కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తమార్పిడికిగల నాణ్యమైన ప్రత్యామ్నాయములు

రక్తమార్పిడికిగల నాణ్యమైన ప్రత్యామ్నాయములు

రక్తమార్పిడికిగల నాణ్యమైన ప్రత్యామ్నాయములు

‘మార్పిడిలు ప్రమాదభరితమైనవి, కాని మరింత నాణ్యమైన ప్రత్యామ్నాయములు ఏమైనా గలవా?’ అని నీవనుకోవచ్చును. అది మంచి ప్రశ్నే. “నాణ్యత” అను మాటను గమనించుము.

యెహోవా సాక్షులతో పాటు, ప్రతి ఒక్కరు, శ్రేష్టమైన వైద్య చికిత్సను కోరుదురు. డాక్టర్‌ గ్రాంట్‌ ఇ. స్టీఫెన్‌ రెండుముఖ్య మూలకములను గమనించెను: “న్యాయబద్ధమైన వైద్యపర మరియు వైద్యేతర లక్ష్యాలను నెరవేర్చ సమర్థతగల కీలకములే నాణ్యమైన వైద్యచికిత్స.” (ది జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, జూలై 1, 1988) రోగియొక్క బైబిలు-ఆధారపూరిత మనస్సాక్షినిగాని, నైతికతలనుగాని మీరకుండుట “వైద్యేతర లక్ష్యాల” యందు యిమిడియున్నవి.—అపొ.కార్యములు 15:28, 29.

రక్తమును ఉపయోగించకుండా, తీవ్ర ఆరోగ్య సమస్యలను సంభాళించుటకు ఏవైనా న్యాయసమ్మతమైన, సమర్ధవంతమైన మార్గములు కలవా? సంతోషించురీతిగా, ఉన్నవి అను సమాధానము గలదు.

అనేకమంది శస్త్రనిపుణలు తప్పని అవసరత కలిగినప్పుడే వారు రక్తమును యిచ్చినట్లుగా వాదించినప్పటికి, ఎయిడ్స్‌ వ్యాధి ప్రబలమైన తరువాత, వారు రక్తమును ఉపయోగించుట త్వరితంగా పడిపోయెను. మెయో క్లినిక్‌ ప్రొసీడింగ్స్‌ (సెప్టెంబరు 1988)లో వార్తాపత్రికాధిపతి ఇలా అనెను, “ఆ వ్యాధి ప్రాబల్యతవలన కలిగిన కొద్ది ప్రయోజనాలలో ఒకటి ఏమనగా” అది “రక్తమును నిరాకరించుటకు వైద్యులకు, అటు రోగులకు అనేక పద్ధతులకు దారితీసినది”. ఒక రక్తనిధి అధికారి యిట్లు వివరించెను: “మారినదేమనగా, సమాచారముయొక్క తీవ్రత, ఆ సమాచారమును (అపాయములను మరింతగా గ్రహించుకొనుటకు) మరియు, ప్రత్యామ్నాయముల కొరకుగల పరిశీలనను కోరుటను వైద్యులు స్వీకరించిరి.”—ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ రివ్యూస్‌, అక్టోబరు 1989.

ప్రత్యామ్నాయములు కలవని గమనించుడి! రక్తము ఎందుకు మార్పిడిచేయబడునో, మనం పరిశీలించినప్పుడు యిది అర్ధమగును.

