కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 5

పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి

పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి

1, 2. తమ పిల్లలను పెంచడంలో సహాయం కొరకు తలిదండ్రులు ఎవరి వైపు చూడాలి?

 “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని 3,000 సంవత్సరాల క్రితం మెప్పుగల ఒక తండ్రి పలికాడు. (కీర్తన 127:3) వాస్తవానికి, తలిదండ్రులు కాగల ఆనందం దేవునినుండి వచ్చిన అమూల్యమైన బహుమానం, అది చాలామంది వివాహమైన ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే, తలిదండ్రులవ్వడం ఆనందంతోబాటు బాధ్యతలను కూడా తెస్తుందని పిల్లలుగలవారు త్వరలోనే గ్రహిస్తారు.

2 ప్రాముఖ్యంగా నేడు, పిల్లలను పెంచడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ, అనేకులు దాన్ని విజయవంతంగా చేశారు, ప్రేరేపించబడిన కీర్తనల గ్రంథకర్త ఇలా చెబుతూ, ఆ మార్గాన్ని సూచించాడు: “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.” (కీర్తన 127:1) యెహోవా ఉపదేశాలను మీరెంత నిశితంగా అనుసరిస్తారో, మీరు అంత శ్రేష్ఠమైన తలిదండ్రులౌతారు. బైబిలు ఇలా చెబుతుంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” (సామెతలు 3:5) మీరు మీ 20 ఏళ్ల పిల్లల పెంపకపు యోజనను ప్రారంభించబోతుండగా యెహోవా సలహాలను వినేందుకు మీరు ఇష్టతను కలిగివున్నారా?

బైబిలు దృష్టికోణాన్ని అంగీకరించడం

3. పిల్లలను పెంచడంలో తండ్రులకు ఏ బాధ్యత ఉంది?

3 ప్రపంచవ్యాప్తంగా అనేక గృహాల్లో, పిల్లలకు తర్ఫీదునివ్వడాన్ని పురుషులు ముఖ్యంగా స్త్రీ యొక్క పనిగా దృష్టిస్తారు. నిజమే, సూత్రప్రాయంగా పోషకుని పాత్ర తండ్రిదేనని దేవుని వాక్యం సూచిస్తోంది. అయితే, ఆయనకు గృహంలో బాధ్యతలున్నాయని కూడా అది చెబుతుంది. బైబిలు ఇలా చెబుతుంది: “బయట నీ పని చక్క పెట్టుకో ముందు పొలంలో దాని సిద్ధపరచు తరువాత నీ కుటుంబాన్ని కూడా నిర్మించుకోవాలి.” (సామెతలు 24:27, NW) దేవుని దృష్టిలో, తండ్రులు మరియు తల్లులు పిల్లలకు తర్ఫీదునివ్వడంలో భాగస్థులు.—సామెతలు 1:8, 9.

4. మగ పిల్లలను ఆడ పిల్లలకంటే ఉన్నతులుగా మనం ఎందుకు దృష్టించకూడదు?

4 మీరు మీ పిల్లలనెలా దృష్టిస్తారు? ఆసియాలో, “అమ్మాయిలు జన్మించడం తలిదండ్రులకు ఇష్టంగా ఉండడం లేదని” నివేదికలు చెబుతున్నాయి. లాటిన్‌ అమెరికాలో, “ఎక్కువ జ్ఞానవంతులైన కుటుంబాలలో” కూడా ఇప్పటికీ ఆడపిల్లల ఎడల ప్రతికూలభావం ఉందని నివేదికలు చూపుతున్నాయి. అయితే సత్యమేమంటే ఆడపిల్లలు తక్కువ జాతి పిల్లలు కారు. ప్రాచీన కాలాల్లోని పేరుపొందిన తండ్రి అయిన యాకోబు, ఆ సమయానికి తనకు కలిగిన కుమార్తెలతో సహా తన సంతానాన్ని అంతటినీ ‘దేవుడు నాకు దయచేసిన పిల్లలు’ అని వర్ణించాడు. (ఆదికాండము 33:1-5; 37:35) అదే విధంగా, యేసు తన వద్దకు తేబడిన “చిన్న పిల్లలను” అందరినీ (బాలురు మరియు బాలికలను) దీవించాడు. (మత్తయి 19:13-15) ఆయన యెహోవా దృష్టిని ప్రతిబింబించాడన్న నిశ్చయతను మనం కలిగివుండవచ్చు.—ద్వితీయోపదేశకాండము 16:14.

