కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ భాగం

బైబిలు ప్రవచిస్తున్నది నెరవేరుతుంది

బైబిలు ప్రవచిస్తున్నది నెరవేరుతుంది

బైబిలు గతంలో జరిగినవాటి గురించి నిజమైన వృత్తాంతాన్ని తెలియజేయడమే కాక భవిష్యత్తులో జరగబోయేవాటి గురించి కూడా తెలియజేస్తోంది. మానవులు భవిష్యత్తును చెప్పలేరు. అందుకే బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకు తెలుసు. బైబిలు భవిష్యత్తు గురించి ఏమి చెబుతోంది?

అది దేవుని మహా యుద్ధం గురించి చెబుతోంది. ఆ యుద్ధంలో దేవుడు చెడుతనాన్నంతటినీ, చెడ్డ ప్రజలందరినీ తీసివేసి భూమిని శుభ్రం చేస్తాడు. కానీ ఆయన తనను సేవించే వాళ్ళను రక్షిస్తాడు. దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు దేవుని సేవకులు శాంతి సమాధానాలతో జీవిస్తూ ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కాకుండా లేక మరణించకుండా ఉండేలా చూస్తాడు.

దేవుడు భూమ్మీద ఒక క్రొత్త పరదైసును ఏర్పాటు చేస్తున్నందుకు మనం సంతోషిస్తాం, కాదా? అయితే మనం ఆ పరదైసులో జీవించాలంటే కొన్ని పనులు చేయాలి. దేవుడు తనను సేవించేవారి కోసం సిద్ధంగా ఉంచిన అద్భుతమైన వాటిని అనుభవించాలంటే మనమేమి చేయాలో ఈ పుస్తకంలోని చివరి కథలో తెలుసుకుంటాం. కాబట్టి 8వ భాగం చదివి భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెబుతోందో తెలుసుకోండి..

 

ఈ భాగంలో

114వ కథ

చెడుతనమంతా అంతం కావడం

హార్‌మెగిద్దోనులో దేవుడు, యేసు నాయకత్వంలో తన సైన్యాన్ని ఎందుకు యుద్ధానికి పంపిస్తాడు?

115వ కథ

భూమిపై ఒక కొత్త పరదైసు

ప్రజలు ఒకప్పుడు పరదైసులా ఉన్న భూమ్మీద జీవించారు, మళ్లీ అలాంటి కాలం వస్తుంది.

116వ కథ

మనమెలా నిరంతరం జీవించవచ్చు

కేవలం యెహోవా, యేసు గురించి తెలుసుకుంటే సరిపోతుందా? దానికి జవాబు కాదు అయితే, మరి ఇంకా ఏం అవసరం?