జీవమునకు, ఆరోగ్యమునకు అవసరమయిన ప్రాణవాయువును ఎర్రరక్తకణములందలి హిమోగ్లోబిన్‌ తీసికొనిపోవును. కావున ఒక వ్యక్తి ఎక్కువగా రక్తమును కోల్పోయినట్లయితే, తిరిగి దానిని భర్తిచేయుట సహేతుకమనిపించును. సాధారణంగా నీవు సుమారుగా 14 లేక 15 గ్రాముల హిమోగ్లొబిన్‌, ప్రతి 100 ఘన సెంటీమీటర్ల రక్తమందు కలిగివుందువు. (ఈ సాంద్రతకు వేరే కొలత అది హిమటోక్రిట్‌, సహజంగా అది 45 శాతం ఉండును.) శస్త్ర చికిత్సకు ముందు ఒక రోగియొక్క హిమోగ్లొబిన్‌ 10 కన్నా తక్కువైన (లేక హిమటోక్రిట్‌ 30 శాతం కన్నా తక్కువైన) యెడల అతడికి రక్తమివ్వవలెను అని అంగీకారమైన “సూత్రమై” యున్నది. “65% రోగులలో (మత్తుమందిచ్చు వైద్యులు) శస్త్రచికిత్సకు ముందుగా హిమోగ్లొబిన్‌ 10 గ్రా/డెసీలీటర్లు ముందుగా ఎన్నుకొనిన శస్త్రచికిత్స కొరకు ఉండవలెనని కోరుచున్నారని” స్విస్‌ పత్రిక ఓక్స్‌ శాంగ్వినిస్‌ (మార్చి 1987) తెలుపుచున్నది.

అయితే, 1988 లో రక్తమార్పిడి మీద సదస్సునందు ప్రొఫెసర్‌ హోవార్డ్‌ ఎల్‌. జాడెర్‌: “ఒక ‘గారడీ సంఖ్య’ మనకేవిధంగా వచ్చినదని” అడిగెను. మరియు అతడు: “ఒక రోగి మత్తుమందు తీసికొనకముందు, 10 గ్రా. హిమోగ్లొబిన్‌ అతడు కలిగియుండవలెననుటకుగల కారణములు, సాంప్రదాయంతో కప్పబడినవి, అస్పష్టతతో మూయబడినవి, మరియు రోగసంబంధితమైన, లేక ప్రయోగాత్మకమైనదని రుజువు చేయబడలేదు.” అని స్పష్టముగా పలికెను. అనేక వేలమంది రోగులు, ‘అస్పష్టమైన, రుజువుచేయలేని’ అవసరములచే రక్తమివ్వబడుచున్నారనుటనుగూర్చి ఊహించుము.

‘14గ్రా. హిమోగ్లొబిన్‌ కంటే తక్కువైనను నీవు తాళుచున్నట్లయిన ఎందుకు అది (14గ్రా) సర్వసాధారణమైనదని’ కొందరు ఆశ్చర్యపడవచ్చును. సరియే, తగినంత ప్రాణవాయు సరఫరా సామర్థ్యము నీకు నిక్షిప్తమైయున్నది, కావున వ్యాయామం చేయుటకు, కష్టమైన పనిచేయుటకు నీవు సిద్ధముగా ఉన్నావు. “హిమోగ్లొబిన్‌ సాంద్రత 7 గ్రా. లంత తక్కువైనను, పనితక్కువగా చేయకుండుటను కనుగొనుట కష్టమైయున్నది. కొంతమంది, పనియందు కేవలం కొద్దిపాటి తరుగుదలనే కనుగొనిరి.”—టెంపరరీ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ప్రాక్టీస్‌, 1987.

పెద్దవారు, తక్కువ హిమోగ్లొబిన్‌ స్థాయిని తట్టుకొందురు, కాని పిల్లలనుగూర్చి ఏమి? డాక్టర్‌ జేమ్సు ఎ. స్టాక్‌మన్‌ ఇలా అన్నారు: “కొద్ది మినహాయింపులతో, అపరిపక్వముగా పుట్టిన శిశువులు, మొదటి ఒకటినుండి మూడు నెలలలో హిమోగ్లొబిన్‌ తరుగుదలను అనుభవింతురు . . . శిశువైద్యశాలలందు రక్తమార్పిడికి సూచకములు బాగుగా తేల్చబడలేదు. నిజమునకు స్పష్టమైన ఏ రోగసంబంధ చిక్కులులేకుండ, అనేకమంది శిశువులు, బహుతక్కువగావున్న హిమోగ్లొబిన్‌ సాంద్రతను తాళుకొనుచున్నట్లు ఉన్నది.”—పీడియాట్రిక్‌ క్లీనిక్స్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, ఫిబ్రవరి 1986.

