కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎంపికచేయుటకు నీకు హక్కు కలదు

ఎంపికచేయుటకు నీకు హక్కు కలదు

ఎంపికచేయుటకు నీకు హక్కు కలదు

ఇటీవల వైద్యవిధానం (లాభ-నష్టముల విశ్లేషణ అని పిలవబడును) రక్తచికిత్స విసర్జించుటకు వైద్యులు రోగులు సహకరించుకొనుటను సులభతరం చేయుచున్నది. రాదగిన ప్రయోజనములు, ఒకానొక మందు లేక శస్త్ర చికిత్సయొక్క చిక్కులవంటి విషయాలను వైద్యులు తూచుదురు. రోగులుకూడా అటువంటి విశ్లేషణలో పాల్గొనవచ్చును.

అనేక ప్రాంతములలో ప్రజలకు సంబంధించిన—దీర్ఘ కాలిక గవదవాపు (క్రానిక్‌ టాన్సిలైటిస్‌) అను ఉదాహరణను మనము ఉపయోగించెదము. నీకు ఈ సమస్య ఉండిన, నీవు వైద్యునివద్దకు వెళ్లుదువు. ఆరోగ్య నిపుణులు తరచూ ద్వితీయాభిప్రాయము కొరకు సిఫారసు చేయుదురు కనుక, నిజానికి, నీవు యిరువురిని సంప్రదింతువు. ఒకరు శస్త్ర చికిత్సను సిఫారసు చేయుదురు. అసుపత్రినందుండవలసిన కాలము, బాధ తీవ్రత మరియు ఖర్చులను వివరించును. చిక్కుసమస్యలనుగూర్చి తీవ్రరక్తస్రావము సామాన్యమైనది కాదని మరియు, అటవంటి శస్త్ర చికిత్స వలన మరణము చాలా అరుదు అని అతడు చెప్పును. కాని, ద్వితీయాభిప్రామునిచ్చిన వైద్యుడు, సూక్ష్మజీవి వినాశక (యాంటిబయటిక్స్‌) మందులను వాడుమని నిన్ను కోరును. అతడు మందు రకమును, సాఫల్యతయొక్క అవకాశము మరియు వెలనుగూర్చి వివరించును. చిక్కులనుగూర్చి అతికొద్దిమంది రోగులకు ప్రాణహానికరమైన వికటింపు చర్యలను మందువలన కల్గెనని అతడు చెప్పును.

సమర్థుడైన ప్రతి వైద్యుడు, చిక్కును ప్రయోజనములను గమనించును, కాని నీవు బాగుగా ఎరిగియున్న యితర విషయములతోపాటు ఇప్పుడు చిక్కులను, పొందనగు ప్రయోజనములను సరితూచు కొనవలెను. (నీ భావోద్రేక లేక ఆత్మీయ బలము, కుటుంబ ఆర్థికపరిస్థితులు, కుటుంబముపై ప్రభావము మరియు నీ స్వంత నైతికతలను స్థితిగతులను ఆలోచించుటకు నీవు ఉత్తమ స్థానమందున్నావు.) అప్పుడు నీవు ఎన్నిక చేసికొందువు. సాధ్యమైనంతవరకు, ఒక చికిత్సకు సవివరమైన అనుమతినియిచ్చి, రెండవదానిని తిరస్కరింతువు.

నీ పిల్లవానికి క్రానిక్‌ టాన్సిలైటిస్‌ ఉండినట్లయిన, ఈ విషయము అట్లేయుండును. ఫలితాల వలన ప్రత్యక్షముగా గురియగునది పరిస్థితులను ఎదుర్కొనవలసిన ప్రేమగల తలిదండ్రులగు మీకొరకు, చిక్కులు ప్రయోజనములు మరియు చికిత్సలు క్లుప్తముగా వర్ణించబడును. స్థితిగతులన్నియు ఆలోచించిన తరువాత, నీ పిల్లవాని ఆరోగ్యమును మరియు అతడి లేక ఆమెయొక్క జీవమును కలిగియున్న ఈ విషయంపై సమగ్ర ఎన్నికను నువ్వుచేసికొనగలవు. ఒకవేళ నీవు శస్త్రచికిత్సకు దాని సమస్యలతో సమ్మతించితివి. ఇతర తలిదండ్రులు సూక్ష్మజీవి వినాశక మందులను, వాటి సమస్యలతో ఎన్నుకొనిరి. వారి సలహానందు వైద్యులు భేదించినట్లు ఏది ఉత్తమమైనదో అను భావనయందు రోగులు లేక తలిదండ్రులు భేదించుదురు. సవివరమైన (లాభ-నష్టములు) ఎంపికయొక్క గ్రహింపుపొందిన లక్షణము అది.