5. తమ కుటుంబ పరిమాణం విషయంలో ఒక దంపతుల నిర్ణయాన్ని ఏ ఆలోచనలు నడిపించాలి?

5 ఒక స్త్రీ తనకు వీలైనంత మంది పిల్లలకు జన్మనివ్వాలని మీ సమాజం అపేక్షిస్తుందా? తమకు ఎంతమంది పిల్లలు ఉండాలన్నది నిర్ణయించుకోవడం కచ్చితంగా వివాహదంపతుల వ్యక్తిగత నిర్ణయమే. ఎక్కువమంది పిల్లలకు తిండి, బట్ట మరియు విద్యను తలిదండ్రులు ఇవ్వలేకపోతే అప్పుడేమిటి? కుటుంబ పరిమాణం ఎంత ఉండాలనే దాన్ని తీర్మానించుకునేటప్పుడే దంపతులు ఈ విషయాన్ని గురించి ఆలోచించుకోవాలి. తమ పిల్లలందరినీ పెంచలేని దంపతులు తమ పిల్లల్లో కొందరిని పెంచే బాధ్యత తమ బంధువులపై వేస్తారు. ఈ పద్ధతి కోరదగినదేనా? కానేకాదు. అది తమ పిల్లల ఎడల తలిదండ్రులకున్న కర్తవ్యంనుండి వారిని తప్పించదు. బైబిలు ఇలా చెబుతుంది: ‘ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడు.’ (1 తిమోతి 5:8) బాధ్యతగల దంపతులు, ‘తమ స్వకీయులను సంరక్షించేందుకు తమ యింటి’ పరిమాణాన్ని గురించి పథకం వేసుకుంటారు. దీన్ని చేసేందుకు వారు సంతాననిరోధాన్ని అనుసరించవచ్చా? అది కూడా వ్యక్తిగత నిర్ణయమే, మరి వివాహమైన దంపతులు ఈ విషయాన్ని గురించి నిర్ణయించుకుంటే ఎలాంటి గర్భనిరోధకాలను ఉపయోగించాలన్నది కూడా వ్యక్తిగత విషయమే. “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:5) అయితే, ఏ విధంగానైనా గర్భస్రావం కలిగించే సంతాన నిరోధక చర్య బైబిలు సూత్రాలకు విరుద్ధమైనది. యెహోవా దేవుని “యొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) గర్భంలో జీవం ప్రారంభమైన తర్వాత దాన్ని నాశనం చేయడం యెహోవా ఎడల పూర్తి అగౌరవాన్ని చూపిస్తుంది, అది హత్యతో సమానం కాగలదు.—నిర్గమకాండము 21:22, 23; కీర్తన 139:16; యిర్మీయా 1:5.

మీ పిల్లవాని అవసరతలను తీర్చడం

6. పిల్లవాని తర్ఫీదు ఎప్పుడు ప్రారంభమవ్వాలి?

6 సామెతలు 22:6 ఇలా చెబుతుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము.” పిల్లలకు తర్ఫీదునివ్వడం తలిదండ్రులకున్న మరొక పెద్ద బాధ్యత. అయితే, ఆ తర్ఫీదు ఎప్పుడు ప్రారంభమవ్వాలి? చాలా త్వరగానే. తిమోతి “పసితనము నుండే” తర్ఫీదు పొందాడని అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు. (2 తిమోతి 3:15, NW) ఇక్కడ ఉపయోగింపబడిన గ్రీకు పదం చిన్న బిడ్డను లేక జన్మించని శిశువును కూడా సూచిస్తుంది. (లూకా 1:41, 44; అపొస్తలుల కార్యములు 7:18-20) కాబట్టి, తిమోతి తాను చాలా చిన్నప్పుడే తర్ఫీదు పొందాడు—మరి అది సరైనదే. బిడ్డకు తర్ఫీదునిచ్చేందుకు పసితనమే సరైన సమయం. ఒక చిన్న బిడ్డకు కూడా జ్ఞానతృష్ణ ఉంటుంది.

