కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధునిక దిన మంచి సమరయుడు

ఆధునిక దిన మంచి సమరయుడు

ఆధునిక దిన మంచి సమరయుడు

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

మంచి సమరయుడనే పొరుగువాడిని గురించిన బైబిలు కథను మనలో చాలామంది విన్నాం. (లూకా 10:​29-37) ఈ ఉపమానంలో, కష్టంలోవున్న తన పొరుగువాని పట్ల తన ప్రేమను కనబరిచేందుకు ఆ సమరయుడు ఎంతగా ప్రయత్నించాడో యేసు వివరించాడు. నేడు అలాంటి మంచి సమరయులు ఉన్నారా? మెక్సికోలో జరిగిన ఈ క్రింది సంఘటన పరిశీలించండి.

విహారయాత్ర ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న బెటూయేల్‌, ఆయన కుటుంబం వాళ్ళ ఇల్లు ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనగా, ప్రధాన రహదారిపై జరిగిన ఒక ఘోరమైన మోటారు వాహన ప్రమాదం చూశారు. సహాయం చేయడానికి వాళ్ళక్కడ ఆగారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్లలో ఒకాయన డాక్టరు. గర్భవతి అయిన తన భార్యను, తన ఇద్దరు చిన్న కూతుర్లను చికిత్స కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకువెళ్ళమని ఆయన వాళ్లను కోరాడు. అలా చేసిన తర్వాత, బెటూయేల్‌ ఇంకా ఏమైనా సహాయం చేయగలనేమోనని తిరిగి ప్రమాద స్థలానికి వెళ్ళాడు.

బెటూయేల్‌ ఇలా వివరిస్తున్నాడు: ఆ ప్రమాదంలో ఒకరు చనిపోయారు కాబట్టి, “జాతీయ ప్రధాన రహదారి గస్తీ సిబ్బంది వచ్చినప్పుడు, చనిపోయిన వారి విషయంలో విచారణ కోసం డాక్టరును కస్టడీలోకి తీసుకున్నారు. నేనెందుకు సహాయం చేస్తున్నానని ఆ డాక్టర్‌ నన్ను అడిగినప్పుడు, మేము యెహోవాసాక్షులమని, పొరుగువారిని ప్రేమించాలని బైబిలు నుండి నేర్చుకున్నామని నేను ఆయనకు వివరించాను. తన భార్యాబిడ్డల గురించి దిగులుపడనక్కర్లేదనీ, మేము వారిని చూసుకుంటామని ఆయనకు ధైర్యం చెప్పాను. అప్పుడాయన కృతజ్ఞత నిండిన కళ్ళతో తన దగ్గరున్న విలువైన వస్తువులను భద్రపరచడానికి నాకు అప్పగించాడు.”

బెటూయేల్‌, ఆయన కుటుంబం ఆ డాక్టరు భార్యాబిడ్డలను తమ ఇంటికి తీసుకెళ్లి చాలా రోజులు తమదగ్గరే ఉంచుకున్నారు. బెటూయేల్‌ ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని వాళ్లతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. ఆ డాక్టరు విడుదలైన తరువాత, ఆయన యెహోవాసాక్షుల పట్ల తన కృతజ్ఞతను, ప్రశంసను వ్యక్తం చేశాడు. ఆయన తమ ఊరికి వెళ్ళిన తరువాత ఆ బైబిలు అధ్యయనం కొనసాగిస్తామని వాగ్దానం చేయడమే కాక, తన భార్యకు ఒకవేళ బాబు పుడితే, ఆ బాబుకి బెటూయేల్‌ అని పేరు పెడతానని కూడా చెప్పాడు. బెటూయేల్‌ ఇంకా ఇలా చెబుతున్నాడు: “రెండు సంవత్సరాల తరువాత, ఇప్పుడు మాకు వాళ్ళను సందర్శించే అవకాశం లభించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వాళ్ళు బైబిలు అధ్యయనం చేస్తున్నారు, అంతేకాక వాళ్ళ బాబుకు బెటూయేల్‌ అని పేరు పెట్టారు!”(g04 8/8)

[29వ పేజీలోని చిత్రం]

బెటూయేల్‌