రక్తమునుపయోగించుట గూర్చి ఏమి? వాస్తవములను ఉన్నదివున్నట్టు పరిశీలించు వారెవరూ, రక్తమార్పిడిలు గొప్ప సమస్యలతోకూడి ఉన్నదను విషయమును తిరస్కరించలేరు. మాసాచూసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రినందు, రక్తమార్పిడి కేంద్ర అధికారియయిన, డాక్టర్‌ చార్షెస్‌ హగ్గిన్స్‌, దీనిని ఇట్లు స్పష్టపరచెను: “రక్తమెన్నటికి సురక్షితముకాదు. కాని అది అనివార్యముగా ప్రమాదమైనదని ఎంచబడవలెను. వైద్యమందు మేము ఉపయోగించు అతిప్రమాదకరమైన పదార్థము అది.”—ది బోస్టన్‌ గ్లోబ్‌ మేగజైన్‌, ఫిబ్రవరి 4, 1990.

మంచి కారణముతో, “రక్తమార్పిడి కొరకు లాభనష్టముల సంబంధమునందు నష్టముల భాగమునుకూడా పునఃసమీక్షించుట మరియు ప్రత్యామ్నాయములను వెదకుట, అవసరమైయున్నది” అని వైద్య సిబ్బందికి సలహా ఇవ్వబడెను. (ఇటాలిక్కులు మావి.)—పెరిఆపరేటివ్‌ రెడ్‌సెల్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కాన్ఫరెన్స్‌, జూన్‌ 27-29, 1988.

రక్తమును ఉపయోగించుటలోగల ప్రయోజనములను లేక చిక్కులనుగూర్చి వైద్యులు అంగీకరించకపోవుదురు. ఒకరు అనేక రక్తమార్పిడులను సాహసించిచేసి మేలే జరిగినదని నమ్మియుండవచ్చును. మరొకరు, రక్తము లేకుండా చికిత్సలతో అతడు మంచి ఫలితాలను పొందెను గనుక, ఆ చిక్కులన్నియు అసమంజసమని భావించవచ్చును. ఏమైనప్పటికీ తుదకు రోగివి లేక తల్లి (తండ్రి) వి అయిన నీవు నిర్ణయించుకొనవలెను. నీవే ఎందుకు? ఎందుకనగా నీ (లేక నీ పిల్లవాని) దేహము, జీవము, నైతికతలు మరియు దేవునితోగల అత్యంత ప్రాముఖ్యసంబంధములు యిమిడియున్నవి గనుక.

నీ హక్కు గుర్తించబడియున్నది

ఈనాడు అనేక ప్రాంతములలో, ఎటువంటి చికిత్సను అతడు అంగీకరించునో నిర్ణయించుకొనుటకు అతిక్రమించబడనేరని హక్కును ఒక రోగి కలిగియున్నాడు. “చట్టనుగుణ్యమైన అనుమతి రెండు విషయాలపై ఆధారపడినది: మొదటిది, సిఫారసుచేయబడిన చికిత్సగురించి సవివరమైన ఎన్నికను చేసికొనుటలో తగినంత సమాచారమును పొందుటకు రోగిహక్కును కలిగియున్నాడు. మరియు రెండవది, వైద్యుని సిఫారసును తిరస్కరించుటకు లేక అంగీకరించుటకు ఒక రోగి నిర్ణయించుకొనవచ్చును. . . . అవునని చెప్పుటకు లేక కాదని చెప్పుటకు మరియు షరతులతో అవునని చెప్పుటకు రోగులు హక్కును కలిగియున్నారని దృష్టింపబడినట్లయితే తప్ప, సవివర అనుమతి కొరకుగల అనేక కారణములు తొలగిపోవును.—ఇన్‌ఫార్మ్‌డ్‌ కన్సెంట్‌—లీగల్‌ థియరీ అండ్‌ క్లినికల్‌ ప్రాక్టీస్‌, 1987. *

కొందరు రోగులు వారి హక్కును వారు వినియోగించుకొనుటకు ప్రయత్నించినప్పుడు ఆటంకమును ఎదుర్కొనిరి. టాన్సిలెక్టమీ గురించి లేక సూక్ష్మజీవ వినాశక ఔషధములను గూర్చి తీవ్ర ధోరణిగల స్నేహితునినుండి అది రావచ్చును. లేక వైద్యుడు తన సలహా సరియని నమ్మిక కలిగియుండవచ్చును. చట్టబద్ధమైన లేక ఆర్ధిక విషయాల ఆధారంగా ఒక ఆసుపత్రి అధికారి అనంగీకారమునుకూడా తెల్పియుండవచ్చును.