7. (ఎ) తలిదండ్రులిరువురూ బిడ్డతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలన్నది ఎందుకు ప్రాముఖ్యం? (బి) యెహోవాకు మరియు ఆయన అద్వితీయ కుమారునికి మధ్య ఎలాంటి సంబంధం ఉండేది?

7 “నేను నా బాబును మొదట చూసినప్పుడే నేను వాన్ని ప్రేమించాను” అని ఒక తల్లి చెబుతుంది. అలా అనేకమంది తల్లులకు అవుతుంది. తల్లీ బిడ్డల మధ్య ఉండే ఆ అందమైన బంధం, పుట్టుక తర్వాత వారిద్దరూ కలిసి సమయం గడిపే కొలది పెరుగుతుంది. పాలివ్వడం ఆ సన్నిహితత్వాన్ని పెంచుతుంది. (1 థెస్సలొనీకయులు 2:7 పోల్చండి.) తల్లి తన బిడ్డను లాలించడం, ఆ బిడ్డతో మాట్లాడటం బిడ్డ భావోద్రేక అవసరతలను తీర్చడంలో అత్యంత ప్రాముఖ్యమైనది. (యెషయా 66:12 పోల్చండి.) అయితే తండ్రి సంగతేమిటి? ఆయనకూడా తన నూతన సంతానంతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవాలి. యెహోవా తానే దీనికొక ఉదాహరణ. సామెతల గ్రంథంలో, “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. . . . అనుదినము ఆయనకు ఇష్టునిగా నేనుంటిని” అని చెప్పినట్లుగా సూచింపబడిన తన అద్వితీయ కుమారునితో యెహోవాకున్న సంబంధాన్ని గురించి మనం నేర్చుకుంటాము. (సామెతలు 8:22, 30, NW; యోహాను 1:14) అదే విధంగా, ఒక మంచి తండ్రి తన బిడ్డతో వాని జీవితారంభం నుండే ఆప్యాయత, ప్రేమగల సంబంధాన్ని పెంచుకుంటాడు. “వీలైనంత ఎక్కువ ప్రేమను చూపండి. కౌగిలించుకోవడం, ముద్దుపెట్టడం ద్వారా ఏ పిల్లాడూ ఇంతవరకూ చనిపోలేదని” ఒక తండ్రి చెబుతున్నాడు.

8. బిడ్డలకు వీలైనంత త్వరగా తలిదండ్రులు ఏ మానసిక ప్రేరణను ఇవ్వాలి?

8 అయితే బిడ్డలకు అంతకంటే ఎక్కువే కావాలి. పుట్టుక నుండే, సమాచారాన్ని అందుకుని దాన్ని భద్రపర్చేందుకు వారి మెదడులు సిద్ధంగా ఉంటాయి, మరి ఆ జ్ఞానానికి ప్రధాన మూలం తలిదండ్రులే. భాషను ఒక ఉదాహరణగా తీసుకోండి. బిడ్డ మాట్లాడటం మరియు చదవడం ఎంత చక్కగా నేర్చుకుంటాడు అనేది, “బిడ్డ తొలి దశలో తన తలిదండ్రులతో సంభాషించే పద్ధతికి ఎంతో దగ్గరి సంబంధాన్ని కలిగివుందని” భావించబడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. మీ బిడ్డతో శిశు ప్రాయంనుండే మాట్లాడటం మరియు చదవటం వంటివి చేయండి. త్వరలో వాడు మిమ్మల్ని అనుకరించాలని ఇష్టపడతాడు, కొంత కాలానికే మీరు వానికి చదవడం కూడా నేర్పిస్తుంటారు. బహుశా, వాడు పాఠశాలలో చేరకముందే చదవగల్గవచ్చు. ఉపాధ్యాయులు తక్కువమంది ఉండి తరగతి గదుల్లో ఎక్కువమంది విద్యార్థులుండే దేశంలో మీరు జీవిస్తుంటే అది ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటుంది.

9. తలిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన లక్ష్యం ఏమిటి?

