కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యంతో, లే

ధైర్యంతో, లే
  1. 1. ప్రతి రోజు పరీక్షే,

    ప్రశాంతతే లేదే

    పడిపోను లే,

    “అనలేరుగా ఎవ్వరు.”

    తడబడి పోయి,

    తప్పటడుగేశావా:

    గాయాలె పాఠాలైతే,

    శక్తి నింపే ప్రేమతో దేవుడు.

    (పల్లవి)

    అలలా లేవాలి.

    ఉప్పెనై సాగాలి.

    సరైందే చేయాలి.

    పాఠమే నేర్చుకో.

    సాయమే తీసుకో.

    యెహోవాయే—చేయిస్తే.

    ఆ బలమే వేరు:

    ఓటమే పాఠమైనా

    ఆగక సాగిపో.

  2. 2. ఉదయం వెలుగుతో,

    హృదయం బరువుతో.

    సమయం గడిచినా.

    కంటి నిండా దుఖం.

    విరిగిన నిన్ను,

    విడువడు యెహోవా.

    వాక్యంతో ఆయనిచ్చే,

    చేయూతను మరువకెన్నడూ.

    (పల్లవి)

    అలలా లేవాలి.

    ఉప్పెనై సాగాలి.

    సరైందే చేయాలి.

    పాఠమే నేర్చుకో.

    సాయమే తీసుకో.

    యెహావాయే—చేయిస్తే.

    ఆ బలమే వేరు:

    ఓటమే పాఠమైనా.

    (బ్రిడ్జ్‌)

    నీ యెహోవా మాటే బాటై

    గత జీవితం ముగించెయ్‌.

    మనసు భారం దించేస్తాడు,

    యెహోవా.

    ధైర్యంతో, లే.

    (పల్లవి)

    అలలా లేవాలి.

    ఉప్పెనై సాగాలి.

    సరైందే చేయాలి.

    పాఠమే నేర్చుకో.

    సాయమే తీసుకో.

    యెహోవాయే—చేయిస్తే.

    ఆ బలమే వేరు:

    ఓటమే పాఠమైనా.

    ఆగక సాగిపో

    ఆగక సాగిపో.