కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ భాగం

యేసు పునరుత్థానం చేయబడడం నుండి పౌలు జైలులో వేయబడడం వరకు

యేసు పునరుత్థానం చేయబడడం నుండి పౌలు జైలులో వేయబడడం వరకు

యేసు మరణించిన తర్వాత, మూడవ రోజున పునరుత్థానం చేయబడ్డాడు. ఆ రోజు ఆయన తన అనుచరులకు ఐదు వేర్వేరు సమయాల్లో కనిపించాడు. ఆ తర్వాత కూడా 40 రోజుల వరకు ఆయన వారికి కనిపిస్తూనే ఉన్నాడు. తర్వాత తన శిష్యులు కొంతమంది చూస్తుండగా, యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. పది రోజుల తర్వాత యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్న యేసు అనుచరులపై దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.

ఆ తర్వాత, దేవుని శత్రువులు అపొస్తలులను చెరసాలలో బంధించినప్పుడు, ఒక దేవదూత వాళ్ళను విడిపించాడు. వ్యతిరేకులు శిష్యుడైన స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. అయితే వ్యతిరేకులలో ఒకరిని యేసు తన ప్రత్యేక సేవకునిగా ఉండడానికి ఎలా ఎన్నుకున్నాడో మనం తెలుసుకుంటాం, ఆయనే అపొస్తలుడైన పౌలు అయ్యాడు. తర్వాత యేసు మరణించిన మూడున్నర సంవత్సరాలకు దేవుడు యూదుడు కాని కొర్నేలీకి, ఆయన కుటుంబానికి ప్రకటించేందుకు అపొస్తలుడైన పేతురును పంపించాడు.

తర్వాత దాదాపు 13 సంవత్సరాలకు పౌలు తన తొలి ప్రకటన పర్యటనను ప్రారంభించాడు. పౌలు రెండవ యాత్రలో తిమోతి ఆయనతోపాటు వెళ్ళాడు. దేవుని సేవించడంలో పౌలుకు, ఆయన ప్రయాణ సహచరులకు అనేక ఉత్తేజకరమైన అనుభవాలు ఎదురవడం గురించి మనం తెలుసుకుంటాం. చివరకు పౌలు, రోములోని చెరసాలలో వేయబడ్డాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన విడిపించబడ్డాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ చెరసాలలో వేయబడి, చంపబడ్డాడు. 7వ భాగంలోని సంఘటనలు 32 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో జరిగాయి.

 

ఈ భాగంలో

102వ కథ

యేసు సజీవుడవడం

ఓ దేవతూత యేసు సమాధికి అడ్డుగా ఉంచిన రాయిని పక్కకు జరిపినప్పుడు, సైనికులు సమాధి లోపల చూసి ఆశ్చర్యపోయారు.

103వ కథ

గడియ వేసివున్న గదిలోకి ప్రవేశించడం

పునరుత్థానమైన యేసును ఆయన శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదు?

104వ కథ

యేసు పరలోకానికి వెళ్లడం

యేసు పరలోకానికి వెళ్లిపోయే ముందు, తన శిష్యులకు చివరి ఆజ్ఞ ఇచ్చాడు.

105వ కథ

యెరూషలేములో కనిపెట్టుకొని ఉండడం

పెంతెకొస్తు రోజున యేసు తన శిష్యుల మీద పరిశుద్ధాత్మ ఎందుకు కుమ్మరించాడు?

106వ కథ

చెరసాలనుండి విడిపించబడడం

అపొస్తలులు చేస్తున్న ప్రకటనా పనిని ఆపుజేయడానికి యూదా మతనాయకులు వాళ్లను చెరసాలలో వేయించారు. కానీ దేవుడు ఆలోచన వేరేలా ఉంది.

107వ కథ

స్తెఫను రాళ్లతో కొట్టబడడం

స్తెఫను హింసించబడుతున్నప్పుడు ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు.

108వ కథ

దమస్కుకు వెళ్లే మార్గంలో

ప్రకాశవంతమైన వెలుగు, పరలోకం నుండి వినబడిన స్వరం సౌలు జీవితాన్ని మార్చేశాయి.

109వ కథ

పేతురు కొర్నేలిని దర్శించడం

ఒక జాతి లేదా ఒక దేశప్రజలు మిగతా వాళ్లకన్నా గొప్పవాళ్లని దేవుడు భావిస్తాడా?

110 వ కథ

తిమోతి—పౌలుకు క్రొత్త సహాయకుడు

పౌలుతో కలిసి ప్రకటించడానికి తిమోతి ఒక ఆసక్తికరమైన యాత్రకు ఇల్లు వదిలి బయల్దేరాడు.

111వ కథ

నిద్రపోయిన బాలుడు

ఐతుకు పౌలు మొదటి ప్రసంగంలో నిద్రపోయాడుగానీ రెండవ ప్రసంగం ఇస్తున్నప్పుడు కాదు. ఆ రెండు ప్రసంగాల మధ్యలో ఓ అద్భుతం జరిగింది.

112వ కథ

ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం

ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో, దేవుని దగ్గర నుండి వచ్చిన సందేశం పౌలులో నమ్మకాన్ని నింపింది.

113వ కథ

రోమాలో పౌలు

పౌలు ఖైధీగా ఉన్నప్పుడు అపొస్తలునిగా చేయాల్సిన పనిని ఎలా చేయగలిగాడు?