ఒక ప్రమాదమందు, లేక శస్త్ర చికిత్సయందు, ఒక వ్యక్తి ఎక్కువగా రక్తమును కోల్పోయినట్లయిన చేయవలసిన దేమియులేదని దాని అర్థము కానేరదు. నష్టము త్వరితంగా ఎక్కువ జరిగినట్లయిన, ఒక వ్యక్తియొక్క రక్తపీడనం దిగజారును, మరియు అతడు సొమ్మసిల్లును. వెంటనే అవసరమైన దేమనగా, రక్తస్రావమును అరికట్టవలెను, మరియు అతడి దేహ వ్యవస్థలోనికి పరిమాణమును పూరించవలెను. అది స్పృహ కోల్పోవుటను నివారించి మిగిలిన ఎర్రకణములను, యితర పదార్థములను ప్రసరణలో పెట్టుటకు ఉపకరించును.

పూర్తి రక్తముగాని, రక్తప్లాస్మాగాని ఉపయోగించకుండా, పరిమాణము భర్తిచేయబడవచ్చును. * అనేక రక్తరహిత ద్రవములు పరిమాణమును విస్తరింపజేయుటకు సమర్థనీయమైనవి. అతి సామాన్యమైన సెలైన్‌ (ఉప్పు) ద్రావణము, అది ఖర్చుతక్కువ గలది మరియు మన రక్తమునకు అనుగుణ్యమైనది. డెక్స్‌ట్రాన్‌, హిమాసెల్‌, మరియు రింగర్స్‌ లాక్టేటువంటి ప్రత్యేక లక్షణములు కలిగిన ద్రావణములుకూడా కలవు. పరిమాణమును పెంపొందించునట్టి హిటాస్టార్చ్‌ (HES) క్రొత్తది, మరియు దానిని “రక్తపదార్థములకు అభ్యంతరపెట్టు (కాలినగాయాలుగల) రోగులకు నిరపాయకరంగా యివ్వవచ్చును.” (జర్నల్‌ ఆఫ్‌ బర్న్‌కేర్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, జనవరి/ఫిబ్రవరి, 1989) అటువంటి ద్రవములు నిశ్చితమైన ప్రయోజనములు కలవి. “స్ఫటికరూప ద్రావణములు [మామూలు సెలైన్‌, రింగర్స్‌ లాక్టేటువంటి ద్రవములు], డెక్స్‌ట్రాన్‌ మరియు HES లు చాలావరకు హానిలేనివి, ఖర్చుతక్కువైనవి త్వరగా అంటుబాటులో ఉండును, గది ఉష్ణోగ్రతవద్ద నిల్వయుంచ తగినవి, అనుగుణ్యతా పరీక్ష అవసరము లేనివి మరియు రక్తమార్పిడి-వ్యాప్తిత వ్యాధుల సమస్యలు లేనివి.”—బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ థెరపీ—ఎ ఫిజీషియన్స్‌ హాండ్‌బుక్‌, 1989.

‘నా శరీరమంతటా ప్రాణవాయువును సరఫరా చేయుటకు నాకు ఎర్రకణములు అవసరమయివుండగా, రక్తరహితముగా భర్తిచేయగల ద్రవములేవిధముగా బాగుగా పనిచేయును?’ అని నీవడుగవచ్చును. ప్రస్తావించబడిన విధముగా, నీకు ప్రాణవాయు-సరఫరా నిక్షేపములు గలవు. నీవు రక్తమును కోల్పోయినట్లయిన, అద్భుతమైన భర్తిచేయుచర్యలు ఆరంభమగును. నీగుండె, ప్రతీ ఒక్క స్పందనతో ఎక్కువ రక్తమును పంపును. తగిన ద్రావణంతో కోల్పోయిన రక్తము భర్తిచేయబడినప్పుడు, పలుచబడిన రక్తము సులభముగా చిన్న నాళములలోనికి కూడా ప్రవహించును. రసాయినిక చర్యల ఫలితంగా, ఎక్కువ ప్రాణవాయువు కణజాలములకు విడుదలచేయబడును. ఈ మార్పులు ఎంతో బలీయమైనవి, అనగా నీ ఎర్రరక్తకణములలో సగము మాత్రమే మిగిలినట్లయిన, ప్రాణవాయు సరఫరా సాధారణంగా వుండు దానిలో 75 శాతముముండవచ్చును. ఒక రోగి విశ్రాంతిలో ఉన్నప్పుడు తన రక్తమందు అందుబాటులో ఉన్న ప్రాణవాయువులో 25 శాతము వినియోగించుకొనును. మరియు, అనేక పూర్తిస్థాయి మత్తుమందులు శరీరముయొక్క ప్రాణవాయు అవసరతను తగ్గించును.