“అనేకమంది ఎముక వ్యాధుల నిపుణులు, [సాక్షులైన] రోగులపై శస్త్రచికిత్సలను నిర్వహించరాదని నిర్ణయించిరి” అని డాక్టర్‌ కార్ష్‌ యల్‌. నెల్సన్‌ చెప్పుచున్నారు. “ఎటువంటి వైద్య చికిత్సనైనను తిరస్కరించుటకు రోగికి హక్కుగలదని మా విశ్వాసం. రక్తమార్పిడివంటి ప్రత్యేక చికిత్సను విడుచుచూ, శస్త్రచికిత్సను సాంకేతిక పరంగా అందించ సాధ్యపడినట్లయిన అప్పుడు అది ఒకే అవకాశముగా ఉండవలయును.”—ది జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ జాయింట్‌ సర్జరీ, మార్చి 1986.

నిపుణతలేన వైద్యుని ఒక చికిత్సను అందించుమని యోచనగల ఒక రోగి ఆ వైద్యుని వత్తిడిచేయడు. అయినప్పటికీ, డాక్టర్‌ నెల్సన్‌ గమనించినట్లుగా, అనేక అంకితభావంగల వైద్యులు రోగుల నమ్మకములను అనుమతించవచ్చును. ఒక జర్మని అధికారి ఇలా సలహనిచ్చెను: “చికిత్సాపూర్వక ప్రత్యామ్నాయములన్నింటిని తన ఆధీనమందులేవు అను కారణములు యెహోవా సాక్షులకు చూపించుచూ . . . వారికి సహాయమును అందించుటకు వైద్యుడు తిరస్కరించలేడు. అతడి ఎదుట తెరచియున్న మార్గములు తగ్గిననూ, సహాయమును అందించు బాధ్యతను అతడికింకనూ కలదు.” (డెర్‌ ఫ్రానార్‌ట్జ్‌, మే-జూన్‌ 1983) అట్లే ధన సంపాదన చేయుటకేకాదుగాని, ప్రజలందరికీ ఏ భేదమును లేకుండా సేవచేయుటకు ఆసుపత్రులున్నవి. కాథోలిక్‌ వేదాంతియైన రిచర్డ్‌ జె. డేవిన్‌ ఇట్లుచెప్పెను: “రోగి ప్రాణమును, ఆరోగ్యమును కాపాడుటకు, ఆసుపత్రులు యితర వైద్యపరమైన ప్రయత్నములు తప్పక చేయవలసియుండినను, వైద్యచికిత్స, [అతడి] మనస్సాక్షిని భ్రష్టపరచకుండునట్లు నిశ్చయపరచవలెను. అంతేగాక, రక్తమార్పిడిచేయుటకు కోర్టు ఉత్తర్వులను తెచ్చుటకు రోగిని వంచించుట, సమస్త బలత్కార విధానములను అది విడిచిపెట్టవలెను.”—హెల్త్‌ ప్రోగ్రెస్‌, జూన్‌ 1989.

న్యాయస్థానముల కంటెనూ

న్యాయస్థానము వ్యక్తిగత వైద్యపర విషయాగురించి కాదు అని అనేకప్రజలు అంగీకరింతురు. నీవు సూక్ష్మజీవి వినాశక ఔషధములను ఎంచుకున్నట్లయిన, ఎవరో ఒకరు నీకు టాన్సిలెక్టమీ కోర్టుద్వారా చేయుటకు వెళ్లిరనిన, నీవెట్లు భావింతువు? ఉత్తమ సంరక్షణయని దేనిని తాను అనుకొనునో, దానినందించుటకు వైద్యుడు కోరుకొనవచ్చును, కాని, నీ ప్రాథమిక హక్కులను అణగద్రొక్కుటకు చట్టపరమైన న్యాయమును వెదకుటకు అతనికి అగత్యత లేదు. జారత్వమును విసర్జించు నైతిక స్థాయితో సమముగా రక్తమును విసర్జించుటనుకూడా బైబిలు చెప్పు చున్నది. కాబట్టి, ఒక క్రైస్తవునిమీద రక్తమార్పిడిని బలవంతము చేయుట, బలత్కారపూరిత సంపర్కము—అత్యాచారమునకు సరిసమానమై యుండును.—అపొ.కార్యములు 15:28, 29.

అయినప్పటికి, “మార్పిడి జరుగుటకు అనుమతినిచ్చుటకు—నీకిష్టమైనచో, కొద్దిచట్ట సంబంధ మినహాయింపులు—చట్టబద్ధమైన అభూతకల్పనలను” ఏర్పరచు మతహక్కుల కారణముగా, ఒక రోగి చిక్కు సమస్యలను అంగీకరించుటకు యిష్టపడినప్పుడు, కొన్ని కోర్టులు చాలా ఆందోళన పడుచున్నవి అని యిన్‌ఫార్మ్‌డ్‌ కన్‌సెంట్‌ ఫర్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ (1989) నివేదించుచున్నది. గర్భధారణ యిమిడియున్నదని, లేక ఆదుకోబడవలసిన పిల్లలుగలరని చెప్పు మిషలను కోర్టులు ప్రయత్నించును. “అవి చట్టబద్ధమైన అభూతకల్పనలు” అని ఆ పుస్తకం చెప్పుచున్నది. “సమర్థనీయులైన పెద్దలు చికిత్సను నిరాకరించుటకు హక్కును కలిగియున్నారు.”

