కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

పోర్నోగ్రఫీ “పోర్నోగ్రఫీ​—⁠హానిరహితమా హానికరమా?” (అక్టోబరు-డిసెంబరు, 2003) వరుస ఆర్టికల్స్‌ విషయంలో మీకు ధన్యవాదాలు. సూటిగా ఇచ్చిన ఈ హితబోధ నాకు చాలా అవసరం. నేను క్రైస్తవునిగా మారక ముందు చాలాకాలంపాటు పోర్నోగ్రఫీ చూసేవాడిని. అదెంత హానికరమైనదో, దాని శక్తిమంతమైన, ఆకర్షణీయమైన వ్యసనం నుండి బయటపడడానికి ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలో ముందెన్నటికంటే మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు ఆ ఆర్టికల్స్‌ నాకు సహాయం చేశాయి.

ఇ. పి., అమెరికా (g04 3/22)

22 యేళ్లు సంతోషంగా సాగిన నా వివాహ జీవితం 2 సంవత్సరాల క్రితం విడాకులతో ముగిసింది. పోర్నోగ్రఫీ చక్కని భర్తను, ప్రేమగల తండ్రిని మాకు దక్కకుండా చేసింది. దయాపరునిగా, మెత్తని మనిషిగా ఉన్న అతణ్ణి ఈ భయంకరమైన వ్యసనం కోపిష్ఠిగా, అబద్ధికునిగా, పశువుగా మార్చేసింది. పోర్నోగ్రఫీ క్షతగాత్రిని నేను ఒక్కదాన్నే అనుకునేదాన్ని, అయితే అది అనేకులపై ప్రభావం చూపుతున్న సంకటమని నేనిప్పుడు గ్రహిస్తున్నాను. చక్కగా వ్రాసిన ఈ వరుస ఆర్టికల్స్‌ విషయంలో మీకు ధన్యవాదాలు.

ఎల్‌. టి., అమెరికా (g04 3/22)

బైబిలు అధ్యయనానికి ముందు, నేను ఒక దశాబ్దంపాటు పోర్నోగ్రఫీ వ్యసనపరునిగా ఉన్నాను. దాన్ని సమర్థించేవారు ఏమి చెప్పుకున్నా, దానిలో ఖచ్చితంగా ప్రయోజనకరమైనదేదీ లేదు. నేను యెహోవాసాక్షి కాకముందు, దాదాపు ప్రతివిధమైన మాదక ద్రవ్యానికి బానిసను. నా వ్యసనాలన్నింటిలోకీ పోర్నోగ్రఫీ నుండి బయటపడడం అత్యంత కష్టంగా ఉండేది. ఇలాంటి ఆర్టికల్స్‌ను దయచేసి ప్రచురిస్తూనే ఉండండి.

జె. ఎ., అమెరికా (g04 3/22)

డయబెటిస్‌ “డయబెటిస్‌తో జీవించడం” అనే ముఖపత్ర ఆర్టికల్స్‌ కోసం మీకు ధన్యవాదాలు. (జనవరి-మార్చి, 2004) నేను గత 12 సంవత్సరాలుగా టైప్‌ I డయబెటిస్‌తో జీవిస్తూ, చికిత్సగా తరచూ ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకుంటున్నాను. నా భార్య నాకు చాలా మద్దతిస్తోంది. మేమిద్దరం ఈ వ్యాధి గురించి తెలుసుకుంటూ ఉంటాం, మేమిద్దరం కలిసి డాక్టరు దగ్గరకు వెళతాం, నేను మరింత అనుకూలమైన దృక్పథం అలవర్చుకోవడానికి కృషిచేస్తున్నాను. నేను ఒక ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేస్తున్న కారణంగా, అనారోగ్యంగల వ్యక్తి జీవిత సవాళ్లు ఎదుర్కోవడానికి అతనికి సహాయంచేసేందుకు అతనితో దయగా, ఓపికగావుండవలసిన అవసరతపట్ల తోటి క్రైస్తవులు మరింత అప్రమత్తంగా ఉన్నట్లు నేను గమనించాను. అలాంటి దృక్పథం సంఘాల్లో నా పరిచర్య కొనసాగించడానికి నాకు సహాయం చేస్తోంది. ఈ వరుస ఆర్టికల్స్‌ సరిగ్గా సమయానికి వచ్చాయి. మరలా ఒకసారి మీకు ధన్యవాదాలు.

డబ్ల్యు. బి., పోలాండ్‌ (g04 3/8)

నేను గత 28 సంవత్సరాలుగా డయబెటిస్‌తో జీవిస్తున్నాను. మా కుటుంబ సభ్యుల్లో పదిమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. నేనిప్పటివరకు చూసిన వాటిలోకెల్లా మీ వరుస ఆర్టికల్స్‌లో చక్కగా అర్థంచేసుకొనే సమాచారం ఉంది. ఆ ఆర్టికల్స్‌ మన సృష్టికర్త ప్రేమను అంటే ఆ అంశంపై లౌకిక శీర్షికల్లో లేని విషయాన్ని ప్రతిఫలించాయి. కుటుంబం మీద ఎక్కువ ఆధారపడకూడదని భావించి, నా వ్యాధి గురించి ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఇతరులపట్ల శ్రద్ధ చూపించడంలో నేను ఆనందం పొందాను. అయితే ఇతరులపట్ల మరింత శ్రద్ధచూపడానికి, నేను నాగురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని చూసేందుకు ఈ ఆర్టికల్‌ నాకు సహాయం చేసింది.

ఎల్‌. పి., ఫ్రాన్స్‌ (g04 3/8)

యువత ఇలా అడుగుతోంది నా వయస్సు 16 సంవత్సరాలు, నేను ఉన్నత పాఠశాల మొదటి సంవత్సరం విద్యార్థిని. నేను ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోని సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాను. తోటివారి ఒత్తిడి ప్రభావాలను నేను నిజంగా చూడగలుగుతున్నాను. “యువత ఇలా అడుగుతోంది” ఆర్టికల్స్‌ బైబిలు చదవడం, అధ్యయనం చేయడంయొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి నాకు సహాయం చేశాయి. టీనేజి పిల్లలపట్ల మీరు చూపుతున్న శ్రద్ధకు నేను నిజంగా కృతజ్ఞురాలను. ఆ శీర్షికలు వ్యక్తిగతంగా నా కోసమే వ్రాసినట్లుగా నేను భావిస్తున్నాను.

ఎస్‌. ఆర్‌., అమెరికా (g04 1/22)