కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా బైబిలు కథల పుస్తకము కోసం అధ్యయన ప్రశ్నలు

నా బైబిలు కథల పుస్తకము కోసం అధ్యయన ప్రశ్నలు

1వ కథ

దేవుడు సృష్టిని ప్రారంభించడం

  1. మనకున్న మంచివన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, ఒక ఉదాహరణ ఇవ్వగలరా?

  2. దేవుడు మొట్టమొదట ఎవరిని చేశాడు?

  3. మొదట సృష్టించబడిన దూత ఎందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి?

  4. మొదట్లో భూమి ఎలా ఉండేదో వర్ణించండి. (చిత్రం చూడండి.)

  5. దేవుడు భూమిని జంతువులు, మనుష్యులు నివసించేందుకు అనుకూలంగా చేయడం ఎలా ప్రారంభించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. యిర్మీయా 10:12 చదవండి.

    దేవుని సృష్టిలో ఆయనకున్న ఏయే లక్షణాలు కనిపిస్తాయి? (యెష. 40:26; రోమా. 11:33)

  2. కొలొస్సయులు 1:15-17 చదవండి.

    సృష్టించడంలో యేసు పాత్ర ఏమిటి, ఆ కారణంగా మనం ఆయనను ఎలా దృష్టించాలి? (కొలొ. 1:15-17)

  3. ఆదికాండము 1:1-10 చదవండి.

    1. (ఎ) భూమి ఎలా వచ్చింది? (ఆది. 1:1)

    2. (బి) మొదటి సృష్టి దినమున ఏమి జరిగింది? (ఆది. 1:3-5)

    3. (సి) రెండవ సృష్టి దినమున ఏమి జరిగిందో వర్ణించండి. (ఆది. 1:7, 8)

2వ కథ

ఒక అందమైన తోట

  1. భూమి మన గృహంలా ఉండడానికి దేవుడు దానిని ఎలా సిద్ధం చేశాడు?

  2. దేవుడు చేసిన అనేక రకాల జంతువులను వర్ణించండి. (చిత్రం చూడండి.)

  3. ఏదెను తోట ఎందుకు ప్రత్యేకమైనది?

  4. భూమంతా ఎలా మారాలని దేవుడు కోరుకున్నాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 1:11-25 చదవండి.

    1. (ఎ) మూడవ సృష్టి దినమున దేవుడు ఏమి సృష్టించాడు? (ఆది. 1:12)

    2. (బి) నాలుగవ సృష్టి దినమున ఏమి జరిగింది? (ఆది. 1:16)

    3. (సి) ఐదవ దినమున, ఆరవ దినమున దేవుడు ఎలాంటి జంతువులను చేశాడు? (ఆది. 1:20, 21, 25)

  2. ఆదికాండము 2:8, 9 చదవండి.

    దేవుడు తోటలో ప్రత్యేకమైన ఏ రెండు చెట్లను ఉంచాడు, అవి వేటిని సూచించాయి?

3వ కథ

మొదటి పురుషుడు, స్త్రీ

  1. రెండవ కథలోని చిత్రానికి, మూడవ కథలోని చిత్రానికి మధ్య తేడా ఏమిటి?

  2. మొదటి పురుషుణ్ణి ఎవరు చేశారు, ఆ పురుషుని పేరు ఏమిటి?

  3. దేవుడు ఆదాముకు ఏ పని అప్పగించాడు?

  4. దేవుడు ఆదాముకు గాఢనిద్ర ఎందుకు కలిగించాడు?

  5. ఆదాము హవ్వలు ఎంతకాలం జీవించగలిగేవారు, వాళ్ళు ఏ పని చేయాలని యెహోవా కోరుకున్నాడు?

అదనపు ప్రశ్నలు:

  1. కీర్తన 83:18 చదవండి.

    దేవుని పేరు ఏమిటి, భూమిపై ఆయనకు ఎలాంటి విశిష్టమైన స్థానం ఉంది? (యిర్మీ. 16:21; దాని. 4:17)

  2. ఆదికాండము 1:26-31 చదవండి.

    1. (ఎ) ఆరవ దినమున చివరిగా దేవుడు ఏమి సృష్టించాడు, ఆ సృష్టి ఇతర జంతువులకు ఎలా భిన్నంగా ఉంది? (ఆది. 1:26)

    2. (బి) మనుష్యులకు, జంతువులకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? (ఆది. 1:30)

  3. ఆదికాండము 2:7-25 చదవండి.

    1. (ఎ) జంతువులకు పేర్లు పెట్టమని ఆదాముకు ఇవ్వబడిన నియామకంలో భాగంగా ఆయన ఏమి చేయాలి? (ఆది. 2:19)

    2. (బి) వివాహాన్ని, విడిపోవడాన్ని, విడాకులను దేవుడు ఎలా దృష్టిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆదికాండము 2:24 మనకు ఎలా సహాయం చేస్తుంది? (మత్త. 19:4-6, 9)

4వ కథ

వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం

  1. చిత్రంలో ఆదాము హవ్వలకు ఏమి జరుగుతోంది?

  2. యెహోవా వాళ్ళను ఎందుకు శిక్షించాడు?

  3. ఒక పాము హవ్వకు ఏమని చెప్పింది?

  4. పాము హవ్వతో మాట్లాడేలా ఎవరు చేశారు?

  5. ఆదాము హవ్వలు తమ పరదైసు గృహాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 2:16, 17, 3:1-13, 24 చదవండి.

    1. (ఎ) పాము హవ్వను అడిగిన ప్రశ్న యెహోవాను ఎలా తప్పుగా చిత్రీకరించింది? (ఆది. 3:1-5; 1 యోహా. 5:3)

    2. (బి) హవ్వ మనకు ఒక హెచ్చరికా మాదిరిగా ఎందుకు ఉంది? (ఫిలి. 4:8; యాకో. 1:14, 15; 1 యోహా. 2:16)

    3. (సి) ఆదాము హవ్వలు తాము చేసిన పనులకు ఎలా బాధ్యత వహించలేదు? (ఆది. 3:12, 13)

    4. (డి) ఏదెను తోటకు తూర్పువైపున నిలబెట్టబడిన కెరూబులు యెహోవా సర్వాధిపత్యాన్ని ఎలా సమర్థించారు? (ఆది. 3:24)

  2. ప్రకటన 12:9 చదవండి.

    మానవాళిని దేవుని పరిపాలననుండి ప్రక్కకు మళ్ళించడంలో సాతాను ఎంతగా విజయం సాధించాడు? (1 యోహా. 5:19)

5వ కథ

కష్టమైన జీవితం మొదలవడం

  1. ఏదెను తోట బయట ఆదాము హవ్వల జీవితం ఎలా ఉంది?

  2. ఆదాము హవ్వలకు ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు అలా జరిగింది?

  3. ఆదాము హవ్వల పిల్లలు ఎందుకు ముసలివాళ్ళై చనిపోతారు?

  4. ఆదాము హవ్వలు యెహోవాకు విధేయత చూపించివుంటే, వాళ్ళ జీవితం వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉండేది?

  5. అవిధేయత చూపించడంవల్ల హవ్వ ఎలాంటి కష్టాలు అనుభవించవలసి వచ్చింది?

  6. ఆదాము హవ్వల మొదటి ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి?

  7. చిత్రంలోవున్న ఇతర పిల్లలు ఎవరు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 3:16-23, 4:1, 2 చదవండి.

    1. (ఎ) నేల శపించబడినందువల్ల ఆదాము జీవితంపై ఎలాంటి ప్రభావం పడింది? (ఆది. 3:17-19; రోమా. 8:20, 22)

    2. (బి) హవ్వ అనే పేరుకు ‘జీవముగలది’ అని అర్థం, ఆ పేరు ఆమెకు ఎందుకు తగినది? (ఆది. 3:20)

    3. (సి) ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత కూడా దేవుడు వాళ్ళపై ఎలా శ్రద్ధ చూపించాడు? (ఆది. 3:7, 21)

  2. ప్రకటన 21:3, 4 చదవండి.

    ఏయే “మొదటి సంగతులు” నిర్మూలించబడాలని మీరు ఎదురు చూస్తున్నారు?

6వ కథ

మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు

  1. కయీను, హేబెలు ఏయే పనులు ప్రారంభించారు?

  2. కయీను, హేబెలు యెహోవా కోసం తెచ్చిన అర్పణలేమిటి?

  3. యెహోవా హేబెలు అర్పణ చూసి ఎందుకు సంతోషించాడు, కయీను అర్పణ చూసి ఎందుకు సంతోషించలేదు?

  4. కయీను ఎలాంటి వ్యక్తి, యెహోవా అతనిని సరిదిద్దడానికి ఎలా ప్రయత్నించాడు?

  5. కయీను తన సహోదరునితోపాటు పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేశాడు?

  6. కయీను తన సహోదరుణ్ణి చంపిన తర్వాత అతనికి ఏమి జరిగిందో వివరించండి.

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 4:2-26 చదవండి.

    1. (ఎ) కయీను ఉన్న ప్రమాదకరమైన పరిస్థితిని యెహోవా ఎలా వర్ణించాడు? (ఆది. 4:7)

    2. (బి) కయీను తన హృదయ వైఖరిని ఎలా వెల్లడి చేశాడు? (ఆది. 4:9)

    3. (సి) అమాయకుల రక్తం చిందించడాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (ఆది. 4:10; యెష. 26:20, 21)

  2. మొదటి యోహాను 3:11, 12 చదవండి.

    1. (ఎ) కయీనుకు కోపం ఎందుకు వచ్చింది, అది నేడు మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (ఆది. 4:4, 5; సామె. 14:30; యాకో. 3:16)

    2. (బి) మన కుటుంబ సభ్యులందరూ యెహోవాను వ్యతిరేకించినా మనం మన యథార్థతను కాపాడుకోవచ్చని బైబిలు ఎలా చూపిస్తోంది? (కీర్త. 27:10; మత్త. 10:21, 22)

  3. యోహాను 11:25 చదవండి.

    నీతి కోసం చనిపోయేవారందరి విషయంలో యెహోవా ఎలాంటి హామీ ఇస్తున్నాడు? (యోహా. 5:24)

7వ కథ

ఒక ధైర్యవంతుడు

  1. హనోకు ఇతరుల నుండి ఎలా భిన్నంగా ఉండేవాడు?

  2. హనోకు కాలంలోని ప్రజలు ఎందుకు అన్ని చెడ్డ పనులు చేసేవారు?

  3. ప్రజలు ఎలాంటి చెడ్డ పనులు చేసేవారు? (చిత్రం చూడండి.)

  4. హనోకుకు ఎందుకు ధైర్యం అవసరమయ్యింది?

  5. ఆ కాలంలోని ప్రజలు ఎంతకాలం జీవించేవారు, కానీ హనోకు ఎంతకాలం జీవించాడు?

  6. హనోకు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 5:21-24, 27 చదవండి.

    1. (ఎ) హనోకుకు యెహోవాతో ఎలాంటి సంబంధం ఉండేది? (ఆది. 5:24)

    2. (బి) బైబిలు ప్రకారం, అందరికంటే ఎక్కువకాలం జీవించిన వ్యక్తి ఎవరు, చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? (ఆది. 5:27)

  2. ఆదికాండము 6:5 చదవండి.

    హనోకు చనిపోయిన తర్వాత భూమిపై పరిస్థితులు ఎంత చెడుగా తయారయ్యాయి, మన కాలంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి? (2 తిమో. 3:13)

  3. హెబ్రీయులు 11:5 చదవండి.

    హనోకులోని ఏ లక్షణం కారణంగా ఆయన “దేవునికి ఇష్టుడై” ఉన్నాడు, దాని ఫలితమేమిటి? (ఆది. 5:22)

  4. యూదా 14, 15 చదవండి.

    నేటి క్రైస్తవులు రాబోయే అర్మగిద్దోను యుద్ధం గురించి ప్రజలకు హెచ్చరించేటప్పుడు హనోకు చూపించిన ధైర్యాన్ని ఎలా అనుకరించవచ్చు? (2 తిమో. 4:2; హెబ్రీ. 13:6)

8వ కథ

భూమిపై రాక్షసులు

  1. దేవుని దూతల్లో కొందరు సాతాను మాటలు విన్నప్పుడు ఏమి జరిగింది?

  2. కొందరు దేవదూతలు పరలోకంలో తమ పనిని మానుకొని భూమ్మీదకు ఎందుకు వచ్చారు?

  3. దేవదూతలు భూమ్మీదకు వచ్చి తమ కోసం మానవ శరీరాలు చేసుకోవడం ఎందుకు తప్పు?

  4. దేవదూతలకు పుట్టిన పిల్లలు ఎలా భిన్నంగా తయారయ్యారు?

  5. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా, దేవదూతల పిల్లలు రాక్షసులుగా తయారైనప్పుడు ఏమి చేశారు?

  6. హనోకు తర్వాత భూమిపై జీవించిన మంచి వ్యక్తి ఎవరు, దేవుడు ఆయనను ఎందుకు ఇష్టపడ్డాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 6:1-8 చదవండి.

    మన ప్రవర్తన యెహోవా మనస్సుపై ఎలా ప్రభావం చూపించగలదు అనే విషయమై ఆదికాండము 6:6 ఏమి వెల్లడి చేస్తోంది? (కీర్త. 78:40, 41; సామె. 27:11)

  2. యూదా 6వ వచనం చదవండి.

    నోవహు దినాల్లో ‘తమ ప్రధానత్వమును నిలుపుకోని’ దేవదూతలు నేడు మనకు ఒక జ్ఞాపికగా ఎలా ఉన్నారు? (1 కొరిం. 3:5-9; 2 పేతు. 2:4, 9, 10)

9వ కథ

నోవహు ఓడను నిర్మించడం

  1. నోవహు కుటుంబంలో ఎంతమంది ఉండేవారు, ఆయన ముగ్గురు కుమారుల పేర్లు ఏమిటి?

  2. దేవుడు నోవహును ఎలాంటి విచిత్రమైన పని చేయమన్నాడు, అలా చేయమని ఎందుకు చెప్పాడు?

  3. నోవహు ఓడ గురించి తన పొరుగువారికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు?

  4. జంతువులను ఏమి చేయమని దేవుడు నోవహుకు చెప్పాడు?

  5. దేవుడు ఓడ తలుపులు మూసేసిన తర్వాత, నోవహు ఆయన కుటుంబం ఏమి చేయవలసి వచ్చింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 6:9-22 చదవండి.

    1. (ఎ) నోవహును సత్య దేవుని నమ్మకమైన ఆరాధకుడిగా చేసినదేమిటి? (ఆది. 6:9, 22)

    2. (బి) దేవుడు దౌర్జన్యాన్ని ఎలా దృష్టిస్తాడు, మనం ఎలాంటి వినోదాన్ని ఎంపిక చేసుకుంటామనే దానిని అదెలా ప్రభావితం చేయాలి? (ఆది. 6:11, 12; కీర్త. 11:5)

    3. (సి) మనకు యెహోవా సంస్థ నుండి మార్గదర్శకం అందినప్పుడు మనం నోవహును ఎలా అనుకరించవచ్చు? (ఆది. 6:22; 1 యోహా. 5:3)

  2. ఆదికాండము 7:1-9 చదవండి.

    అపరిపూర్ణ మానవుడైన నోవహును యెహోవా నీతిమంతుడిగా దృష్టించాడు అనే వాస్తవం నేడు మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? (ఆది. 7:1; సామె. 10:16; యెష. 26:7)

10వ కథ

గొప్ప జలప్రళయం

  1. వర్షం మొదలైన తర్వాత ఎవ్వరూ ఓడలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు?

  2. ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు వర్షం పడేలా యెహోవా చేశాడు, నీళ్ళు ఎంత ఎత్తుకు చేరుకున్నాయి?

  3. భూమిపై నీళ్ళు నిండే కొద్దీ ఓడకు ఏమయ్యింది?

  4. రాక్షసులు జలప్రళయం నుండి తప్పించుకున్నారా, రాక్షసుల తండ్రులకు ఏమి జరిగింది?

  5. అయిదు నెలల తర్వాత ఓడకు ఏమి జరిగింది?

  6. నోవహు ఒక కాకిని ఓడనుండి బయటకు ఎందుకు పంపించాడు?

  7. భూమిపై నీళ్ళు తగ్గిపోయాయని నోవహుకు ఎలా అర్థమయ్యింది?

  8. నోవహు, ఆయన కుటుంబం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంపాటు ఓడలో ఉన్న తర్వాత దేవుడు నోవహుకు ఏమి చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 7:10-24 చదవండి.

    1. (ఎ) భూమిపై వినాశనం ఎంత పూర్తిగా జరిగింది? (ఆది. 7:23)

    2. (బి) జలప్రళయపు నీళ్ళు ఇంకిపోవడానికి ఎంతకాలం పట్టింది? (ఆది. 7:24)

  2. ఆదికాండము 8:1-17 చదవండి.

    భూమికి సంబంధించి యెహోవాకున్న మొదటి సంకల్పం మారలేదని ఆదికాండము 8:17 ఎలా చూపిస్తోంది? (ఆది. 1:22)

  3. మొదటి పేతురు 3:19, 20 చదవండి.

    1. (ఎ) తిరుగుబాటుదారులైన దూతలు పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎలాంటి తీర్పు తీర్చబడింది? (యూదా 6)

    2. (బి) నోవహు ఆయన కుటుంబానికి సంబంధించిన వృత్తాంతం, యెహోవాకు తన ప్రజలను రక్షించే సామర్థ్యం ఉందనే మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది? (2 పేతు. 2:9)

11వ కథ

మొదటి వర్షధనుస్సు

  1. చిత్రంలో చూపించబడినట్లు, నోవహు ఓడలోనుండి బయటకు వచ్చిన తర్వాత చేసిన మొదటి పనేమిటి?

  2. జలప్రళయం తర్వాత దేవుడు నోవహుకు, ఆయన కుటుంబానికి ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

  3. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు?

  4. మనం వర్షధనుస్సును చూసినప్పుడు, దేనిని జ్ఞాపకం చేసుకోవాలి?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 8:18-22 చదవండి.

    1. (ఎ) నేడు మనం యెహోవాకు “ఇంపయిన సువాసన”ను ఎలా ఇవ్వవచ్చు? (ఆది. 8:21; హెబ్రీ. 13:15, 16)

    2. (బి) మానవుని హృదయ పరిస్థితి గురించి యెహోవా ఏమని చెప్పాడు, కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? (ఆది. 8:21; మత్త. 15:18, 19)

  2. ఆదికాండము 9:9-17 చదవండి.

    1. (ఎ) భూమిపైనున్న ప్రాణులన్నింటితో యెహోవా ఎలాంటి నిబంధన చేశాడు? (ఆది. 9:10, 11)

    2. (బి) వర్షధనుస్సు నిబంధన ఎంతకాలం ఉంటుంది? (ఆది. 9:16, NW)

12వ కథ

ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం

  1. నిమ్రోదు ఎవరు, దేవుడు ఆయన గురించి ఎలా భావించాడు?

  2. చిత్రంలో కనిపిస్తున్నట్లు ప్రజలు ఇటుకలు ఎందుకు తయారు చేశారు?

  3. యెహోవా ఆ నిర్మాణ పనిని ఎందుకు ఇష్టపడలేదు?

  4. గోపుర నిర్మాణాన్ని దేవుడు ఎలా ఆపేశాడు?

  5. ఆ పట్టణం పేరేమిటి, ఆ పేరుకు అర్థమేమిటి?

  6. దేవుడు ప్రజల భాషలను తారుమారు చేసిన తర్వాత వాళ్ళు ఏమి చేశారు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 10:1, 8-10 చదవండి.

    నిమ్రోదు ఎలాంటి స్వభావాన్ని ప్రదర్శించాడు, అది మనకు ఎలాంటి హెచ్చరికగా ఉంది? (సామె. 3:31)

  2. ఆదికాండము 11:1-9 చదవండి.

    గోపురాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటి, ఆ నిర్మాణ పని ఎందుకు విఫలమయ్యింది? (ఆది. 11:4; సామె. 16:18; యోహా. 5:44)

13వ కథ

అబ్రాహాము—దేవుని స్నేహితుడు

  1. ఊరు పట్టణంలో ఎలాంటి ప్రజలు నివసించేవారు?

  2. చిత్రంలోవున్న వ్యక్తి ఎవరు, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఆయన ఎక్కడ నివసించేవాడు?

  3. దేవుడు అబ్రాహాముకు ఏమి చేయమని చెప్పాడు?

  4. అబ్రాహాము దేవుని స్నేహితుడు అని ఎందుకు పిలువబడ్డాడు?

  5. అబ్రాహాము ఊరు పట్టణాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయనతోపాటు ఎవరు వెళ్ళారు?

  6. అబ్రాహాము కనానుకు చేరుకున్న తర్వాత దేవుడు ఆయనకు ఏమి చెప్పాడు?

  7. అబ్రాహాముకు 99 సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు ఆయనకు ఏ వాగ్దానం చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 11:27-32 చదవండి.

    1. (ఎ) అబ్రాహాముకు లోతుకు ఉన్న బంధుత్వము ఏమిటి? (ఆది. 11:27)

    2. (బి) తెరహు తన కుటుంబాన్ని తీసుకొని కనానుకు వెళ్ళాడు అని చెప్పబడినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది అబ్రాహాము అని మనకు ఎలా తెలుసు, ఆయన ఎందుకు అలా చేశాడు? (ఆది. 11:31; అపొ. 7:2-4)

  2. ఆదికాండము 12:1-7 చదవండి.

    అబ్రాహాము కనానుకు చేరుకున్న తర్వాత యెహోవా అబ్రాహాముతో చేసిన నిబంధనకు ఏమి చేర్చాడు? (ఆది. 12:7)

  3. ఆదికాండము 17:1-8, 15-17 చదవండి.

    1. (ఎ) అబ్రాముకు 99 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన పేరు ఎలా మార్చబడింది, ఎందుకు మార్చబడింది? (ఆది. 17:5)

    2. (బి) శారాకు భవిష్యత్తులో ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయని యెహోవా వాగ్దానం చేశాడు? (ఆది. 17:15, 16)

  4. ఆదికాండము 18:9-19 చదవండి.

    1. (ఎ) ఆదికాండము 18:19లో తండ్రులు ఎలాంటి బాధ్యతలు చేపట్టాలని తెలియజేయబడింది? (ద్వితీ. 6:6, 7; ఎఫె. 6:4)

    2. (బి) మనం యెహోవానుండి ఏమీ దాచలేమని, శారాకు ఎదురైన ఏ అనుభవం చూపిస్తోంది? (ఆది. 18:12, 15; కీర్త. 44:21)

14వ కథ

దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం

  1. దేవుడు అబ్రాహాముకు ఏమని వాగ్దానం చేశాడు, దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడు?

  2. చిత్రంలో కనిపిస్తున్నట్లు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని ఎలా పరీక్షించాడు?

  3. దేవుడు అలా ఆజ్ఞాపించడానికి కారణం తెలియకపోయినా అబ్రాహాము ఏమి చేశాడు?

  4. అబ్రాహాము తన కుమారుణ్ణి చంపడానికి కత్తి బయటకు తీసినప్పుడు ఏమి జరిగింది?

  5. అబ్రాహాముకు దేవునిపై ఉన్న విశ్వాసం ఎంత బలమైనది?

  6. బలిగా అర్పించడానికి దేవుడు అబ్రాహాముకు ఏమి ఏర్పాటు చేశాడు, ఎలా చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 21:1-7 చదవండి.

    అబ్రాహాము ఎనిమిదవ రోజున తన కుమారుడికి ఎందుకు సున్నతి చేశాడు? (ఆది. 17:10-12; 21:4)

  2. ఆదికాండము 22:1-18 చదవండి.

    ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముకు ఎలా విధేయత చూపించాడు, అది భవిష్యత్తులో జరగబోయే మరింత గమనార్హమైన సంఘటనకు పూర్వఛాయగా ఎలా ఉంది? (ఆది. 22:7-9; 1 కొరిం. 5:7; ఫిలి. 2:8, 9)

15వ కథ

లోతు భార్య వెనక్కి చూడడం

  1. అబ్రాహాము, లోతు ఎందుకు విడిపోయారు?

  2. లోతు సొదొమలో నివసించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు?

  3. సొదొమలోని ప్రజలు ఎలాంటివారు?

  4. ఇద్దరు దేవదూతలు లోతును ఏమని హెచ్చరించారు?

  5. లోతు భార్య ఎందుకు ఉప్పు స్తంభంగా మారింది?

  6. లోతు భార్యకు జరిగినదాని నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 13:5-13 చదవండి.

    వ్యక్తుల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించే విషయంలో మనం అబ్రాహామునుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ఆది. 13:8, 9; రోమా. 12:10; ఫిలి. 2:3, 4)

  2. ఆదికాండము 18:20-33 చదవండి.

    యెహోవా అబ్రాహాముతో వ్యవహరించిన విధానం, యెహోవా మరియు యేసు న్యాయంగానే తీర్పు తీరుస్తారని ఎలా హామీ ఇస్తోంది? (ఆది. 18:25, 26; మత్త. 25:31-33)

  3. ఆదికాండము 19:1-29 చదవండి.

    1. (ఎ) దేవుడు స్వలింగ సంయోగాన్ని ఎలా దృష్టిస్తాడనే విషయం గురించి ఈ బైబిలు వృత్తాంతం ఏమి చూపిస్తోంది? (ఆది. 19:5, 13; లేవీ. 20:13)

    2. (బి) దేవుని మార్గదర్శకానికి అబ్రాహాము స్పందించిన విధానంలో, లోతు స్పందించిన విధానంలో ఎలాంటి తేడా కనిపిస్తుంది, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (ఆది. 19:15, 16, 19, 20; 22:3)

  4. లూకా 17:28-32 చదవండి.

    భౌతిక సంపదల విషయంలో లోతు భార్య హృదయ పరిస్థితి ఎలా ఉంది, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (లూకా 12:15; 17:31, 32; మత్త. 6:19-21, 25)

  5. రెండవ పేతురు 2:6-8 చదవండి.

    లోతులాగే, మన చుట్టూవున్న దైవభక్తిలేని ప్రపంచంపట్ల మన వైఖరి ఎలా ఉండాలి? (యెహె. 9:4; 1 యోహా. 2:15-17)

16వ కథ

ఇస్సాకుకు మంచి భార్య లభించడం

  1. చిత్రంలోని పురుషుడు, స్త్రీ ఎవరు?

  2. అబ్రాహాము తన కుమారుడి కోసం భార్యను తీసుకురావడానికి ఏమి చేశాడు, ఆయన ఎందుకు అలా చేశాడు?

  3. అబ్రాహాము సేవకుని ప్రార్థనకు ఎలా సమాధానమివ్వబడింది?

  4. ఇస్సాకును పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగినప్పుడు రిబ్కా ఏమని సమాధానం చెప్పింది?

  5. ఇస్సాకు తిరిగి ఎందుకు సంతోషభరితుడయ్యాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 24:1-67 చదవండి.

    1. (ఎ) రిబ్కా బావి దగ్గర అబ్రాహాము సేవకుడిని కలిసినప్పుడు ఎలాంటి మంచి లక్షణాలను ప్రదర్శించింది? (ఆది. 24:17-20; సామె. 31:17, 31)

    2. (బి) అబ్రాహాము ఇస్సాకు కోసం చేసిన ఏర్పాటు నేటి క్రైస్తవులకు ఎలా ఒక మంచి మాదిరిగా ఉంది? (ఆది. 24:37, 38; 1 కొరిం. 7:39; 2 కొరిం. 6:14)

    3. (సి) ఇస్సాకులాగే మనం ధ్యానించడానికి సమయాన్ని ఎందుకు కేటాయించాలి? (ఆది. 24:63; కీర్త. 77:12; ఫిలి. 4:8)

17వ కథ

భిన్నమైన కవల పిల్లలు

  1. ఏశావు యాకోబులు ఎవరు, వాళ్ళు ఎలా భిన్నంగా ఉండేవారు?

