కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5 బాధలు ఎప్పటికైనా పోతాయా?

5 బాధలు ఎప్పటికైనా పోతాయా?

దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?

బాధలు అంతమౌతాయని తెలిస్తే మనం ఒక ఆశతో జీవించగలుగుతాం, దేవుని విషయంలో మంచి అభిప్రాయంతో ఉంటాం.

ఒకసారి ఆలోచించండి

చాలామంది బాధల్ని తీసేయాలని అనుకుంటారు, కానీ వాళ్లకంత సామర్థ్యం లేదు. ఈ ఉదాహరణలు పరిశీలించండి:

వైద్య రంగంలో చాలా అభివృద్ధి జరిగినా . . .

  • ఎక్కువశాతం మంది గుండె జబ్బు వల్ల చనిపోతున్నారు.

  • ప్రతీ సంవత్సరం లక్షలమందిని క్యాన్సర్‌ పొట్టనబెట్టుకుంటుంది.

  • ‘అంటువ్యాధులు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. కొన్ని దీర్ఘకాలంపాటు ఉంటున్నాయి, కొన్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయి, కొన్ని పాత వ్యాధులు మళ్లీ విజృంభిస్తున్నాయి’ అని ఫ్రంటీయర్స్‌ ఇన్‌ ఇమ్యూనాలజీ అనే పత్రికలో డా. డేవిడ్‌ బ్లూమ్‌ రాశారు.

కొన్ని దేశాల్లో చాలా డబ్బున్నా . . .

  • ప్రతీ సంవత్సరం లక్షలమంది పిల్లలు చనిపోతున్నారు, ముఖ్యంగా పేద ప్రాంతాల్లో జీవిస్తున్నవాళ్లకు అలా జరుగుతోంది.

  • కోట్లమంది ప్రజలకు సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు.

  • కోట్లమందికి సురక్షితమైన మంచినీళ్లు అందుబాటులో లేవు.

మానవ హక్కుల గురించి అవగాహన పెరిగినా . . .

  • చాలా ప్రాంతాల్లో మనుషుల్ని అమ్మే వ్యాపారం (human trafficking) చేస్తున్నారు. “ఈ సమస్య ఉందని తెలియకపోవడం వల్లనో, తెలిసినా ఏమీ చేసే సామర్థ్యం లేకనో” చాలా దేశాలు నేరస్తులను పట్టుకోలేకపోతున్నాయని ఒక యునైటెడ్‌ నేషన్స్‌ నివేదిక చెప్తుంది.

    ఎక్కువ తెలుసుకోండి

    jw.org వెబ్‌సైట్‌లో దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

దేవునికి మనమంటే శ్రద్ధ ఉంది.

మన నొప్పిని, బాధను ఆయన అర్థం చేసుకుంటాడు.

“ఆయన [దేవుడు] బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు; అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు. అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.”కీర్తన 22:24.

“ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”1 పేతురు 5:7.

బాధలు నిరంతరం కొనసాగవు.

మన విషయంలో దేవుని ఉద్దేశం నెరవేరుతుందని బైబిలు మాటిస్తుంది.

“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”ప్రకటన 21:3, 4.

మనుషుల బాధలకు కారణమైన వాటిని దేవుడు తీసేస్తాడు.

తన రాజ్యం ద్వారా ఆయన అలా చేస్తాడు, ఆ రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వమని బైబిలు చెప్తుంది.

“పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు. . . . అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”దానియేలు 2:44.