కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒత్తిడి నుండి బయటపడండి

మీరు ఒత్తిడికి గురౌతున్నారా?

మీరు ఒత్తిడికి గురౌతున్నారా?

“ప్రతీఒక్కరు ఎంతోకొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు, కానీ నేనైతే భరించలేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. కేవలం ఏదో ఒక్క పెద్ద సమస్య వల్ల కాదుగానీ, రకరకాల పరిస్థితుల వల్ల, కష్టాల వల్ల సతమతమౌతున్నాను. శారీరకంగా, మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను ఎన్నో సంవత్సరాలుగా చూసుకుంటున్నాను. వీటన్నిటి వల్ల నేను చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాను.”—అనిత. a

“నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది, దాంతో మా ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది. నేను ఒక్కడినే వాళ్లను చూసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. పైగా నా ఉద్యోగం పోయింది. కారు రిపేర్‌ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. అసలు ఏంచేయాలో అర్థం కాలేదు. నేను ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది, అయితే అది తప్పని తెలుసు కాబట్టి నా ప్రాణాన్ని తీసేసుకోమని దేవుణ్ణి వేడుకున్నాను.”—హేమంత్‌.

అనిత, హేమంత్‌లాగే మీరు కూడా అప్పుడప్పుడు తట్టుకోలేనంత ఒత్తిడికి గురౌతుంటారా? అయితే, ఈ పత్రికలో ఉన్న సమాచారం మీకు ఓదార్పును ఇవ్వాలని, సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. సాధారణంగా మనకు వేటివల్ల ఒత్తిడి కలుగుతుందో, ఒత్తిడి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, కొంతవరకైనా ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చో ఈ పత్రికలో తెలుసుకుంటాం.

a పేర్లు మార్చాం.