వైద్యులేవిధంగా సహాయపడగలరు?

రక్తము కోల్పోవుటవలన కొద్ది రక్తకణములు కలిగివున్న ఒకనికి నిపుణులైన వైద్యులు సహాయపడగలరు. ఒకసారి రక్తపరిమాణము యథాస్థితికి తేబడినప్పుడు, వైద్యులు ఎక్కువ సాంద్రతల్లో ప్రాణవాయువును యివ్వగలరు. ఇది, దానిలోగల అధిక భాగాన్ని శరీరమునకు అందుబాటులో ఉంచును. తరచుగా, మంచి ఫలితాలు కలుగును. ఎక్కువగా రక్తమును కోల్పోయిన ఒక స్త్రీ విషయంలో దీనిని బ్రిటీషు వైద్యులు వినియోగించిరి, “ఆమెయొక్క హిమోగ్లొబిన్‌ 1.8 గ్రా/డెసీలీటర్లకు పడిపోయినది. ఎక్కువ పరిమాణాల్లో జిలాటిన్‌ ద్రావణములు (హిమాసెల్‌) ఎక్కించుట మరియు పీల్చుటకు అధిక శాతాల్లో ప్రాణవాయువు [తో] . . . ఆమెకు విజయవంతముగా చికిత్స చేయబడెను.” (అనెస్తీషియా, జనవరి 1987) ఆ నివేదిక యింకనూ తీవ్ర రక్తస్రావము జరిగిన వారికి, అధిక పీడనంగల ప్రాణవాయువు గదుల్లో చికిత్స విజయవంతంగా చేయబడెను అని చెప్పుచున్నది.

రోగులు మరింతగా ఎర్రరక్తకణములను వృద్ధిచేసికొనుటకు వారి వైద్యులు సహాయపడగలరు. ఎట్లు? ఇనుము ధాతువులుగల పదార్థములను వారికిచ్చుటద్వారా (కండరములు, రక్తనాళములలోనికి) అవి, మాములు కంటెనూ మూడు, నాలుగు రెట్లు వేగంగా రక్తకణములను తయారుచేయునట్లు దేహమునకు సహాయపడును. ఇటీవల, మరొక సహాయకం అందుబాటులోనికి వచ్చినది. ఎర్రకణములనుత్పత్తి చేయునట్లు ఎముకమూలుగను ప్రేరేపించు ఎరిథ్రోపోయిటిన్‌ (EPO) అను హార్మోనును నీ మూత్రపిండములు ఉత్పత్తిచేయును. ఇప్పుడు కృత్రిమ (సమ్మేళనం) EPO అందుబాటులో ఉన్నది. రక్తహీనులైన కొందరు రోగులకు వైద్యులు దీన్నిచ్చుటద్వారా, త్వరితంగా ఎర్రకణములను భర్తిచేయునట్లు వారికి సహాయపడగలరు.

శస్త్రచికిత్సయందుకూడా, రక్తమునుకాపాడు ఆధునిక పద్ధతులను వినియోగించుటద్వారా, నిపుణులైన మరియు మనస్సాక్షికమైన శస్త్రవైద్యులు, మత్తుమందు యిచ్చు వైద్యులు సహాయపడగలరు. రక్తస్రావంను తగ్గించు ఎలక్ట్రొకాటరీవంటి జాగరూకతతోకూడిన శస్త్రపద్ధతి ఎక్కువగా చెప్పబడనవసరములేదు. కొన్నిసార్లు గాయములోనికి రక్తము ప్రవహించుచుండిన, అది తీసివేయబడవచ్చును, వడపోయబడవచ్చును, మరియు తిరిగి ప్రసరణలోనికి మళ్లింపబడవచ్చును. *

గుండె-ఊపిరితిత్తుల యంత్రము, రక్తరహిత ద్రవముతో ప్రధానంగా అమర్చబడి, కొద్దిపాటి ఎర్రకణములను నష్టపోవుటతోపాటు కలుగు రక్తవిలీనతవలన రోగులు ప్రయోజనం పొందగలరు.

