కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా నాతో లేడా!

యెహోవా నాతో లేడా!
  1. 1. స్వాగతిస్తా ప్రతి కొత్త రోజును,

    పరిచర్యలోని ఆనందం కోసం.

    వెంటాడే కళ్ళనే, తప్పించుకుంటా

    క్రీస్తాజ్ఞకేగా లోబడేదీ.

    (పల్లవి)

    గుండెళ్ళో హాయిగా ఉంటుందిలే, పాటిస్తే దీన్నే!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!

  2. 2. మధ్యాహ్నం మాట్లాడా మంచి వ్యక్తితో,

    స్పందించాడు చాలా యథార్థంగా

    అవకాశమే వస్తే స్నేహం చేస్తా,

    నేర్పిస్తా సత్యమే పాటించేలాగా.

    (పల్లవి)

    గుండెళ్ళో హాయిగా ఉంటుందిలే, పాటిస్తే దీన్నే!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!

    (బ్రిడ్జ్‌)

    మంచివార్తే లేదా గుండె నిండా

    పంచిస్తానంతా నిస్వార్థంగా.

    కీర్తిస్తాను యెహోవా పేరే,

    ఏమొస్తే రానీ వెనుకాడనులే!

    ముందుకు వెళ్తా విశ్వాసముతో,

    ఆ సోదరులే ఆదర్శంగా.

    సరికొత్తగా మారేటి లోకం,

    చూస్తాననే నా ఆశే ఆధారం.

  3. 3. మనశ్శాంతినే రోజంతా పొందా,

    సంతోషంతో నే ప్రార్థిస్తూ ఉన్నా.

    నే నిద్రిస్తానెంతో ప్రశాంతంగా,

    తన చేతిలోనే ఉన్నా కదా.

    (పల్లవి)

    గుండెళ్ళో హాయిగా ఉంటుందిలే, పాటిస్తే దీన్నే!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!

    యెహోవా నాతో లేడా, భయం జయిస్తా!