కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొక్కలు ఔషధాల విలువయిన మూలసంపద

మొక్కలు ఔషధాల విలువయిన మూలసంపద

మొక్కలు ఔషధాల విలువయిన మూలసంపద

ప్రజలు ఆధారపడే ఆధునిక దిన మందుల్లో 25 శాతం, పూర్తిగా లేదా పాక్షికంగా, మొక్కల్లో ఉండే రసాయనాలతోనే ఆరంభమయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ రకాల ఓషధి చికిత్సను బలపరిచేవారు ఈ వాస్తవాన్ని తరచూ ఉదహరిస్తుంటారు.

ఔషధ మొక్కలపై జరపబడే పరిశోధనలో అధికశాతం వ్యాధి నివారణా మిశ్రపదార్థాలను వేరుచేయడంపైనే దృష్టినిలుపబడుతోంది. అలాంటి వ్యాధినివారణా మిశ్రపదార్థపు ఓ ప్రముఖ ఉదాహరణ ఆస్ప్రిన్‌. అది శ్వేత విలో చెట్టు బెరడులో ఉండే సాలిసిన్‌ నుంచి సేకరించబడుతుంది.

మొక్కలో ఉండే వ్యాధి నివారణా మిశ్రపదార్థం వేరుచేయబడిన తర్వాత అది తగినంత మోతాదులో, మరింత ప్రామాణికమైన మోతాదులో ఇవ్వబడుతుంది. ఒక రెఫరెన్సు గ్రంథమిలా చెబుతోంది: “ఆస్ప్రిన్‌ ఇవ్వగల ప్రయోజనాలు సాధించడానికి సరిపడా విలో బెరడు లేదా డిజిటాలిస్‌ ప్రాణరక్షక ఫలితాలు సాధించడానికి సరిపడా ఫాక్స్‌గ్లోవ్‌ వంటి సహజ మూలపదార్థాలు తినడానికి బదులు మరింత సులభంగా ఒక్క బిళ్లతో సాధించవచ్చు.”

మరో ప్రక్క, ఔషధ మొక్కనుండి వ్యాధి నివారణా మిశ్రపదార్థాన్ని వేరుచేయడంలో తత్సంబంధిత నష్టాలు ఉండే అవకాశముంది. అందులో ఒకటేమంటే, ఆ మొక్క మూలపదార్థాలు అందించే ఇతర పోషక మరియు సంభావ్య వైద్యసంబంధ ప్రయోజనాలు నష్టపోవడం కావచ్చు. అంతేకాకుండా, కొన్ని రకాల వ్యాధికారక క్రిములు వాటి నిర్మూలనకే ఉపయోగించే మందులను తట్టుకునేలా తయారయ్యాయి.

ఔషధ మొక్క నుండి వ్యాధి నివారణా మిశ్రపదార్థాలను వేరుచేయడంలో నష్టాలు ఉన్నాయని చెప్పడానికి సింకోనా చెట్ల బెరడు నుండి సేకరించే మూలపదార్థమైన క్వైనా ఒక ఉదాహరణ. మలేరియా కలిగించే పరాన్నభుక్కులను అధికశాతంలో క్వైనా హతమార్చినా, వేరే పరాన్నభుక్కులు చచ్చినా అది హతమార్చని మిగిలిన పరాన్నభుక్కులు విపరీతంగా వృద్ధిచెందుతాయి. ఒక రెఫరెన్సు పుస్తకమిలా వివరిస్తోంది: “అలా తట్టుకోవడం వైద్య రంగంలో ఓ పెద్ద వివాదంగా తయారయింది.” (g03 12/22)

[19వ పేజీలోని చిత్రాలు]

ఆస్ప్రిన్‌ ఈ శ్వేత విలో చెట్టు నుండి సేకరించబడుతుంది

[చిత్రసౌజన్యం]

▼ USDA-NRCS PLANTS Database/Herman, D.E. et al. 1996. North Dakota tree handbook

[19వ పేజీలోని చిత్రాలు]

సింకోనా చెట్టు, దీనినుండే క్వైనా సేకరించబడుతుంది

[చిత్రసౌజన్యం]

Courtesy of Satoru Yoshimoto