సహాయమునకింకనూ మార్గములు కలవు. శస్త్ర చికిత్సయందు, ప్రాణవాయు అవసరతను తగ్గించుటకు రోగిని చల్లబరచుట అవసరము అల్పపీడన మత్తుమందు, గడ్డకట్టుటను వృద్ధిచేయుటకు చికిత్స. రక్తస్రావకాలమును తగ్గించుటకు డెస్మోప్రెస్సిన్‌ (DDAVP) లేజర్‌ “స్కాల్‌పెల్స్‌.” సంబంధిత రోగులు, వైద్యులు రక్తము నిరాకరించుచున్నట్లయిన, ఈ జాబితా పెరుగుచుండుటను నీవు చూచెదవు. ఎక్కువ పరిమాణంలో రక్తమును నీవు ఎప్పటికీ కోల్పోకూడదని మా ఆకాంక్ష. ఒకవేళ, నీకు జరిగినా, అనేక సమస్యలను కల్గిన రక్తమార్పిడిలను వినియోగించకుండా, నిపుణులైన వైద్యులు జాగ్రత్త వహించగలరు.

శస్త్రచికిత్సా, నిజమే—కానీ రక్తమార్పిడిలు లేకుండా

ఈనాడు అనేకమంది ప్రజలు రక్తమును స్వీకరించరు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, సాక్షులు మతపరమైన విషయముల ఆధారముగా దేన్ని అపేక్షించుచున్నారో, దానినే వారును కోరుచున్నారు: ప్రత్యామ్నాయమైన రక్తరహిత చికిత్సను వినియోగించు నాణ్యమైన వైద్య సంరక్షణ. మనం గమనించినట్లుగా పెద్ద శస్త్రచికిత్స యింకనూ సాధ్యమే. నీవు సంశయించు అనుమానములు కలిగినట్లయిన, వైద్య సాహిత్యములోని వేరొక రుజువు వాటిని తొలగించును.

“రెండు మోకాళ్లలో, తుంట్లలో బాగుగా నాశనము జరిగిన” ఒక రక్తహీనతకలిగిన రోగినిగూర్చి “ క్వాడ్రుపుల్‌ మేజర్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ యిన్‌ మెంబర్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌” అను శీర్షిక (ఆర్థోపెడిక్‌ రివ్యూ, ఆగష్టు 1986) తెల్పినది. దశలవారిగా జరిపిన శస్త్రచికిత్సకు ముందు వెనుకలలో ఐరన్‌-డెక్స్‌ట్రాన్‌ ఉపయోగించబడెను, అది విజయవంతమైనది. హిమోగ్లొబిన్‌ స్థాయి 10 కంటె తక్కువగా ఉన్న 52 సంవత్సరాల వయస్కురాలైన సాక్షినిగూర్చి బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ అనెస్థీషియా (1982) నివేదించినది. రక్తస్రావమును తగ్గించుటకు అల్పపీడన మత్తుమందు యిచ్చుటద్వారా ఆమెకు పూర్తిగా తుంటికీలు, భుజములు మార్చబడెను. ఆర్కన్‌సస్‌ విశ్వవిద్యాలయము (అమెరికా) లోని ఒక శస్త్రవైద్య బృందము, సాక్షులకు నూరు తుంటి కీళ్లను మార్చుటలో ఈ పద్ధతిని ఉపయోగించెను, మరియు రోగులందరు కోలుకొనిరి. ఆ విభాగమునకు నాయకత్వము వహించుచున్న ప్రొఫెసర్‌: “ఆ (సాక్షులు) రోగులనుండి మేము నేర్చుకొనిన దానిని ఇప్పుడు మేము, తుంటినమర్చవలసిన మా యితర రోగులందరికీ వర్తింపజేయుదుము,” అని వ్యాఖ్యానించెను.

