కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తివాసీలు ఎంత సురక్షితమైనవి?

తివాసీలు ఎంత సురక్షితమైనవి?

తివాసీలు ఎంత సురక్షితమైనవి?

తివాసీలు పరచివున్న నాలుగు గోడల మధ్య మీరు ఎంత సమయం గడుపుతారు? ఈ ప్రశ్నకు సమాధానం​—ప్రాముఖ్యంగా పిల్లలకు సంబంధించి​—భయం గొలిపే విషయం కావచ్చునని న్యూ సైంటిస్ట్‌ పత్రికలోని ఒక నివేదిక సూచిస్తోంది.

ఆ పత్రిక ఇలా పేర్కొన్నది: “మనం విషపూరితమైన కాలుష్యాలకు గురవ్వడం, బహిరంగ ప్రదేశాల్లో కంటే నాలుగు గోడల మధ్య 10 నుండి 50 రెట్లు అధికంగా ఉంటుంది.” సాధారణ గృహాల్లోని తివాసీలలో ఉండే ధూళి నమూనాలలో భయం గొల్పేంతటి హెచ్చు స్థాయిలో కాలుష్యకారకాలు ఉండగలవని అమెరికాలో పర్యావరణ శాస్త్ర ఇంజనీరుగా పనిచేస్తున్న జాన్‌ రాబర్ట్స్‌ అంటున్నాడు. వీటిలో సీసం, కాడ్మియమ్‌, పాదరసం, క్రిమిసంహారకాలు, క్యాన్సరు కలిగించే పాలిక్లోరినేటెడ్‌ బైఫినేల్‌లు (పి.సి.బిలు), పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు (పి.ఎ.హెచ్‌లు) కూడా ఉంటాయి.

బూట్ల ద్వారా, పెంపుడు జంతువుల పాదాల ద్వారా ఇళ్ళలోకి ప్రవేశించే క్రిమిసంహారకాల వల్ల, తివాసీలలో ఉండే ధూళిలోని క్రిమిసంహారకాలు 400 రెట్లు అధికం అవుతాయని నివేదించబడుతోంది. ఈ కాలుష్యకారకాలు సంవత్సరాలపాటు నిలిచివుండగలవని చెప్పబడుతోంది. క్రిమిసంహారకాలు, పి.ఎ.హెచ్‌లు అర్ధభాష్పశీలమైనవి గనుక అవి ఆవిరైపోయి, అటు ఇటు కొట్టుకుపోయి, తర్వాత మళ్ళీ తివాసీలపైనా లేదా ఇతర ఉపరితలాలపైనా స్థిరపడిపోతాయి.

చిన్నపిల్లలు తరచూ నేలపై ఆడుకుని, తమ వ్రేళ్ళను నోట్లో పెట్టుకుంటుంటారు. కాబట్టి కాలుష్యకారకాలకు ప్రధానంగా వాళ్ళే గురవుతారు. చిన్నపిల్లల్లో జీవప్రక్రియ రేటు పెద్దవారిలోకన్నా అధికంగా ఉంటుంది గనుక, వారు బరువు తక్కువగా ఉన్నా వారు గాలిని పెద్దవారికన్నా ఎక్కువ నిష్పత్తిలో పీల్చుకుంటారు.

తివాసీలు పరచివున్న నాలుగు గోడల మధ్యనున్న స్థలం పిల్లల్లో ఉబ్బసం, ఎలర్జీలు, క్యాన్సర్లు అధికమవ్వడానికి దోహదపడుతుండవచ్చునని కొంతమంది పరిశోధకులు అనుకుంటున్నారు. రాబర్ట్స్‌ ఇలా పేర్కొంటున్నాడు: “కొన్ని స్థలాల్లో మాత్రమే రగ్గులు ఉండి తివాసీలు పరిచిలేని నేల ఉన్న ఇంట్లో ఒక వంతు ధూళి ఉంటే, నేల అంతటా తివాసీ పరచి ఉన్న ఇంట్లో పది వంతుల ధూళి ఉంటుంది.”

తివాసీలను సురక్షితమైనవిగా చేయడానికి ఎక్కువ పవర్‌ ఉన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఉపయోగించాలి. ఇక అనేక వారాల పాటు, వారానికి ఒకసారి వీధి గుమ్మం దగ్గర ఉండే 1.3 మీటర్ల తివాసీ భాగంపై 25 సార్లు వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రపరిస్తే, ఎక్కువగా నడిచే ప్రాంతాల్లో 16 సార్లు, మిగిలిన తివాసీ భాగాన్ని 8 సార్లు శుభ్రపరచాలి.

సరళమైన ఈ విధానాన్ని పూర్తి చేసిన తర్వాత, ప్రతివారం పైన సిఫారసు చేసిన వాటిలో కనీసం సగం సార్లయినా శుభ్రపరిస్తే, మీరు ధూళిని తక్కువ స్థాయిలో ఉంచగల్గుతారు. “మీ ఇంటికున్న ప్రతి తలుపు దగ్గరా మందమైన పీచుపట్టా వేసి, లోపలికి వచ్చే ముందు రెండుసార్లు మీ కాళ్ళను దానికి తుడుచుకోండి” అని కూడా రాబర్ట్స్‌ సలహా ఇస్తున్నాడు. (g02 4/22)