  2. ఏశావు యాకోబుల తాత అబ్రాహాము చనిపోయినప్పుడు వాళ్ళ వయసు ఎంత?

  3. ఏశావు తన తల్లిదండ్రులకు బాధ కలిగించే ఏ పని చేశాడు?

  4. ఏశావుకు తన సహోదరుడైన యాకోబుపై ఎందుకు కోపం వచ్చింది?

  5. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు ఏమి చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 25:5-11, 20-34 చదవండి.

    1. (ఎ) రిబ్కాకు పుట్టిన ఇద్దరు కుమారుల గురించి యెహోవా ఏమని ప్రవచించాడు? (ఆది. 25:23)

    2. (బి) జ్యేష్ఠత్వము విషయంలో యాకోబుకున్న వైఖరికి, ఏశావుకున్న వైఖరికి మధ్య ఎలాంటి తేడా ఉంది? (ఆది. 25:31-34)

  2. ఆదికాండము 26:34, 35; 27:1-46; 28:1-5 చదవండి.

    1. (ఎ) ఏశావు ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా ఎంచలేదని ఎలా స్పష్టమయ్యింది? (ఆది. 26:34, 35; 27:46)

    2. (బి) యాకోబు యెహోవా ఆశీర్వాదం పొందడానికి ఏమి చేయాలని ఇస్సాకు చెప్పాడు? (ఆది. 28:1-4)

  3. హెబ్రీయులు 12:16, 17 చదవండి.

    పరిశుద్ధమైనవాటిని తృణీకరించే వారి పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఏశావు ఉదాహరణ ఎలా చూపిస్తోంది?

18వ కథ

యాకోబు హారానుకు వెళ్ళడం

  1. చిత్రంలోని యువతి ఎవరు, యాకోబు ఆమె కోసం ఏమి చేశాడు?

  2. రాహేలును పెళ్ళి చేసుకోవడానికి యాకోబు ఏమి చేయడానికి సిద్ధపడ్డాడు?

  3. యాకోబు రాహేలును పెళ్ళి చేసుకోవలసిన సమయం వచ్చినప్పుడు లాబాను ఏమి చేశాడు?

  4. రాహేలును తన భార్యగా చేసుకోవడానికి యాకోబు ఏమి చేయడానికి అంగీకరించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 29:1-30 చదవండి.

    1. (ఎ) లాబాను యాకోబును మోసం చేసినప్పటికీ యాకోబు తాను మర్యాదస్థుడనని ఎలా చూపించాడు, దానినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ఆది. 25:27; 29:26-28; మత్త. 5:37)

    2. (బి) ప్రేమకు, ఆకర్షణకు మధ్యవున్న తేడాను యాకోబు ఉదాహరణ ఎలా చూపిస్తోంది? (ఆది. 29:18, 20, 30; పర. 8:6)

    3. (సి) ఏ నలుగురు స్త్రీలు యాకోబు కుటుంబంలో భాగమై ఆ తర్వాత ఆయనకు కుమారులను కన్నారు? (ఆది. 29:23, 24, 28, 29)

19వ కథ

యాకోబు పెద్ద కుటుంబం

  1. యాకోబుకు తన మొదటి భార్య లేయా ద్వారా పుట్టిన ఆరుగురు కుమారుల పేర్లేమిటి?

  2. లేయా దాసురాలైన జిల్పా యాకోబుకు కనిన ఇద్దరు కుమారులు ఎవరు?

  3. రాహేలు దాసురాలైన బిల్హా యాకోబుకు కనిన ఇద్దరు కుమారుల పేర్లేమిటి?

  4. రాహేలుకు జన్మించిన ఇద్దరు కుమారులు ఎవరు, రెండవ కుమారుడు జన్మించినప్పుడు ఏమి జరిగింది?

  5. చిత్రంలో కనిపిస్తున్నట్లు యాకోబుకు ఎంతమంది కుమారులు, వాళ్ళనుండి ఏమి వచ్చింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 29:32-35; 30:1-26; 35:16-19 చదవండి.

    యాకోబు 12 మంది కుమారుల విషయంలో సూచించబడినట్లు, ప్రాచీన కాలాల్లో హెబ్రీ అబ్బాయిలకు పేర్లు ఎలా పెట్టబడేవి?

  2. ఆదికాండము 37:35 చదవండి.

    బైబిలులో కేవలం దీనా పేరు మాత్రమే ఇవ్వబడినప్పటికీ యాకోబుకు వేరే కుమార్తెలు కూడా ఉన్నారని మనకు ఎలా తెలుసు? (ఆది. 37:34, 35)

20వ కథ

దీనా కష్టాల్లో చిక్కుకోవడం

  1. అబ్రాహాము ఇస్సాకులు, తమ కుమారులు కనాను అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు?

  2. తన కుమార్తె కనానులోని అమ్మాయిలతో స్నేహం చేయడం యాకోబుకు ఇష్టమేనా?

  3. చిత్రంలో దీనాను చూస్తున్న వ్యక్తి ఎవరు, అతను ఎలాంటి చెడ్డ పని చేశాడు?

  4. దీనా సహోదరులైన షిమ్యోనుకు, లేవికి జరిగిన సంగతి తెలిసినప్పుడు వాళ్ళేమి చేశారు?

  5. షిమ్యోను లేవిలు చేసిన పని యాకోబుకు నచ్చిందా?

  6. ఆ కుటుంబానికి కష్టాలు ఎలా ప్రారంభమయ్యాయి?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 34:1-31 చదవండి.

    1. (ఎ) దీనా కనాను దేశంలోని అమ్మాయిలను కలవడానికి కేవలం ఒక్కసారే వెళ్ళిందా? వివరించండి. (ఆది. 34:1, “లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను [“వెళ్ళుచుండెను,” NW].”)

    2. (బి) తన కన్యత్వాన్ని పోగొట్టుకోవడానికి దీనా ఎలా బాధ్యురాలు? (గల. 6:7)

    3. (సి) దీనా హెచ్చరికా మాదిరిని లక్ష్యపెట్టామని నేటి యౌవనస్థులు ఎలా చూపించవచ్చు? (సామె. 13:20; 1 కొరిం. 15:33; 1 యోహా. 5:19)

21వ కథ

యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం

  1. యోసేపు అన్నలు ఆయనపై ఎందుకు అసూయపడ్డారు, వాళ్ళేమి చేశారు?

  2. యోసేపు సహోదరులు ఏమి చేయాలనుకున్నారు, కానీ రూబేను ఏమి చెప్పాడు?

  3. ఇష్మాయేలీయులైన వర్తకులు వచ్చినప్పుడు ఏమి జరిగింది?

  4. తమ తండ్రియైన యాకోబు, యోసేపు చనిపోయాడని భావించేలా చేయడానికి యోసేపు సహోదరులు ఏమి చేశారు?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 37:1-35 చదవండి.

    1. (ఎ) ఎవరైనా తప్పు చేస్తే దాన్ని సంఘానికి తెలియజేయడంలో క్రైస్తవులు యోసేపు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (ఆది. 37:2; లేవీ. 5:1; 1 కొరిం. 1:11)

    2. (బి) యోసేపు సహోదరులు ఆయనతో విశ్వాసఘాతుకంగా ప్రవర్తించడానికి కారణమేమిటి? (ఆది. 37:11, 18; సామె. 27:4; యాకో. 3:14-16)

    3. (సి) యాకోబు చేసిన ఏ పని దుఃఖించడంలో ఒక సాధారణమైన భాగం? (ఆది. 37:35)

22వ కథ

యోసేపు చెరసాలలో వేయబడడం

  1. యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్ళబడినప్పుడు ఆయన వయసెంత, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది?

  2. యోసేపు చెరసాలలో ఎందుకు వేయబడ్డాడు?

  3. యోసేపుకు చెరసాలలో ఏ బాధ్యత ఇవ్వబడింది?

  4. చెరసాలలో యోసేపు ఫరో పానదాయకునికి, వంటవాడికి ఎలాంటి సహాయం చేశాడు?

  5. పానదాయకుడు చెరసాల నుండి విడుదల చేయబడిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 39:1-23 చదవండి.

    యోసేపు కాలంలో వ్యభిచారాన్ని ఖండిస్తూ దేవుడు వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞ లేదు కదా, మరి పోతీఫరు భార్యనుండి పారిపోవడానికి యోసేపును ప్రేరేపించినదేమిటి? (ఆది. 2:24; 20:3; 39:9)

  2. ఆదికాండము 40:1-23 చదవండి.

    1. (ఎ) పానదాయకుడికి వచ్చిన కలను, యోసేపుకు యెహోవా తెలియజేసిన భావాన్ని క్లుప్తంగా చెప్పండి. (ఆది. 40:9-13)

    2. (బి) వంటవాడికి వచ్చిన కల ఏమిటి, దాని భావమేమిటి? (ఆది. 40:16-19)

    3. (సి) నేడు నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుని తరగతి యోసేపు వైఖరిని ఎలా అనుకరించింది? (ఆది. 40:8; కీర్త. 36:9; యోహా. 17:17; అపొ. 17:2, 3)

    4. (డి) క్రైస్తవులు జన్మదిన వేడుకలను ఎలా దృష్టిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండము 40:20 ఎలా సహాయం చేస్తుంది? (ప్రసం. 7:1; మార్కు 6:21-28)

23వ కథ

ఫరో కలలు

  1. ఒక రాత్రి ఫరోకు ఏమి జరిగింది?

  2. పానదాయకుడు చివరకు యోసేపును ఎందుకు గుర్తుచేసుకున్నాడు?

  3. చిత్రంలో చూపించబడినట్లు, ఫరోకు ఏ రెండు కలలు వచ్చాయి?

  4. ఆ కలల భావమేమిటని యోసేపు చెప్పాడు?

  5. ఐగుప్తులో ఫరో తర్వాత అత్యంత ప్రముఖ వ్యక్తిగా యోసేపు ఎలా అయ్యాడు?

  6. యోసేపు సహోదరులు ఐగుప్తుకు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఆయనను ఎందుకు గుర్తుపట్టలేదు?

  7. యోసేపు ఏ కలను గుర్తుచేసుకున్నాడు, ఆయన ఏమి అర్థం చేసుకోవడానికి అది సహాయం చేసింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 41:1-57 చదవండి.

    1. (ఎ) యోసేపు యెహోవా వైపుకు అవధానాన్ని ఎలా మళ్ళించాడు, నేటి క్రైస్తవులు ఆయన మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (ఆది. 41:16, 25, 28; మత్త. 5:16; 1 పేతు. 2:12)

    2. (బి) ఐగుప్తులో సమృద్ధిగా పంటపండే సంవత్సరాల తర్వాత వచ్చిన కరువుగల సంవత్సరాలు, నేడు యెహోవా ప్రజల ఆధ్యాత్మిక పరిస్థితికి, క్రైస్తవమత సామ్రాజ్యపు ఆధ్యాత్మిక పరిస్థితికి మధ్య ఉన్న తేడాను ఎలా సరిగ్గా చూపిస్తున్నాయి? (ఆది. 41:29, 30; ఆమో. 8:11, 12)

  2. ఆదికాండము 42:1-8, 50:20 చదవండి.

    యెహోవా ఆరాధకులు తమ దేశ ఆచారం ప్రకారం ఒక వ్యక్తిపట్ల ఉన్న గౌరవమర్యాదలను చూపించడానికి ఆ వ్యక్తికి వంగి నమస్కరించడం తప్పా? (ఆది. 42:6)

24వ కథ

యోసేపు తన సహోదరులను పరీక్షించడం

  1. యోసేపు తన సహోదరులు వేగులవారు అని ఎందుకు అన్నాడు?

  2. యాకోబు తన చిన్న కుమారుడైన బెన్యామీనును ఐగుప్తుకు ఎందుకు వెళ్ళనిచ్చాడు?

  3. యోసేపు వెండి గిన్నె బెన్యామీను సంచిలోకి ఎలా వచ్చింది?

  4. బెన్యామీనును విడిపించుకోవడానికి యూదా ఏమి చేస్తానని ముందుకు వచ్చాడు?

  5. యోసేపు సహోదరుల్లో ఎలాంటి మార్పు వచ్చింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 42:9-38 చదవండి.

    ఆదికాండము 42:18లో యోసేపు అన్న మాటలు, నేడు యెహోవా సంస్థలో బాధ్యతగలవారికి ఎలా ఒక చక్కని జ్ఞాపికగా ఉన్నాయి? (నెహె. 5:15; 2 కొరిం. 7:1, 2)

  2. ఆదికాండము 43:1-34 చదవండి.

    1. (ఎ) రూబేను మొదటి కుమారుడు అయినప్పటికీ, యూదాయే తన సహోదరుల తరఫున మాట్లాడే వ్యక్తిగా వ్యవహరించాడని ఎలా స్పష్టమవుతోంది? (ఆది. 43:3, 8, 9; 44:14, 18; 1 దిన. 5:2)

    2. (బి) యోసేపు తన సహోదరులను ఎలా పరీక్షించాడు, ఆయనలా ఎందుకు చేశాడు? (ఆది. 43:33, 34)

  3. ఆదికాండము 44:1-34 చదవండి.

    1. (ఎ) తన సహోదరులు తనను గుర్తుపట్టకుండా ఉండడానికి యోసేపు వేసిన పథకంలో భాగంగా ఆయన తనను తాను ఎలాంటి పనులు చేసే వ్యక్తిగా చిత్రీకరించుకున్నాడు? (ఆది. 44:5, 15; లేవీ. 19:26)

    2. (బి) యోసేపు సహోదరులు తమకు తమ సహోదరునిపట్ల ముందు ఉండిన అసూయ ఇప్పుడు లేదని ఎలా చూపించారు? (ఆది. 44:13, 33, 34)

25వ కథ

కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళడం

  1. యోసేపు తానెవరో తన సహోదరులకు చెప్పినప్పుడు ఏమి జరిగింది?

  2. యోసేపు తన సహోదరులకు దయతో ఏమి వివరించాడు?

  3. యోసేపు సహోదరుల గురించి ఫరోకు తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడు?

  4. యాకోబు కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళినప్పుడు ఎంత పెద్దగా ఉంది?

  5. యాకోబు కుటుంబం ఏమని పిలువబడింది, ఎందుకు అలా పిలువబడింది?

అదనపు ప్రశ్నలు:

  1. ఆదికాండము 45:1-28 చదవండి.

    తన సేవకులకు హాని చేయడానికి ఉద్దేశించబడిన పనులను యెహోవా సత్ఫలితాలుగా మార్చగలడని యోసేపు గురించిన బైబిలు వృత్తాంతం ఎలా చూపిస్తోంది? (ఆది. 45:5-8; యెష. 8:10; ఫిలి. 1:12-14)

  2. ఆదికాండము 46:1-27 చదవండి.

    యాకోబు ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చాడు? (ఆది. 46:1-4)

26వ కథ

యోబు దేవునికి నమ్మకంగా ఉండడం

  1. యోబు ఎవరు?

  2. సాతాను ఏమి చేయడానికి ప్రయత్నించాడు, అతనలా చేయగలిగాడా?

  3. సాతాను ఏమి చేసేందుకు యెహోవా అనుమతించాడు, ఎందుకు అనుమతించాడు?

  4. యోబు భార్య ఆయనతో ‘దేవున్ని దూషించి చనిపో’ అని ఎందుకు అన్నది? (చిత్రం చూడండి.)

  5. రెండవ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా యెహోవా యోబును ఎలా ఆశీర్వదించాడు, ఎందుకు ఆశీర్వదించాడు?

  6. మనం కూడా యోబులాగే యెహోవాకు నమ్మకంగా ఉంటే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

అదనపు ప్రశ్నలు:

  1. యోబు 1:1-22 చదవండి.

    నేడు క్రైస్తవులు యోబును ఎలా అనుకరించవచ్చు? (యోబు 1:1; ఫిలి. 2:14; 2 పేతు. 3:14)

  2. యోబు 2:1-13 చదవండి.

    సాతాను హింసకు యోబు, ఆయన భార్య ఎలా విభిన్నంగా ప్రతిస్పందించారు? (యోబు 2:9, 10; సామె. 19:3; మీకా 7:7; మలా. 3:14)

  3. యోబు 42:10-17 చదవండి.

    1. (ఎ) నమ్మకంగా జీవించినందుకు యోబుకు లభించిన ప్రతిఫలానికి, యేసుకు లభించిన ప్రతిఫలానికి ఉన్న సారూప్యతలు ఏమిటి? (యోబు 42:12; ఫిలి. 2:9-11)

    2. (బి) దేవునిపట్ల తన యథార్థతను కాపాడుకున్నందుకు యోబుకు లభించిన ఆశీర్వాదాలనుబట్టి మనకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది? (యోబు 42:10, 12; హెబ్రీ. 6:10; యాకో. 1:2-4, 12; 5:11)

27వ కథ

ఒక చెడ్డరాజు ఐగుప్తును పరిపాలించడం

  1. చిత్రంలో కొరడా పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు, అతను ఎవరిని కొడుతున్నాడు?

  2. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?

  3. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూసి ఎందుకు భయపడ్డారు?

  4. ఇశ్రాయేలీయులైన తల్లులకి మంత్రసాని పనిచేసే స్త్రీలకు ఫరో ఏమని ఆజ్ఞాపించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 1:6-22 చదవండి.

    1. (ఎ) యెహోవా తాను అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చడం ప్రారంభించాడు? (నిర్గ. 1:7; ఆది. 12:2; అపొ. 7:17)

    2. (బి) హీబ్రూ మంత్రసానులు జీవానికున్న పవిత్రతను ఎలా గౌరవించారు? (నిర్గ. 1:17; ఆది. 9:6)

    3. (సి) మంత్రసానులు యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు ఎలా ఆశీర్వదించబడ్డారు? (నిర్గ. 1:20, 21; సామె. 19:17)

    4. (డి) అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన సంతానం విషయంలో దేవుని సంకల్పాన్ని ఆటంకపరచాలని సాతాను ఎలా ప్రయత్నించాడు? (నిర్గ. 1:22; మత్త. 2:16)

28వ కథ

పసివాడైన మోషే రక్షించబడడం

  1. చిత్రంలో కనిపిస్తున్న పసివాడు ఎవరు, అతను ఎవరి వ్రేలును పట్టుకొని ఉన్నాడు?

  2. మోషే చనిపోకుండా ఉండేందుకు అతని తల్లి ఏమి చేసింది?

  3. చిత్రంలోని అమ్మాయి ఎవరు, ఆమె ఏమి చేసింది?

  4. ఫరో కుమార్తెకు ఆ పసివాడు దొరికినప్పుడు, మిర్యాము ఏమని సలహా ఇచ్చింది?

  5. యువరాణి మోషే తల్లితో ఏమని చెప్పింది?

అదనపు ప్రశ్న:

  1. నిర్గమకాండము 2:1-10 చదవండి.

    మోషే చిన్నతనంలో ఆయనకు శిక్షణనిచ్చి, బోధించడానికి వీలుగా మోషే తల్లికి ఎలాంటి అవకాశం లభించింది, నేటి తల్లిదండ్రులకు అది ఎలాంటి మాదిరిగా ఉంది? (నిర్గ. 2:9, 10; ద్వితీ. 6:6-9; సామె. 22:6; ఎఫె. 6:4; 2 తిమో. 3:15)

29వ కథ

మోషే పారిపోవడానికిగల కారణం

  1. మోషే ఎక్కడ పెరిగాడు, కానీ ఆయనకు తన తల్లిదండ్రుల గురించి ఏమి తెలుసు?

  2. మోషేకు 40 సంవత్సరాలున్నప్పుడు ఆయనేమి చేశాడు?

  3. కొట్లాడుతున్న ఒక ఇశ్రాయేలీయునితో మోషే ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమని సమాధానమిచ్చాడు?

  4. మోషే ఐగుప్తునుండి ఎందుకు పారిపోయాడు?

  5. మోషే ఎక్కడికి పారిపోయాడు, ఆయన అక్కడ ఎవరిని కలుసుకున్నాడు?

  6. మోషే ఐగుప్తునుండి పారిపోయిన తర్వాత 40 సంవత్సరాల వరకు ఏమి చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 2:11-25 చదవండి.

    మోషే ఐగుప్తీయుల జ్ఞానం సంపాదించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినప్పటికీ, యెహోవాపట్ల ఆయన ప్రజలపట్ల తనకున్న విశ్వసనీయతను ఎలా చూపించాడు? (నిర్గ. 2:11, 12; హెబ్రీ. 11:24)

  2. అపొస్తలుల కార్యములు 7:22-29 చదవండి.

    మోషే తనంతట తానే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి ప్రయత్నించడం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (అపొ. 7:23-25; 1 పేతు. 5:6, 10)

30వ కథ

మండుతున్న పొద

  1. చిత్రంలోని పర్వతం పేరు ఏమిటి?

  2. మోషే తన గొర్రెలతోపాటు ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు చూసిన వింతను వర్ణించండి.

  3. మండుతున్న పొదలోనుండి వినపడిన స్వరం ఏమని చెప్పింది, ఆ స్వరం ఎవరిది?

  4. తన ప్రజలను ఐగుప్తునుండి బయటకు తీసుకురావాలని దేవుడు చెప్పినప్పుడు మోషే ఎలా ప్రతిస్పందించాడు?

  5. మోషేను ఎవరు పంపించారని ప్రజలు అడిగితే, ఏమి చెప్పమని దేవుడు చెప్పాడు?

  6. దేవుడే తనను పంపించాడని మోషే ఎలా నిరూపించుకోగలడు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 3:1-22 చదవండి.

    ఒకానొక దైవపరిపాలనా నియామకాన్ని నిర్వహించడానికి మనం అర్హులము కాదు అని మనకు అనిపించినా, యెహోవా మనకు సహాయం చేస్తాడని మోషే అనుభవం మనకు ఎలా హామీ ఇస్తోంది? (నిర్గ. 3:11, 13; 2 కొరిం. 3:5, 6)

  2. నిర్గమకాండము 4:1-20 చదవండి.

    1. (ఎ) మోషే మిద్యానులో గడిపిన 40 సంవత్సరాల్లో ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చింది, సంఘంలో ఆధిక్యతలను చేపట్టడానికి అర్హులయ్యేందుకు కృషి చేస్తున్నవారు దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (నిర్గ. 2:11, 12; 4:10, 13; మీకా 6:8; 1 తిమో. 3:1, 6, 10)

    2. (బి) యెహోవా తన సంస్థ ద్వారా మనకు క్రమశిక్షణ ఇచ్చినా, మోషే ఉదాహరణ మనకు ఏ హామీ ఇస్తోంది? (నిర్గ. 4:12-14; కీర్త. 103:14; హెబ్రీ. 12:4-11)

31వ కథ

మోషే అహరోనులు ఫరోను కలవడం

  1. మోషే అహరోనులు చేసిన అద్భుతాలు ఇశ్రాయేలీయులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

  2. మోషే అహరోనులు ఫరోతో ఏమని చెప్పారు, ఫరో ఏమని సమాధానమిచ్చాడు?

  3. చిత్రంలో చూపించబడినట్లు, అహరోను తన కర్రను పడేసినప్పుడు ఏమి జరిగింది?

  4. యెహోవా ఫరోకు ఎలా పాఠం నేర్పించాడు, ఫరో ఎలా ప్రతిస్పందించాడు?

  5. పదవ తెగులు తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 4:27-31, 5:1-23 చదవండి.

    “నేను యెహోవాను ఎరుగను” అని ఫరో అన్నప్పుడు అతని మాటల భావమేమిటి? (నిర్గ. 5:2; 1 సమూ. 2:12; రోమా. 1:21)

  2. నిర్గమకాండము 6:1-13, 26-30 చదవండి.

    1. (ఎ) ఏ భావంలో యెహోవా అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు “తెలియబడలేదు?” (నిర్గ. 3:13, 14; 6:3; ఆది. 12:8)

    2. (బి) మోషే తనకు నియమించబడిన పనికి తాను అర్హుడను కాను అని భావించినా యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడని తెలుసుకోవడం మనకు ఎలాంటి ఓదార్పును ఇస్తుంది? (నిర్గ. 6:12, 30; లూకా 21:13-15)

  3. నిర్గమకాండము 7:1-13 చదవండి.

    1. (ఎ) మోషే అహరోనులు యెహోవా తీర్పుల గురించి ధైర్యంగా ఫరోకు చెప్పినప్పుడు, వాళ్ళు నేటి దేవుని సేవకుల కోసం ఎలాంటి ప్రమాణాన్ని ఏర్పరిచారు? (నిర్గ. 7:2, 3, 6; అపొ. 4:29-31)

    2. (బి) యెహోవా తాను ఐగుప్తు దేవుళ్ళకంటే శ్రేష్ఠమైనవాడనని ఎలా చూపించాడు? (నిర్గ. 7:12; 1 దిన. 29:12)

32వ కథ

పది తెగుళ్ళు

  1. ఇక్కడ చూపించబడిన చిత్రాలను ఉపయోగించి, యెహోవా ఐగుప్తుపైకి తెచ్చిన మొదటి మూడు తెగుళ్ళను వివరించండి.

  2. మొదటి మూడు తెగుళ్ళకు, మిగతా తెగుళ్ళకు మధ్య తేడా ఏమిటి?

  3. నాలుగవ, ఐదవ, ఆరవ తెగుళ్ళు ఏమిటి?

  4. ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ తెగుళ్ళను వర్ణించండి.

  5. పదవ తెగులుకు ముందు యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమి చేయమని చెప్పాడు?

  6. పదవ తెగులు ఏమిటి, దాని తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 7:19–8:23 చదవండి.

    1. (ఎ) ఐగుప్తులోని శకునగాండ్రు యెహోవా రప్పించిన మొదటి రెండు తెగుళ్ళను నకలు చేయగలినా, మూడవ తెగులు తర్వాత వాళ్ళు ఏమి అంగీకరించవలసి వచ్చింది? (నిర్గ. 8:18, 19; మత్త. 12:24-28)

    2. (బి) యెహోవాకు తన ప్రజలను రక్షించే సామర్థ్యం ఉందని నాలుగవ తెగులు ఎలా చూపించింది, దేవుని ప్రజలు ప్రవచించబడిన “మహాశ్రమలు” ఎదుర్కోబోతుండగా ఆ విషయాన్ని తెలుసుకోవడం వాళ్ళకు ఎలాంటి హామీ ఇస్తుంది? (నిర్గ. 8:22, 23; ప్రక. 7:13, 14; 2 దిన. 16:9)

  2. నిర్గమకాండము 8:24; 9:3, 6, 10, 11, 14, 16, 23-25; 10:13-15, 21-23 చదవండి.

    1. (ఎ) పది తెగుళ్ళు ఏ రెండు వర్గాలకు చెందిన ప్రజలపైకి తీసుకురాబడ్డాయి, నేడు మనం ఆ వర్గాలకు చెందినవాళ్ళను దృష్టించే విధానంపై అది ఎలా ప్రభావం చూపుతుంది? (నిర్గ. 8:10, 18, 19; 9:14)

    2. (బి) సాతాను ఇప్పటివరకూ ఉండడానికి యెహోవా ఎందుకు అనుమతించాడో అర్థం చేసుకోవడానికి మనకు నిర్గమకాండము 9:16 ఎలా సహాయం చేస్తుంది? (రోమా. 9:21, 22)

  3. నిర్గమకాండము 12:21-32 చదవండి.

    పస్కావల్ల చాలామందికి రక్షణ ఎలా కలిగింది, అది దేనివైపుకు అవధానం మళ్ళించింది? (నిర్గ. 12:21-23; యోహా. 1:29; రోమా. 5:18, 19, 21; 1 కొరిం. 5:7)

33వ కథ

ఎర్ర సముద్రాన్ని దాటడం

  1. స్త్రీలు పిల్లలతోపాటు ఎంతమంది ఇశ్రాయేలు పురుషులు ఐగుప్తును విడిచిపెట్టారు, వాళ్ళతోపాటు ఎవరు కూడా వెళ్ళారు?