రక్తమార్పిడిచేయుటకు పట్టుబట్టిన కొందరు, సాక్షులు అన్నిరకాల చికిత్సలను నిరాకరించుట లేదను వాస్తవమును అలక్ష్యము చేయుచున్నారు. నిపుణులు సహితము, ప్రమాదభరితమని చెప్పిన ఒక చికిత్సావిధానమును వారు తిరస్కరింతురు. సాధారణంగా, వైద్య సమస్య అనేక విధాలుగా పరిష్కరించబడగలదు. ఒకరికి ఈ సమస్య మరొకరికి ఆ సమస్య ఉండవచ్చును. “నీకు సంబంధించి” ఏ సమస్య క్షేమంగా ఉండగలదో కోర్టుగాని, వైద్యుడుగాని అధికారికంగా తెలిసికోగల్గునా? దాని నిర్ణయించవలసినది నీవు మాత్రమే. తమకొరకు వేరొకరు నిర్ణయించుటను కోరుకొనరను విషయములో యెహోవా సాక్షులు స్థిరులైయున్నారు; దేవునియెదుట అది వారి వ్యక్తిగతబాధ్యతయైయున్నది.

నీకు హేయమైన ఒక చికిత్సా విధానమును కోర్టు బలవంతము చేసినట్లయిన, అది నీ మనస్సాక్షిని, జీవింపవలెనను నీ కోరిక విషయమును ఎట్లు ప్రభావితము చేయును? “భౌతికంగా చికిత్స చేయుటకొరకు, అతడి మనస్సాక్షిని అతిక్రమించి, ఒకానొక చికిత్సను అంగీకరింపవలెనని రోగిని బలవంతముచేయుటకు నడుపునది, తప్పుదోవపట్టిన వైద్యపరమయిన అత్యాశ అని ఖచ్ఛితమే గాక, అతడి మనస్సునకు చావుదెబ్బదీయుటయై యుండును,” అని డాక్టర్‌ కొనార్డ్‌ డ్రెబింగర్‌ వ్రాసెను.—డెర్‌ ప్రాక్టిషి ఆర్జ్‌, జూలై 1978.

పిల్లలకొరకు ప్రేమదాయకమైన సంరక్షణ

రక్తమునుగూర్చి కోర్టుకేసులు ప్రధానంగా పిల్లలకు సంబంధించియుండును. కొన్ని సందర్భములలో, ప్రేమపూర్వకమైన తలిదండ్రులు రక్తరహిత చికిత్సను ఉపయోగించుడని గౌరవంగా అడిగినప్పుడు, కొందరు వైద్యసిబ్బంది రక్తమును యిచ్చుటకు కోర్టు సహాయము కొరకు ప్రయత్నించిరి. అయితే, పిల్లలను చెడుగా వినియోగించుట లేక నిర్లక్ష్యంచేయుటను బంధించు చట్టములతో, కోర్టు చర్యలతో క్రైస్తవులు ఏకీభవింతురు. కొందరు తలిదండ్రులు పిల్లలను హింసించిరని, లేక వైద్య చికిత్సలను నిరాకరించిరను సందర్భములను నీవు చదివియుండవచ్చును. ఎంత శోచనీయం! స్పష్టముగా, నిర్లక్ష్యపరచబడిన ఒక పిల్లవానిని రక్షించుటలో ప్రభుత్వము ముందడుగ వేయగలదు మరియు వేయవలెను. అయినప్పటికీ, సంరక్షించు తల్లి/తండ్రి ఉన్నతమైన రక్తరహితమైన వైద్యచికిత్సను కోరినప్పుడు అది ఎంతభేదమును కలిగియుండునో చూచుట చాలా సులభం.

సాధారణంగా ఆసుపత్రినందున్న, పిల్లవాడిపై ఈ కోర్టుకేసులు కేంద్రీకరించును. అక్కడికి పిల్లవాడెట్లు వచ్చెను. మరియు ఎందుకు? సర్వసాధారణంగా, పిల్లవాడు నాణ్యమైన సంరక్షణను పొందుటకు సంబంధిత తలిదండ్రులు తెచ్చుదురు. యేసుకూడా పిల్లలందు ఆసక్తి కలిగియున్నట్లుగా క్రైస్తవ తలిదండ్రులు వారి పిల్లలనుగూర్చి జాగ్రత్త వహించుదురు. ‘సొంత బిడ్డలను గారవించుచు, స్తన్యమిచ్చు తల్లిని’ గూర్చి బైబిలు పలుకుచున్నది. యెహోవా సాక్షులు వారి పిల్లలనుగూర్చి అటువంటి లోతైన ప్రేమను కలిగియున్నారు.— 1 థెస్సలొనీకయులు 2:7 ;మత్తయి 7:11; 19:13—15.