రక్తము లేకుండా అవయవ మార్పిడి చేసికొనుటకు, కొందరి సాక్షుల మనస్సాక్షి వారిని అనుమతించుచున్నది. 13 మూత్ర పిండముల మార్పిడినిగూర్చి చెప్పిన ఒక నివేదిక ఇలా తెల్పెను: “అనేకమంది యెహోవా సాక్షులకు, మూత్రపిండ మార్పిడి విధానమును సురక్షితముగా, సమర్థవంతముగా వర్తింపచేయవచ్చునని మొత్తంమీది ఫలితములు సూచించుచున్నవి.” (ట్రాన్స్‌ప్లాంటేషన్‌, జూన్‌ 1988) అదేవిధముగా, విజయవంతముగా గుండెమార్పిడి మార్గములో, రక్తనివారణ అను విషయంలో అడ్డురాలేదు.

‘రక్తరహిత శస్త్రచికిత్సా యితర పద్ధతులగూర్చి ఏమి?’ అని నీవు ఆశ్చర్యపడవచ్చును. “రక్తమార్పిడి లేకుండా [వెయిన్‌ స్టేట్‌ యూనివర్శిటి, అమెరికా నందు] స్త్రీగర్భకోశ మరియు ప్రసూతిసంబంధమైన శస్త్ర చికిత్సలను చేయించుకొనిన యెహోవా సాక్షులను” గూర్చి మెడికల్‌ హాట్‌లైన్‌ (ఏప్రిల్‌/మే 1983) తెలిపెను. ఆ వార్తాసంకలనం ఇలా నవేదించెను: “రక్తమార్పిడితో అటువంటి శస్త్రచికిత్సలు చేయించుకొనిన స్త్రీల మరణములు మరియు చిక్కులకంటే వారియందు ఎక్కువ ఏమిలేవు.” ఆ వార్తాసంకలనం చివరిగా ఇలా వ్యాఖ్యానించెను : “ప్రసూతి మరియు గర్భకోశ శస్త్రచికిత్సలను చేయించుకొను స్త్రీలందరకు రక్తమునువాడుటను పునఃపరిశీలించవలెనని ఈ విచారణల ఫలితములు హెచ్చరించుచున్నవి.”

గొట్టిన్‌జెన్‌ విశ్వవిద్యాలయ ఆసుపత్రి [జర్మని] నందు, రక్తమును నిరాకరించిన 30 మంది రోగులకు సాధారణ శస్త్రచికిత్స జరిగింపబడెను. “రక్తమార్పిడిని అంగీకరించు రోగులలోసహితము తల్తెగల చిక్కులు ఏవియు తల్తెలేదు. . . . అట్లని రక్తమార్పిడిని అవసరోపాయముగా అంగీకరించుట సాధ్యముకాదనుటను అధికముచేసి చెప్పకూడదు, ఆ విధముగా అది అవసరమైన మరియు శస్త్రశాస్త్రబద్ధమైన శస్త్రచికిత్సనుండి వెనుదీయుటకు నడిపించకూడదు.”—రిసికో ఇన్‌డెర్‌ షిరర్‌గీ, 1987.

అసంఖ్యాకమైన పెద్దలు, పిల్లలకు రక్తమునుపయోగించకుండా మెదడుపై శస్త్రచికిత్సలుకూడా చేయబడినవి, ఉదాహరణకు, న్యూయార్కు విశ్వవిద్యాలయ వైద్య కేంద్రమునందు. “రక్తపదార్థముల వాడకానికి విరుర్ధమైన మత సిద్ధాంతములు కలిగిన రోగులలో కొద్దిపాటి చిక్కులతో, ప్రత్యేకముగా వేగంగా శస్త్రచికిత్సను, వీలయినంత తక్కువ వ్యవధిలో జరిపినట్లయిన, అనేక సందర్భములలో రక్తపదార్ధములను విసర్జించగలుగుట సుస్పష్టము. ఆసక్తికరమైన విషయమేమనగా, విడుదలయ్యే సమయమున వారి మత నమ్మకములను గౌరవించిరని వారు నాకు కృతజ్ఞత తెల్పువరకు, ఆ రోగి ఒక సాక్షియను విషయమును నేను తరచు మరచిపోవుదును,” అని 1989 లో నూరోసర్జరీ విభాగాధిపతి అయిన డాక్టర్‌ జోసెఫ్‌ రాన్‌సొహఫ్‌ వ్రాసెను.