  2. ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చిన తర్వాత ఫరోకు ఏమనిపించింది, ఆయన ఏమి చేశాడు?

  3. ఐగుప్తీయులు తన ప్రజలపై దాడి చేయకుండా ఉండడానికి యెహోవా ఏమి చేశాడు?

  4. మోషే తన కర్రను ఎర్ర సముద్రంవైపు ఎత్తినప్పుడు ఏమి జరిగింది, ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

  5. ఇశ్రాయేలీయుల వెనుక ఐగుప్తీయులు కూడా సముద్రంలోకి వచ్చినప్పుడు ఏమి జరిగింది?

  6. తాము రక్షించబడినందుకు సంతోషంగా ఉన్నామని, యెహోవాపట్ల కృతజ్ఞతతో ఉన్నామని ఇశ్రాయేలీయులు ఎలా చూపించారు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 12:33-36 చదవండి.

    తన ప్రజలు ఎన్నో సంవత్సరాలపాటు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నందుకు వాళ్ళకు తగిన ప్రతిఫలం లభించేలా యెహోవా ఎలా చూశాడు? (నిర్గ. 3:21, 22; 12:35, 36)

  2. నిర్గమకాండము 14:1-31 చదవండి.

    నేడు యెహోవా సేవకులు రానున్న అర్మగిద్దోను కోసం ఎదురు చూస్తుండగా, నిర్గమకాండము 14:13, 14లో నమోదు చేయబడిన మోషే మాటలు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (2 దిన. 20:17; కీర్త. 91:8)

  3. నిర్గమకాండము 15:1-8, 20, 21 చదవండి.

    1. (ఎ) యెహోవా సేవకులు ఆయనకు స్తుతిగీతాలు ఎందుకు పాడాలి? (నిర్గ. 15:1, 2; కీర్త. 105:2, 3; ప్రక. 15:3, 4)

    2. (బి) ఎర్ర సముద్రం దగ్గర మిర్యాము, ఇతర స్త్రీలు యెహోవాను స్తుతించడంలో నేటి క్రైస్తవ స్త్రీల కోసం ఎలాంటి మాదిరిని ఉంచారు? (నిర్గ. 15:20, 21; కీర్త. 68:11)

34వ కథ

ఒక క్రొత్త రకమైన ఆహారం

  1. చిత్రంలోని ప్రజలు నేలపై నుండి ఏమి ఏరుకుంటున్నారు, దాని పేరేమిటి?

  2. మన్నా ఏరుకోవడానికి సంబంధించి మోషే ప్రజలకు ఏ ఉపదేశాలు ఇచ్చాడు?

  3. ఆరవ దినమున ఏమి చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు?

  4. ప్రజలు ఏడవ రోజు కోసం మన్నాను దాచుకున్నప్పుడు యెహోవా ఏ అద్భుతం చేశాడు?

  5. యెహోవా ఎంతకాలం వరకు ప్రజలకు మన్నా దయచేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 16:1-36, సంఖ్యాకాండము 11:7-9 చదవండి.

    1. (ఎ) క్రైస్తవ సంఘంలో దైవపరిపాలనా ఏర్పాటు కోసం నియమించబడినవారిని గౌరవించడం విషయంలో నిర్గమకాండము 16:8 ఏమి చూపిస్తోంది? (హెబ్రీ. 13:17)

    2. (బి) అరణ్యప్రాంతంలో ఇశ్రాయేలీయులు యెహోవాపై ఆధారపడాలనే విషయం వాళ్ళకు రోజూ ఎలా గుర్తుచేయబడేది? (నిర్గ. 16:14-16, 35; ద్వితీ. 8:2, 3)

    3. (సి) యేసు మన్నాకు ఎలాంటి సూచనార్థక భావాన్ని తెలియజేశాడు, ఈ ‘పరలోక ఆహారం’ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? (యోహా. 6:31-35, 40)

  2. యెహోషువ 5:10-12 చదవండి.

    ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలపాటు మన్నాను తిన్నారు, అది వాళ్ళను ఎలా పరీక్షించింది, మనం ఈ వృత్తాంతం నుండి ఏమి నేర్చుకోవచ్చు? (నిర్గ. 16:35; సంఖ్యా. 11:4-6; 1 కొరిం. 10:10, 11)

35వ కథ

యెహోవా తన నియమాలను ఇవ్వడం

  1. ఐగుప్తును విడిచిన రెండు నెలల తర్వాత, ఇశ్రాయేలీయులు ఎక్కడ బసచేశారు?

  2. ప్రజలు ఏమి చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు, వాళ్ళు ఏమని సమాధానమిచ్చారు?

  3. యెహోవా మోషేకు రెండు రాతి పలకలను ఎందుకు ఇచ్చాడు?

  4. పది ఆజ్ఞలతోపాటు యెహోవా ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఇతర నియమాలు ఇచ్చాడు?

  5. ఏ రెండు నియమాలు అన్నింటికంటే గొప్పవని యేసుక్రీస్తు చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 19:1-25; 20:1-21; 24:12-18; 31:18 చదవండి.

    నిర్గమకాండము 19:8లో నమోదు చేయబడిన మాటలు, క్రైస్తవునిగా సమర్పించుకోవడంలో ఏమి ఇమిడివుందో అర్థం చేసుకోవడానికి మనకు ఎలా సహాయం చేస్తాయి? (మత్త. 16:24; 1 పేతు. 4:1-3)

  2. ద్వితీయోపదేశకాండము 6:4-6; లేవీయకాండము 19:18; మత్తయి 22:36-40 చదవండి.

    క్రైస్తవులు తమకు దేవునిపై ఉన్న ప్రేమను, తమ పొరుగువారిపై ఉన్న ప్రేమను ఎలా ప్రదర్శిస్తారు? (మార్కు 6:34; అపొ. 4:20; రోమా. 15:2)

36వ కథ

బంగారు దూడ

  1. చిత్రంలోని ప్రజలు ఏమి చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు?

  2. యెహోవాకు ఎందుకు కోపం వచ్చింది, ప్రజలు చేస్తున్న దానిని చూసినప్పుడు మోషే ఏమి చేశాడు?

  3. కొంతమంది పురుషులకు మోషే ఏమి చేయమని చెప్పాడు?

  4. ఈ కథ మనకు ఎలాంటి పాఠం నేర్పించాలి?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 32:1-35 చదవండి.

    1. (ఎ) సత్యారాధనతో అబద్ధ మతాన్ని కలపడం గురించి యెహోవా దృక్కోణమేమిటో మనకు ఈ వృత్తాంతం ఎలా చూపిస్తోంది? (నిర్గ. 32:4-6, 10; 1 కొరిం. 10:7, 11)

    2. (బి) పాటలు పాడడం, నాట్యం చేయడం వంటి వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు క్రైస్తవులు ఎలాంటి జాగ్రత్త వహించాలి? (నిర్గ. 32:18, 19; ఎఫె. 5:15, 16; 1 యోహా. 2:15-17)

    3. (సి) నీతిని సమర్థించడంలో లేవీ గోత్రంవారు ఎలా ఒక చక్కని మాదిరిని ఉంచారు? (నిర్గ. 32:25-28; కీర్త. 18:25)

37వ కథ

ఆరాధన కోసం ఒక గుడారం

  1. చిత్రంలో కనిపిస్తున్న కట్టడం ఏమని పిలువబడేది, అది దేనికోసం ఉపయోగించబడేది?

  2. సులభంగా విడదీసేలా గుడారాన్ని నిర్మించమని యెహోవా మోషేకు ఎందుకు చెప్పాడు?

  3. గుడారానికి చివర్లోవున్న చిన్న గదిలోని పెట్టె ఏమిటి, ఆ పెట్టెలో ఏమి ఉండేవి?

  4. ప్రధాన యాజకుడిగా ఉండడానికి యెహోవా ఎవరిని ఎన్నుకున్నాడు, ప్రధాన యాజకుడు ఏమి చేసేవాడు?

  5. గుడారంలోని పెద్ద గదిలోవున్న మూడు వస్తువుల పేర్లు చెప్పండి.

  6. మందిరపు ఆవరణలోవున్న రెండు వస్తువులు ఏమిటి, అవి దేనికోసం ఉపయోగించబడేవి?

అదనపు ప్రశ్నలు:

  1. నిర్గమకాండము 25:8-40; 26:1-37; 27:1-8; 28:1 చదవండి.

    “శాసనములుగల మందసము” పైన ఉండే కెరూబులు దేనిని సూచిస్తున్నాయి? (నిర్గ. 25:20, 22; సంఖ్యా. 7:89; 2 రాజు. 19:15)

  2. నిర్గమకాండము 30:1-10, 17-21; 34:1, 2; హెబ్రీయులు 9:1-5 చదవండి.

    1. (ఎ) గుడారంవద్ద సేవచేస్తున్న యాజకులు శారీరక పరిశుభ్రతను కాపాడుకోవలసిన ప్రాముఖ్యతను యెహోవా ఎందుకు నొక్కి చెప్పాడు, అది నేడు మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? (నిర్గ. 30:18-21; 40:30, 31; హెబ్రీ. 10:22)

    2. (బి) అపొస్తలుడైన పౌలు తాను హెబ్రీయులకు లేఖ వ్రాసే సమయానికి గుడారం మరియు ధర్మశాస్త్ర నిబంధన వాడుకలో లేవని ఎలా చూపించాడు? (హెబ్రీ. 9:1, 9; 10:1)

38వ కథ

పన్నెండు మంది వేగులవారు

  1. చిత్రంలోని ద్రాక్ష గెల గురించి మీరేమి గమనించారు, అది ఎక్కడి నుండి వచ్చింది?

  2. మోషే 12 మంది వేగులవాళ్ళను కనాను దేశానికి ఎందుకు పంపించాడు?

  3. తిరిగి వచ్చిన తర్వాత పదిమంది వేగులవాళ్ళు మోషేకు ఏమని చెప్పారు?

  4. ఇద్దరు వేగులవాళ్ళు యెహోవాపై తమకున్న నమ్మకాన్ని ఎలా చూపించారు, వాళ్ళ పేర్లేమిటి?

  5. యెహోవాకు కోపం ఎందుకు వచ్చింది, ఆయన మోషేకు ఏమని చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 13:1-33 చదవండి.

    1. (ఎ) దేశాన్ని సంచరించి చూడడానికి ఎవరు ఎంపిక చేసుకోబడ్డారు, వాళ్ళకు ఎలాంటి గొప్ప అవకాశం లభించింది? (సంఖ్యా. 13:2, 3, 18-20)

    2. (బి) యెహోషువ కాలేబుల దృక్కోణం ఇతర వేగులవాళ్ళ దృక్కోణానికి ఎందుకు భిన్నంగా ఉంది, దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 13:28-30; మత్త. 17:20; 2 కొరిం. 5:7)

  2. సంఖ్యాకాండము 14:1-38 చదవండి.

    1. (ఎ) యెహోవా భూసంబంధ ప్రతినిధులకు వ్యతిరేకంగా సణగడం విషయంలో ఇవ్వబడిన ఏ హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి? (సంఖ్యా. 14:2, 3, 27; మత్త. 25:40, 45; 1 కొరిం. 10:10)

    2. (బి) యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత ఆసక్తి చూపిస్తాడని సంఖ్యాకాండము 14:24 ఎలా చూపిస్తోంది? (1 రాజు. 19:18; సామె. 15:3)

39వ కథ

అహరోను కర్రకు పువ్వులు పూయడం

  1. మోషే అహరోనుల అధికారానికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేశారు, వాళ్ళు మోషేతో ఏమన్నారు?

  2. మోషే కోరహుకు, అతని 250 మంది అనుచరులకు ఏమి చెప్పాడు?

  3. మోషే ప్రజలకు ఏమి చెప్పాడు, ఆయన మాట్లాడడం ముగించగానే ఏమి జరిగింది?

  4. కోరహుకు, అతని 250 మంది అనుచరులకు ఏమి జరిగింది?

  5. అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినవారి ధూపార్తులతో ఏమి చేశాడు, అలా ఎందుకు చేశాడు?

  6. అహరోను కర్రకు పువ్వులు పూసేలా యెహోవా ఎందుకు చేశాడు? (చిత్రం చూడండి.)

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 16:1-49 చదవండి.

    1. (ఎ) కోరహు, అతని అనుచరులు ఏమి చేశారు, అది యెహోవాకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు చర్య ఎందుకయ్యింది? (సంఖ్యా. 16:9, 10, 18; లేవీ. 10:1, 2; సామె. 11:2)

    2. (బి) కోరహు, 250 మంది “సమాజప్రధానులు” ఎలాంటి తప్పుడు దృక్కోణాన్ని పెంపొందించుకున్నారు? (సంఖ్యా. 16:1-3; సామె. 15:33; యెష. 49:7)

  2.  ఖ్యాకాండం 17:1-1626:10; చదవండి.

    1. (ఎ) అహరోను కర్ర చిగురించడం దేనిని సూచించింది, దానిని మందసములో ఉంచమని యెహోవా ఎందుకు చెప్పాడు? (సంఖ్యా. 17:5, 8, 10)

    2. (బి) అహరోను కర్రకు సంబంధించిన అద్భుతంనుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 17:10; అపొ. 20:28; ఫిలి. 2:14; హెబ్రీ. 13:17)

40వ కథ

మోషే బండను కొట్టడం

  1. ఇశ్రాయేలీయులు అరణ్యప్రాంతంలో ఉన్నప్పుడు యెహోవా వాళ్ళను ఎలా శ్రద్ధగా చూసుకున్నాడు?

  2. ఇశ్రాయేలీయులు కాదేషువద్ద బస చేసినప్పుడు ఏమని ఫిర్యాదు చేశారు?

  3. యెహోవా ఆ ప్రజలకు, జంతువులకు నీళ్ళు ఎలా దయచేశాడు?

  4. చిత్రంలో తనవైపు చూపించుకుంటున్న వ్యక్తి ఎవరు, ఆయన అలా ఎందుకు చేశాడు?

  5. యెహోవా మోషే అహరోనులపై ఎందుకు కోపం తెచ్చుకున్నాడు, వాళ్ళు ఎలా శిక్షించబడ్డారు?

  6. హోరు కొండ దగ్గర ఏమి జరిగింది, ఎవరు ఇశ్రాయేలు ప్రధాన యాజకుడయ్యాడు?

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 20:1-13, 22-29; ద్వితీయోపదేశకాండము 29:5 చదవండి.

    1. (ఎ) అరణ్య ప్రాంతంలో యెహోవా ఇశ్రాయేలీయులను చూసుకున్న విధానంనుండి మనమేమి నేర్చుకుంటాము? (ద్వితీ. 29:5; మత్త. 6:31; హెబ్రీ. 13:5; యాకో. 1:17)

    2. (బి) మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ఎదుట తన పరిశుద్ధతను సన్మానించడంలో విఫలమవ్వడాన్ని యెహోవా ఎలా దృష్టించాడు? (సంఖ్యా. 20:12; 1 కొరిం. 10:12; ప్రక. 4:11)

    3. (సి) యెహోవానుండి లభించిన క్రమశిక్షణకు మోషే ప్రతిస్పందించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 12:3; 20:12, 27, 28; ద్వితీ. 32:4; హెబ్రీ. 12:7-11)

41వ కథ

ఇత్తడి పాము

  1. చిత్రంలో స్తంభానికి చుట్టుకొని ఉన్నది ఏమిటి, దానిని అక్కడ ఉంచమని యెహోవా మోషేకు ఎందుకు చెప్పాడు?

  2. దేవుడు ఆ ప్రజల కోసం చేసిన వాటన్నింటికీ వాళ్ళు ఆయనకు కృతజ్ఞత చూపించలేదని ఎలా చెప్పవచ్చు?

  3. ప్రజలను శిక్షించడానికి యెహోవా విషసర్పాలను పంపించిన తర్వాత వాళ్ళు ఏమి చేయమని మోషేను అడిగారు?

  4. ఇత్తడి పామును చేయమని యెహోవా మోషేకు ఎందుకు చెప్పాడు?

  5. ఈ కథనుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 21:4-9 చదవండి.

    1. (ఎ) యెహోవా ఏర్పాట్ల గురించి ఇశ్రాయేలీయులు ఫిర్యాదు చేయడం మనకు ఎలాంటి హెచ్చరికగా ఉంది? (సంఖ్యా. 21:5, 6; రోమా. 2:4)

    2. (బి) తర్వాతి శతాబ్దాల్లో ఇశ్రాయేలీయులు ఇత్తడి పామును ఎలా ఉపయోగించారు, హిజ్కియా రాజు ఎలాంటి చర్య తీసుకున్నాడు? (సంఖ్యా. 21:9; 2 రాజు. 18:1-4)

  2. యోహాను 3:14, 15 చదవండి.

    ఇత్తడి పామును ఒక స్తంభంపై ఉంచడం, యేసుక్రీస్తు కొయ్యపై మరణించడాన్ని ఎలా చక్కగా చిత్రీకరిస్తోంది? (గల. 3:13; 1 పేతు. 2:24)

42వ కథ

గాడిద మాట్లాడడం

  1. బాలాకు ఎవరు, ఆయన బిలామును రమ్మని ఎందుకు కబురు పంపాడు?

  2. బిలాము గాడిద దారిలో ఎందుకు కూర్చుండి పోయింది?

  3. తన గాడిద ఏమి మాట్లాడడాన్ని బిలాము విన్నాడు?

  4. ఒక దేవదూత బిలాముకు ఏమి చెప్పాడు?

  5. బిలాము ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 21:21-35 చదవండి.

    ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఎందుకు ఓడించారు? (సంఖ్యా. 21:21, 23, 33, 34)

  2. సంఖ్యాకాండము 22:1-40 చదవండి.

    ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నించడం వెనుక బిలాము ఉద్దేశమేమిటి, మనం దానినుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 22:16, 17; సామె. 6:16, 18; 2 పేతు. 2:15; యూదా 11)

  3. సంఖ్యాకాండము 23:1-30 చదవండి.

    బిలాము యెహోవా సేవకుడిలాగే మాట్లాడినా, ఆయన నిజానికి యెహోవాను సేవించడంలేదని ఆయన చర్యలు ఎలా చూపించాయి? (సంఖ్యా. 23:3, 11-14; 1 సమూ. 15:22)

  4. సంఖ్యాకాండము 24:1-25 చదవండి.

    యెహోవా వాగ్దానాలు నెరవేరతాయని మనకున్న నమ్మకాన్ని ఈ బైబిలు వృత్తాంతం ఎలా బలపరుస్తుంది? (సంఖ్యా. 24:10; యెష. 54:17)

43వ కథ

యెహోషువ నాయకుడు కావడం

  1. చిత్రంలో మోషేతోపాటు నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు?

  2. యెహోవా యెహోషువకు ఏమి చెప్పాడు?

  3. మోషే నెబో కొండపైకి ఎందుకు వెళ్ళాడు, యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు?

  4. మోషే చనిపోయేటప్పటికి ఆయన వయసెంత?

  5. ప్రజలు ఎందుకు దుఃఖించారు, అయితే వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏ కారణముంది?

అదనపు ప్రశ్నలు:

  1. సంఖ్యాకాండము 27:12-23 చదవండి.

    యెహోషువకు యెహోవానుండి ఏ బరువైన బాధ్యత లభించింది, యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న శ్రద్ధ నేడు ఎలా స్పష్టమవుతోంది? (సంఖ్యా. 27:15-19; అపొ. 20:28; హెబ్రీ. 13:7)

  2. ద్వితీయోపదేశకాండము 3:23-29 చదవండి.

    మోషే అహరోనులు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి యెహోవా ఎందుకు అనుమతించలేదు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ద్వితీ. 3:25-27; సంఖ్యా. 20:12, 13)

  3. ద్వితీయోపదేశకాండము 31:1-8, 14-23 చదవండి.

    విడిపోయేముందు మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు, ఆయన యెహోవానుండి లభించిన క్రమశిక్షణను వినయంతో స్వీకరించాడని ఎలా చూపిస్తున్నాయి? (ద్వితీ. 31:6-8, 23)

  4. ద్వితీయోపదేశకాండము 32:45-52 చదవండి.

    దేవుని వాక్యం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి? (ద్వితీ. 32:47; లేవీ. 18:5; హెబ్రీ. 4:12)

  5. ద్వితీయోపదేశకాండము 34:1-12 చదవండి.

    మోషే అక్షరార్థంగా యెహోవాను ఎన్నడూ చూడకపోయినా, యెహోవాతో ఆయనకున్న సంబంధం గురించి ద్వితీయోపదేశకాండము 34:10 ఏమి సూచిస్తోంది? (నిర్గ. 33:11, 20; సంఖ్యా. 12:8)

44వ కథ

రాహాబు వేగులవాళ్ళను దాచిపెట్టడం

  1. రాహాబు ఎక్కడ నివసించేది?

  2. చిత్రంలోని ఇద్దరు పురుషులు ఎవరు, వాళ్ళు యెరికోకు ఎందుకు వెళ్ళారు?

  3. యెరికో రాజు రాహాబుకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడు, ఆమె ఏమని సమాధానమిచ్చింది?

  4. రాహాబు ఆ ఇద్దరు పురుషులకు ఎలా సహాయం చేసింది, ఆమె వాళ్ళనుండి ఏ ఉపకారము కోరింది?

  5. వేగులవాళ్ళు రాహాబుకు ఏమని వాగ్దానం చేశారు?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 2:1-24 చదవండి.

    నిర్గమకాండము 23:27లో నమోదు చేయబడిన యెహోవా వాగ్దానం, ఇశ్రాయేలీయులు యెరికోకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఎలా నెరవేరింది? (యెహో. 2:9-11)

  2. హెబ్రీయులు 11:31 చదవండి.

    రాహాబు ఉదాహరణ, విశ్వాసంయొక్క ప్రాముఖ్యతను ఎలా నొక్కి చెప్పింది? (రోమా. 1:17; హెబ్రీ. 10:39; యాకో. 2:25)

45వ కథ

యొర్దాను నది దాటడం

  1. ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటడానికి వీలుగా యెహోవా ఏ అద్భుతం చేశాడు?

  2. యొర్దాను నది దాటాలంటే ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని చర్యల్లో ఎలా చూపించాల్సి వచ్చింది?

  3. నది మధ్యనుండి 12 పెద్ద రాళ్ళను తీసుకొమ్మని యెహోవా యెహోషువకు ఎందుకు చెప్పాడు?

  4. యాజకులు యొర్దాను నదినుండి బయటకు రాగానే ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 3:1-17 చదవండి.

    1. (ఎ) ఈ వృత్తాంతం ద్వారా ఉదహరించబడినట్లు, మనకు యెహోవా సహాయం, ఆశీర్వాదం లభించాలంటే మనమేమి చేయాలి? (యెహో. 3:13, 15; సామె. 3:5; యాకో. 2:22, 26)

    2. (బి) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి నది దాటవలసి వచ్చినప్పుడు యొర్దాను నది పరిస్థితి ఎలా ఉండింది, అది యెహోవా నామాన్ని ఎలా మహిమపరచింది? (యెహో. 3:15; 4:18; కీర్త. 66:5-7)

  2. యెహోషువ 4:1-18 చదవండి.

    యొర్దాను నదినుండి తీసుకోబడి గిల్గాలు వద్ద ఉంచబడిన 12 రాళ్ళు దేనికి గుర్తుగా ఉపయోగపడ్డాయి? (యెహో. 4:4-7, 19-24)

46వ కథ

యెరికో గోడలు

  1. యుద్ధశూరులు మరియు యాజకులు ఆరు రోజులపాటు ఏమి చేయాలని యెహోవా చెప్పాడు?

  2. ఆ పురుషులు ఏడవ రోజున ఏమి చేయాలి?

  3. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా యెరికో గోడలకు ఏమి జరిగింది?

  4. ఒక కిటికీలోనుండి ఎర్ర తాడు ఎందుకు వ్రేలాడుతోంది?

  5. యెరికోలోని ప్రజలను మరియు ఆ పట్టణాన్ని ఏమి చేయమని, కానీ వెండిని, బంగారాన్ని, ఇత్తడిని, ఇనుమును ఏమి చేయమని యెహోషువ యుద్ధశూరులకు చెప్పాడు?

  6. ఇద్దరు వేగులవాళ్ళకు ఏమి చేయమని చెప్పబడింది?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 6:1-25 చదవండి.

    1. (ఎ) ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ ఏడు రోజులపాటు తిరగడం, ఈ అంత్యదినాల్లో యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా పనికి ఎలా పోలివుంది? (యెహో. 6:15, 16; యెష. 60:22; మత్త. 24:14; 1 కొరిం. 9:16)

    2. (బి) యెహోషువ 6:26లో వ్రాయబడిన ప్రవచనం దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎలా నెరవేరింది, అది మనకు యెహోవా వాక్యం గురించి ఏమి బోధిస్తోంది? (1 రాజు. 16:34; యెష. 55:11)

47వ కథ

ఇశ్రాయేలులో దొంగ

  1. చిత్రంలో యెరికోనుండి తీసుకోబడిన విలువైన వస్తువులను పాతి పెడుతున్న వ్యక్తి ఎవరు, ఆయనకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు?

  2. ఆకాను, అతని కుటుంబం చేసిన ఆ పని ఎందుకు అంత గంభీరమైనది?

  3. హాయివద్ద జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికిగల కారణమేమిటని యెహోషువ అడిగినప్పుడు యెహోవా ఏమి చెప్పాడు?

  4. ఆకాను, అతని కుటుంబం యెహోషువ దగ్గరకు తీసుకురాబడినప్పుడు, వాళ్ళకేమి జరిగింది?

  5. ఆకానుకు ఇవ్వబడిన తీర్పు మనకు ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తోంది?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 7:1-26 చదవండి.

    1. (ఎ) యెహోషువ ప్రార్థనలు, ఆయనకు యెహోవాతో ఉన్న సంబంధం గురించి ఏమి వెల్లడి చేశాయి? (యెహో. 7:7-9; కీర్త. 119:145; 1 యోహా. 5:14)

    2. (బి) ఆకాను ఉదాహరణ ఏమి చూపిస్తోంది, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (యెహో. 7:11, 14, 15; సామె. 15:3; 1 తిమో. 5:24; హెబ్రీ. 4:13)

  2. యెహోషువ 8:1-29 చదవండి.

    నేడు క్రైస్తవ సంఘంపట్ల మనకు ఎలాంటి వ్యక్తిగతమైన బాధ్యత ఉంది? (యెహో. 7:13; లేవీ. 5:1; సామె. 28:13)

48వ కథ

తెలివైన గిబియోనీయులు

  1. గిబియోనుకు చెందిన ప్రజలు దగ్గర్లోని పట్టణాలకు చెందిన కనానీయులకు ఎలా భిన్నంగా ఉన్నారు?

  2. చిత్రంలో చూపించబడినట్లుగా గిబియోనీయులు ఏమి చేశారు, వాళ్ళు ఎందుకలా చేశారు?

  3. యెహోషువ మరియు ఇశ్రాయేలు నాయకులు గిబియోనీయులకు ఏమని ప్రమాణం చేశారు, మూడు రోజుల తర్వాత వాళ్ళకు ఏమి తెలిసింది?

  4. గిబియోనీయులు ఇశ్రాయేలుతో సమాధానపడ్డారని ఇతర పట్టణాల్లోని రాజులకు తెలిసినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 9:1-27 చదవండి.

    1. (ఎ) ‘ఈ దేశ నివాసులనందరినీ నశింపజేయండి’ అని యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞాపించినా ఆ తర్వాత ఆయన గిబియోనీయులను విడిచిపెట్టడంలో ఆయనకున్న ఏ లక్షణాలు ప్రత్యేకంగా వెల్లడయ్యాయి? (యెహో. 9:22, 24; మత్త. 9:13; అపొ. 10:34, 35; 2 పేతు. 3:9)

    2. (బి) యెహోషువ గిబియోనీయులకు తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం ద్వారా నేటి క్రైస్తవులకు ఎలా ఒక చక్కని మాదిరిని ఉంచాడు? (యెహో. 9:18, 19; మత్త. 5:37; ఎఫె. 4:25)

  2. యెహోషువ 10:1-5 చదవండి.