సహజంగా, తలిదండ్రులందరూ వారి పిల్లల క్షేమము, ప్రాణములనుగూర్చి నిర్ణయములు చేయుదురు: ఇంటిని వేడిమిచేయుటకు కుటుంబం గ్యాస్‌ను లేక చమురును వాడుచున్నదా? సుదూర ప్రయాణములకు పిల్లవాడిని వారు తీసికొనిపోవుచున్నారా? ఈతకు అతడు వెళ్లుచున్నాడా? అటువంటి విషయాలు, జీవన్మరణ సమస్యలతోపాటు సమస్యాపూర్వకమైనవి. తలిదండ్రుల విచక్షణను సమాజము గుర్తించినది, కావున తమ పిల్లలకు సంబంధించిన నిర్ణయములన్నింటిని చేయుటకు తలిదండ్రులకు విస్తృత అధికారమివ్వబడినది.

అమెరికా సుప్రీంకోర్టు, 1979 లో ఇలా స్పష్టముగా చెప్పెను: “చట్టమునందు కుటుంబముయొక్క భావన, పిల్లవానిలో లోపించిన పరిపక్వత, అనుభవము మరియు జీవితముయొక్క సంక్లిష్ట నిర్ణయాలకు అవసరమైన తీర్మాన సామర్థ్యములు తలిదండ్రులు కలిగియున్నారను తలంపుపై ఆధారపడినది . . . కేవలం తల్లి/తండ్రి నిర్ణయము [వైద్య విషయాలపై] చిక్కు మయమయినచో, ఆ నిర్ణయమునుచేయు అధికారము ఆ తల్లి/తండ్రినుండి ఒక సంస్థకుగాని, ప్రభుత్వాధికారికిగాని దానికదే బదలాయించబడదు.” —పర్‌హామ్‌ వి. జె. ఆర్‌.

అదే సంవత్సరం, న్యూయార్కు కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ ఇలా తీర్పునిచ్చెను: “పిల్లవానికి తగిన వైద్యసంరక్షణను లేకుండా చేయుచున్నదనుటను నిర్ణయించుటలోగల అతి ప్రాముఖ్యమైన విషయమేమనగా . . . చుట్టూవున్న పరిస్థితులలో అంగీకృతమైన వైద్యచికిత్సా విధానమును తలిదండ్రులు అందించిరనుట. ఈ విచారణ తల్లి/తండ్రి ‘తగిన’ లేక ‘తగని’ నిర్ణయము చేసితిరను మాటలలో నిలువరించబడలేదు, ఎందుకనగా, గొప్ప అభివృద్ధి వున్నప్పటికీ, ప్రస్తుత వైద్యశాస్త్ర అభ్యాసస్థాయి, అటువంటి ఖచ్ఛితమైన ముగింపులకు బహు అరుదుగా అనుమతించును. తల్లి/తండ్రియొక్క ఉపస్థానమును ఒక కోర్టు ఊహించుకొననేరదు.”—ఇన్‌రె హోఫ్‌బాయిర్‌.

శస్త్రచికిత్స మరియు సూక్ష్మజీవ వినాశక ఔషధములలో ఎంపిక చేసికొనుచున్న తలిదండ్రుల ఉదాహరణను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రతి చికిత్సావిధానమునకు దాని చిక్కులు దానికిగలవు. ప్రేమపూర్వకమైన తలిదండ్రులు, చిక్కుసమస్యలను, ప్రయోజనములను, మరియు యితర విషయాలను సరితూచుకొని, అప్పుడు ఒక ఎంపిక చేసికొనుటకు బాధ్యులైయున్నారు. దీనిని పునస్కరించుకొని, ఈ క్రింది పరిస్థితిని కలిగియున్న గైడ్స్‌ టుది జడ్జ్‌ ఇన్‌ మెడికల్‌ ఆర్డర్స్‌ అఫెక్టింగ్‌ చిల్డ్రన్‌ యొక్క పునఃసమీక్షకై డాక్టర్‌ జాన్‌ శామ్యూల్స్‌ (అనెస్తీషియాలజీ న్యూస్‌, అక్టోబరు 1989) ఇలా సలహానిచ్చెను:

“తన రోగులు జీవించునో లేక మరణించునో అని యుక్తమైన నిశ్చయతతో చెప్పగల సమర్థతగలవారిగా వైద్యులను చేయుటకు వైద్యపరిజ్ఞానము అంతగా అభివృద్ధిచెందలేదు . . . పద్ధతుల్లో ఎంపిక ఉన్నట్లయితే—ఉదాహరణకు, తలిదండ్రులకు అనంగీకారయోగ్యమైన, 80 శాతమువరకు విజయావకాశములుగల ఒక పద్ధతిని గాని, మరియు తలిదండ్రులకు నిరభ్యంతరకరమైన కేవలం 40 శాతంవరకు విజయావకాశముగల ఒక పద్ధతికిగాని వైద్యుడు సిఫారసు చేసినయెడల—వైద్యరీత్యా కష్టతరమైన దానిని, అయితే తలిదండ్రులకు నిరభ్యంతరమైన పద్ధతిని వైద్యుడు అవలంభించవలెను.”