చివరగా, రక్తములేకుండా పెద్దలు పిల్లలపై సంక్లిష్టమైన గుండె, మరియు రక్తనాళ శస్త్రచికిత్సలు జరుపబడగలవా? దానిలో డాక్టర్‌ డెన్టన్‌ ఎ. కూలే సుప్రసిద్ధుడు. గతంలోని విశ్లేషణ ఆధారంగా, 27-29 పేజీల్లో పునర్ముద్రితమైన అనుబంధ శీర్షికనందుగల వైద్యపరమైన శీర్షికలో నీవు గమనించునట్లుగా, “యెహోవా సాక్షుల వర్గములోని రోగులకు శస్త్రచికిత్స సమస్య ఇతరులకంటె నిదర్శనపూర్వకంగా ఎక్కువేమీకాదు” అని డాక్టర్‌ కూలే ముగించెను. ఇప్పుడు ఇటువంటివి 1,106 శస్త్ర చికిత్సలను చేసిన అనంతరం, ఆయన “ప్రతి సందర్భమునందు, రోగులతో నాయొక్క అంగీకారం లేక ఒప్పందము కాపాడబడినది,” అనగా రక్తమును ఉపయోగించకుండుట, అని వ్రాసెను.

యెహోవా సాక్షుల మంచి దృక్పథము, శస్త్రవైద్యులు గమనించిన మరొక విషయము. “ఈ రోగులయొక్క దృక్పథము మాదిరికరమైనది,” అని డాక్టర్‌ కూలే అక్టోబరు, 1989 లో వ్రాసెను. “అనేకమంది రోగులు కలిగియుండు సమస్యలు లేక మరణాలనుగూర్చిన భయము వారికిలేదు. వారి దేవునియందు, వారి నమ్మకములందు లోతైన మరియు స్థిరమైన విశ్వాసము వారికి గలదు.”

మరణించుటకు హక్కును వారు బలపర్చుదురని దీనియర్థము కాదు. స్వస్థపడవలెనని కోరువారు కావున జాగరూకతతో నాణ్యమైన చికిత్సను వారు వెదుకుదురు. రక్తరహిత శస్త్ర చికిత్సపై అనుకూల ప్రభావమును కనపరచు దృక్పథమే, రక్తము విషయములో దేవుని శాసనమునకు విధేయులగుట వివేకమని వారు నమ్ముచున్నారు.

ఫ్రీబర్గ్‌ విశ్వవిద్యాలయము (జర్మని), శస్త్రచికిత్సల ఆసుపత్రినందు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి. ష్షాస్సర్‌ ఇలా తెల్పెను: “శస్త్ర చికిత్స మొత్తంకాలంలో రక్తస్రావ సందర్భాలు ఈ వర్గ రోగులలో ఎక్కువగా లేవు; చిక్కులేమైనా ఉన్నట్లయితే అవి కొద్ది మాత్రమే. శస్త్ర చికిత్స మొత్తం కాలక్రమముపై అనుకూల ప్రభావమును, యెహోవా సాక్షులకు చిహ్నంగా, వ్యధిలో గల ప్రత్యేక దృక్పథము కనబరచినది.”—హెర్చ్‌ క్రీస్‌లాఫ్‌, ఆగష్టు 1987.

[అధస్సూచీలు]

^ పేరా 12 సాక్షులు మొత్తముగా రక్తమును, ఎర్రకణములను, తెల్లకణములను, ప్లాటిలెట్స్‌ను, లేక రక్తముయొక్క ప్లాస్మాను మార్పిడిచేయించుకొనుటను అంగీకరించరు. ఇమ్యూన్‌ గ్లొబులిన్‌ వంటి చిన్నభాగముల సమాచారమునకై వాచ్‌టవర్‌ జూన్‌ 1, 1990, పుటలు 30-1 చూడుము.