    నేడు గొప్ప సమూహం గిబియోనీయులను ఎలా అనుకరిస్తున్నారు, దానివల్ల వాళ్ళు దేనికి గురవుతున్నారు? (యెహో. 10:2; జెక. 8:23; మత్త. 25:35-40; ప్రక. 12:17)

49వ కథ

సూర్యుడు అలాగే నిలిచిపోవడం

  1. చిత్రంలో యెహోషువ ఏమంటున్నాడు, ఎందుకు అలా అంటున్నాడు?

  2. యెహోవా యెహోషువకు, ఆయన యుద్ధశూరులకు ఎలా సహాయం చేశాడు?

  3. యెహోషువ ఎంతమంది శత్రు రాజులను ఓడించాడు, దానికి ఎంత సమయం పట్టింది?

  4. యెహోషువ కనాను దేశాన్ని ఎందుకు పంచాడు?

  5. యెహోషువ చనిపోయేటప్పటికి ఆయన వయసెంత, ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. యెహోషువ 10:6-15 చదవండి.

    ఇశ్రాయేలు కోసం యెహోవా సూర్యుడు, చంద్రుడు నిలిచిపోయేలా చేశాడని తెలుసుకోవడంవల్ల నేడు మనమే నమ్మకంతో ఉండవచ్చు? (యెహో. 10:8, 10, 12, 13; కీర్త. 18:3; సామె. 18:10)

  2. యెహోషువ 12:7-24 చదవండి.

    కనానులో 31 మంది రాజులు ఓడించబడడానికి కారణమెవరు, అది మనకు నేడు ఎందుకు ప్రాముఖ్యం? (యెహో. 12:7; 24:11-13; ద్వితీ. 31:8; లూకా 21:9, 25-28)

  3. యెహోషువ 14:1-5 చదవండి.

    దేశము ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఎలా పంచిపెట్టబడింది, పరదైసులో స్వాస్థ్యంగా లభించే స్థలం గురించి అది ఏమి సూచిస్తోంది? (యెహో. 14:2; యెష. 65:21; యెహె. 47:21-23; 1 కొరిం. 14:33)

  4. న్యాయాధిపతులు 2:8-13 చదవండి.

    ఇశ్రాయేలులో యెహోషువలాగే నేడు మతభ్రష్టత్వాన్ని ఎవరు అదుపు చేస్తున్నారు? (న్యాయా. 2:8, 10, 11; మత్త. 24:45-47; 2 థెస్స. 2:3-6; తీతు 1:7-9; ప్రక. 1:1; 2:1, 2)

50వ కథ

ధైర్యంగల ఇద్దరు స్త్రీలు

  1. న్యాయాధిపతులు ఎవరు, వాళ్ళలో కొంతమంది పేర్లేమిటి?

  2. దెబోరాకు ఎలాంటి ప్రత్యేకమైన ఆధిక్యత ఉండేది, దానికి సంబంధించి ఆమె ఏమేమి చేస్తుండేది?

  3. యాబీను రాజు మరియు ఆయన సైన్యాధిపతి సీసెరా ఇశ్రాయేలుకు ప్రమాదంగా తయారైనప్పుడు, దెబోరా న్యాయాధిపతియైన బారాకుకు యెహోవానుండి వచ్చిన ఏ సందేశాన్ని తెలియజేసింది, దాని కోసం ఎవరు ఘనతను పొందుతారని ఆమె చెప్పింది?

  4. తాను ధైర్యంగల స్త్రీనని యాయేలు ఎలా చూపించింది?

  5. యాబీను రాజు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. న్యాయాధిపతులు 2:14-22 చదవండి.

    ఇశ్రాయేలీయులు తమపైకి యెహోవా కోపాన్ని ఎలా తెచ్చుకున్నారు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 2:20; సామె. 3:1, 2; యెహె. 18:21-23)

  2. న్యాయాధిపతులు 4:1-24 చదవండి.

    దెబోరా యాయేలుల ఉదాహరణల నుండి నేటి క్రైస్తవ స్త్రీలు విశ్వాసానికి, ధైర్యానికి సంబంధించిన ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? (న్యాయా. 4:4, 8, 9, 14, 21, 22; సామె. 31:30; 1 కొరిం. 16:13)

  3. న్యాయాధిపతులు 5:1-31 చదవండి.

    బారాకు దెబోరాలు పాడిన విజయ గీతాన్ని రానున్న అర్మగిద్దోను యుద్ధం గురించిన ప్రార్థనగా ఎలా అన్వయించవచ్చు? (న్యాయా. 5:3, 31; 1 దిన. 16:8-10; ప్రక. 7:9, 10; 16:16; 19:19-21)

51వ కథ

రూతు, నయోమి

  1. నయోమి మోయాబు దేశానికి ఎందుకు వచ్చింది?

  2. రూతు, ఓర్పా ఎవరు?

  3. తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళమని నయోమి చెప్పినప్పుడు రూతు ఎలా ప్రతిస్పందించింది, ఓర్పా ఎలా ప్రతిస్పందించింది?

  4. బోయజు ఎవరు, ఆయన రూతుకు, నయోమికి ఎలా సహాయం చేశాడు?

  5. బోయజు రూతులకు పుట్టిన అబ్బాయి పేరేమిటి, ఆయనను మనం ఎందుకు గుర్తుంచుకోవాలి?

అదనపు ప్రశ్నలు:

  1. రూతు 1:1-17 చదవండి.

    1. (ఎ) రూతు విశ్వసనీయమైన ప్రేమను ఎలా అద్భుతమైన విధంగా కనపరిచింది? (రూతు 1:16, 17)

    2. (బి) రూతు మానసిక వైఖరి, నేడు భూమిపైవున్న అభిషిక్తులపట్ల “వేరే గొఱ్ఱెల”కు ఉన్న వైఖరిని ఎలా వ్యక్తం చేస్తోంది? (యోహా. 10:16; జెక. 8:23)

  2. రూతు 2:1-23 చదవండి.

    నేటి యువతుల కోసం రూతు ఒక చక్కని మాదిరిని ఎలా ఉంచింది? (రూతు 2:17, 18; సామె. 23:22; 31:15)

  3. రూతు 3:5-13 చదవండి.

    1. (ఎ) రూతు ఒక యువకుడిని కాకుండా తనను పెళ్ళి చేసుకోవడానికి సుముఖత చూపించడాన్ని బోయజు ఎలా దృష్టించాడు?

    2. (బి) రూతు వైఖరి మనకు విశ్వసనీయ ప్రేమ గురించి ఏమి బోధిస్తోంది? (రూతు 3:10; 1 కొరిం. 13:4, 5)

  4. రూతు 4:7-17 చదవండి.

    నేడు క్రైస్తవ పురుషులు బోయజులా ఎలా ఉండవచ్చు? (రూతు 4:9, 10; 1 తిమో. 3:1, 12, 13; 5:8)

52వ కథ

గిద్యోను, అతని 300 మంది పురుషులు

  1. ఇశ్రాయేలీయులు ఎలా, ఎందుకు చాలా కష్టాల్లో చిక్కుకున్నారు?

  2. గిద్యోను సైన్యంలో చాలామంది ఉన్నారు అని యెహోవా ఎందుకు అన్నాడు?

  3. గిద్యోను భయపడేవాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత ఎంతమంది పురుషులు మిగిలారు?

  4. చిత్రం సహాయంతో, యెహోవా గిద్యోను సైన్యాన్ని కేవలం 300 మందికి తగ్గించిన విధానాన్ని వివరించండి.

  5. గిద్యోను తన 300 మంది పురుషులను ఎలా ఏర్పాటు చేశాడు, ఇశ్రాయేలు యుద్ధంలో ఎలా విజయం సాధించింది?

అదనపు ప్రశ్నలు:

  1. న్యాయాధిపతులు 6:36-40 చదవండి.

    1. (ఎ) యెహోవా చిత్తమేమిటో గిద్యోను ఎలా నిశ్చయపరచుకున్నాడు?

    2. (బి) నేడు మనం యెహోవా చిత్తమేమిటో ఎలా తెలుసుకోవచ్చు? (సామె. 2:3-6; మత్త. 7:7-11; 2 తిమో. 3:16, 17)

  2. న్యాయాధిపతులు 7:1-25 చదవండి.

    1. (ఎ) నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి విరుద్ధంగా అప్రమత్తంగా ఉండిన 300 మంది నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 7:3, 6; రోమా. 13:11, 12; ఎఫె. 5:15-17)

    2. (బి) ఆ 300 మంది పురుషులు గిద్యోనును చూసి నేర్చుకున్నట్లే మనం గొప్ప గిద్యోను అయిన యేసుక్రీస్తును చూసి ఎలా నేర్చుకుంటాము? (న్యాయా. 7:17; మత్త. 11:29, 30; 28:19, 20; 1 పేతు. 2:21)

    3. (సి) యెహోవా సంస్థలో ఎక్కడ సేవ చేయడానికి నియమించబడినా మనం సంతృప్తిగా ఉండడానికి న్యాయాధిపతులు 7:21 ఎలా సహాయం చేస్తుంది? (1 కొరిం. 4:2; 12:14-18; యాకో. 4:10)

  3. న్యాయాధిపతులు 8:1-3 చదవండి.

    ఒక సహోదరునితో లేదా సహోదరితో ఉన్న వ్యక్తిగత మనస్పర్థలను పరిష్కరించుకునే విషయానికి వచ్చినప్పుడు, గిద్యోను ఎఫ్రాయిమీయులతో ఉన్న కలహాన్ని పరిష్కరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సామె. 15:1; మత్త. 5:23, 24; లూకా 9:48)

53వ కథ

యెఫ్తా వాగ్దానం

  1. యెఫ్తా ఎవరు, ఆయన ఏ కాలంలో జీవించాడు?

  2. యెఫ్తా యెహోవాకు ఏమని వాగ్దానం చేశాడు?

  3. అమ్మోనీయులపై విజయం సాధించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యెఫ్తా ఎందుకు బాధపడ్డాడు?

  4. తన తండ్రి వాగ్దానం గురించి తెలుసుకున్నప్పుడు యెఫ్తా కుమార్తె ఏమి అన్నది?

  5. ప్రజలు యెఫ్తా కుమార్తెను ఎందుకు ఇష్టపడ్డారు?

అదనపు ప్రశ్నలు:

  1. న్యాయాధిపతులు 10:6-18 చదవండి.

    ఇశ్రాయేలీయులు యెహోవాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించిన విధానం నుండి మనమే హెచ్చరికను లక్ష్యపెట్టాలి? (న్యాయా. 10:6, 15, 16; రోమా. 15:4; ప్రక. 2:10)

  2. న్యాయాధిపతులు 11:1-11, 29-40 చదవండి.

    1. (ఎ) యెఫ్తా తన కుమార్తెను “దహనబలిగా” ఇవ్వడం అంటే దానర్థం ఆమెను మానవ బలిగా అగ్ని ద్వారా అర్పించడం కాదని మనకు ఎలా తెలుసు? (న్యాయా. 11:31; లేవీ. 16:24; ద్వితీ. 18:10, 12)

    2. (బి) యెఫ్తా తన కుమార్తెను ఏ విధంగా ఒక బలిగా అర్పించాడు?

    3. (సి) యెఫ్తా తాను యెహోవాకు చేసిన వాగ్దానంపట్ల ప్రదర్శించిన వైఖరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 11:35, 39; ప్రసం. 5:4, 5; మత్త. 16:24)

    4. యౌవన క్రైస్తవులు పూర్తికాల సేవను తమ వృత్తిగా చేసుకోవడానికి యెఫ్తా కుమార్తె ఎలా ఒక మంచి మాదిరిగా ఉంది? (న్యాయా. 11:36; మత్త. 6:33; ఫిలి. 3:8)

54వ కథ

గొప్ప బలంగల వ్యక్తి

  1. జీవించినవారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి పేరేమిటి, ఆయనకు అంత బలాన్ని ఎవరు ఇచ్చారు?

  2. చిత్రంలో కనిపిస్తున్నట్లు ఒకసారి సమ్సోను ఒక పెద్ద సింహాన్ని ఏమి చేశాడు?

  3. చిత్రంలో సమ్సోను దెలీలాకు ఏ రహస్యం చెబుతున్నాడు, ఆయన ఫిలిష్తీయుల చేత బంధించబడడానికి అది ఎలా కారణమయ్యింది?

  4. సమ్సోను చనిపోయిన రోజున శత్రువులైన 3,000 మంది ఫిలిష్తీయులను ఎలా హతమార్చాడు?

అదనపు ప్రశ్నలు:

  1. న్యాయాధిపతులు 13:1-14 చదవండి.

    మనోహ మరియు ఆయన భార్య, పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఎలా ఒక మంచి మాదిరిని ఉంచారు? (న్యాయా. 13:8; కీర్త. 127:3; ఎఫె. 6:4)

  2. న్యాయాధిపతులు 14:5-9, 15:9-16 చదవండి.

    1. (ఎ) సమ్సోను సింహాన్ని చంపడం, అతనికి కట్టబడిన కొత్త తాళ్ళను తెంచేయడం, 1,000 మందిని చంపడానికి మగ గాడిద దవడ ఎముకను ఉపయోగించడం వంటి వృత్తాంతాలు యెహోవా పరిశుద్ధాత్మ పని చేయడానికి సంబంధించి ఏమి వెల్లడి చేస్తున్నాయి?

    2. (బి) నేడు పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది? (న్యాయా. 14:6; 15:14; జెక. 4:6; అపొ. 4:31)

  3. న్యాయాధిపతులు 16:18-31 చదవండి.

    చెడు సహవాసాలు సమ్సోనుపై ఎలాంటి ప్రభావం చూపించాయి, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 16:18, 19; 1 కొరిం. 15:33)

55వ కథ

చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం

  1. చిత్రంలోని అబ్బాయి పేరేమిటి, అతనితోపాటు ఉన్న ఇతరులు ఎవరు?

  2. హన్నా ఒకరోజు యెహోవా గుడారానికి వెళ్ళి ఏమని ప్రార్థించింది, యెహోవా ఆమె ప్రార్థనకు ఎలా సమాధానమిచ్చాడు?

  3. యెహోవా గుడారంవద్ద సేవచేయడానికి తీసుకోబడినప్పుడు సమూయేలు వయసెంత, ఆయన తల్లి ఆయనకోసం ప్రతి సంవత్సరం ఏమి చేస్తుండేది?

  4. ఏలీ కుమారుల పేర్లేమిటి, వాళ్ళు ఎలాంటివాళ్ళు?

  5. యెహోవా సమూయేలును ఎలా పిలిచాడు, ఆయన సమూయేలుకు ఏమని చెప్పాడు?

  6. సమూయేలు పెద్దవాడయ్యాక ఏమయ్యాడు, ఆయన వృద్ధుడయినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 1:1-28 చదవండి.

    1. (ఎ) సత్యారాధన విషయంలో ముందుండడంలో కుటుంబ శిరస్సులకు ఎల్కానా ఎలాంటి చక్కని మాదిరిని ఉంచాడు? (1 సమూ. 1:3, 21; మత్త. 6:33; ఫిలి. 1:10)

    2. (బి) కలవరపెట్టే సమస్యతో వ్యవహరించే విషయంలో హన్నా ఉదాహరణ నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (1 సమూ. 1:10, 11; కీర్త. 55:22; రోమా. 12:12)

  2. మొదటి సమూయేలు 2:11-36 చదవండి.

    ఏలీ తన కుమారులను యెహోవాకంటే గొప్పగా ఎలా ఎంచాడు, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉండగలదు? (1 సమూ. 2:22-24, 27, 29; ద్వితీ. 21:18-21; మత్త. 10:36, 37)

  3. మొదటి సమూయేలు 4:16-18 చదవండి.

    యుద్ధంనుండి ఏ నాలుగు దుర్వార్తలుగల సమాచారం అందింది, అది ఏలీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

  4. మొదటి సమూయేలు 8:4-9 చదవండి.

    ఇశ్రాయేలీయులు ఎలా యెహోవా మనస్సును ఎంతగానో నొప్పించారు, మనం నేడు ఎలా ఆయన రాజ్యాన్ని నమ్మకంగా సమర్థించవచ్చు? (1 సమూ. 8:5, 7; యోహా. 17:16; యాకో. 4:4)

56వ కథ

సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు

  1. చిత్రంలో సమూయేలు ఏమి చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు?

  2. యెహోవా సౌలును ఎందుకు ఇష్టపడ్డాడు, ఆయన ఎలాంటి వ్యక్తి?

  3. సౌలు కుమారుని పేరేమిటి, ఆ కుమారుడు ఏమి చేశాడు?

  4. సమూయేలు వచ్చి బలి అర్పించేవరకు వేచివుండే బదులు దానిని సౌలు ఎందుకు అర్పించాడు?

  5. సౌలు కథనుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 9:15-21; 10:17-27 చదవండి.

    సౌలు వినయంతో కూడిన వైఖరి, కొంతమంది ఆయన గురించి అగౌరవంగా మాట్లాడినా తొందరపడి చర్య తీసుకోకుండా ఉండడానికి ఎలా సహాయం చేసింది? (1 సమూ. 9:21; 10:21, 22, 27; సామె. 17:27)

  2. మొదటి సమూయేలు 13:5-14 చదవండి.

    సౌలు గిల్గాలువద్ద చేసిన పాపమేమిటి? (1 సమూ. 10:8; 13:8, 9, 13)

  3. మొదటి సమూయేలు 15:1-35 చదవండి.

    1. (ఎ) అమాలేకు రాజైన అగగుకు సంబంధించి సౌలు ఎలాంటి గంభీరమైన పాపం చేశాడు? (1 సమూ. 15:2, 3, 8, 9, 22)

    2. (బి) సౌలు తన చర్యలను సమర్థించుకోవడానికి, ఇతరులపై నింద మోపడానికి ఎలా ప్రయత్నించాడు? (1 సమూ. 15:24)

    3. (సి) నేడు మనకు ఉపదేశం ఇవ్వబడినప్పుడు మనమే హెచ్చరికను లక్ష్యపెట్టాలి? (1 సమూ. 15:19-21; కీర్త. 141:5; సామె. 9:8, 9; 11:2)

57వ కథ

దేవుడు దావీదును ఎన్నుకోవడం

  1. చిత్రంలోని యువకుడి పేరేమిటి, ఆయన ధైర్యవంతుడని మనకు ఎలా తెలుసు?

  2. దావీదు ఎక్కడ నివసించేవాడు, ఆయన తండ్రి పేరేమిటి, తాతయ్య పేరేమిటి?

  3. యెహోవా సమూయేలును బేత్లెహేములోని యెష్షయి ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు?

  4. యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు దగ్గరకు తెచ్చినప్పుడు ఏమి జరిగింది?

  5. దావీదు తీసుకురాబడినప్పుడు, యెహోవా సమూయేలుకు ఏమి చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 17:34, 35 చదవండి.

    ఈ సంఘటనలు, దావీదు ధైర్యవంతుడని, ఆయన యెహోవాపై ఆధారపడ్డాడని ఎలా చూపిస్తున్నాయి? (1 సమూ. 17:37)

  2. మొదటి సమూయేలు 16:1-14 చదవండి.

    1. (ఎ) మొదటి సమూయేలు 16:7లో యెహోవా చెప్పిన మాటలు, మనం నిష్పక్షపాతంగా ఉండడానికి, బాహ్య రూపాలనుబట్టి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండడానికి ఎలా సహాయం చేస్తాయి? (అపొ. 10:34, 35; 1 తిమో. 2:4)

    2. (బి) యెహోవా ఒక వ్యక్తినుండి తన పరిశుద్ధాత్మను తీసివేసినప్పుడు ఏర్పడిన ఖాళీని ఒక చెడ్డ ఆత్మ లేదా తప్పు చేయాలనే ఆంతరంగిక కోరిక నింపవచ్చని సౌలు ఉదాహరణ ఎలా చూపిస్తోంది? (1 సమూ. 16:14; మత్త. 12:43-45; గల. 5:16)

58వ కథ

దావీదు, గొల్యాతు

  1. గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎలా సవాలు చేశాడు?

  2. గొల్యాతు ఎంత భారీకాయుడు, సౌలు రాజు గొల్యాతును చంపే వ్యక్తికి ఏ బహుమతిని ప్రకటించాడు?

  3. దావీదు కేవలం బాలుడు కాబట్టి గొల్యాతుతో పోరాడలేడు అని సౌలు అన్నప్పుడు దావీదు ఏమని సమాధానమిచ్చాడు?

  4. దావీదు గొల్యాతుకు ఇచ్చిన సమాధానం ద్వారా యెహోవాపై తనకున్న నమ్మకాన్ని ఎలా ప్రదర్శించాడు?

  5. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా దావీదు గొల్యాతును చంపడానికి ఏమి ఉపయోగించాడు, ఆ తర్వాత ఫిలిష్తీయులకు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 17:1-54 చదవండి.

    1. (ఎ) దావీదు నిర్భయంగా ఉండడానికిగల కారణమేమిటి, మనం ఆయన ధైర్యాన్ని ఎలా అనుకరించవచ్చు? (1 సమూ. 17:37, 45; ఎఫె. 6:10, 11)

    2. (బి) క్రైస్తవులు ఆటల్లో లేదా ఉల్లాస కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు గొల్యాతుకున్నటువంటి పోటీతత్వానికి ఎందుకు దూరంగా ఉండాలి? (1 సమూ. 17:8; గల. 5:26; 1 తిమో. 4:8)

    3. (సి) దావీదుకు దేవుడిచ్చే మద్దతుపై నమ్మకముందని ఆయన మాటలు ఎలా సూచిస్తున్నాయి? (1 సమూ. 17:45-47; 2 దిన. 20:15)

    4. (డి) కేవలం రెండు ప్రత్యర్థి సైన్యాల మధ్య జరిగిన పోటీని వర్ణించడానికి బదులు ఈ వృత్తాంతం నిజానికి అబద్ధ దేవుళ్ళకు, సత్య దేవుడైన యెహోవాకు మధ్య యుద్ధం జరిగిందని ఎలా చూపిస్తోంది? (1 సమూ. 17:43, 46, 47)

    5. (ఇ) అభిషిక్త శేషానికి చెందినవారు యెహోవాపై నమ్మకముంచడంలో దావీదు మాదిరిని ఎలా అనుకరిస్తారు? (1 సమూ. 17:37; యిర్మీ. 1:17-19; ప్రక. 12:17)

59వ కథ

దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది

  1. సౌలు దావీదుపై ఎందుకు అసూయపడ్డాడు, సౌలు కుమారుడైన యోనాతాను ఎలా భిన్నంగా ఉన్నాడు?

  2. ఒకరోజు దావీదు సౌలు కోసం సంగీతం వాయిస్తున్నప్పుడు ఏమి జరిగింది?

  3. తన కుమార్తె మీకాలును పెళ్ళి చేసుకోవడానికి దావీదు ఏమి చేయాలని సౌలు చెప్పాడు, సౌలు అలా ఎందుకు చెప్పాడు?

  4. దావీదు సౌలు కోసం సంగీతం వాయించినప్పుడు, చిత్రంలో చూపించబడినట్లు మూడవసారి కూడా ఏమి జరిగింది?

  5. దావీదు ప్రాణాలు కాపాడడానికి మీకాలు ఎలా సహాయం చేసింది, ఆ తర్వాత దావీదు ఏడు సంవత్సరాలపాటు ఏమి చేయాల్సి వచ్చింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 18:1-30 చదవండి.

    1. (ఎ) యోనాతాను దావీదుపట్ల చూపించిన గాఢమైన ప్రేమ, “వేరే గొఱ్ఱెల”కు “చిన్న మంద”కు మధ్య ఉండే పరస్పర ప్రేమకు పూర్వఛాయగా ఎలా ఉంది? (1 సమూ. 18:1; యోహా. 10:16; లూకా 12:32; జెక. 8:23)

    2. (బి) సాధారణంగా యోనాతానే సౌలుకు వారసుడనే వాస్తవం దృష్ట్యా, రాజుగా ఉండడానికి ఎన్నుకోబడిన వ్యక్తికి యోనాతాను అసాధారణమైన విధేయత చూపించాడని 1 సమూయేలు 18:4 ఎలా చూపిస్తోంది?

    3. (సి) అసూయ గంభీరమైన పాపాలకు నడిపించగలదని సౌలు ఉదాహరణ ఎలా చూపిస్తోంది, అది మనకు ఎలాంటి హెచ్చరికగా ఉంది? (1 సమూ. 18:7-9, 25; యాకో. 3:14-16)

  2. మొదటి సమూయేలు 19:1-17 చదవండి.

    యోనాతాను సౌలుతో మాట్లాడుతున్నప్పుడు తన ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడవేసుకున్నాడు? (1 సమూ. 19:1,  4-6; సామె 16:14)

60వ కథ

అబీగయీలు, దావీదు

  1. చిత్రంలో దావీదును కలవడానికి వస్తున్న స్త్రీ పేరేమిటి, ఆమె ఎలాంటి వ్యక్తి?

  2. నాబాలు ఎవరు?

  3. నాబాలును సహాయం కోరడానికి దావీదు తన మనుష్యులను ఎందుకు పంపించాడు?

  4. దావీదు పంపించిన మనుష్యులకు నాబాలు ఏమని సమాధానమిచ్చాడు, దానికి దావీదు ఎలా ప్రతిస్పందించాడు?

  5. అబీగయీలు తాను వివేచనగల స్త్రీనని ఎలా చూపించింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 22:1-4 చదవండి.

    క్రైస్తవ సహోదరత్వంలో మనం ఒకరికొకరు ఎలా మద్దతిచ్చుకోవాలి అనే విషయంలో దావీదు కుటుంబం ఎలా ఒక చక్కని మాదిరినుంచింది? (సామె. 17:17; 1 థెస్స. 5:14)

  2. మొదటి సమూయేలు 25:1-43 చదవండి.

    1. (ఎ) నాబాలు అంత అహంకారిగా ఎందుకు వర్ణించబడ్డాడు? (1 సమూ. 25:2-5, 10, 14, 21, 25)

    2. (బి) నేడు క్రైస్తవ భార్యలు అబీగయీలు నుండి ఏమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 25:32, 33; సామె. 31:26; ఎఫె. 5:24)

    3. (సి) దావీదు ఏ రెండు చెడ్డ పనులు చేయకుండా అబీగయీలు ఆపింది? (1 సమూ. 25:31, 33; రోమా. 12:19; ఎఫె. 4:26)

    4. (డి) అబీగయీలు మాటలకు దావీదు ప్రతిస్పందించిన విధానం, నేటి పురుషులు స్త్రీలను యెహోవా దృష్టించినట్లే దృష్టించడానికి ఎలా సహాయం చేస్తుంది? (అపొ. 21:8, 9; రోమా. 2:11; 1 పేతు. 3:7)

61వ కథ

దావీదు రాజుగా చేయబడడం

  1. సౌలు తన దండులో నిద్రిస్తున్నప్పుడు దావీదు, అబీషై ఏమి చేశారు?

  2. దావీదు సౌలును ఏ ప్రశ్నలు అడిగాడు?

  3. సౌలును విడిచిపెట్టిన తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళాడు?

  4. దావీదు ఒక చక్కని పాట వ్రాసేలా ఏ సంఘటన ఆయనకు ఎంతో దుఃఖం కలిగించింది?

  5. దావీదు హెబ్రోనులో రాజుగా చేయబడినప్పుడు ఆయన వయసెంత, ఆయన కుమారులలో కొంతమంది పేర్లేమిటి?

  6. ఆ తర్వాత దావీదు ఎక్కడ రాజుగా పరిపాలించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి సమూయేలు 26:1-25 చదవండి.