వైద్యరీత్యా రక్తమును ఉపయోగించుటయందు బహిర్గతమైన అనేక ప్రాణాంతకమైన అపాయముల దృష్ట్యా, మరియు చికిత్సయందు సమర్థనీయమైన ప్రత్యామ్నాయ పద్ధతుల దృష్ట్యా, రక్తమును విసర్జించుట తక్కువ సమస్యలను తెచ్చునదై యుండదా?

సహజముగా, వారి పిల్లవానికి శస్త్రచికిత్స అవసరమైనయెడల క్రైస్తవులు అనేక విషయాలను సరితూచుకొందురు. రక్తమును ఉపయోగించిననూ లేకున్ననూ, ప్రతి శస్త్రచికిత్సకు కొన్ని చిక్కులుగలవు. శస్త్రవైద్యుడేమి హామి యిచ్చును? సాక్షులైన పిల్లవానికి రక్తరహిత శస్త్ర చికిత్సద్వారా సత్ఫలితాలను సాధించిన నిపుణులైన వైద్యులగురించి తలిదండ్రులకు తెలిసియుండును. కావున వైద్యుడుగాని, ఆసుపత్రి అధికారిగాని వేరొక విధానమును కలిగియున్ననూ, ఆందోళనకరమైన మరియు కాలయాపనపరమైన చట్ట సంబంధపోరు సల్పుటకంటే, ప్రేమపూర్వకమైన తలిదండ్రులతో కలిసిపనిచేయుటకు వారికి కారణయుక్తము కాదా? లేక, ఆ విధముగా చేయు మరియు అటువంటి కేసులను నిర్వహించగల అనుభవము కలిగిన సిబ్బంది ఉన్న వేరొక ఆసుపత్రికి పిల్లవానిని తలిదండ్రులు తరలించవచ్చును. వార్తవానికి, రక్తరహితమైన చికిత్సయే నాణ్యమైన సంరక్షితము కాగలదు, ఎందుకనగా ముందే మనము గమనించిన “చట్టబద్ధమైన వైద్యపర, వైద్యేతర లక్ష్యాలను సాధించుటకు” కుటుంబమునకు అది సహాయపడగలదు.

[అధస్సూచీలు]

^ పేరా 10 పునర్ముద్రింపబడిన, “రక్తము: ఎవరి ఎంపిక మరియు ఎవరి మనస్సాక్షి?” అను వైద్యశీర్షికను పుటలు 30-1 లో చూడుము.

[18వ పేజీలోని బాక్సు]

చట్టపరమైన వాటినుండి విడుదల

‘కొందరు వైద్యులు మరియు ఆసుపత్రులు ఎందుకు రక్తము నిచ్చుటకు కోర్టు ఉత్తర్వులను తెచ్చుటలో త్వరపడుదురు?’ అని నీవు ఆశ్చర్యపడవచ్చును. కొన్నిప్రాంతములలో జవాబుదారీగా ఉండుటకుగల భయమే దానికి కారణం.

యెహోవా సాక్షులు రక్తరహిత చికిత్సా విధానమునెంచుకున్నప్పుడు అటువంటి వ్యవహారమునకు ఆధారము లేదు. ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ వైద్య కళాశాల (అమెరికా) నందలి ఒక వైద్యుడు ఇలా వ్రాసెను: “వైద్యులను ఆసుపత్రులను జావాబుదారులుగా విడిపించుచూ అమెరికా వైద్యసమాఖ్య పత్రముపై అనేకులు (సాక్షులు) వెంటనే సంతకము చేయుదురు మరియు అనేకులు మెడికల్‌ అలెర్ట్‌ (కార్డు) ను తెచ్చుకొందురు. ‘రక్త పదార్ధములు అంగీకారమునకు నిరాకరణా’ పత్రములను తగినరీతిలో సంతకం చేయబడి, తేదీవేయబడినచో, అది ఖరారుపూర్వక ఒడంబడిక మరియు చట్టబద్ధమైనది.”—అనెస్థిషియాలజీ న్యూస్‌, అక్టోబరు 1989.

అవును, కోరిన రక్తరహిత చికిత్సనందించినప్పుడు వైద్యుడు కాని ఆసుపత్రిగాని జవాబుదారులు కానేరరని యెహోవా సాక్షులు సహకరించువిధంగా, చట్టబద్ధమైన హామిని ఇచ్చుదురు. వైద్య నిపుణులచే సిఫారసు చేయబడిన రీతిలో ప్రతి సాక్షి ఒక మెడికల్‌ డాక్యుమెంటు కార్డునుతెచ్చును. ఇది సంవత్సర కాలములో పునఃప్రారంభించబడి ఆ వ్యక్తిచే సాక్షులచే తరచూ అతని సమీప బంధువుచే సంతకము చేయబడును.

