కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ భాగం

బబులోనులో బంధీలుగా ఉన్నప్పటి నుండియెరూషలేము గోడలు తిరిగి నిర్మించబడడం వరకు

బబులోనులో బంధీలుగా ఉన్నప్పటి నుండియెరూషలేము గోడలు తిరిగి నిర్మించబడడం వరకు

బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల విశ్వాసం ఎన్నోసార్లు పరీక్షించబడింది. షద్రకు, మేషాకు, అబేద్నెగో కాలుతున్న అగ్నిగుండములో వేయబడ్డారు, కానీ దేవుడు వాళ్లను అందులోనుండి సజీవంగా బయటకు తెచ్చాడు. ఆ తర్వాత బబులోను మాదీయ పారసీకుల చేతిలో ఓడిపోయాక, దానియేలు సింహపు గుహలో వేయబడ్డాడు, కానీ దేవుడు సింహాల నోళ్ళు మూయడం ద్వారా ఆయనను కూడా రక్షించాడు.

చివరకు, పారసీక రాజైన కోరెషు ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడిన 70 సంవత్సరాల తర్వాత వాళ్లు తిరిగి తమ స్వదేశానికి వచ్చారు. వాళ్లు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత చేసిన మొదటి పనులలో యెహోవా ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించడం ఒకటి. అయితే, త్వరలోనే శత్రువులు వాళ్ల పనిని ఆపుచేశారు. కాబట్టి వాళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చిన 22 సంవత్సరాల తర్వాత చివరకు ఆలయాన్ని పూర్తి చేశారు.

ఆ తర్వాత, ఆలయాన్ని అలంకరించడానికి ఎజ్రా తిరిగి యెరూషలేముకు రావడాన్ని గురించి మనం తెలుసుకుంటాం. అది ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దాదాపు 47 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలను తిరిగి నిర్మించడానికి సహాయపడ్డాడు. అంటే అయిదవ భాగం మొత్తం 152 సంవత్సరాల చరిత్రను వివరిస్తోంది.

 

ఈ భాగంలో

77వ కథ

వాళ్లు సాగిలపడలేదు

విధేయులైన ఈ ముగ్గురు హెబ్రీ యువకుల్ని, ముండుతున్న అగ్నిగుండం నుండి దేవుడు కాపాడతాడా?

78వ కథ

గోడమీద చేతివ్రాత

దానియేలు ప్రవక్త నాలుగు వింత పదాల అర్థాన్ని వివరించాడు.

79వ కథ

సింహాల బోనులో దానియేలు

దానియేలుకు మరణశిక్షగురించి తెలిసినప్పుడు, ప్రార్థన చేయడం ఆపేయాలనుకున్నాడా?

80వ కథ

దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్లడం

పారసీక రాజు కోరేషు, బబులోనును స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక ప్రవచనం నెరవేరింది, అలాగే ఇప్పుడు ఆయన మరో ప్రవచనాన్ని నెరవేరుస్తాడు.

81వ కథ

దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

ఇశ్రాయేలీయులు మానవుల చట్టాలను ఎదిరించి దేవునికి లోబడ్డారు. దేవుడు వాళ్లను ఆశీర్వదించాడా?

82వ కథ

మొర్దెకై, ఎస్తేరు

రాణి వష్తి ఎంతో అందమైనది అయినప్పటికి, రాజైనా అహష్వేరేషు ఆమె స్థానాన్ని ఎస్తేరుకు ఇచ్చాడు ఎందుకు?

83వ కథ

యెరూషలేము గోడలు

గోడలను తిరిగి నిర్మిస్తున్నప్పుడు, అక్కడ పనిచేసేవాళ్లు తమ కత్తులను, ఈటెలను తప్పకుండా వాళ్ల దగ్గర పగలు, రాత్రి ఉంచుకోవాలి.