    1. (ఎ) మొదటి సమూయేలు 26:11లోని దావీదు మాటలు, దైవపరిపాలనా క్రమంపట్ల ఆయనకున్న వైఖరి గురించి ఏమి వెల్లడి చేస్తున్నాయి? (కీర్త. 37:7; రోమా. 13:2)

    2. (బి) మనం ప్రేమపూర్వకమైన దయ చూపించడానికి ఎంతో కృషి చేసినా కృతజ్ఞతలేని ప్రతిస్పందనే లభిస్తే, 1 సమూయేలు 26:23లోని దావీదు మాటలు మనం సరైన దృక్కోణాన్ని కాపాడుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? (1 రాజు. 8:32; కీర్త. 18:20)

  2. రెండవ సమూయేలు 1:26 చదవండి.

    దావీదు యోనాతానులకు ‘ఒకరిపట్ల ఒకరికి ఉన్నటువంటి మిక్కటమైన ప్రేమను’ నేడు క్రైస్తవులు ఎలా పెంపొందించుకోవచ్చు? (1 పేతు. 4:8; కొలొ. 3:14; 1 యోహా. 4:12)

  3. రెండవ సమూయేలు 5:1-10 చదవండి.

    1. (ఎ) దావీదు ఎన్ని సంవత్సరాలపాటు రాజుగా పరిపాలించాడు, ఆ కాలం ఎలా విభజించబడింది? (2 సమూ. 5:4, 5)

    2. (బి) దావీదు గొప్పతనానికి కారణమేమిటి, అది మనకు నేడు ఒక జ్ఞాపికగా ఎందుకు ఉంది? (2 సమూ. 5:10; 1 సమూ. 16:13; 1 కొరిం. 1:31; ఫిలి. 4:13)

62వ కథ

దావీదు ఇంట్లో శ్రమ

  1. యెహోవా సహాయంతో చివరకు కనాను దేశానికి ఏమి జరిగింది?

  2. ఒకరోజు సాయంత్రం దావీదు తన భవనం పైకప్పుమీద ఉన్నప్పుడు ఏమి జరిగింది?

  3. యెహోవాకు దావీదుమీద ఎందుకు కోపం వచ్చింది?

  4. చిత్రంలో కనిపిస్తున్నట్లు, దావీదుకు ఆయన పాపాల గురించి చెప్పడానికి యెహోవా ఎవరిని పంపించాడు, ఆ వ్యక్తి దావీదుకు ఏమి జరుగుతుందని చెప్పాడు?

  5. దావీదుకు ఎలాంటి శ్రమ కలిగింది?

  6. దావీదు తర్వాత ఎవరు ఇశ్రాయేలుకు రాజయ్యాడు?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ సమూయేలు 11:1-27 చదవండి.

    1. (ఎ) యెహోవా సేవలో చురుకుగా ఉండడం మనకు రక్షణగా ఎలా ఉంటుంది?

    2. (బి) దావీదు ఎలా పాపంవైపుకు ఆకర్షించబడ్డాడు, నేడు యెహోవా సేవకులకు అది ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (2 సమూ. 11:2; మత్త. 5:27-29; 1 కొరిం. 10:12; యాకో. 1:14, 15)

  2. రెండవ సమూయేలు 12:1-18 చదవండి.

    1. (ఎ) నాతాను దావీదుకు ఉపదేశం ఇచ్చిన విధానం నుండి పెద్దలు, తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (2 సమూ. 12:1-4; సామె. 12:18; మత్త. 13:34)

    2. (బి) యెహోవా దావీదుతో ఎందుకు దయగా వ్యవహరించాడు? (2 సమూ. 12:13; కీర్త. 32:5; 2 కొరిం. 7:9, 10)

63వ కథ

జ్ఞానియైన సొలొమోను రాజు

  1. యెహోవా సొలొమోనును ఏమి అడిగాడు, ఆయన ఎలా సమాధానమిచ్చాడు?

  2. సొలొమోను కోరిన దానినిబట్టి సంతోషించి యెహోవా ఆయనకు ఇంకా ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు?

  3. ఇద్దరు స్త్రీలు ఏ కఠినమైన సమస్యను సొలొమోను ముందుంచారు?

  4. మీకు చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, సొలొమోను ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు?

  5. సొలొమోను పరిపాలన ఎలా ఉండేది, ఎందుకు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి రాజులు 3:3-28 చదవండి.

    1. (ఎ) నేడు యెహోవా సంస్థలో బాధ్యతలు అప్పగించబడిన పురుషులు, 1 రాజులు 3:7లో సొలొమోను పలికిన హృదయపూర్వక మాటలనుండి ఏమి నేర్చుకోవచ్చు? (కీర్త. 119:105; సామె. 3:5, 6)

    2. (బి) సొలొమోను కోరినది, ఏయే విషయాల గురించి ప్రార్థించడం సముచితం అనేదానికి ఎందుకు ఒక చక్కని ఉదాహరణగా ఉంది? (1 రాజు. 3:9, 11; సామె. 30:8, 9; 1 యోహా. 5:14)

    3. (సి) ఇద్దరు స్త్రీల మధ్య తలెత్తిన వివాదాన్ని సొలొమోను పరిష్కరించిన విధానం, గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు భవిష్యత్తులో చేయబోయే పరిపాలన గురించి మనకే నమ్మకాన్ని ఇస్తుంది? (1 రాజు. 3:28; యెష. 9:6, 7; 11:2-4)

  2. మొదటి రాజులు 4:29-34 చదవండి.

    1. (ఎ) వివేకముగల హృదయము దయచేయమని సొలొమోను చేసిన ప్రార్థనకు యెహోవా ఎలా సమాధానమిచ్చాడు? (1 రాజు. 4:29)

    2. (బి) సొలొమోను జ్ఞానపు మాటలు వినడానికి ప్రజలు చేసిన ప్రయత్నాల దృష్ట్యా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? (1 రాజు. 4:29, 34; యోహా. 17:3; 2 తిమో. 3:16)

64వ కథ

సొలొమోను ఆలయాన్ని నిర్మించడం

  1. యెహోవా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సొలొమోనుకు ఎంతకాలం పట్టింది, దాని నిర్మాణానికి ఎందుకు అంత ధనం ఖర్చయ్యింది?

  2. ఆలయంలో ఎన్ని ముఖ్య గదులు ఉండేవి, లోపలి గదిలో ఏమి ఉంచబడేది?

  3. ఆలయ నిర్మాణం పూర్తైనప్పుడు సొలొమోను ఏమని ప్రార్థించాడు?

  4. సొలొమోను చేసిన ప్రార్థనను బట్టి తాను సంతోషించానని యెహోవా ఎలా చూపించాడు?

  5. సొలొమోను భార్యలు ఆయన ఏమి చేసేలా చేశారు, సొలొమోనుకు ఏమి జరిగింది?

  6. యెహోవాకు సొలొమోనుమీద ఎందుకు కోపం వచ్చింది, ఆయన సొలొమోనుకు ఏమి చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి దినవృత్తాంతములు 28:9, 10 చదవండి.

    మొదటి దినవృత్తాంతములు 28:9, 10లో నమోదు చేయబడిన దావీదు మాటలను బట్టి మనం మన దైనందిన జీవితాల్లో ఏమి చేయడానికి కృషి చేయాలి? (కీర్త. 19:14; ఫిలి. 4:8, 9)

  2. రెండవ దినవృత్తాంతములు 6:12-21, 32-42 చదవండి.

    1. (ఎ) మానవ నిర్మిత మందిరాలేవీ మహోన్నతునికి నివాసముగా ఉండలేవని సొలొమోను ఎలా చూపించాడు? (2 దిన. 6:18; అపొ. 17:24, 25)

    2. (బి) రెండవ దినవృత్తాంతములు 6:32, 33లోని సొలొమోను మాటలు యెహోవా గురించి ఏమి తెలియజేస్తున్నాయి? (అపొ. 10:34, 35; గల. 2:6)

  3. రెండవ దినవృత్తాంతములు 7:1-5 చదవండి.

    యెహోవా మహిమను చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయనను స్తుతించడానికి కదిలించబడినట్లే, యెహోవా తన ప్రజలకిచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచించినప్పుడు మనమెలా ప్రభావితం చెందాలి? (2 దిన. 7:3; కీర్త. 22:22; 34:1; 96:2)

  4. మొదటి రాజులు 11:9-13 చదవండి.

    చివరివరకూ నమ్మకంగా ఉండడం ప్రాముఖ్యమని సొలొమోను జీవిత విధానం ఎలా చూపిస్తోంది? (1 రాజు. 11:4, 9; మత్త. 10:22; ప్రక. 2:10)

65వ కథ

రాజ్యం విభాగించబడడం

  1. చిత్రంలోని ఇద్దరు వ్యక్తుల పేర్లేమిటి, వాళ్ళు ఎవరు?

  2. అహీయా తాను ధరించిన వస్త్రాన్ని ఏమి చేశాడు, ఆ చర్య భావమేమిటి?

  3. సొలొమోను యరొబామును ఏమి చేయడానికి ప్రయత్నించాడు?

  4. ప్రజలు యరొబామును పది గోత్రాలకు రాజుగా ఎందుకు చేశారు?

  5. యరొబాము రెండు బంగారు దూడలను ఎందుకు చేశాడు, ఆ తర్వాత దేశానికి ఏమయ్యింది?

  6. రెండు గోత్రాల రాజ్యానికి, యెరూషలేములోని యెహోవా ఆలయానికి ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి రాజులు 11:26-43 చదవండి.

    యరొబాము ఎలాంటి వ్యక్తి, అతను దేవుని నియమాలను పాటిస్తే ఏమి చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు? (1 రాజు. 11:28, 38)

  2. మొదటి రాజులు 12:1-33 చదవండి.

    1. (ఎ) రెహబాము చెడు మాదిరినుండి, అధికారాన్ని దుర్వినియోగపరచడానికి సంబంధించి తల్లిదండ్రులు, పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు? (1 రాజు. 12:13; ప్రసం. 7:7; 1 పేతు. 5:2, 3)

    2. (బి) యౌవనులు జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆధారపడదగిన మార్గనిర్దేశం కోసం ఎవరివైపు చూడాలి? (1 రాజు. 12:6, 7; సామె. 1:8, 9; 2 తిమో. 3:16, 17; హెబ్రీ. 13:7)

    3. (సి) దూడ ఆరాధన కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి యరొబామును ప్రేరేపించినదేమిటి, అతను యెహోవాపై అస్సలు నమ్మకముంచలేదని అది ఎలా చూపిస్తోంది? (1 రాజు. 11:37; 12:26-28)

    4. (డి) పది గోత్రాల రాజ్యానికి చెందిన ప్రజలు సత్యారాధనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా నడిపించింది ఎవరు? (1 రాజు. 12:32, 33)

66వ కథ

యెజెబెలు—ఒక దుష్ట రాణి

  1. యెజెబెలు ఎవరు?

  2. రాజైన అహాబు ఒకరోజు ఎందుకు బాధగా కనిపించాడు?

  3. తన భర్తయైన అహాబు కోసం నాబోతు ద్రాక్షతోటను సంపాదించడానికి యెజెబెలు ఏమి చేసింది?

  4. యెజెబెలును శిక్షించడానికి యెహోవా ఎవరిని పంపించాడు?

  5. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా, యెహూ యెజెబెలు భవనానికి వచ్చినప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి రాజులు 16:29-33; 18:3, 4 చదవండి.

    అహాబు రాజు కాలంలో ఇశ్రాయేలులోని పరిస్థితులు ఎంత చెడ్డగా ఉండేవి? (1 రాజు. 14:9)

  2. మొదటి రాజులు 21:1-16 చదవండి.

    1. (ఎ) నాబోతు ధైర్యాన్ని, యెహోవాపట్ల విశ్వసనీయతను ఎలా ప్రదర్శించాడు? (1 రాజు. 21:1-3; లేవీ. 25:23-28)

    2. (బి) అహాబు ఉదాహరణనుండి, నిరుత్సాహంతో వ్యవహరించడం గురించి మనమేమి నేర్చుకోవచ్చు? (1 రాజు. 21:4; రోమా. 5:3-5)

  3. రెండవ రాజులు 9:30-37 చదవండి.

    యెహోవా చిత్తం చేయడానికి యెహూ చూపించిన ఆసక్తినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2 రాజు. 9:4-10; 2 కొరిం. 9:1, 2; 2 తిమో. 4:2)

67వ కథ

యెహోషాపాతు యెహోవాపై నమ్మకం ఉంచడం

  1. యెహోషాపాతు ఎవరు, ఆయన ఏ కాలంలో జీవించాడు?

  2. ఇశ్రాయేలీయులు ఎందుకు భయపడ్డారు, వాళ్ళలో చాలామంది ఏమి చేశారు?

  3. యెహోషాపాతు ప్రార్థనకు యెహోవా ఏమని సమాధానమిచ్చాడు?

  4. యుద్ధానికి ముందు యెహోవా ఏమి జరిగేలా చేశాడు?

  5. మనం యెహోషాపాతు నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ దినవృత్తాంతములు 20:1-30 చదవండి.

    1. (ఎ) ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు దేవుని నమ్మకమైన సేవకులు ఏమి చేయాలో యెహోషాపాతు ఎలా చూపించాడు? (2 దిన. 20:12; కీర్త. 25:15; 62:1)

    2. (బి) యెహోవా తన ప్రజలతో వ్యవహరించేటప్పుడు ఎల్లప్పుడూ ఒక మాధ్యమాన్ని ఉపయోగించాడు కాబట్టి, నేడు ఆయన ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాడు? (2 దిన. 20:14, 15; మత్త. 24:45-47; యోహా. 15:15)

    3. (సి) దేవుడు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమును” ప్రారంభించినప్పుడు మన పరిస్థితి యెహోషాపాతు పరిస్థితిలాగే ఎలా ఉంటుంది? (2 దిన. 20:15, 17; 32:8; ప్రక. 16:14, 16)

    4. (డి) లేవీయులను అనుకరిస్తూ పయినీర్లు, మిషనరీలు నేడు ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? (2 దిన. 20:19, 21; రోమా. 10:13-15; 2 తిమో. 4:2)

68వ కథ

తిరిగి బ్రతికిన ఇద్దరు అబ్బాయిలు

  1. చిత్రంలోని ముగ్గురు వ్యక్తులు ఎవరు, ఆ చిన్న అబ్బాయికి ఏమి జరిగింది?

  2. ఆ అబ్బాయి గురించి ఏలియా ఏమని ప్రార్థించాడు, ఆ తర్వాత ఏమి జరిగింది?

  3. ఏలియా సహాయకుని పేరేమిటి?

  4. ఎలీషా షూనేములోని స్త్రీ ఇంటికి ఎందుకు పిలువబడ్డాడు?

  5. ఎలీషా ఏమి చేశాడు, చనిపోయిన అబ్బాయికి ఏమి జరిగింది?

  6. ఏలియా ఎలీషాల ద్వారా చూపించబడినట్లు యెహోవాకు ఏ శక్తి ఉంది?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి రాజులు 17:8-24 చదవండి.

    1. (ఎ) ఏలియా విధేయత, విశ్వాసం ఎలా పరీక్షించబడ్డాయి? (1 రాజు. 17:9; 19:1-4, 10)

    2. (బి) సారెపతులోని విధవరాలి విశ్వాసం ఎందుకు అసాధారణమైనది? (1 రాజు. 17:12-16; లూకా 4:25, 26)

    3. (సి) సారెపతులోని విధవరాలి అనుభవం మత్తయి 10:41, 42లోని యేసు మాటల నిజత్వాన్ని ఎలా నిరూపిస్తోంది? (1 రాజు. 17:10-12, 17, 23, 24)

  2. రెండవ రాజులు 4:8-37 చదవండి.

    1. (ఎ) షూనేము స్త్రీ, ఆతిథ్యం ఇవ్వడం గురించి మనకు ఏమి నేర్పిస్తోంది? (2 రాజు. 4:8; లూకా 6:38; రోమా. 12:13; 1 యోహా. 3:17)

    2. (బి) నేడు దేవుని సేవకులపట్ల మనం ఏయే విధాలుగా దయ చూపించవచ్చు? (అపొ. 20:35; 28:1, 2; గల. 6:9, 10; హెబ్రీ. 6:10)

69వ కథ

ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం

  1. చిత్రంలోని చిన్న అమ్మాయి ఆ స్త్రీతో ఏమి చెబుతోంది?

  2. చిత్రంలోని స్త్రీ ఎవరు, ఆ చిన్న అమ్మాయి ఆ స్త్రీ ఇంట్లో ఎందుకు ఉంది?

  3. నయమానుకు ఏమి చెప్పమని ఎలీషా తన సేవకుడికి చెప్పాడు, నయమానుకు ఎందుకు కోపం వచ్చింది?

  4. నయమాను తన సేవకుల మాట విన్నప్పుడు ఏమి జరిగింది?

  5. ఎలీషా నయమాను ఇచ్చిన బహుమానాన్ని ఎందుకు తీసుకోలేదు, కానీ గేహజీ ఏమి చేశాడు?

  6. గేహజీకి ఏమి జరిగింది, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ రాజులు 5:1-27 చదవండి.

    1. (ఎ) ఇశ్రాయేలు బాలిక మాదిరి, నేడు యౌవనస్థులకు ఎలా సహాయం చేయగలదు? (2 రాజు. 5:3; కీర్త. 8:2; 148:12, 13)

    2. (బి) మనకు లేఖనాధారిత ఉపదేశం ఇవ్వబడినప్పుడు మనం నయమాను ఉదాహరణను మనస్సులో ఉంచుకోవడం ఎందుకు మంచిది? (2 రాజు. 5:15; హెబ్రీ. 12:5, 6; యాకో. 4:6)

    3. (సి) ఎలీషా మాదిరికి, గేహజీ మాదిరికి ఉన్న తేడాలనుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? (2 రాజు. 5:9, 10, 14-16, 20; మత్త. 10:8; అపొ. 5:1-5; 2 కొరిం. 2:17)

70వ కథ

యోనా, పెద్ద చేప

  1. యోనా ఎవరు, ఆయనకు యెహోవా ఏమి చేయమని చెప్పాడు?

  2. యెహోవా చెప్పిన చోటకు వెళ్ళడం యోనాకు ఇష్టంలేదు కాబట్టి ఆయన ఏమి చేశాడు?

  3. యోనా తుపానును ఆపడానికి ఏమి చేయమని నావికులకు చెప్పాడు?

  4. మీకు చిత్రంలో కనిపిస్తున్నట్లు, యోనా నీళ్ళలో మునిగిపోతుండగా ఏమి జరిగింది?

  5. యోనా ఎంతకాలం ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడు, ఆయన అక్కడ ఏమి చేశాడు?

  6. యోనా పెద్ద చేపనుండి బయట పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, అది మనకు ఏమి నేర్పిస్తోంది?

అదనపు ప్రశ్నలు:

  1. యోనా 1:1-17 చదవండి.

    నీనెవె వాసులకు ప్రకటించే నియామకం గురించి యోనా ఎలా భావించాడని స్పష్టమవుతోంది? (యోనా 1:2, 3; సామె. 3:7; ప్రసం. 8:12)

  2. యోనా 2:1, 2, 10 చదవండి.

    యోనా అనుభవం, యెహోవా మన ప్రార్థనలకు సమాధానమిస్తాడనే నమ్మకాన్ని ఎలా ఇస్తుంది? (కీర్త. 22:24; 34:6; 1 యోహా. 5:14)

  3. యోనా 3:1-10 చదవండి.

    1. (ఎ) యోనా తన నియామకాన్ని నిర్వహించడంలో మొదట విఫలమైనా యెహోవా ఆ తర్వాత ఆయనను ఉపయోగించుకున్నాడనే వాస్తవం మనకు ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది? (కీర్త. 103:14; 1 పేతు. 5:10)

    2. (బి) నీనెవె వాసుల విషయంలో యోనాకు ఎదురైన అనుభవం, మన క్షేత్రంలోని ప్రజల గురించి ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే విషయం గురించి ఏమి బోధిస్తోంది? (యోనా 3:6-9; ప్రసం. 11:6; అపొ. 13:48)

71వ కథ

దేవుడు ఒక పరదైసును వాగ్దానం చేయడం

  1. యెషయా ఎవరు, ఆయన ఎప్పుడు జీవించాడు, యెహోవా ఆయనకు ఏమి చూపించాడు?

  2. “పరదైసు” అనే పదానికి అర్థమేమిటి, అది మీకు దేనిని జ్ఞాపకం చేస్తుంది?

  3. నూతన పరదైసు గురించి ఏమి వ్రాయమని యెహోవా యెషయాకు చెప్పాడు?

  4. ఆదాము హవ్వలు తమ అందమైన గృహాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు?

  5. తనను ప్రేమించేవారి కోసం యెహోవా ఏమి వాగ్దానం చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. యెషయా 11:6-9 చదవండి.

    1. (ఎ) నూతనలోకంలో మానవులకు జంతువులకు మధ్యవుండే శాంతిని దేవుని వాక్యం ఎలా వర్ణిస్తోంది? (కీర్త. 148:10, 13; యెష. 65:25; యెహె. 34:25)

    2. (బి) నేడు యెహోవా ప్రజల మధ్య యెషయా మాటలు ఆధ్యాత్మికపరంగా ఎలా నెరవేరుతున్నాయి? (రోమా. 12:2; ఎఫె. 4:23, 24)

    3. (సి) ఇప్పుడు మరియు నూతనలోకంలో మానవులు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకున్నందుకు ఘనత పొందడానికి ఎవరు అర్హులు? (యెష. 48:17, 18; గల. 5:22; ఫిలి. 4:7)

  2. ప్రకటన 21:3, 4 చదవండి.

    1. (ఎ) దేవుడు మానవజాతితో నివాసముండడమంటే వాళ్ళతో సూచనార్థకంగా ఉండడమే గానీ శారీరకంగా భూమ్మీద ఉండడం కాదని లేఖనాలు ఎలా సూచిస్తున్నాయి? (లేవీ. 26:11, 12; 2 దిన. 6:18; యెష. 66:1; ప్రక. 21:2, 3, 22-24)

    2. (బి) ఎలాంటి కన్నీళ్ళు, బాధ ఇక ఉండవు? (లూకా 8:49-52; రోమా. 8:21, 22; ప్రక. 21:4)

72వ కథ

హిజ్కియా రాజుకు దేవుడు సహాయం చేయడం

  1. చిత్రంలోని వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు చాలా కష్టంలో ఉన్నాడు?

  2. హిజ్కియా దేవుని ఎదుట పెట్టిన ఉత్తరాలు ఏమిటి, హిజ్కియా ఏమని ప్రార్థించాడు?

  3. హిజ్కియా ఎలాంటి రాజు, యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఆయనకు ఎలాంటి సందేశం పంపించాడు?

  4. చిత్రంలో చూపించబడినట్లు యెహోవా దూత అష్షూరీయులను ఏమి చేశాడు?

  5. రెండు గోత్రాల రాజ్యం కొంతకాలంపాటు సమాధానాన్ని అనుభవించినా, హిజ్కియా చనిపోయిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ రాజులు 18:1-36 చదవండి.

    1. (ఎ) అష్షూరీయుల ప్రతినిధి అయిన రబ్షాకే ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని బలహీనపరచడానికి ఎలా ప్రయత్నించాడు? (2 రాజు. 18:19, 21; నిర్గ. 5:2; కీర్త. 64:3)

    2. (బి) వ్యతిరేకులతో వ్యవహరించేటప్పుడు యెహోవాసాక్షులు హిజ్కియా మాదిరిని ఎలా లక్ష్యపెడతారు? (2 రాజు. 18:36; కీర్త. 39:1; సామె. 26:4; 2 తిమో. 2:24)

  2. రెండవ రాజులు 19:1-37 చదవండి.

    1. (ఎ) నేడు యెహోవాసాక్షులు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు హిజ్కియాను ఎలా అనుకరిస్తారు? (2 రాజు. 19:1, 2; సామె. 3:5, 6; హెబ్రీ. 10:24, 25; యాకో. 5:14, 15)

    2. (బి) సన్హెరీబు రాజు ఏ మూడు విధాలుగా ఓడించబడ్డాడు, ఆయన ప్రవచనాత్మకంగా ఎవరిని సూచిస్తున్నాడు? (2 రాజు. 19:32, 35, 37; ప్రక. 20:2, 3)

  3. రెండవ రాజులు 21:1-6, 16 చదవండి.

    యెరూషలేమును పాలించిన చెడ్డ రాజుల్లో మనష్షే అత్యంత దుష్టుడని ఎందుకు చెప్పవచ్చు? (2 దిన. 33:4-6, 9)

73వ కథ

ఇశ్రాయేలీయుల చివరి మంచి రాజు

  1. యోషీయా రాజైనప్పుడు ఆయన వయసెంత, ఏడు సంవత్సరాలు రాజుగా ఉన్న తర్వాత ఆయన ఏమి చేయడం ప్రారంభించాడు?

  2. మొదటి చిత్రంలో యోషీయా ఏమి చేస్తున్నాడు?

  3. మనుష్యులు ఆలయాన్ని మరమ్మతు చేసేటప్పుడు ప్రధాన యాజకుడు ఏమి కనుగొన్నాడు?

  4. యోషీయా తన వస్త్రాలను ఎందుకు చింపుకున్నాడు?

  5. ప్రవక్త్రిని అయిన హుల్దా యోషీయాకు యెహోవానుండి వచ్చిన ఏ సందేశాన్ని చెప్పింది?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ దినవృత్తాంతములు 34:1-28 చదవండి.

    1. (ఎ) చిన్నతనంలో కష్టాలు అనుభవించాల్సి వచ్చినవారి కోసం యోషీయా ఎలాంటి మాదిరిని ఉంచాడు? (2 దిన. 33:21-25; 34:1, 2; కీర్త. 27:10)

    2. (బి) యోషీయా తన పరిపాలనలోని 8వ, 12వ, 18వ సంవత్సరాలలో సత్యారాధనను విస్తరింపజేయడానికి ఎలాంటి ముఖ్యమైన చర్యలు తీసుకున్నాడు? (2 దిన. 34:3, 8)

    3. (సి) మన ఆరాధనా స్థలాలను చక్కగా ఉంచుకునే విషయంలో యోషీయా రాజు, ప్రధాన యాజకుడైన హిల్కీయా ఉంచిన మాదిరులనుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? (2 దిన. 34:9-13; సామె. 11:14; 1 కొరిం. 10:31)

74వ కథ

భయపడని వ్యక్తి

  1. చిత్రంలో కనిపిస్తున్న యువకుడు ఎవరు?

  2. తాను ప్రవక్తగా ఉండే విషయం గురించి యిర్మీయా ఎలా భావించాడు, కానీ యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు?

  3. యిర్మీయా ప్రజలకు ఏ సందేశాన్ని చెబుతూనే ఉన్నాడు?

  4. యాజకులు యిర్మీయాను ఆపడానికి ఎలా ప్రయత్నించారు, అయితే తాను భయపడలేదని యిర్మీయా ఎలా చూపించాడు?

  5. ఇశ్రాయేలీయులు తమ చెడ్డ మార్గాలను మార్చుకోనప్పుడు ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. యిర్మీయా 1:1-8 చదవండి.

    1. (ఎ) యిర్మీయా ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, ఒక వ్యక్తిని యెహోవా సేవ చేయడానికి అర్హుణ్ణి చేసేదేమిటి? (2 కొరిం. 3:5, 6)

    2. (బి) నేటి క్రైస్తవ యౌవనులకు యిర్మీయా ఉదాహరణ ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తోంది? (ప్రసం. 12:1; 1 తిమో. 4:12)

  2. యిర్మీయా 10:1-5 చదవండి.

    విగ్రహాలను నమ్ముకోవడం వ్యర్థమని చూపించడానికి యిర్మీయా ఎలాంటి శక్తివంతమైన ఉపమానం ఉపయోగించాడు? (యిర్మీ. 10:5; యెష. 46:7; హబ. 2:19)

  3. యిర్మీయా 26:1-16 చదవండి.

