కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతా గందరగోళం

1 | ఆరోగ్యం కాపాడుకోండి

1 | ఆరోగ్యం కాపాడుకోండి

ఎందుకో తెలుసా?

సాధారణంగా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, అది ఏదోకవిధంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.

  • సమస్యలు వచ్చినప్పుడు చాలా టెన్షన్‌ పడతాం, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఎక్కువకాలం అలానే ఉంటే, ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా అంతే ఎక్కువుంటుంది.

  • విపత్తులు జరిగినప్పుడు, తీవ్రమైన అంటువ్యాధులు వ్యాపించినప్పుడు చికిత్స ఎక్కువమందికి అవసరమౌతుంది. హాస్పిటల్‌లు నిండిపోతాయి, మందులు అందరికీ దొరకకపోవచ్చు.

  • పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి; సరుకులు, మందులు కొనుక్కోవడం కూడా కష్టంగా మారుతుంది.

మీకు తెలుసా?

  • ఒంట్లో బాలేనప్పుడు, మానసికంగా ఎక్కువ ఒత్తిడి (mental stress) అనిపించినప్పుడు సరిగ్గా ఆలోచించలేం. దానివల్ల ఎప్పుడుపడితే అప్పుడు నిద్రలేస్తాం; ఐతే మరీ ఎక్కువ తినేస్తాం లేదా సరిగ్గా తినం. అప్పుడు ఆరోగ్యం ఇంకా పాడౌతుంది.

  • ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే జబ్బు ఇంకా పెద్దది అవ్వచ్చు, ప్రాణం మీదికి రావచ్చు.

  • మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోనప్పుడు అంతబాగా ఆలోచించగలుగుతారు; మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

  • ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు బాగా డబ్బు ఉండాల్సిన అవసరంలేదు. మీ స్తోమత ఏదైనా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

సాధ్యమైతే, తెలివైనవాళ్లు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ముందుజాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యానికి కూడా ఇదే వర్తిస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభమని పెద్దలు అంటారు. అందుకే, ముందునుండే పరిశుభ్రంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, జబ్బులు ఎక్కువ రాకుండా ఉంటాయి. వచ్చినా వాటి తీవ్రత తక్కువగా ఉంటుంది.

“మనల్ని, మన ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డాక్టర్లకు, మందులకు అయ్యే ఖర్చు మిగులుతుంది.”—ఆనంద్‌. a

a కొన్ని పేర్లు మార్చాం.