కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి

మన కోసం దేవుడు ఇచ్చిన సందేశం బైబిల్లో ఉంది. మనం చక్కగా జీవించాలంటే, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏంచేయాలో అది చెప్తుంది. అంతేకాదు, కింది ప్రశ్నలకు జవాబులు కూడా అందులో ఉన్నాయి:

  1. 1. దేవుడు ఎవరు?

  2. 2. దేవుని గురించి నేర్చుకోవడం ఎలా?

  3. 3. బైబిల్ని ఎవరు రాశారు?

  4. 4. బైబిలు విజ్ఞానశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఉందా?

  5. 5. బైబిలు సందేశం ఏమిటి?

  6. 6. మెస్సీయ గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?

  7. 7. మన కాలం గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?

  8. 8. మనుషుల కష్టాలకు కారణం దేవుడా?

  9. 9. మనుషులు ఎందుకు బాధలు పడుతున్నారు?

  10. 10. భవిష్యత్తు గురించి బైబిలు ఏమని మాటిస్తుంది?

  11. 11. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది?

  12. 12. చనిపోయినవాళ్ల విషయంలో ఎలాంటి ఆశ ఉంది?

  13. 13. పని గురించి బైబిలు ఏమంటోంది?

  14. 14. మీకున్న వాటిని ఎలా ఉపయోగించాలి?

  15. 15. సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

  16. 16. ఆందోళనను తట్టుకోవడం ఎలా?

  17. 17. బైబిలు మీ కుటుంబానికి ఎలా సహాయం చేస్తుంది?

  18. 18. దేవునికి మీరెలా దగ్గర కావచ్చు?

  19. 19. బైబిల్లోని ఏ పుస్తకాల్లో ఏముంది?

  20. 20. ఎక్కువ ప్రయోజనం పొందాలంటే బైబిల్ని ఎలా చదవాలి?

బైబిలు వచనాల్ని ఎలా చూడాలి?

బైబిల్లో 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. అది రెండు భాగాలుగా ఉంటుంది: హీబ్రూ-అరామిక్‌ లేఖనాలు (“పాత నిబంధన”), గ్రీకు లేఖనాలు (“కొత్త నిబంధన”). ప్రతీ బైబిలు పుస్తకంలో అధ్యాయాలు, వచనాలు ఉంటాయి. ఒక లేఖనాన్ని పేర్కొన్నప్పుడు, పుస్తకం పేరు తర్వాత వచ్చే మొదటి సంఖ్య అధ్యాయాన్ని సూచిస్తుంది, తర్వాత వచ్చే సంఖ్య(లు) ఆ అధ్యాయంలోని వచనాన్ని(ల్ని) సూచిస్తుంది. ఉదాహరణకు, ఆదికాండం 1:1 అంటే, ఆదికాండం పుస్తకంలోని 1వ అధ్యాయం, 1వ వచనం అని అర్థం.