    1. (ఎ) నేడు హెచ్చరికా సందేశాన్ని ప్రకటించేటప్పుడు అభిషిక్త శేషానికి చెందినవారు, “వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు” అని యెహోవా యిర్మీయాకు ఇచ్చిన ఆజ్ఞను ఎలా మనస్సులో ఉంచుకున్నారు? (యిర్మీ. 26:2; ద్వితీ. 4:2; అపొ. 20:27)

    2. (బి) యెహోవా హెచ్చరికను దేశాలకు ప్రకటించే విషయంలో నేడు యెహోవాసాక్షులకు యిర్మీయా ఎలాంటి మంచి మాదిరిని ఉంచాడు? (యిర్మీ. 26:8, 12, 14, 15; 2 తిమో. 4:1-5)

  4. రెండవ రాజులు 24:1-17 చదవండి.

    యూదా యెహోవాకు నమ్మకంగా ఉండకపోవడంవల్ల ఎలాంటి విషాదకరమైన పర్యవసానాలు అనుభవించాల్సి వచ్చింది? (2 రాజు. 24:2-4, 14)

75వ కథ

బబులోనులో నలుగురు యువకులు

  1. చిత్రంలోని నలుగురు యువకులు ఎవరు, వాళ్ళు బబులోనులో ఎందుకున్నారు?

  2. ఆ నలుగురు యువకులను ఎలా తయారు చేయాలని నెబుకద్నెజరు అనుకున్నాడు, ఆయన తన సేవకులకు ఏమి ఆజ్ఞాపించాడు?

  3. దానియేలు తన కోసం, తన ముగ్గురు స్నేహితుల కోసం ఎలాంటి ఆహారం కావాలని కోరాడు?

  4. పది రోజులపాటు కూరగాయలు తిన్న తర్వాత, ఇతర యువకులతో పోల్చినప్పుడు దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులు ఎలా కనిపించారు?

  5. దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు రాజభవనానికి ఎలా వచ్చారు, వాళ్ళు ఏ విధంగా యాజకులకంటే జ్ఞానులకంటే వివేచనగలవారు?

అదనపు ప్రశ్నలు:

  1. దానియేలు 1:1-21 చదవండి.

    1. (ఎ) మనం శోధనలను ఎదిరించి, బలహీనతలను అధిగమించాలనుకుంటే ఎలాంటి కృషి చేయడం అవసరం? (దాని. 1:8; ఆది. 39:7, 10; గల. 6:9)

    2. (బి) కొందరు “రాజు భుజించు భోజనము”గా పరిగణించే దానిలో నిమగ్నమయ్యేందుకు నేడు యౌవనస్థులు ఏ విధంగా శోధించబడవచ్చు లేదా ఒత్తిడికి గురికావచ్చు? (దాని. 1:8; సామె. 20:1; 2 కొరిం. 6:17-7:1)

    3. (సి) నలుగురు హీబ్రూ యువకులను గురించిన బైబిలు వృత్తాంతం, లౌకిక జ్ఞానాన్ని సంపాదించుకునే విషయానికి సంబంధించి ఏమి అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది? (దాని. 1:20; యెష. 54:13; 1 కొరిం. 3:18-20)

76వ కథ

యెరూషలేము నాశనం కావడం

  1. చిత్రంలో చూపించబడిన యెరూషలేముకు, ఇశ్రాయేలీయులకు ఏమి జరుగుతోంది?

  2. యెహెజ్కేలు ఎవరు, యెహోవా ఆయనకు ఎలాంటి దిగ్భ్రాంతికరమైన సంగతులను చూపించాడు?

  3. ఇశ్రాయేలీయులకు యెహోవాపట్ల గౌరవం లేదు కాబట్టి ఆయన ఏమని వాగ్దానం చేశాడు?

  4. ఇశ్రాయేలీయులు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత రాజైన నెబుకద్నెజరు ఏమి చేశాడు?

  5. ఇశ్రాయేలీయులు ఇలా ఘోరంగా నాశనం చేయబడేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు?

  6. ఇశ్రాయేలు దేశం ఎలా నిర్మానుష్యంగా తయారయ్యింది, అది ఎంతకాలం అలా ఉంది?

అదనపు ప్రశ్నలు:

  1. రెండవ రాజులు 25:1-26 చదవండి.

    1. (ఎ) సిద్కియా ఎవరు, ఆయనకు ఏమి జరిగింది, అది బైబిలు ప్రవచనాన్ని ఎలా నెరవేర్చింది? (2 రాజు. 25:5-7; యెహె. 12:13-15)

    2. (బి) ఇశ్రాయేలు చూపించిన అవిశ్వాసానికి యెహోవా ఎవరిని బాధ్యులుగా ఎంచాడు? (2 రాజు. 25:9, 11, 12, 18, 19; 2 దిన. 36:14, 17)

  2. యెహెజ్కేలు 8:1-18 చదవండి.

    మతభ్రష్టులై సూర్య ఆరాధకులుగా మారిన ఇశ్రాయేలీయులను క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా అనుకరిస్తోంది? (యెహె. 8:16; యెష. 5:20, 21; యోహా. 3:19-21; 2 తిమో. 4:3)

77వ కథ

వాళ్ళు సాగిలపడలేదు

  1. బబులోను రాజైన నెబుకద్నెజరు ప్రజలకు ఏమని ఆజ్ఞాపించాడు?

  2. దానియేలు ముగ్గురు స్నేహితులు బంగారు ప్రతిమ ముందు ఎందుకు సాగిలపడలేదు?

  3. నెబుకద్నెజరు ఆ ముగ్గురు హెబ్రీయులకు సాగిలపడడానికి మరో అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు యెహోవాపై తమ నమ్మకాన్ని ఎలా చూపించారు?

  4. నెబుకద్నెజరు తన మనుష్యులతో షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఏమి చేయించాడు?

  5. నెబుకద్నెజరు అగ్నిగుండములోకి చూసినప్పుడు ఆయనకు ఏమి కనిపించింది?

  6. రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడిని ఎందుకు స్తుతించాడు, వాళ్ళు మనకు ఏ విషయంలో ఉదాహరణగా ఉన్నారు?

అదనపు ప్రశ్నలు:

  1. దానియేలు 3:1-30 చదవండి.

    1. (ఎ) యథార్థతా పరీక్షలు ఎదురైనప్పుడు దేవుని సేవకులందరూ ముగ్గురు హెబ్రీ యువకులు ప్రదర్శించిన ఏ దృక్పథాన్ని అనుకరించాలి? (దాని. 3:17, 18; మత్త. 10:28; రోమా. 14:7, 8)

    2. (బి) యెహోవా దేవుడు నెబుకద్నెజరుకు ఏ ప్రాముఖ్యమైన పాఠం బోధించాడు? (దాని. 3:28, 29; 4:34, 35)

78వ కథ

గోడమీద చేతివ్రాత

  1. బబులోను రాజు గొప్ప విందు చేసుకోవడానికి యెరూషలేములోని యెహోవా ఆలయం నుండి తెచ్చిన పాత్రలను ఉపయోగించినప్పుడు ఏమి జరిగింది?

  2. బెల్షస్సరు తన జ్ఞానులందరినీ ఏమి అడిగాడు, కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయారు?

  3. రాజు తల్లి ఆయనకు ఏమి చేయమని చెప్పింది?

  4. దానియేలు, రాజుకు చెప్పినదాని ప్రకారం, దేవుడు గోడమీద వ్రాయడానికి చెయ్యిని ఎందుకు పంపించాడు?

  5. గోడమీద ఉన్న మాటల భావాన్ని దానియేలు ఎలా వివరించాడు?

  6. దానియేలు ఇంకా మాట్లాడుతుండగానే ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. దానియేలు 5:1-31 చదవండి.

    1. (ఎ) దైవిక భయానికి, బెల్షస్సరు గోడమీద చేతివ్రాత చూసినప్పుడు భయపడిన దానికి ఉన్న తేడాను వివరించండి. (దాని. 5:6, 7; కీర్త. 19:9; రోమా. 8:35-39)

    2. (బి) దానియేలు బెల్షస్సరుతో ఆయన అధిపతులతో మాట్లాడేటప్పుడు ఎలా గొప్ప ధైర్యాన్ని చూపించాడు? (దాని. 5:17, 18, 22, 26-28; అపొ. 4:29)

    3. (సి) దానియేలు 5వ అధ్యాయం యెహోవా విశ్వ సర్వాధిపత్యాన్ని ఎలా నొక్కిచెబుతోంది? (దాని. 4:17, 25; 5:21)

79వ కథ

సింహాల గుహలో దానియేలు

  1. దర్యావేషు ఎవరు, ఆయన దానియేలును ఎలా చూసేవాడు?

  2. అసూయపరులైన కొంతమంది దర్యావేషు ఏమి చేసేలా చేశారు?

  3. దానియేలు క్రొత్త శాసనం గురించి తెలుసుకున్నప్పుడు ఏమి చేశాడు?

  4. దర్యావేషు తాను నిద్రపోలేనంతగా ఎందుకు కలత చెందాడు, మరుసటి రోజు ఉదయం ఆయన ఏమి చేశాడు?

  5. దానియేలు దర్యావేషుకు ఎలా సమాధానం ఇచ్చాడు?

  6. దానియేలును చంపడానికి ప్రయత్నించిన చెడ్డవాళ్ళకు ఏమి జరిగింది, దర్యావేషు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఏమి వ్రాశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. దానియేలు 6:1-28 చదవండి.

    1. (ఎ) దానియేలుకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర, ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షుల పనిని అణచివేయడానికి వ్యతిరేకులు చేసినదానిని మనకు ఎలా గుర్తు చేస్తుంది? (దాని. 6:7; కీర్త. 94:20; యెష. 10:1; రోమా. 8:31)

    2. (బి) దేవుని సేవకులు నేడు “పై అధికారులకు” లోబడి ఉండడంలో దానియేలును ఎలా అనుకరించవచ్చు? (దాని. 6:5, 10; రోమా. 13:1; అపొ. 5:29)

    3. (సి) యెహోవాను “అనుదినము తప్పక” సేవించే విషయంలో దానియేలు ఉదాహరణను మనం ఎలా అనుకరించవచ్చు? (దాని. 6:16, 20; ఫిలి. 3:16; ప్రక. 7:15)

80వ కథ

దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్ళడం

  1. చిత్రంలో చూపించబడినట్లుగా ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

  2. యెషయా ద్వారా యెహోవా ప్రవచించిన దానిని కోరెషు ఎలా నెరవేర్చాడు?

  3. యెరూషలేముకు తిరిగి వెళ్ళలేని ఇశ్రాయేలీయులకు కోరెషు ఏమి చెప్పాడు?

  4. యెరూషలేముకు తిరిగి తీసుకువెళ్ళడానికి కోరెషు ప్రజలకు ఏమి ఇచ్చాడు?

  5. ఇశ్రాయేలీయులు యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది?

  6. ప్రజలు లేకుండా యెరూషలేము నిర్మానుష్యంగా ఉండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి?

అదనపు ప్రశ్నలు:

  1. యెషయా 44:28; 45:1-4 చదవండి.

    1. (ఎ) కోరెషు గురించిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుందని యెహోవా ఎలా నొక్కిచెప్పాడు? (యెష. 55:10, 11; రోమా. 4:17)

    2. (బి) కోరెషుకు సంబంధించిన యెషయా ప్రవచనం, యెహోవా దేవునికున్న భవిష్యత్తును చెప్పగల శక్తి గురించి ఏమి చూపిస్తోంది? (యెష. 42:9; 45:21; 46:10, 11; 2 పేతు. 1:20)

  2. ఎజ్రా 1:1-11 చదవండి.

    యెరూషలేముకు తిరిగి వెళ్ళలేకపోయిన వారి మాదిరిని అనుసరిస్తూ, నేడు మనం పూర్తికాల సేవలో ప్రవేశించగలవారికి ఎలా ‘సహాయం చేయవచ్చు’? (ఎజ్రా 1:4, 6; రోమా. 12:13; కొలొ. 4:12)

81వ కథ

దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

  1. బబులోను నుండి యెరూషలేముకు ఎంతమంది ప్రజలు తిరిగి వెళ్ళారు, వాళ్ళు అక్కడకు చేరుకున్న తర్వాత ఏమి చూశారు?

  2. ఇశ్రాయేలీయులు అక్కడికి చేరుకున్న తర్వాత ఏమి నిర్మించడం ప్రారంభించారు, కానీ వాళ్ళ శత్రువులు ఏమి చేశారు?

  3. హగ్గయి, జెకర్యా ఎవరు, వాళ్ళు ప్రజలకు ఏమి చెప్పారు?

  4. తత్తెనై బబులోనుకు ఏమని ఉత్తరం పంపించాడు, ఆయనకు ఏమి సమాధానం వచ్చింది?

  5. దేవుని ఆలయాన్ని మరమ్మతు చేయవలసిన అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు ఎజ్రా ఏమి చేశాడు?

  6. చిత్రంలో ఎజ్రా దేని కోసం ప్రార్థిస్తున్నాడు, ఆయన ప్రార్థనకు ఎలా సమాధానం లభించింది, ఇది మనకు ఏమి బోధిస్తోంది?

అదనపు ప్రశ్నలు:

  1. ఎజ్రా 3:1-13 చదవండి.

    ఎప్పుడైనా మనం దేవుని ప్రజల సంఘంలేని ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే మనం ఏమి చేస్తూనే ఉండాలి? (ఎజ్రా 3:3, 6; అపొ. 17:16, 17; హెబ్రీ. 13:15)

  2. ఎజ్రా 4:1-7 చదవండి.

    మిశ్రమ విశ్వాసానికి సంబంధించి జెరుబ్బాబెలు యెహోవా ప్రజలకు ఏ మాదిరి ఉంచాడు? (నిర్గ. 34:12; 1 కొరిం. 15:33; 2 కొరిం. 6:14-17)

  3. ఎజ్రా 5:1-5, 17; 6:1-22 చదవండి.

    1. (ఎ) ఆలయ నిర్మాణ పనిని వ్యతిరేకులు ఎందుకు ఆపలేకపోయారు? (ఎజ్రా 5:5; యెష. 54:17)

    2. (బి) యూదుల్లోని పెద్దలు తీసుకున్న చర్య, వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు యెహోవా మార్గదర్శకం కోసం వెదకాలని క్రైస్తవ పెద్దలను ఎలా ప్రోత్సహిస్తోంది? (ఎజ్రా 6:14; కీర్త. 32:8; రోమా. 8:31; యాకో. 1:5)

  4. ఎజ్రా 8:21-23, 28-36 చదవండి.

    మనం ఏదైనా చర్య తీసుకునే ముందు ఎజ్రా ఉంచిన ఏ మాదిరిని అనుకరించడం మంచిది? (ఎజ్రా 8:23; కీర్త. 127:1; సామె. 10:22; యాకో. 4:13-15)

82వ కథ

మొర్దెకై, ఎస్తేరు

  1. మొర్దెకై, ఎస్తేరు ఎవరు?

  2. అహష్వేరోషు రాజుకు క్రొత్త భార్య ఎందుకు అవసరమైంది, ఆయన ఎవరిని ఎంపిక చేసుకున్నాడు?

  3. హామాను ఎవరు, ఆయనకు ఎందుకు కోపం వచ్చింది?

  4. ఏ శాసనం రూపొందించబడింది, మొర్దెకై నుండి వర్తమానం అందిన తర్వాత ఎస్తేరు ఏమి చేసింది?

  5. హామానుకు ఏమి జరిగింది, మొర్దెకైకి ఏమి జరిగింది?

  6. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల నుండి ఎలా రక్షించబడ్డారు?

అదనపు ప్రశ్నలు:

  1. ఎస్తేరు 2:12-18 చదవండి.

    ‘సాధువైన, మృదువైన గుణాన్ని’ అలవరచుకోవడం విలువైనదని ఎస్తేరు ఎలా చూపించింది? (ఎస్తే. 2:15; 1 పేతు. 3:1-5)

  2. ఎస్తేరు 4:1-17 చదవండి.

    సత్యారాధన పక్షాన చర్య తీసుకోవడానికి ఎస్తేరుకు ఒక అవకాశం ఇవ్వబడినట్లే, యెహోవాకు మన భక్తి యథార్థతలను వ్యక్తం చేయడానికి మనకు నేడు ఏ అవకాశం ఇవ్వబడుతోంది? (ఎస్తే. 4:13, 14; మత్త. 5:14-16; 24:14)

  3. ఎస్తేరు 7:1-6 చదవండి.

    ఎస్తేరులాగే నేడు చాలామంది దేవుని ప్రజలు ఎలా హింస అనుభవించడానికి వెనుకాడడంలేదు? (ఎస్తే. 7:4; మత్త. 10:16-22; 1 పేతు. 2:12)

83వ కథ

యెరూషలేము గోడలు

  1. తమ నగరమైన యెరూషలేము చుట్టూ గోడలు లేకపోవడం గురించి ఇశ్రాయేలీయులు ఎలా భావించారు?

  2. నెహెమ్యా ఎవరు?

  3. నెహెమ్యా ఏ పని చేసేవాడు, అది ఎందుకు ప్రాముఖ్యమైనది?

  4. ఏ వార్త నెహెమ్యాను బాధపెట్టింది, ఆయనేమి చేశాడు?

  5. అర్తహషస్త రాజు నెహెమ్యాపట్ల ఎలా దయ చూపించాడు?

  6. ఇశ్రాయేలీయుల శత్రువులు నిర్మాణ పనిని ఆపలేని విధంగా నెహెమ్యా ఎలా ఏర్పాటు చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. నెహెమ్యా 1:4-6; 2:1-20 చదవండి.

    నెహెమ్యా యెహోవా మార్గదర్శకం కోసం ఎలా వెదికాడు? (నెహె. 2:4, 5; రోమా. 12:12; 1 పేతు. 4:7)

  2. నెహెమ్యా 3:3-5 చదవండి.

    తెకోవీయులకు వారి ‘అధికారులకు’ మధ్యవున్న తేడా నుండి పెద్దలు, పరిచర్య సేవకులు ఏమి నేర్చుకోవచ్చు? (నెహె. 3:5, 27; 2 థెస్స. 3:7-10; 1 పేతు. 5:5)

  3. నెహెమ్యా 4:1-23 చదవండి.

    1. (ఎ) తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ నిర్మాణ పని కొనసాగించడానికి ఇశ్రాయేలీయులను ఏమి పురికొల్పింది? (నెహె. 4:6, 8, 9; కీర్త. 50:15; యెష. 65:13, 14)

    2. (బి) ఇశ్రాయేలీయుల మాదిరి మనల్ని నేడు ఎలా ప్రోత్సహిస్తుంది?

  4. నెహెమ్యా 6:15 చదవండి.

    యెరూషలేము గోడలు రెండు నెలల్లోనే పూర్తి కావడం, విశ్వాసం ఎంత శక్తివంతమైనదో ఎలా చూపిస్తోంది? (కీర్త. 56:3, 4; మత్త. 17:20; 19:26)

84వ కథ

ఒక దూత మరియను దర్శించడం

  1. చిత్రంలోని స్త్రీ ఎవరు?

  2. గబ్రియేలు మరియకు ఏమి చెప్పాడు?

  3. మరియ ఒక పురుషునితో జీవించకపోయినా బిడ్డను కంటుందని గబ్రియేలు ఎలా వివరించాడు?

  4. మరియ తన బంధువు అయిన ఎలీసబెతును దర్శించినప్పుడు ఏమి జరిగింది?

  5. మరియకు బిడ్డ పుట్టబోతోందని యోసేపుకు తెలిసినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, కానీ ఆయన తన మనసు ఎందుకు మార్చుకున్నాడు?

అదనపు ప్రశ్నలు:

  1. లూకా 1:26-56 చదవండి.

    1. (ఎ) దేవుని కుమారుని జీవం ఆత్మ సామ్రాజ్యం నుండి బదిలీ చేయబడినప్పుడు మరియ అండంలో ఆదాము సంబంధిత అపరిపూర్ణత ఉండగల సాధ్యత గురించి లూకా 1:35 ఏమి సూచిస్తోంది? (హగ్గ. 2:11-13; యోహా. 6:69; హెబ్రీ. 7:26; 10:5)

    2. (బి) యేసు తన జననానికి ముందు ఎలా ఘనత పొందాడు? (లూకా 1:41-43)

    3. (సి) నేడు ప్రత్యేక సేవాధిక్యతలను పొందే క్రైస్తవుల కోసం మరియ ఎలాంటి చక్కని మాదిరిని ఉంచింది? (లూకా 1:38, 46-49; 17:10; సామె. 11:2)

  2. మత్తయి 1:18-25 చదవండి.

    యేసుకు ఇమ్మానుయేలు అనే వ్యక్తిగత నామం ఇవ్వబడకపోయినా మానవునిగా ఆయన పాత్ర ఆ నామ భావాన్ని ఎలా నెరవేర్చింది? (మత్త. 1:22, 23; యోహా. 14:8-10; హెబ్రీ. 1:1-3)

85వ కథ

యేసు పశువుల కొట్టంలో జన్మించడం

  1. చిత్రంలోని పసిబిడ్డ ఎవరు, మరియ ఆ బాబును ఎక్కడ పడుకోబెట్టింది?

  2. యేసు జంతువులతోపాటు కొట్టంలో ఎందుకు జన్మించాడు?

  3. చిత్రంలో కొట్టంలోకి ప్రవేశిస్తున్న వ్యక్తులు ఎవరు, దేవదూత వారికి ఏమి చెప్పాడు?

  4. యేసు ఎందుకు ప్రత్యేకమైనవాడు?

  5. యేసును దేవుని కుమారుడు అని ఎందుకు పిలువవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. లూకా 2:1-20 చదవండి.

    1. (ఎ) యేసు జననానికి సంబంధించిన ప్రవచనం నెరవేరడంలో కైసరు ఔగుస్తు ఏ పాత్ర వహించాడు? (లూకా 2:1-4; మీకా 5:2)

    2. (బి) ఒక వ్యక్తి ‘దేవునికిష్టులైన మనుష్యులలో’ ఎలా లెక్కించబడగలడు? (లూకా 2:14; మత్త. 16:24; యోహా. 17:3; అపొ. 3:19; హెబ్రీ. 11:6)

    3. (సి) దీనులైన యూదా గొఱ్ఱెల కాపరులు రక్షకుడు జన్మించాడని ఆనందించారు, నేడు దేవుని సేవకులు ఆనందించడానికి ఏ గొప్ప కారణం ఉంది? (లూకా 2:10, 11; ఎఫె. 3:8, 9; ప్రక. 11:15; 14:6)

86వ కథ

నక్షత్రం ద్వారా నడిపించబడిన మనుష్యులు

  1. చిత్రంలోని వ్యక్తులు ఎవరు, వారిలో ఒక వ్యక్తి ప్రకాశమానమైన నక్షత్రంవైపు ఎందుకు వ్రేలు చూపిస్తున్నాడు?

  2. హేరోదు రాజు ఎందుకు వ్యాకులపడ్డాడు, ఆయనేమి చేశాడు?

  3. ఆ ప్రకాశమానమైన నక్షత్రం ఆ వ్యక్తులను ఎక్కడికి నడిపించింది, కానీ వాళ్ళు మరో మార్గం గుండా తమ దేశానికి ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు?

  4. హేరోదు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకు?

  5. యెహోవా యోసేపుకు ఏమి చేయమని చెప్పాడు?

  6. ఆ నక్షత్రం ప్రకాశించేలా ఎవరు చేశారు, ఎందుకు?

అదనపు ప్రశ్న:

  1. మత్తయి 2:1-23 చదవండి.

    జ్ఞానులు యేసును సందర్శించేనాటికి ఆయన వయస్సు ఎంత, అప్పుడు ఆయనెక్కడ జీవిస్తున్నాడు? (మత్త. 2:1, 11, 16)

87వ కథ

దేవాలయంలో బాల యేసు

  1. చిత్రంలోవున్న యేసు వయసెంత, ఆయన ఎక్కడ ఉన్నాడు?

  2. యోసేపు ప్రతి సంవత్సరం తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళేవాడు?

  3. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత యోసేపు, మరియ మళ్ళీ యెరూషలేముకు ఎందుకు వచ్చారు?

  4. యోసేపు, మరియలకు యేసు ఎక్కడ కనిపించాడు, అక్కడున్న వాళ్ళంతా ఎందుకు ఆశ్చర్యపోయారు?

  5. యేసు తన తల్లియైన మరియతో ఏమి అన్నాడు?

  6. దేవుని గురించి నేర్చుకోవడంలో మనం యేసువలే ఎలా ఉండవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. లూకా 2:41-52 చదవండి.

    1. (ఎ) ధర్మశాస్త్రం ప్రకారం కేవలం పురుషులే వార్షిక పండుగలకు హాజరు కావలసి ఉన్నా యోసేపు, మరియ నేటి తల్లిదండ్రుల కోసం ఎలాంటి చక్కని మాదిరిని ఉంచారు? (లూకా 2:41; ద్వితీ. 16:16; 31:12; సామె. 22:6)

    2. (బి) పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండే విషయంలో యేసు ఎలా ఒక మంచి మాదిరిని ఉంచాడు? (లూకా 2:51; ద్వితీ. 5:16; సామె. 23:22; కొలొ. 3:20)

  2. మత్తయి 13:53-56 చదవండి.

    యేసు సహోదరులలో ఏ నలుగురి పేర్లు బైబిలులో ఉన్నాయి, వాళ్ళలో ఇద్దరు తర్వాత క్రైస్తవ సంఘంలో ఎలా ఉపయోగించుకోబడ్డారు? (మత్త. 13:55; అపొ. 12:17; 15:6, 13; 21:18; గల. 1:19; యాకో. 1:1; యూదా 1)

88వ కథ

యోహాను యేసుకు బాప్తిస్మమివ్వడం

  1. చిత్రంలోని ఇద్దరు వ్యక్తులు ఎవరు?

  2. ఒక వ్యక్తి ఎలా బాప్తిస్మం పొందుతాడు?

  3. యోహాను సాధారణంగా ఎవరికి బాప్తిస్మం ఇచ్చేవాడు?

  4. యేసు ఏ ప్రత్యేకమైన కారణం కోసం తనకు బాప్తిస్మమివ్వమని యోహానును అడిగాడు?

  5. యేసు బాప్తిస్మం తీసుకోవడం తనకు సంతోషం కలిగించిందని దేవుడు ఎలా చూపించాడు?

  6. యేసు 40 రోజులు ఏకాంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమి జరిగింది?

  7. యేసు మొదటి అనుచరుల్లో లేదా శిష్యుల్లో కొంతమంది ఎవరు, ఆయన చేసిన మొదటి అద్భుతం ఏమిటి?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 3:13-17 చదవండి.

    యేసు తన శిష్యుల బాప్తిస్మం కోసం ఎలాంటి ప్రమాణం ఉంచాడు? (కీర్త. 40:7, 8; మత్త. 28:19, 20; లూకా 3:21, 22)

  2. మత్తయి 4:1-11 చదవండి.

    యేసు సమర్థవంతంగా లేఖనాలను ఉపయోగించడం, క్రమంగా బైబిలును అధ్యయనం చేయడానికి మనలను ఎలా ప్రోత్సహిస్తోంది? (మత్త. 4:5-7; 2 పేతు. 3:17, 18; 1 యోహా. 4:1)

  3. యోహాను 1:29-51 చదవండి.

    బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులను ఎవరి దగ్గరకు పంపించాడు, నేడు మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు? (యోహా. 1:29, 35, 36; 3:30; మత్త. 23:10)

  4. యోహాను 2:1-12 చదవండి.

    యెహోవా తన సేవకులకు మేలైనదేదీ దొరక్కుండా చేయడని యేసు చేసిన మొదటి అద్భుతం ఎలా చూపించింది? (యోహా. 2:9, 10; కీర్త. 84:11; యాకో. 1:17)

89వ కథ

యేసు దేవాలయాన్ని శుభ్రపరచడం

  1. దేవాలయంలో జంతువులు ఎందుకు అమ్మబడేవి?

  2. యేసుకు ఎందుకు కోపం వచ్చింది?

