కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా నా ఉపశమనం”

“యెహోవా నా ఉపశమనం”

“యెహోవా నా ఉపశమనం”

పైన ప్రస్తావించబడిన మాటలు స్వీడన్‌కు చెందిన చార్లెస్‌ రాజు IX యొక్క అధికారిక రాచవాక్య అనువాదం. లాటిన్‌లో ఆ మాటలు ఇలా ఉంటాయి: “ఈహోవా సొలేష్యమ్‌ మీయుమ్‌.” 1560 నుండి 1697 వరకూ స్వీడన్‌లో నాణాల మీద, పతాకాల మీద లేదా వ్యక్తిగత నినాదాల్లో దేవుని నామాన్ని హీబ్రూ భాషలో లేదా లాటిన్‌ భాషలో ఉపయోగించిన అనేక తరాలకు చెందిన పరిపాలకుల్లో ఈ రాజు కూడా ఒకరు. చార్లెస్‌ IX యెహోవా పేరిట రాజశాసనం ఏర్పాటుచేశాడు. 1607లో చార్లెస్‌ రాజుగా పట్టాభిషిక్తుడైన రోజున ఆయన యెహోవా గొలుసు అని పిలువబడే గొలుసును తన మెడలో వేసుకున్నాడు.

ఆ చక్రవర్తులు ఆ నామాన్ని ఉపయోగించడానికి గల కారణమేమిటి? ఆ సమయంలో ఐరోపాలో జరిగిన కాల్వనిస్ట్‌ ఉద్యమం, అలాగే బైబిలుపై వారికున్న గౌరవం వారిని ప్రభావితం చేశాయని విద్వాంసుల నమ్మకం. పునర్జాగారణోద్యమం సమయంలో మంచి విద్యావంతులైన చక్రవర్తులుగా వారికి దేవుని వ్యక్తిగత నామమైన యెహోవా అనే పదానికి లాటిన్‌ భాషలో ఉపయోగించబడే పదం గురించి తెలిసేవుంటుందని స్పష్టమౌతోంది. హీబ్రూ మూలపాఠంలో ఆ పేరు వేలాది సార్లు ఉందని వారిలో కొందరు గ్రహించివుంటారనడంలో సందేహం లేదు.

16వ శతాబ్దం మరియు 17వ శతాబ్దంలో ఐరోపాలోని వివిధ ప్రాంతాల్లో యెహోవా అనే పేరు నాణాలపై, పతాకాలపైనే కాక ప్రజా భవనాలపై, చర్చీ భవనాలపై కూడా కనిపించేది అని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. నిర్గమకాండము 3:15 వ వచనంలో ఉల్లేఖించబడిన దేవుని మాటలు సాధారణంగా అంగీకరించబడి, గౌరవించబడేవి అనడంలో సందేహం లేదు: “యెహోవా . . . నిరంతరము నా నామము ఇదే.” (g03 6/22)

[13వ పేజీలోని చిత్రాలు]

యెహోవా పేరిట రాజశాసనానికి చెందిన గొలుసు మరియు బ్యాడ్జి, 1606, బంగారం, ఎనామిల్‌, శిలాస్ఫటికం మరియు గార్నెట్‌లతో తయారుచేయబడినవి

రాజు ఎరిక్‌ XIV 1560-68

చార్లెస్‌ రాజు IX 1599-1611 (ఎరిక్‌ XIV సహోదరుడు)

గుస్టావస్‌ రాజు II అడాల్ఫ్‌ 1611-32 (చార్లెస్‌ IX కుమారుడు)

క్రిస్టీనా రాణి 1644-54 (గుస్టావస్‌ II అడాల్ఫ్‌ కుమార్తె)

[చిత్రసౌజన్యం]

గొలుసు: Livrustkammaren, Stockholm Sverige; నాణాలు: Kungl. Myntkabinettet, Sveriges Ekonomiska Museum