1990 మార్చిలో కెనడా, ఒన్టారియో నందలి సర్వోన్నత న్యాయస్థానము అటువంటి పత్రం ఆమోదయోగ్యమైనదని వ్యాఖ్యానించు తీర్మానమును సమర్థించినది: “ఈ కార్డు యోగ్యమైన, వ్రాతపూర్వక ప్రకటనయైయున్నది, వైద్యునితోగల ఒప్పందమునకు వ్రాతపూర్వక నిషేధమును చట్టబద్ధంగా కార్డు స్వంతదారుడు, వేయవచ్చును.” మెడిసినిక్స్‌ ఎటిక్‌ (1985) లో ప్రొఫెసర్‌ డానియేల్‌ ఆండర్సన్‌ ఇలా వ్రాసెను: “రోగి తాను ఒక యెహోవా సాక్షినని, ఎట్టి పరిస్థితుల్లో రక్తమును యిష్టపడనని నిస్సందేహాస్పదముగా వ్రాతపూర్వక ప్రకటనను కలిగియుండిన యెడల, రోగియొక్క స్వయంప్రతిపత్తిని గౌరవించుటకు కావలసినదేమనగా, ఈ అభీష్టమును నోటిమాటగా వ్యక్తిపరచునట్లుగానే మన్నింపబడవలెను.”

సాక్షులు ఆసుపత్రి అనుమతి పత్రాలపైకూడ సంతకం చేయుదురు. ఫ్రీబర్గ్‌, జర్మని ఆసుపత్రినందు ఉపయోగింపబడు ఒక పత్రంలో, చికిత్సనుగురించి రోగికి వైద్యుడిచ్చిన సమాచారమును వివరించుటకు స్థలముండును. అంతేగాక, వైద్యుడు మరియు రోగియొక్క సంతకాలపై, ఈ పత్రంలో: “యెహోవాసాక్షుల మత సంస్థ సభ్యునిగా, నాకు జరుగు శస్త్రచికిత్సయందు యితర రక్తమునుగాని, రక్తపదార్థములనుగాని ఉపయోగించుటకు నేను నిస్సంశయముగా తిరస్కరించుచున్నాను ఏర్పాటుచేయబడిన అవసరమైన పద్ధతి రక్తస్రావసమస్యలవలన అధిచిక్కులమయమైనదని నేనెరుగుదును. ప్రత్యేకంగా దానిగురించి సవివరమైన వివరణను అందుకొనిన తరువాతే, అవసరమైన శస్త్ర చికిత్సను యితర రక్తమునుగాని రక్త పదార్థములుగాని ఉపయోగింపబడకుండా చేయవలెనని నేను కోరుచున్నాను,” అని చేర్చబడినది.—హెర్చ్‌ క్రిస్‌లాఫ్‌, ఆగష్టు 1987.

వాస్తవానికి, రక్తరహిత చికిత్స కొద్ది చిక్కులను కలిగియుండవచ్చును. కానీ, ప్రజలు స్వస్థులగుటకు సహాయపడుట అను ఒప్పుకోలును చేయుటలో వైద్యసిబ్బంది ముందడుగు వేయునట్లుగా, రోగులైన సాక్షులు అవసరములేని వాటినుండి సంతోషముగా విడిపించుదురనుట యిక్కడ విషయము. “మేజర్‌ అబ్డామినల్‌ ఆపరేషన్స్‌ ఆన్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌” నందు డాక్టర్‌ ఏంజిలోస్‌ ఎ. కంబోరిస్‌ చూపినట్లు, ఈ సహకారము అందరికి ప్రయోజనము:

“శస్త్ర చికిత్సకు ముందుగల ఒప్పందము, శస్త్రవైద్యుడు బద్ధుడగునని దృష్టింపబడవలెను, మరియు శస్త్ర చికిత్సనందు, తరువాత ఉత్పన్నమగు పరిస్థితుల కతీతంగా, అది అనుసరణీయం చేయబడవలెను. [ఇది] రోగులను వారి శస్త్రచికిత్సకు అనుకూలంగా స్ఫురింపజేయును, మరియు శస్త్ర వైద్యుల అవధానమును, చట్టసంబంధ, తాత్విక విషయములనుండి మళ్లించి శస్త్రవైద్య, సాంకేతిక పరమైన విషయములు, తగిన రీతిలో జరుపుటకు, రోగికి చేయగల అత్యధిక సహాయము చేయుటకు అతడిని నడుపును.”—ది అమెరికన్‌ సర్జన్‌, జూన్‌ 1987.