  3. మీకు చిత్రంలో కనిపిస్తున్నట్లుగా యేసు ఏమి చేశాడు, పావురాలను అమ్ముకునే వ్యక్తులకు ఆయన ఏమని ఆజ్ఞాపించాడు?

  4. యేసు చేస్తున్నదానిని ఆయన అనుచరులు చూసినప్పుడు, వాళ్ళు దేనిని జ్ఞాపకం చేసుకున్నారు?

  5. యేసు గలిలయకు వెళ్ళేటప్పుడు ఏ జిల్లాగుండా వెళ్ళాడు?

అదనపు ప్రశ్న:

  1. యోహాను 2:13-25 చదవండి.

    ఆలయంలోవున్న రూకలు మార్చేవారిపై యేసు కోపం తెచ్చుకోవడాన్ని బట్టి చూస్తే, రాజ్యమందిరంలో వ్యాపార సంబంధ కార్యకలాపాలు చేయడాన్ని మనమెలా దృష్టించాలి? (యోహా. 2:15, 16; 1 కొరిం. 10:24, 31-33)

90వ కథ

బావి దగ్గర స్త్రీతో మాట్లాడడం

  1. యేసు సమరయలో ఒక బావిదగ్గర ఎందుకు ఆగాడు, ఆయన అక్కడకు వచ్చిన స్త్రీతో ఏమి మాట్లాడాడు?

  2. ఆ స్త్రీ ఎందుకు ఆశ్చర్యపోయింది, యేసు ఆమెకు ఏమి చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు?

  3. యేసు ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడని ఆ స్త్రీ అనుకుంది, అయితే నిజానికి ఆయన ఏ నీళ్ళ గురించి మాట్లాడాడు?

  4. యేసుకు తన గురించి తెలిసిన విషయాలు విన్నప్పుడు ఆమె ఎందుకు ఆశ్చర్యపోయింది, ఆయనకు ఆ విషయాలు ఎలా తెలిశాయి?

  5. బావి దగ్గర స్త్రీ కథనుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. యోహాను 4:5-43 చదవండి.

    1. (ఎ) యేసు మాదిరిని అనుసరిస్తూ మనం వేరే జాతికి లేదా వేరే సామాజిక నేపథ్యానికి చెందిన ప్రజలపట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించాలి? (యోహా. 4:9; 1 కొరిం. 9:22; 1 తిమో. 2:3, 4; తీతు 2:11)

    2. (బి) యేసు శిష్యుడైన వ్యక్తికి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి? (యోహా. 4:14; యెష. 58:11; 2 కొరిం. 4:16)

    3. (సి) తాను తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడానికి తొందరపడిన సమరయ స్త్రీ చూపించినటువంటి మెప్పుదలను మనం ఎలా చూపించవచ్చు? (యోహా. 4:7, 28; మత్త. 6:33; లూకా 10:40-42)

91వ కథ

యేసు కొండమీద బోధించడం

  1. చిత్రంలో యేసు ఎక్కడ బోధిస్తున్నాడు, ఆయనకు దగ్గరగా కూర్చొని ఉన్నవాళ్ళు ఎవరు?

  2. పన్నెండు మంది అపొస్తలుల పేర్లేమిటి?

  3. యేసు ఏ రాజ్యం గురించి ప్రకటించాడు?

  4. ఏ విషయాల గురించి ప్రార్థించమని యేసు ప్రజలకు బోధించాడు?

  5. ప్రజలు ఒకరిపట్ల ఒకరు ఎలా ఉండాలని యేసు బోధించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 5:1-12 చదవండి.

    మనం మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించామని ఏయే విధాలుగా చూపించవచ్చు? (మత్త. 5:3; రోమా. 10:13-15; 1 తిమో. 4:13, 15, 16)

  2. మత్తయి 5:21-26 చదవండి.

    మనకు మన సహోదరులతో ఉన్న సంబంధం, దేవునితో మనకున్న సంబంధంపై ప్రభావం చూపిస్తుందని మత్తయి 5:23, 24 ఎలా నొక్కి చెబుతోంది? (మత్త. 6:14, 15; కీర్త. 133:1; కొలొ. 3:13; 1 యోహా. 4:20)

  3. మత్తయి 6:1-8 చదవండి.

    క్రైస్తవులు త్యజించవలసిన స్వనీతితో కూడిన కొన్ని పనులు ఏమిటి? (లూకా 18:11, 12; 1 కొరిం. 4:6, 7; 2 కొరిం. 9:7)

  4. మత్తయి 6:25-34 చదవండి.

    మన భౌతిక అవసరాల కోసం యెహోవాపై నమ్మకముంచే విషయానికి సంబంధించి యేసు ఏమి బోధించాడు? (నిర్గ. 16:4; కీర్త. 37:25; ఫిలి. 4:6)

  5. మత్తయి 7:1-11 చదవండి.

    మత్తయి 7:5లోని ఉపమానం మనకు ఏమి బోధిస్తోంది? (సామె. 26:12; రోమా. 2:1; 14:10; యాకో. 4:11, 12)

92వ కథ

యేసు మృతులను లేపడం

  1. చిత్రంలోని అమ్మాయి తండ్రి ఎవరు, ఆయనా ఆయన భార్య ఎందుకు కలతపడ్డారు?

  2. యాయీరు యేసును చూసినప్పుడు ఏమి చేశాడు?

  3. యేసు యాయీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమి జరిగింది, దారిలో యాయీరుకు ఏ సందేశం అందింది?

  4. యాయీరు ఇంట్లోని ప్రజలు యేసు మాటలు విని ఎందుకు నవ్వారు?

  5. ముగ్గురు అపొస్తలులను, అమ్మాయి తల్లిదండ్రులను అమ్మాయి గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత యేసు ఏమి చేశాడు?

  6. యేసు ఇంకా ఎవరిని మృతులలోనుండి లేపాడు, అది ఏమి చూపిస్తోంది?

అదనపు ప్రశ్నలు:

  1. లూకా 8:40-56 చదవండి.

    రక్తస్రావంగల స్త్రీతో యేసు దయాపూర్వకంగా, సహేతుకంగా ఎలా ప్రవర్తించాడు, దానినుండి నేడు క్రైస్తవ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు? (లూకా 8:43, 44, 47, 48; లేవీ. 15:25-27; మత్త. 9:12, 13; కొలొ. 3:12-14)

  2. లూకా 7:11-17 చదవండి.

    ప్రియమైనవారిని పోగొట్టుకొన్నవారు, యేసు నాయీనుకు చెందిన విధవరాలితో అన్న మాటలనుండి ఓదార్పును ఎందుకు పొందవచ్చు? (లూకా 7:13; 2 కొరిం. 1:3, 4; హెబ్రీ. 4:15)

  3. యోహాను 11:17-44 చదవండి.

    ప్రియమైనవారు చనిపోతే దుఃఖించడం సహజమేనని యేసు ఎలా చూపించాడు? (యోహా. 11:33-36, 38; 2 సమూ. 18:33; 19:1-4)

93వ కథ

యేసు అనేకమందికి ఆహారం పెట్టడం

  1. బాప్తిస్మమిచ్చు యోహానుకు ఏ ఘోరమైన సంగతి జరిగింది, అది విన్నప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు?

  2. తనను వెంబడించి వచ్చిన ప్రజలకు యేసు ఎలా ఆహారం పెట్టాడు, ఎంత ఆహారం మిగిలిపోయింది?

  3. రాత్రివేళ శిష్యులు ఎందుకు భయపడ్డారు, పేతురుకు ఏమి జరిగింది?

  4. యేసు రెండవసారి కూడా వేలాదిమందికి ఎలా ఆహారం పెట్టాడు?

  5. దేవుని రాజుగా యేసు భూమిని పరిపాలించే సమయం ఎందుకు అద్భుతంగా ఉంటుంది?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 14:1-32 చదవండి.

    1. (ఎ) మత్తయి 14:23-32 వచనాలు పేతురు వ్యక్తిత్వం గురించి మనకేమి తెలియజేస్తున్నాయి?

    2. (బి) పేతురు తొందరపాటుతో ప్రవర్తించే లక్షణాన్ని అధిగమించి పరిణతి సాధించాడని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి? (మత్త. 14:27-30; యోహా. 18:10; 21:7; అపొ. 2:14, 37-40; 1 పేతు. 5:6, 10)

  2. మత్తయి 15:29-38 చదవండి.

    తన తండ్రి దయచేసిన భౌతిక విషయాలకు యేసు ఎలా గౌరవం చూపించాడు? (మత్త. 15:37; యోహా. 6:12; కొలొ. 3:15)

  3. యోహాను 6:1-21 చదవండి.

    ప్రభుత్వాలకు సంబంధించి నేడు క్రైస్తవులు యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (యోహా. 6:15; మత్త. 22:21; రోమా. 12:2; 13:1-4)

94వ కథ

ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం

  1. దూర ప్రయాణం చేసి తిరిగివస్తున్నప్పుడు అపొస్తలులు దేని గురించి వాదించుకున్నారు?

  2. యేసు ఒక చిన్న పిల్లవాడిని పిలిచి అపొస్తలుల ఎదుట ఎందుకు నిలబెట్టాడు?

  3. అపొస్తలులు ఏ విధంగా పిల్లలుగా ఉండడం నేర్చుకోవాల్సి వచ్చింది?

  4. కొన్ని నెలల తర్వాత, యేసు తనకు పిల్లలంటే ఇష్టమని ఎలా చూపించాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 18:1-4 చదవండి.

    యేసు బోధించడానికి ఉపమానాలు ఎందుకు ఉపయోగించాడు? (మత్త. 13:34, 36; మార్కు 4:33, 34)

  2. మత్తయి 19:13-15 చదవండి.

    మనకు రాజ్య ఆశీర్వాదాలు లభించాలంటే మనం చిన్న పిల్లల్లోని ఏ లక్షణాలను అనుకరించాలి? (కీర్త. 25:9; 138:6; 1 కొరిం. 14:20)

  3. మార్కు 9:33-37 చదవండి.

    ప్రముఖ స్థానాలు కావాలని కోరుకోవడం గురించి యేసు తన శిష్యులకు ఏమి బోధించాడు? (మార్కు 9:35; మత్త. 20:25, 26; గల. 6:3; ఫిలి. 2:5-8)

  4. మార్కు 10:13-16 చదవండి.

    యేసు ఎంత సమీపించదగిన వ్యక్తిగా ఉండేవాడు, ఆయన మాదిరి నుండి క్రైస్తవ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు? (మార్కు 6:30-34; ఫిలి. 2:1-4; 1 తిమో. 4:12)

95వ కథ

యేసు బోధించే విధానం

  1. ఒక వ్యక్తి యేసును ఏ ప్రశ్న అడిగాడు, ఎందుకు అడిగాడు?

  2. యేసు బోధించడానికి కొన్నిసార్లు ఏమి ఉపయోగించేవాడు, మనం యూదుల మరియు సమరయుల గురించి ఇప్పటికే ఏమి నేర్చుకున్నాము?

  3. యేసు చెప్పిన కథలో, యెరికోకు వెళ్ళే మార్గంలో ప్రయాణిస్తున్న యూదునికి ఏమి జరిగింది?

  4. ఆ మార్గంలో ఒక యూదా యాజకుడు, లేవీయుడు వెళ్ళినప్పుడు ఏమి జరిగింది?

  5. చిత్రంలో గాయపడివున్న యూదునికి ఎవరు సహాయం చేస్తున్నారు?

  6. యేసు కథ చెప్పడం ముగించిన తర్వాత ఏ ప్రశ్న అడిగాడు, ఆ వ్యక్తి ఏమని సమాధానమిచ్చాడు?

అదనపు ప్రశ్నలు:

  1. లూకా 10:25-37 చదవండి.

    1. (ఎ) సూటిగా సమాధానం చెప్పే బదులు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన ఒక వ్యక్తి ఒక విషయం గురించి తర్కించడానికి యేసు ఎలా సహాయం చేశాడు? (లూకా 10:26; మత్త. 16:13-16)

    2. (బి) తన శ్రోతలకు ముందే ఉన్న అభిప్రాయాలను చెరిపివేయడానికి యేసు ఉపమానాలను ఎలా ఉపయోగించాడు? (లూకా 10:36, 37; 18:9-14; తీతు 1:9)

96వ కథ

యేసు రోగులను స్వస్థపరచడం

  1. యేసు దేశమంతటా సంచరిస్తూ ఏమి చేశాడు?

  2. యేసు బాప్తిస్మం పొంది మూడు సంవత్సరాలు గడిచాక తన అపొస్తలులకు ఏమి చేయమని చెప్పాడు?

  3. చిత్రంలోని వ్యక్తులు ఎవరు, యేసు ఆ స్త్రీ కోసం ఏమి చేశాడు?

  4. మతనాయకులు అభ్యంతరం చెప్పినప్పుడు యేసు వారికి ఇచ్చిన సమాధానం, వాళ్ళు అవమానంతో తలవంచుకునేలా ఎందుకు చేసింది?

  5. యేసు తన అపొస్తలులతోపాటు యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యేసు ఇద్దరు గ్రుడ్డివాళ్ళ కోసం ఏమి చేశాడు?

  6. యేసు అద్భుతాలు ఎందుకు చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 15:30, 31 చదవండి.

    యెహోవా యేసు ద్వారా తన శక్తిని ఎలా అద్భుతంగా ప్రదర్శించాడు, యెహోవా నూతనలోకం కోసం వాగ్దానం చేసినవాటిని ఎలా అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయం చేయాలి? (కీర్త. 37:29; యెష. 33:24)

  2. లూకా 13:10-17 చదవండి.

    యేసు అత్యంత అసాధారణమైన అద్భుతకార్యాలను కొన్నింటిని విశ్రాంతి దినాన చేశాడనే వాస్తవం, ఆయన తన వెయ్యేండ్ల పరిపాలనలో మానవజాతికి తీసుకురాబోయే ఉపశమనం ఎలా ఉంటుందని చూపిస్తోంది? (లూకా 13:10-13; కీర్త. 46:9; మత్త. 12:8; కొలొ. 2:16, 17; ప్రక. 21:1-4)

  3. మత్తయి 20:29-34 చదవండి.

    యేసు ప్రజలకు సహాయం చేయలేనంత పని రద్దీతో ఉండేవాడు కాదని ఈ వృత్తాంతం ఎలా చూపిస్తోంది, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (ద్వితీ. 15:7; యాకో. 2:15, 16; 1 యోహా. 3:17)

97వ కథ

యేసు రాజుగా రావడం

  1. యేసు యెరూషలేము దగ్గర్లోని చిన్న గ్రామానికి వచ్చినప్పుడు, ఏమి చేయమని తన శిష్యులకు చెప్పాడు?

  2. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, యేసు యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు ఏమి జరిగింది?

  3. యేసు గుడ్డివాళ్ళను, అంగవిహీనులను బాగుచేయడం చూసినప్పుడు చిన్న పిల్లలు ఏమి చేశారు?

  4. కోపంతోవున్న యాజకులకు యేసు ఏమని చెప్పాడు?

  5. మనం యేసును స్తుతించిన పిల్లలవలే ఎలా ఉండవచ్చు?

  6. శిష్యులు ఏమి తెలుసుకోవాలని కోరుకున్నారు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 21:1-17 చదవండి.

    1. (ఎ) యేసు రాజుగా యెరూషలేములోకి వచ్చిన విధానానికి, రోమా కాలంలో ఆక్రమణ చేసే అధిపతులు ప్రవేశించే విధానానికి ఏ తేడా ఉంది? (మత్త. 21:4, 5; జెక. 9:9; ఫిలి. 2:5-8; కొలొ. 2:13)

    2. (బి) యేసు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు 118వ కీర్తనలోనుండి ఉటంకించిన హీబ్రూ అబ్బాయిలనుండి యౌవనస్థులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (మత్త. 21:9, 15; కీర్త. 118:25, 26; 2 తిమో. 3:15; 2 పేతు. 3:18)

  2. యోహాను 12:12-16 చదవండి.

    యేసును రాజుగా స్తుతించిన ప్రజలు ఖర్జూర కొమ్మలను ఉపయోగించడం దేనిని సూచిస్తోంది? (యోహా. 12:13; ఫిలి. 2:10; ప్రక. 7:9, 10)

98వ కథ

ఒలీవ కొండమీద

  1. చిత్రంలో, యేసు ఎవరు, ఆయనతోపాటు ఎవరున్నారు?

  2. యాజకులు ఆలయంలో యేసును ఏమి చేయడానికి ప్రయత్నించారు, ఆయన వాళ్ళకేమి చెప్పాడు?

  3. అపొస్తలులు యేసును ఏమి అడిగారు?

  4. యేసు తాను పరలోకంలో రాజుగా పరిపాలించేటప్పుడు భూమిపై జరిగే కొన్ని విషయాల గురించి తన అపొస్తలులకు ఎందుకు చెప్పాడు?

  5. భూమిపైవున్న దుష్టత్వాన్ని తాను నిర్మూలించడానికి ముందు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 23:1-39 చదవండి.

    1. (ఎ) లౌకిక బిరుదులను ఉపయోగించడం సముచితంగా ఉండవచ్చు అని లేఖనాలు సూచించినప్పటికీ, మత్తయి 23:8-11లోని యేసు మాటలు క్రైస్తవ సంఘంలో పొగడ్తలతో కూడిన బిరుదులు ఉపయోగించడాన్ని గురించి ఏమి చూపిస్తున్నాయి? (అపొ. 26:25; రోమా. 13:7; 1 పేతు. 2:13, 14)

    2. (బి) ప్రజలు క్రైస్తవులు కాకుండా ఆపేందుకు ప్రయత్నించడానికి పరిసయ్యులు ఏమి ఉపయోగించారు, ఆధునిక కాలాల్లోని మతనాయకులు కూడా అలాంటి పన్నాగాలనే ఎలా ఉపయోగించారు? (మత్త. 23:13; లూకా 11:52; యోహా. 9:22; 12:42; 1 థెస్స. 2:16)

  2. మత్తయి 24:1-14 చదవండి.

    1. (ఎ) మత్తయి 24:13లో సహించడం యొక్క ప్రాముఖ్యత ఎలా నొక్కి చెప్పబడింది?

    2. (బి) మత్తయి 24:13లోని “అంతము” అనే మాటకు అర్థమేమిటి? (మత్త. 16:27; రోమా. 14:10-12; 2 కొరిం. 5:10)

  3. మార్కు 13:3-10 చదవండి.

    సువార్తను ప్రకటించడం అత్యవసరమైన పనని మార్కు 13:10లోని ఏ పదం చూపిస్తోంది, యేసు మాటలు మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? (రోమా. 13:11, 12; 1 కొరిం. 7:29-31; 2 తిమో. 4:2)

99వ కథ

మేడ గదిలో

  1. చిత్రంలో చూపించబడినట్లు, యేసు ఆయన 12 మంది అపొస్తలులు మేడ గదిలో ఎందుకున్నారు?

  2. గదిలోనుండి వెళ్ళిపోతున్న వ్యక్తి ఎవరు, ఆయన ఏమి చేశాడు?

  3. పస్కా భోజనం అయిపోయిన తర్వాత యేసు ఏ ప్రత్యేకమైన భోజనాన్ని ప్రారంభించాడు?

  4. పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు ఏమి గుర్తు చేసేది, ఈ ప్రత్యేకమైన భోజనం యేసు అనుచరులకు ఏమి గుర్తు చేసింది?

  5. ప్రభువు రాత్రి భోజనం తర్వాత యేసు తన అనుచరులకు ఏమి చెప్పాడు, వాళ్ళేమి చేశారు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 26:14-30 చదవండి.

    1. (ఎ) యూదా యేసును మోసం చేయడం ఉద్దేశపూరితంగా చేయబడిన చర్య అని మత్తయి 26:15 ఎలా చూపిస్తోంది?

    2. (బి) యేసు చిందించిన రక్తం ద్వారా ఏ రెండు భాగాలుగల సంకల్పం నెరవేరింది? (మత్త. 26:27, 28; యిర్మీ. 31:31-33; ఎఫె. 1:7; హెబ్రీ. 9:19, 20)

  2. లూకా 22:1-39 చదవండి.

    సాతాను ఏ భావంలో యూదాలోకి ప్రవేశించాడు? (లూకా 22:3; యోహా. 13:2; అపొ. 1:24, 25)

  3. యోహాను 13:1-20 చదవండి.

    1. (ఎ) యోహాను 13:2లోని వృత్తాంతం దృష్ట్యా, యూదా చేసిన పనికి ఆయనే బాధ్యుడా, దేవుని సేవకులు దాని నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ఆది. 4:7; 2 కొరిం. 2:11; గల. 6:1; యాకో. 1:13, 14)

    2. (బి) యేసు ఎలాంటి శక్తివంతమైన పాఠాన్ని నేర్పించాడు? (యోహా. 13:15; మత్త. 23:11; 1 పేతు. 2:21)

  4. యోహాను 17:1-26 చదవండి.

    తన అనుచరులు ఏ భావంలో “ఏకమై యుండవలెనని” యేసు ప్రార్థించాడు? (యోహా. 17:11, 21-23; రోమా. 13:8; 14:19; కొలొ. 3:14)

100వ కథ

తోటలో యేసు

  1. మేడ గదిని విడిచిపెట్టిన తర్వాత యేసు, ఆయన అపొస్తలులు ఎక్కడికి వెళ్ళారు, ఆయన వాళ్ళకు ఏమి చేయమని చెప్పాడు?

  2. అపొస్తలులు ఉన్న చోటికి తిరిగి వచ్చినప్పుడు యేసు ఏమి చూశాడు, అలా ఎన్నిసార్లు జరిగింది?

  3. తోటలోకి ఎవరు ప్రవేశించారు, చిత్రంలో చూపించబడినట్లు యూదా ఇస్కరియోతు ఏమి చేశాడు?

  4. యూదా యేసును ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు, పేతురు ఏమి చేశాడు?

  5. యేసు పేతురుకు ఏమి చెప్పాడు, కానీ దూతలను పంపించమని ఆయన దేవుణ్ణి ఎందుకు అడగలేదు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 26:36-56 చదవండి.

    1. (ఎ) యేసు తన శిష్యులకు ఉపదేశమిచ్చిన విధానం, నేడు క్రైస్తవ పెద్దలకు ఎందుకు ఒక చక్కని మాదిరిగా ఉంది? (మత్త. 20:25-28; 26:40, 41; గల. 5:17; ఎఫె. 4:29, 31, 32)

    2. (బి) తోటివారిపై దాడిచేసే ఆయుధాలను ఉపయోగించడాన్ని యేసు ఎలా దృష్టించాడు? (మత్త. 26:52; లూకా 6:27, 28; యోహా. 18:36)

  2. లూకా 22:39-53 చదవండి.

    యేసును బలపరచడానికి గెత్సెమనే తోటకు ఒక దేవదూత వచ్చినప్పుడు, అది యేసు విశ్వాసం బలహీనమైపోయిందని సూచించిందా? వివరించండి. (లూకా 22:41-43; యెష. 49:8; మత్త. 4:10, 11; హెబ్రీ. 5:7)

  3. యోహాను 18:1-12 చదవండి.

    యేసు తన అనుచరులను తన వ్యతిరేకుల నుండి ఎలా కాపాడాడు, ఈ ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (యోహా. 10:11, 12; 18:1, 6-9; హెబ్రీ. 13:6; యాకో. 2:25)

101వ కథ

యేసు చంపబడడం

  1. యేసు మరణానికి కారకులు ఎవరు?

  2. యేసును మతనాయకులు తీసుకెళ్ళినప్పుడు అపొస్తలులు ఏమి చేశారు?

  3. ప్రధాన యాజకుడైన కయప ఇంటి దగ్గర ఏమి జరిగింది?

  4. పేతురు ప్రక్కకు వెళ్ళి ఎందుకు ఏడ్చాడు?

  5. యేసును పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళిన తర్వాత, యాజకులు ఏమన్నారు?

  6. శుక్రవారం మధ్యాహ్నం యేసుకు ఏమి జరిగింది, తన పక్కన మ్రానుపై వేలాడుతున్న నేరస్థునికి ఆయన ఏమని వాగ్దానం చేశాడు?

  7. యేసు చెప్పిన పరదైసు ఎక్కడ ఉంటుంది?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 26:57-75 చదవండి.

    యూదుల మహా సభకు చెందిన సభ్యులు తమ హృదయాలు చెడ్డవని ఎలా చూపించారు? (మత్త. 26:59, 67, 68)

  2. మత్తయి 27:1-50 చదవండి.

    యూదా చూపించిన పశ్చాత్తాపం యథార్థమైనది కాదని మనం ఎందుకు చెప్పవచ్చు? (మత్త. 27:3, 4; మార్కు 3:29; 14:21; 2 కొరిం. 7:10, 11)

  3. లూకా 22:54-71 చదవండి.

    యేసు మోసగించబడి బంధించబడిన రాత్రి పేతురు తనకు యేసు ఎవరో తెలియదు అని చెప్పడం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (లూకా 22:60-62; మత్త. 26:31-35; 1 కొరిం. 10:12)

  4. లూకా 23:1-49 చదవండి.

    యేసు తనకు అన్యాయం జరిగినప్పుడు ఎలా ప్రతిస్పందించాడు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (లూకా 23:33, 34; రోమా. 12:17-19; 1 పేతు. 2:23)

  5. యోహాను 18:12-40 చదవండి.

    పేతురు మనుష్యులకు భయపడి తాత్కాలికంగా కృంగిపోయినప్పటికీ, ఆయన దానినుండి కోలుకొని అసాధారణమైన అపొస్తలుడిగా తయారయ్యాడనే వాస్తవం ఏమి చూపిస్తోంది? (యోహా. 18:25-27; 1 కొరిం. 4:2; 1 పేతు. 3:14, 15; 5:8, 9)

  6. యోహాను 19:1-30 చదవండి.

    1. (ఎ) యేసుకు వస్తుసంపదలపట్ల ఎలాంటి సమతుల్యమైన దృక్కోణం ఉండేది? (యోహా. 2:1, 2, 9, 10; 19:23, 24; మత్త. 6:31, 32; 8:20)

    2. (బి) యేసు చనిపోయేటప్పుడు అన్న మాటలు, ఆయన యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడని ఎలా ఎలుగెత్తి చాటాయి? (యోహా. 16:33; 19:30; 2 పేతు. 3:14; 1 యోహా. 5:4)

102వ కథ

యేసు సజీవుడవడం

  1. చిత్రంలోని స్త్రీ, ఇద్దరు పురుషులు ఎవరు, వాళ్ళెక్కడ ఉన్నారు?

  2. యేసు సమాధిని కాపలా కాయడానికి సైనికులను పంపమని పిలాతు యాజకులకు ఎందుకు చెప్పాడు?

  3. యేసు చనిపోయిన తర్వాత మూడవ రోజున ఉదయాన్నే ఒక దేవదూత ఏమి చేశాడు, అయితే యాజకులు ఏమి చేశారు?

  4. కొంతమంది స్త్రీలు యేసు సమాధిని దర్శించినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోయారు?

  5. పేతురు, యోహాను యేసు సమాధి దగ్గరికి ఎందుకు పరుగెత్తుకొని వెళ్ళారు, వాళ్ళకు ఏమి కనిపించింది?

  6. యేసు శరీరానికి ఏమయ్యింది, కానీ తాను సజీవంగా ఉన్నానని శిష్యులకు చూపించడానికి ఆయనేమి చేశాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మత్తయి 27:62-66; 28:1-15 చదవండి.

    యేసు పునరుత్థానం సమయంలో, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఇతరులు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎలా పాపం చేశారు? (మత్త. 12:24, 31, 32; 28:11-15)

  2. లూకా 24:1-12 చదవండి.

    యెహోవా స్త్రీలను నమ్మకమైన సాక్షులుగా దృష్టిస్తాడని యేసు పునరుత్థాన వృత్తాంతం ఎలా చూపిస్తోంది? (లూకా 24:4, 9, 10; మత్త. 28:1-7)

  3. యోహాను 20:1-12 చదవండి.

