కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవదూతలు

దేవదూతలు

దేవదూతలు

దేవదూతల గురించి పుస్తకాల్లో, బొమ్మల్లో, సినిమాల్లో ఉంటుంది. కానీ దేవదూతలు అంటే ఎవరు, వాళ్లు ఏమి చేస్తారు?

దేవదూతలు అంటే ఎవరు?

బైబిలు ఏం చెప్తుంది?

 

దేవుడు విశ్వాన్ని, మనుషుల్ని సృష్టించక ముందే, మనుషుల కన్నా ఉన్నతంగా ఉండే తెలివిగల జీవుల్ని ఆయన చేశాడు. వాళ్లు మనుషుల కన్నా చాలా శక్తిమంతులు, దేవుడు ఉండే చోటే వాళ్లూ ఉంటారు. కానీ ఆ చోటు మనుషులెవ్వరికీ కనపడదు, మనుషులు అక్కడికి వెళ్లలేరు. (యోబు 38:4, 7) బైబిలు ఆ జీవుల్ని “దూతలు” లేదా దేవదూతలు అని పిలుస్తుంది.—కీర్తన 104:4. a

ఎంతమంది దేవదూతలు ఉన్నారు? చాలామంది ఉన్నారు. దేవుని సింహాసనం చుట్టూ దేవదూతల సంఖ్య “లక్షల్లో-కోట్లలో” ఉంది. (ప్రకటన 5:11) ఈ మాటల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే ఆ దూతల సంఖ్య కోటానుకోట్లు ఉన్నట్లే!

“నేను సింహాసనం చుట్టూ . . . ఎంతోమంది దేవదూతలు ఉండడం చూశాను . . . ఆ దేవదూతల సంఖ్య లక్షల్లో-కోట్లలో ఉంది.”—ప్రకటన 5:11.

దేవదూతలు పూర్వకాలంలో ఏమి చేసేవాళ్లు?

బైబిలు ఏం చెప్తుంది?

 

దేవదూతలు ఎక్కువగా దేవుని ప్రతినిధులుగా లేదా సందేశకులుగా పని చేసేవాళ్లు. b బైబిల్లో వాళ్లను దేవుని అద్భుత కార్యాలను చేసేవాళ్లుగా చూపించారు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి, అతని కొడుకు ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపడానికి ఒక దేవదూతను పంపించాడు. (ఆదికాండము 22:11-18) ఒక దేవదూత మోషేకు మండుతున్న పొదలో కనపడి జీవితాన్ని మార్చే సందేశాన్ని తెలియచేశాడు. (నిర్గమకాండము 3:1, 2) దానియేలు ప్రవక్తను సింహాల గుహలో పడేసినప్పుడు, దేవుడు తన దూతను పంపించి, సింహములు ఏ హాని చేయకుండ వాటి నోళ్లు మూయించాడు.—దానియేలు 6:22.

“అప్పుడు యెహోవా దూత ఒక ముళ్లపొద మధ్య అగ్నిజ్వాలలో [మోషేకు] కనిపించాడు.”—నిర్గమకాండము 3:2.

దేవదూతలు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?

బైబిలు ఏం చెప్తుంది?

 

ఇప్పుడు దేవదూతలందరూ ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమే. కానీ మంచి హృదయం ఉన్న వాళ్లకు దేవుని గురించి తెలుసుకోవడానికి వాళ్లు సహాయం చేస్తున్నట్లు బైబిలు చెప్తుంది.—అపొస్తలుల కార్యాలు 8:26-35; 10:1-22; ప్రకటన 14:6, 7.

యెహోవా దేవుడు పితరుడైన యాకోబుకు ఒక కల వచ్చేలా చేశాడు. అందులో ఆయన ఆకాశానికి భూమికి మధ్య ఉన్న “నిచ్చెన” ద్వారా దేవదూతలు పైకి ఎక్కుతూ, కిందికి దిగుతూ ఉన్నట్లు చూశాడు. (ఆదికాండము 28:10-12) యాకోబు ఆ కలనుండి ఏమి అర్థం చేసుకున్నాడో మనమూ బహుశా అదే అర్థం చేసుకోవచ్చు. యెహోవా దేవుడు దేవదూతల్ని అవసరంలో ఉన్న నమ్మకస్థులైన మనుషులకు సహాయం చేయడం లాంటి కొన్ని ప్రత్యేకమైన పనుల మీద భూమికి పంపిస్తాడు.—ఆదికాండము 24:40; నిర్గమకాండము 14:19; కీర్తన 34:7.

“ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.”—ఆదికాండము 28:12.

a కొంతమంది దేవదూతలు దేవుని అధికారానికి ఎదురు తిరిగారని బైబిలు చెప్తుంది, ఈ దుష్ట దూతల్ని “చెడ్డ దూతలు” అని పిలుస్తుంది.—లూకా 10:17-20.

b అసలు బైబిల్ని రాసిన హెబ్రీ, గ్రీకు భాషల్లో “దూత” అనే మాటకు “సందేశకుడు” అని అర్థం.