కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాట్లాడుకోవడం బ్రిడ్జ్‌ లాంటిది. అది మిమ్మల్ని మీ పిల్లలతో కలిపి ఉంచుతుంది

తల్లిదండ్రులకు

5: ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి

5: ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి

అంటే ఏంటి?

మీరు, మీ పిల్లలు ఒకరికొకరు మీ ఆలోచనల్ని, భావాల్ని చెప్పుకుంటేనే నిజంగా మాట్లాడుకున్నట్లు.

ఎందుకు ముఖ్యం?

టీనేజీలో ఉన్న పిల్లలతో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. బ్రేకింగ్‌ ద కోడ్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, ‘పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మానాన్నకు అన్నీ చెప్తారు. కానీ పెద్దవాళ్లు అయ్యాక అమ్మానాన్నతో తక్కువగా మాట్లాడతారు కాబట్టి పిల్లల మనసులో ఉన్న ఆలోచనలు, భావాలు తల్లిదండ్రులకు తెలియవు.’ పరిస్థితి అలా ఉన్నా గానీ నిజానికి అలాంటప్పుడే పిల్లలతో మాట్లాడడం చాలా ముఖ్యం.

మీరు ఏమి చేయవచ్చు

మీ పిల్లలకు తగ్గట్లుగా మీ సమయాన్ని మార్చుకోండి. ఒకవేళ మధ్యరాత్రి మాట్లాడాల్సి వచ్చినా మీరు సమయాన్ని ఇవ్వాలి.

“‘రోజంతా నీతోనే ఉన్నానుగా? అప్పుడు వదిలేసి ఇప్పుడు మాట్లాడతావేంటి?’ అని మీకు అనాలని అనిపించవచ్చు. కానీ పిల్లలు మనతో మనసువిప్పి మాట్లాడడానికి వస్తే అలా ఎలా అనగలం? ప్రతి తల్లి, తండ్రి కోరుకునేది అదే కదా?”—లీసా.

“నా నిద్ర నాకు ముఖ్యం, కానీ టీనేజ్‌లో ఉన్న నా పిల్లలతో నేను బాగా మాట్లాడింది మధ్యరాత్రుల్లోనే.”—హార్‌బర్ట్‌.

మంచి సూత్రాలు: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి.”—1 కొరింథీయులు 10:24.

పిల్లలు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఒక తండ్రి ఇలా ఒప్పుకుంటున్నాడు, “నా పిల్లలు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కొన్నిసార్లు నా మనసులో వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను వింటున్నట్లు మోసం చేయలేను, ఎందుకంటే అది వాళ్లకు అర్థమైపోతుంది.”

మీరు ఈ విషయాన్ని ఒప్పుకుంటే మీ టీవీ ఆపేయండి, మీ ఎలక్ట్రానిక్‌ పరికరాలను పక్కన పెట్టండి. మీ పిల్లలు చెప్తున్నవాటి మీద మనసు పెట్టండి. మీ బాబు లేదా పాప వాళ్ల గురించి చెప్తున్న విషయాలు మీకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు. అయినా వాటిని మీ పూర్తి అవధానం ఇవ్వాల్సినంత విలువైనవిగా చూడండి.

“మన పిల్లల భావాలు మనకు చాలా ముఖ్యం అనే భరోసాను మనం వాళ్లకు ఇవ్వాలి. వాళ్లు అలా అనుకోలేదంటే వాళ్లు విషయాలను లోపలే దాచిపెట్టుకుంటారు లేదా సహాయం కోసం వేరే దగ్గరకు వెళ్తారు.”—మరాండా.

“మీ పిల్లలు తప్పుగా ఆలోచిస్తున్నా ఆవేశపడకండి.”—ఎంతోనీ.

మంచి సూత్రాలు: “మీరు ఎలా వింటున్నారనే దానిమీద మనసుపెట్టండి.”—లూకా 8:18.

మామూలు సమయాల్లో మాట్లాడి చూడండి. కొన్నిసార్లు పిల్లలు అమ్మకు లేదా నాన్నకు ఎదురెదురుగా లేనప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతారు.

“మేము కారులో వెళ్తున్న సమయాన్ని ఉపయోగించుకుంటాము. ఎదురెదురుగా కాకుండా పక్కపక్కన ఉంటాం కాబట్టి మేము చక్కగా మాట్లాడుకోగలుగుతాం.”—నికోల్‌.

సరదాగా మాట్లాడుకోవడానికి భోజనం చేసే సమయం బాగుంటుంది.

“భోజనం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం ఆ రోజు మాకు జరిగిన చెడు విషయాన్ని, మంచి విషయాన్ని చెప్పుకుంటాము. ఈ అలవాటు మమ్మల్ని దగ్గర చేస్తుంది. అంతేకాదు మేము ఒంటరిగా సమస్యల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, మాలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది.”—రాబిన్‌.

మంచి సూత్రాలు: “ప్రతీ ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు.”—యాకోబు 1:19.