    ఒక బైబిలు ప్రవచన నెరవేర్పు మనకు పూర్తిగా అర్థం కాకపోతే సహనం కలిగి ఉండాలని గ్రహించడానికి యోహాను 20:8, 9 మనకెలా సహాయం చేస్తుంది? (సామె. 4:18; మత్త. 17:22, 23; లూకా 24:5-8; యోహా. 16:12)

103వ కథ

గడియవేసివున్న గదిలోకి ప్రవేశించడం

  1. మరియ తోటమాలి అని భావించిన వ్యక్తితో ఏమన్నది, అయితే ఆయన నిజానికి యేసని ఆమె దేన్నిబట్టి గ్రహించింది?

  2. ఎమ్మాయు అనే గ్రామానికి నడిచి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు ఏమి జరిగింది?

  3. ఆ ఇద్దరు శిష్యులు తాము యేసును చూశామని అపొస్తలులకు చెప్పినప్పుడు ఆశ్చర్యకరమైన ఏ విషయం జరిగింది?

  4. యేసు తన అనుచరులకు ఎన్నిసార్లు కనిపించాడు?

  5. శిష్యులు ప్రభువును చూశారని విన్నప్పుడు తోమా ఏమన్నాడు, కానీ ఎనిమిది రోజుల తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. యోహాను 20:11-29 చదవండి.

    యోహాను 20:23లో, మానవులకు పాపాలను క్షమించే అధికారం ఉందని యేసు చెబుతున్నాడా? వివరించండి. (కీర్త. 49:2, 7; యెష. 55:7; 1 తిమో. 2:5, 6; 1 యోహా. 2:1, 2)

  2. లూకా 24:13-43 చదవండి.

    మన హృదయం బైబిలు సత్యాలను స్వీకరించేలా దాన్ని మనం ఎలా సిద్ధం చేసుకోవచ్చు? (లూకా 24:32, 33; ఎజ్రా 7:10; మత్త. 5:3; అపొ. 16:14; హెబ్రీ. 5:11-14)

104వ కథ

యేసు పరలోకానికి వెళ్ళడం

  1. ఒక సందర్భంలో యేసును ఎంతమంది శిష్యులు చూశారు, ఆయన వాళ్ళతో దేని గురించి మాట్లాడాడు?

  2. దేవుని రాజ్యమంటే ఏమిటి, యేసు వెయ్యేండ్లపాటు రాజుగా పరిపాలించినప్పుడు భూమిపై జీవితం ఎలా ఉంటుంది?

  3. యేసు తన శిష్యులకు ఎన్ని రోజులపాటు కనిపించాడు, కానీ ఆయన ఇప్పుడు ఏమి చేయవలసిన సమయం వచ్చింది?

  4. యేసు తన శిష్యులను విడిచి వెళ్ళడానికి ముందు వాళ్ళకు ఏమి చెప్పాడు?

  5. ఈ చిత్రంలో ఏమి జరుగుతోంది, యేసు ఎలా కనిపించకుండా పోయాడు?

అదనపు ప్రశ్నలు:

  1. మొదటి కొరింథీయులు 15:3-8 చదవండి.

    యేసు పునరుత్థానం గురించి అపొస్తలుడైన పౌలు అంత నమ్మకంగా ఎందుకు మాట్లాడగలిగాడు, క్రైస్తవులు నేడు ఏ విషయాల గురించి నమ్మకంగా మాట్లాడవచ్చు? (1 కొరిం. 15:4, 7, 8; యెష. 2:2, 3; మత్త. 24:14; 2 తిమో. 3:1-5)

  2. అపొస్తలుల కార్యములు 1:1-11 చదవండి.

    అపొస్తలుల కార్యములు 1:8లో ముందుగానే చెప్పబడినట్లు ప్రకటనా పని ఎంత విస్తృతంగా వ్యాపించింది? (అపొ. 6:7; 9:31; 11:19-21; కొలొ. 1:23)

105వ కథ

యెరూషలేములో కనిపెట్టుకొని ఉండడం

  1. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, యేసు అనుచరులు యెరూషలేములో వేచివున్నప్పుడు వాళ్ళకు ఏమి జరిగింది?

  2. యెరూషలేముకు వచ్చిన సందర్శకులకు ఆశ్చర్యకరమైన ఏ విషయం జరిగింది?

  3. పేతురు ప్రజలకు ఏమి వివరించాడు?

  4. ప్రజలు పేతురు చెప్పినది విన్న తర్వాత ఎలా భావించారు, ఏమి చేయమని ఆయన వాళ్ళకు చెప్పాడు?

  5. సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 2:1-47 చదవండి.

    1. (ఎ) అపొస్తలుల కార్యములు 2:23, 36 వచనాల్లోని పేతురు మాటలు, యేసు మరణానికి మొత్తం యూదా జనాంగమంతా బాధ్యత వహించాలని ఎలా చూపిస్తున్నాయి? (1 థెస్స. 2:14, 15)

    2. (బి) లేఖనాల నుండి తర్కించే విషయంలో పేతురు ఎలా ఒక మంచి మాదిరిని ఉంచాడు? (అపొ. 2:16, 17, 29, 31, 36, 39; కొలొ. 4:6)

    3. (సి) యేసు పేతురుకు ఇస్తానని వాగ్దానం చేసిన ‘పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులలో’ మొదటిదాన్ని పేతురు ఎలా ఉపయోగించాడు? (అపొ. 2:14, 22-24, 37, 38; మత్త. 16:19)

106వ కథ

చెరసాలనుండి విడిపించబడడం

  1. పేతురు, యోహాను ఒక మధ్యాహ్నం దేవాలయంలోకి వెళ్తుండగా ఏమి జరిగింది?

  2. ఒక కుంటివాడితో పేతురు ఏమి చెప్పాడు, డబ్బు కంటే విలువైన దేనిని పేతురు అతనికి ఇచ్చాడు?

  3. మతనాయకులకు ఎందుకు కోపం వచ్చింది, వాళ్ళు పేతురు యోహానులను ఏమి చేశారు?

  4. పేతురు మతనాయకులకు ఏమి చెప్పాడు, అపొస్తలులకు ఏ హెచ్చరిక ఇవ్వబడింది?

  5. మతనాయకులు ఎందుకు అసూయపడ్డారు, కానీ అపొస్తలులు రెండవసారి చెరసాలలో వేయబడినప్పుడు ఏమి జరిగింది?

  6. అపొస్తలులు న్యాయసభ ఎదుటకు తీసుకురాబడినప్పుడు ఎలా సమాధానం ఇచ్చారు?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 3:1-10 చదవండి.

    నేడు మనకు అద్భుతాలు చేసే శక్తి ఇవ్వబడకపోయినప్పటికీ అపొస్తలుల కార్యములు 3:6లో నమోదు చేయబడిన పేతురు మాటలు, రాజ్య సందేశ విలువను గుర్తించడానికి మనకెలా సహాయం చేస్తాయి? (యోహా. 17:3; 2 కొరిం. 5:18-20; ఫిలి. 3:8)

  2. అపొస్తలుల కార్యములు 4:1-31 చదవండి.

    మనకు పరిచర్యలో వ్యతిరేకత ఎదురైనప్పుడు, మనం మన మొదటి శతాబ్దపు క్రైస్తవ సహోదరులను ఏ విధంగా అనుకరించాలి? (అపొ. 4:29, 31; ఎఫె. 6:18-20; 1 థెస్స. 2:2)

  3. అపొస్తలుల కార్యములు 5:17-42 చదవండి.

    గతంలోనూ, ఇప్పుడూ సాక్షులు కాని కొంతమంది ప్రకటనా పని సంబంధంగా సహేతుకతను ఎలా చూపించారు? (అపొ. 5:34-39)

107వ కథ

స్తెఫను రాళ్ళతో కొట్టబడడం

  1. స్తెఫను ఎవరు, దేవుడు ఆయనకు ఏమి చేయడానికి సహాయం చేశాడు?

  2. మతనాయకులకు కోపం తెప్పించేలా స్తెఫను ఏమన్నాడు?

  3. స్తెఫనును మనుష్యులు నగరం వెలుపలికి లాక్కువెళ్ళి ఆయననేమి చేశారు?

  4. చిత్రంలో, పైవస్త్రాల దగ్గర నిలబడివున్న యువకుడు ఎవరు?

  5. స్తెఫను చనిపోయేముందు యెహోవాకు ఏమని ప్రార్థించాడు?

  6. ఎవరైనా మనకేదైనా హాని చేసినప్పుడు, స్తెఫనును అనుకరిస్తూ మనమేమి చేయాలి?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 6:8-15 చదవండి.

    యెహోవాసాక్షుల ప్రకటనా పనిని ఆపడానికి మతనాయకులు ఏ మోసకరమైన పద్ధతులను ఉపయోగించారు? (అపొ. 6:9, 11, 13)

  2. అపొస్తలుల కార్యములు 7:1-60 చదవండి.

    1. (ఎ) న్యాయసభ ఎదుట సువార్తను చక్కగా సమర్థించడానికి స్తెఫనుకు ఏమి సహాయం చేసింది, ఆయన మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (అపొ. 7:51-53; రోమా. 15:4; 2 తిమో. 3:14-17; 1 పేతు. 3:15)

    2. (బి) మన పనిని వ్యతిరేకించే వారిపట్ల మనం ఎలాంటి దృక్పథం అలవర్చుకోవాలి? (అపొ. 7:58-60; మత్త. 5:44; లూకా 23:33, 34)

108వ కథ

దమస్కుకు వెళ్ళే మార్గంలో

  1. స్తెఫను చంపబడిన తర్వాత సౌలు ఏమి చేశాడు?

  2. సౌలు దమస్కుకు వెళ్తుండగా, ఆశ్చర్యకరమైన ఏ సంగతి జరిగింది?

  3. యేసు సౌలుకు ఏమి చేయమని చెప్పాడు?

  4. యేసు అననీయకు ఏ ఉపదేశం ఇచ్చాడు, సౌలు మళ్ళీ ఎలా చూడగలిగాడు?

  5. సౌలు ఏ పేరుతో పిలువబడ్డాడు, ఆయన ఎలా ఉపయోగించుకోబడ్డాడు?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 8:1-4 చదవండి.

    క్రొత్తగా రూపొందిన క్రైస్తవ సంఘానికి ఎదురైన హింస క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి ఎలా దోహదపడింది, ఆధునిక కాలాల్లో అటువంటిదే ఏమి జరిగింది? (అపొ. 8:4; యెష. 54:17)

  2. అపొస్తలుల కార్యములు 9:1-20 చదవండి.

    సౌలు కోసం తాను ఉద్దేశించిన మూడు అంచెల ఏ కార్యం గురించి యేసు చెప్పాడు? (అపొ. 9:15; 13:5; 26:1; 27:24; రోమా. 11:13)

  3. అపొస్తలుల కార్యములు 22:6-16 చదవండి.

    మనం అననీయలా ఎలా ఉండవచ్చు, అదెందుకు ప్రాముఖ్యం? (అపొ. 22:12; 1 తిమో. 3:7; 1 పేతు. 1:14-16; 2:12)

  4. అపొస్తలుల కార్యములు 26:8-20 చదవండి.

    సౌలు క్రైస్తవుడిగా మారడం, నేడు అవిశ్వాసులైన జీవిత భాగస్వాములున్న వారికి ఎలా ప్రోత్సాహాన్నిస్తుంది? (అపొ. 26:11; 1 తిమో. 1:14-16; 2 తిమో. 4:2; 1 పేతు. 3:1-3)

109వ కథ

పేతురు కొర్నేలిని దర్శించడం

  1. చిత్రంలో వంగి నమస్కరిస్తున్న వ్యక్తి ఎవరు?

  2. కొర్నేలికి ఒక దేవదూత ఏమి చెప్పాడు?

  3. పేతురు యొప్పేలో సీమోను ఇంటి మిద్దెమీద ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏమి చూసేలా చేశాడు?

  4. కొర్నేలి తనకు నమస్కరించి తనను ఆరాధించకూడదని పేతురు ఎందుకు చెప్పాడు?

  5. పేతురుతో ఉన్న యూదులైన శిష్యులు ఎందుకు ఆశ్చర్యపోయారు?

  6. పేతురు కొర్నేలిని సందర్శించడం నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 10:1-48 చదవండి.

    అపొస్తలుల కార్యములు 10:42లోని పేతురు మాటలు రాజ్య సువార్త ప్రకటించే పని గురించి ఏమి చూపిస్తాయి? (మత్త. 28:19; మార్కు 13:10; అపొ. 1:8)

  2. అపొస్తలుల కార్యములు 11:1-18 చదవండి.

    అన్యుల గురించి యెహోవా నిర్దేశం ఏమిటో స్పష్టమైనప్పుడు పేతురు ఎటువంటి దృక్పథం చూపించాడు, ఆయన మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? (అపొ. 11:17, 18; 2 కొరిం. 10:5; ఎఫె. 5:17)

110వ కథ

తిమోతి—పౌలుకు క్రొత్త సహాయకుడు

  1. చిత్రంలోని యువకుడు ఎవరు, ఆయనెక్కడ నివసించేవాడు, ఆయన తల్లి పేరు, అవ్వ పేరు ఏమిటి?

  2. దూరంలోవున్న ప్రజలకు ప్రకటించడానికి నాతోనూ, సీలతోనూ వస్తావా అని పౌలు అడిగినప్పుడు తిమోతి ఏమి చెప్పాడు?

  3. యేసు అనుచరులు మొదట ఎక్కడ క్రైస్తవులని పిలువబడ్డారు?

  4. పౌలు, సీల, తిమోతి లుస్త్ర నుండి వచ్చేసిన తర్వాత దర్శించిన కొన్ని నగరాలు ఏవి?

  5. తిమోతి పౌలుకు ఎలా సహాయం చేశాడు, యౌవనస్థులు నేడు తమను తాము ఏమి ప్రశ్నించుకోవాలి?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 9:19-30 చదవండి.

    సువార్తకు వ్యతిరేకత ఎదురైనప్పుడు అపొస్తలుడైన పౌలు వివేచనను ఎలా చూపించాడు? (అపొ. 9:22-25, 29, 30; మత్త. 10:16)

  2. అపొస్తలుల కార్యములు 11:19-26 చదవండి.

    అపొస్తలుల కార్యములు 11:19-21, 26లో వ్రాయబడివున్న వృత్తాంతం, ప్రకటనా పనికి యెహోవా ఆత్మ మార్గనిర్దేశాన్ని ఇస్తోందని ఎలా చూపిస్తోంది?

  3. అపొస్తలుల కార్యములు 13:13-16, 42-52 చదవండి.

    శిష్యులు వ్యతిరేకతనుబట్టి నిరుత్సాహపడలేదని అపొస్తలుల కార్యములు 13:51, 52 ఎలా చూపిస్తోంది? (మత్త. 10:14; అపొ. 18:6; 1 పేతు. 4:14)

  4. అపొస్తలుల కార్యములు 14:1-6, 19-28 చదవండి.

    “ప్రభువునకు వారిని అప్పగించిరి” అనే పదబంధం, మనం క్రొత్తవారికి సహాయం చేసేటప్పుడు అనవసరమైన చింతకు గురికాకుండా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది? (అపొ. 14:21-23; 20:32; యోహా. 6:44)

  5. అపొస్తలుల కార్యములు 16:1-5 చదవండి.

    తిమోతి సున్నతి చేయించుకోవడానికి సుముఖత చూపించడం, ‘సువార్త కొరకే సమస్తము’ చేయడం ప్రాముఖ్యమని ఎలా నొక్కిచెబుతోంది? (అపొ. 16:3; 1 కొరిం. 9:23; 1 థెస్స. 2:8)

  6. అపొస్తలుల కార్యములు 18:1-11, 18-22 చదవండి.

    ప్రకటనా పనిని నిర్దేశించడంలో యేసు వ్యక్తిగతంగా పాల్గొనడం గురించి అపొస్తలుల కార్యములు 18:9, 10 ఏమి సూచిస్తోంది, అది నేడు మనకు ఏ నమ్మకాన్ని ఇస్తోంది? (మత్త. 28:20)

111వ కథ

నిద్రపోయిన బాలుడు

  1. చిత్రంలో, నేలమీద పడివున్న బాలుడు ఎవరు, ఆయనకు ఏమయ్యింది?

  2. ఆ పిల్లవాడు చనిపోయాడని చూసినప్పుడు పౌలు ఏమి చేశాడు?

  3. పౌలు, తిమోతి, వాళ్ళతో ప్రయాణిస్తున్నవాళ్ళు ఎక్కడికెళ్తున్నారు, వాళ్ళు మిలేతులో ఆగినప్పుడు ఏమి జరిగింది?

  4. అగబు ప్రవక్త పౌలుకు ఏ హెచ్చరిక ఇచ్చాడు, సరిగ్గా ప్రవక్త చెప్పినట్లే ఎలా జరిగింది?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 20:7-38 చదవండి.

    1. (ఎ) అపొస్తలుల కార్యములు 20:26, 27లో వ్రాయబడివున్న పౌలు మాటల ప్రకారం, మనం ‘ఎవరి నాశనము విషయంలోనూ దోషులము కాకుండా’ ఎలా ఉండవచ్చు? (యెహె. 33:8; అపొ. 18:6, 7)

    2. (బి) పెద్దలు బోధించేటప్పుడు “నమ్మదగిన బోధను” ఎందుకు ‘గట్టిగా చేపట్టాలి’? (అపొ. 20:17, 29, 30; తీతు 1:7-9; 2 తిమో. 1:13)

  2. అపొస్తలుల కార్యములు 26:24-32 చదవండి.

    పౌలు తాను యేసు నుండి పొందిన ప్రకటనా పనిని నెరవేర్చడానికి తన రోమా పౌరత్వాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? (అపొ. 9:15; 16:37, 38; 25:11, 12; 26:32; లూకా 21:12, 13)

112వ కథ

ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం

  1. పౌలు ఉన్న ఓడ క్రేతు ద్వీపాన్ని సమీపించినప్పుడు దానికి ఏమయ్యింది?

  2. ఓడలో ఉన్నవారికి పౌలు ఏమి చెప్పాడు?

  3. ఓడ ఎలా ముక్కలుముక్కలుగా బద్దలయ్యింది?

  4. సైనికాధికారి ఏ ఆదేశాలు ఇచ్చాడు, ఎంతమంది సురక్షితంగా దరి చేరుకున్నారు?

  5. వాళ్ళు చేరుకున్న ద్వీపం పేరేమిటి, వాతావరణం తేటపడిన తర్వాత పౌలుకు ఏమయ్యింది?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 27:1-44 చదవండి.

    పౌలు రోమాకు చేసిన ప్రయాణం గురించిన వృత్తాంతాన్ని చదివినప్పుడు, బైబిలు వృత్తాంతపు ఖచ్చితత్వంపై మన నమ్మకం ఎలా బలపడుతుంది? (అపొ. 27:16-19, 27-32; లూకా 1:3; 2 తిమో. 3:16, 17)

  2. అపొస్తలుల కార్యములు 28:1-14 చదవండి.

    అన్యులైన మెలితే ద్వీపవాసులు అపొస్తలుడైన పౌలుకు, ఓడ బద్దలై దురవస్థలో ఉన్న ఆయన సహచరులకు ‘ఎంతో ఉపచారం’ చేయడానికి కదిలించబడితే, క్రైస్తవులు ఏమి చూపించడానికి కదిలించబడాలి, ప్రత్యేకంగా ఏ విధంగా చూపించడానికి వాళ్ళు కదిలించబడాలి? (అపొ. 28:1, 2; హెబ్రీ. 13:1, 2; 1 పేతు. 4:9)

113వ కథ

రోమాలో పౌలు

  1. పౌలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు ఎవరికి ప్రకటించాడు?

  2. చిత్రంలో బల్ల దగ్గరున్న సందర్శకుడు ఎవరు, ఆయన పౌలు కోసం ఏమి చేశాడు?

  3. ఎపఫ్రొదితు ఎవరు, ఆయన ఫిలిప్పీకి తిరిగి వెళ్ళినప్పుడు తనతోపాటు ఏమి తీసుకువెళ్ళాడు?

  4. పౌలు తన సన్నిహిత స్నేహితుడైన ఫిలేమోనుకు ఎందుకు పత్రిక వ్రాశాడు?

  5. పౌలు విడుదల చేయబడినప్పుడు ఏమి చేశాడు, తర్వాత ఆయనకు ఏమి జరిగింది?

  6. బైబిలులోని చివరి పుస్తకాలు వ్రాయడానికి యెహోవా ఎవరిని ఉపయోగించుకున్నాడు, ప్రకటన గ్రంథం దేని గురించి చెబుతుంది?

అదనపు ప్రశ్నలు:

  1. అపొస్తలుల కార్యములు 28:16-31; ఫిలిప్పీయులు 1:13 చదవండి.

    పౌలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు తన సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు, ఆయన అచంచలమైన విశ్వాసం క్రైస్తవ సంఘంపై ఎలాంటి ప్రభావం చూపించింది? (అపొ. 28:23, 30; ఫిలి. 1:14)

  2. ఫిలిప్పీయులు 2:19-30 చదవండి.

    పౌలు తిమోతిని, ఎపఫ్రొదితును ప్రశంసిస్తూ ఏమన్నాడు, పౌలు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? (ఫిలి. 2:20, 22, 25, 29, 30; 1 కొరిం. 16:18; 1 థెస్స. 5:12, 13)

  3. ఫిలేమోను 1-25 చదవండి.

    1. (ఎ) సరైనది చేయమని పౌలు ఫిలేమోనును దేని ఆధారంగా కోరాడు, ఇది నేడు పెద్దలకు ఎలా ఒక మాదిరిగా ఉంటుంది? (ఫిలే. 9; 2 కొరిం. 8:8; గల. 5:13)

    2. (బి) ఫిలేమోను 13, 14 వచనాల్లో ఉన్న పౌలు మాటలు, ఆయన సంఘంలోని ఇతరుల మనస్సాక్షిని గౌరవించాడని ఎలా చూపిస్తున్నాయి? (1 కొరిం. 8:7, 13; 10:31-33)

  4. రెండవ తిమోతి 4:7-9 చదవండి.

    మనం అంతం వరకు నమ్మకంగా ఉంటే యెహోవా మనకు ప్రతిఫలమిస్తాడని అపొస్తలుడైన పౌలువలే మనమెలా నమ్మకం కలిగివుండవచ్చు? (మత్త. 24:13; హెబ్రీ. 6:10)

114వ కథ

చెడుతనమంతా అంతం కావడం

  1. బైబిలు పరలోకంలో ఉన్న గుర్రాల గురించి ఎందుకు మాట్లాడుతోంది?

  2. భూమ్మీదున్న చెడ్డ ప్రజలతో దేవుడు చేసే యుద్ధం పేరేమిటి, ఆ యుద్ధం ఉద్దేశమేమిటి?

  3. చిత్రంలో చూపించబడినట్లు యుద్ధంలో ఎవరు నాయకత్వం వహిస్తారు, ఆయన కిరీటం ఎందుకు ధరించాడు, ఆయన ఖడ్గం ఏమి సూచిస్తోంది?

  4. పదవ కథను, 15వ, 33వ కథలను చూసినప్పుడు, దేవుడు చెడ్డ ప్రజలను నాశనం చేస్తాడంటే మనమెందుకు ఆశ్చర్యపోకూడదు?

  5. చెడ్డ ప్రజలు దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ దేవుడు వారిని నాశనం చేస్తాడని 36, 76 కథలు ఎలా చూపిస్తున్నాయి?

అదనపు ప్రశ్నలు:

  1. ప్రకటన 19:11-16 చదవండి.

    1. (ఎ) తెల్ల గుర్రాన్ని స్వారీచేస్తున్నది యేసుక్రీస్తేనని లేఖనాలు ఎలా స్పష్టం చేస్తున్నాయి? (ప్రక. 1:5; 3:14; 19:11; యెష. 11:4)

    2. (బి) రక్తంలో ముంచబడిన యేసు వస్త్రము ఆయన ఖచ్చితంగా సంపూర్ణంగా విజయం సాధిస్తాడని ఎలా ధృవీకరిస్తోంది? (ప్రక. 14:18-20; 19:13)

    3. (సి) యేసు తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు ఆయన వెనుక వచ్చే సైన్యాల్లో బహుశా ఎవరు ఉండవచ్చు? (ప్రక. 12:7; 19:14; మత్త. 25:31, 32)

115వ కథ

భూమిపై ఒక క్రొత్త పరదైసు

  1. మనం భూపరదైసులో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తాము అని బైబిలు సూచిస్తోంది?

  2. పరదైసులో జీవించేవారి కోసం బైబిలు ఏమని వాగ్దానం చేస్తోంది?

  3. ఈ అద్భుతమైన మార్పు ఎప్పుడు జరిగేలా యేసు చూస్తాడు?

  4. యేసు భూమిపై ఉన్నప్పుడు, తాను దేవుని రాజ్యానికి రాజైనప్పుడు ఏమి చేస్తాడో చూపించడానికి ఏమి చేశాడు?

  5. యేసు, ఆయనతోపాటు పరిపాలించేవారు పరలోకం నుండి భూమిని పరిపాలించినప్పుడు ఏమి చేస్తారు?

అదనపు ప్రశ్నలు:

  1. ప్రకటన 5:9, 10 చదవండి.

    వెయ్యేండ్ల పరిపాలనలో భూమిని పరిపాలించేవారు సానుభూతిగల, దయగల రాజులుగా, యాజకులుగా ఉంటారని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు? (ఎఫె. 4:20-24; 1 పేతు. 1:7; 3:8; 5:6-10)

  2. ప్రకటన 14:1-3 చదవండి.

    1,44,000 మంది నొసళ్ళపై తండ్రి నామము, గొర్రెపిల్ల నామము వ్రాయబడి ఉన్నాయనే వాస్తవం దేనిని సూచిస్తోంది? (1 కొరిం. 3:23; 2 తిమో. 2:19; ప్రక. 3:12)

116వ కథ

మనమెలా నిరంతరం జీవించవచ్చు

  1. మనం నిరంతరం జీవించాలంటే మనమేమి తెలుసుకోవాలి?

  2. చిత్రంలోని చిన్న అమ్మాయి మరియు ఆమె స్నేహితుల ద్వారా చూపించబడినట్లు మనం యెహోవా దేవుని గురించి, యేసు గురించి ఎలా నేర్చుకోవచ్చు?

  3. చిత్రంలో మీకు ఇంకా ఏ పుస్తకం కనిపిస్తోంది, మనం దానిని తరచూ ఎందుకు చదవాలి?

  4. నిత్యజీవం పొందాలంటే యెహోవా గురించి, యేసు గురించి నేర్చుకోవడంతోపాటు ఇంకా ఏమి చేయాలి?

  5. మనం 69వ కథనుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

  6. యాభై ఐదవ కథలోని చిన్న సమూయేలు మంచి మాదిరి ఏమి చూపిస్తోంది?

  7. మనం యేసుక్రీస్తు మాదిరిని ఎలా అనుసరించవచ్చు, మనం అలా అనుసరిస్తే భవిష్యత్తులో ఏమి చేయగలుగుతాము?

అదనపు ప్రశ్నలు:

  1. యోహాను 17:3 చదవండి.

    యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం అంటే కేవలం వాస్తవాలను కంఠతా పెట్టడం కాదని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి? (మత్త. 7:21; యాకో. 2:18-20; 1 యోహా. 2:17)

  2. కీర్తన 145:1-21 చదవండి.

    1. (ఎ) మనం యెహోవాను స్తుతించడానికిగల అనేక కారణాల్లో కొన్ని ఏమిటి? (కీర్త. 145:8-11; ప్రక. 4:10, 11)

    2. (బి) యెహోవా ఎలా “అందరికి ఉపకారి”గా ఉన్నాడు, అది మనల్ని ఆయనకు అంతకంతకూ ఎలా సన్నిహితం చేయాలి? (కీర్త. 145:9; మత్త. 5:43-45)

    3. (సి) యెహోవాను మనం ప్రేమిస్తే, మనం ఏమి చేయడానికి ప్రేరేపించబడతాము? (కీర్త. 119:171, 172, 175; 145:11, 12, 21)