^ పేరా 17 రక్తశుద్ధీరకణ మరియు రక్త-ప్రసరణ (శరీరబాహ్య) యంత్రసామాగ్రి పద్ధతులపై విషయమై బైబిలు సూత్రములు వాచ్‌టవర్‌ మార్చి 1, 1989, పుటలు 30-1 లో విచారింపబడెను.

[13వ పేజీలోని బాక్సు]

“ఇటీవల మార్పిడివలన ప్రయోజనము పొందనవకాశములేని (రక్తము అవసరములేని) అనేకమంది రోగులు రక్త పదార్థములను పొందుచున్నారనియు, మరియు కోరదగని ప్రభావము వలన గుర్తించదగిన సమస్యనుకూడ కల్గియున్నారనియు మనము ముగింపవలెను. సహాయకరముకాని చికిత్సకు ఒకరోగిని ఏ వైద్యుడును బహిర్గతం చేయడు, అయితే అది హాని చేయవచ్చును, కాని అనవసరంగా రక్తమును మార్పిడి చేయుచున్నప్పుడు ఖచ్ఛితముగా జరుగుతున్నదదే.”—“టాన్స్‌ఫ్యూజన్‌— ట్రాన్స్‌మిటెడ్‌ వైరల్‌ డిసీసెస్‌,” 1987.

[14వ పేజీలోని బాక్సు]

“కొందరు రచయితలు, హిమోగ్లొబిన్‌ విలువలు 2 నుండి 2.5 గ్రా./100 మిల్లీ. వలె తక్కువగా ఉన్నను అది ఆమోదయోగ్యమని పేర్కొనిరి. . . . ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి పూర్తి ఎర్రకణరాశిలో 50 శాతము కోల్పోయినను తాళుకొనవచ్చును మరియు రక్తస్రావము ఒక వ్యవధిలో జరిగినచో రోగి సుమారుగా మొత్తం మీద రోగలక్షణములు లేని వాడైయుండును.”—“టెక్నిక్స్‌ ఆఫ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌,” 1982.

[15వ పేజీలోని బాక్సు]

“రక్తముయొక్క ‘పోషక విలువలు,’ గాయముల మాన్పుదల, కణజాలములకు ప్రాణవాయు సరఫరాలను గురించి ప్రాచీన భావనలు విడిచి పెట్టబడుచున్నవి. తీవ్రమైన రక్తహీనత బాగుగా తాళుకొనబడుచున్నది అని యెహోవా సాక్షుల రోగులతోగల అనుభవము కనబరచుచున్నది.”—“ది ఆన్నల్స్‌ ఆఫ్‌ థొరాసిక్‌ సర్జరీ,” మార్చి 1989.

[16వ పేజీలోని బాక్సు]

చిన్న పిల్లలుకూడా? “శస్త్రచికిత్స సంక్లిష్టత ఉన్నప్పటికి నలుబది ఎనిమిది మంది పిల్లల గుండెలకు పెద్ద శస్త్ర చికిత్సలు రక్త రహిత పద్ధతులద్వారా జరుపబడెను.” పిల్లలు 10.3 పౌండ్లు (4.7 కిలో) మాత్రమే ఉండిరి. “యెహోవా సాక్షులందు ఎడతెగని విజయముల వలన, రక్తమార్పిడి తీవ్రపరిణామములను కల్గించు సమస్య ఉన్న వాస్తవము వలన యిటీవల కాలంలో మార్పిడి లేకుండ మా పిల్లల గుండె శస్త్రచికిత్సలలో ఎక్కువ భాగమును మేము చేయుచున్నాము.”—“సర్క్యులేషన్‌,” సెప్టెంబరు 1984.

[15వ పేజీలోని చిత్రం]

రక్తము లేకుండా గుండె శస్త్రచికిత్స పొందు రోగులకు ‘గుండె-ఊపిరితిత్తుల’ యంత్రము ఎంతో సహాయకరము