[19వ పేజీలోని బాక్సు]

“ప్రస్తుత ఆరోగ్య సంరక్షణా వ్యయములోగల పెరుగుదలనందు, వైద్య విజ్ఞానమును మితిమీరి ఉపయోగించుట ఒక ప్రధాన విషయము. . . . రక్తమార్పిడి ప్రత్యేకమైనది ఎందుకనగా, దాని వెల మరియు రాదగిన గొప్ప చిక్కులు. ఆ విధముగానే, రక్త మార్సిడిని ‘అధిక పరిమాణము, అధిక చిక్కులు మరియు పొంచియున్న పొరపాట్లు’ అని విస్త్రుతాధికారి ప్రతిపత్తి కొరకు అమెరికన్‌ జాయింట్‌ కమిషన్‌ వర్గీకరించినది.”—“ట్రాన్‌ఫ్యూజన్‌,” జూలై-ఆగష్టు 1989.

[20వ పేజీలోని బాక్సు]

అమెరికా సంయుక్త రాష్ట్రములు: “రోగియొక్క అనుమతి అవసరతనందు వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి భావన ఉన్నది. అది ఒకవ్యక్తియొక్క స్వగతిని నిర్ణయించునదై ఉండవలెను. రోగి అనుమతి లేకుండ చట్టపరమైన వైద్య చర్య జరిపిన అది అక్రమముగా కొట్టుటవలె రూపింపబడుట, అనుమతిని కోరుటకుగల చట్ట బద్ధమైన హేతువు.”—“ఇన్‌ఫార్మ్‌డ్‌ కన్సెంట్‌ ఫర్‌బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌,” 1989.

జర్మని: “రోగియొక్క స్వయం నిర్ణయ హక్కు, సహాయము జరిగించుట మరియు ప్రాణమును నిలుపుట అను సూత్రమునకు అతీతమైనది. తత్ఫలితముగా: రోగి యిష్టతకు వ్యతిరేకముగా రక్తమార్పిడి కూడదు.”—“హెర్జ్‌ క్రిస్‌లాఫ్‌,” ఆగష్టు 1987

జపాను: “వైద్య ప్రపంచమందు ‘సర్వసంపూర్ణత’ లేదు. ఆధునిక వైద్యం ఉత్తమమని, దాని విధానము అనుసరణీయమని వైద్యులు నమ్ముదురు కాని, రోగులపై దానియొక్క ప్రతి వివరణను, ‘సర్వ సంపూర్ణతను’ ఆపాదించుటకు వారు వత్తడి చేయరాదు. రోగులుకూడా, స్వేచ్ఛా ఎంపికను కలిగియుండవలెను.”—“మినామి నిహాన్‌ షింబున్‌,” జూన్‌ 28, 1985.

[21వ పేజీలోని బాక్సు]

“సున్నితంగా ఉన్న ప్రేమపూర్వకమైన కుటుంబములను [యెహోవా సాక్షుల] నేను కనుగొంటిని,” అని డాక్టర్‌ లారెన్స్‌ ఎస్‌. ఫ్రాంకెల్‌ చెప్పుచున్నారు. పిల్లలు జ్ఞానయుక్తులు, సంరక్షింపబడుచు, గౌరవప్రదమైన వారు. . . . వారి నమ్మకములు అనుమతింప బడునంతవరకు వైద్య సంబంధమైన సంప్రదింపును అంగీకరించుటను కనబరచు ప్రయత్నమును సూచింపజేయగల వైద్య విధానమునకు మరింత అనుకూలత సాధ్యపడినట్లు అగుపడుచున్నది కూడా.”—డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌, ఎమ్‌. డి. ఆండిర్సన్‌ హాస్పిటల్‌ అండ్‌ ట్యూమర్‌ ఇన్‌స్టిట్యూట్‌, హూస్టన్‌, యు.ఎస్‌.ఎ., 1985.

[22వ పేజీలోని బాక్సు]

“స్వచ్ఛత కలిగిన వైద్యపర నిర్ణయమును కూల్చుటకు వృత్తిపరమైన దురంహంకారము అసహజము కానేరదని, నేను భయపడుచున్నాను” అని డాక్టర్‌ జేమ్సు యల్‌. ఫ్లెచర్‌, జూనియర్‌ వ్యాఖ్యానించుచున్నాడు. “‘నేడు ఉన్నతమని’ చెప్పబడు చికిత్సా పద్ధతులు, రేపు సవరించబడుచున్నవి లేక నిరాకరింపబడుచున్నవి. ‘మత తత్వంగల తల్లి/తండ్రి’ లేక తన చికిత్సా విధానమే సర్వసంపూర్ణమైన విలువగలదని నమ్ము దురంహంకారియైన వైద్యుడు దీనిలో ఏది అతిప్రమాదకరమైనది?”—“పీడియాడ్రిక్స్‌,” అక్టోబరు1988.