9 క్రైస్తవ తలిదండ్రుల మొట్టమొదటి బాధ్యత తమ బిడ్డ యొక్క ఆత్మీయ అవసరతలను తీర్చడమే. (ద్వితీయోపదేశకాండము 8:3 చూడండి.) ఏ లక్ష్యంతో? తమ బిడ్డ క్రీస్తు వంటి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసుకునేందుకు, తద్వారా “నవీనస్వభావమును” ధరించుకునేందుకు సహాయం చేయడానికి. (ఎఫెసీయులు 4:24) అందుకొరకు వారు సరైన నిర్మాణ సామాగ్రి మరియు సరైన నిర్మాణ పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరత ఉంది.

మీ బిడ్డకు సత్యాన్ని అభ్యసింపజేయండి

10. పిల్లలు ఏ లక్షణాలను వృద్ధిచేసుకోవలసిన అవసరం ఉంది?

10 ఒక భవనం యొక్క నాణ్యత దాని కట్టడంలో ఉపయోగింపబడే సామాగ్రిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ వ్యక్తిత్వం కొరకు మేలైన నిర్మాణ సామాగ్రి “బంగారము, వెండి, వెలగల రాళ్లు” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 3:10-12) అవి విశ్వాసము, జ్ఞానము, వివేచన, యథార్థత, గౌరవం మరియు యెహోవా ఎడల ఆయన న్యాయవిధుల ఎడల ప్రేమపూర్వక గుణగ్రహణ అనే లక్షణాలను సూచిస్తాయి. (కీర్తన 19:7-11; సామెతలు 2:1-6; 3:13, 14) ఈ లక్షణాలను పెంపొందింపజేసుకునేందుకు తమ పిల్లలకు బాల్యం నుండే తలిదండ్రులెలా సహాయం చేయగలరు? పూర్వకాలంలోనే సూచింపబడిన ఒక పద్ధతిని అనుసరించడం ద్వారా.

11. దైవిక వ్యక్తిత్వాలను వృద్ధి చేసుకోడానికి ఇశ్రాయేలు తలిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేశారు?

11 ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి కొద్దికాలం ముందే, ఇశ్రాయేలీయుల తలిదండ్రులకు యెహోవా ఇలా చెప్పాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) అవును, తలిదండ్రులు మాదిరులుగా, సహవాసులుగా, సంభాషించే వారిగా మరియు బోధకులుగా ఉండాల్సిన అవసరతవుంది.

12. తలిదండ్రులు ఒక మంచి మాదిరులుగా ఉండటం ఎందుకు ఆవశ్యకం?

12 మాదిరిగా ఉండండి. మొదట, యెహోవా ఇలా చెప్పాడు: “ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.” తర్వాత, ఆయనింకా ఇలా చెప్పాడు: “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప”జేయాలి. కాబట్టి దైవిక లక్షణాలు మొదట తలిదండ్రుల హృదయాల్లో ఉండాలి. తండ్రి సత్యాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించాలి. అప్పుడే ఆయన తన బిడ్డ హృదయాన్ని చేరుకోగలడు. (సామెతలు 20:7) ఎందుకు? ఎందుకంటే పిల్లలు వారు వినేదాని కంటే వారు చూసే దాన్నిబట్టే ఎక్కువ ప్రభావితం చెందుతారు.—లూకా 6:40; 1 కొరింథీయులు 11:1.

13. తమ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడంలో క్రైస్తవ తలిదండ్రులు యేసు మాదిరిని ఎలా అనుకరించగలరు?

13 సహవాసులై ఉండండి. ఇశ్రాయేలులోని తలిదండ్రులకు యెహోవా ఇలా చెప్పాడు: ‘నీవు నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును వాటినిగూర్చి నీ కుమారులతో మాట్లాడవలెను.’ అందుకొరకు, తలిదండ్రులకు ఎంత పనివున్నప్పటికీ పిల్లలతో కొంత సమయాన్ని గడపాల్సిన అవసరం ఉంది. తాను చిన్నపిల్లల కొరకు తన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరముందని యేసు భావించాడన్నది స్పష్టం. ఆయన పరిచర్య యొక్క చివరి దినాల్లో, “తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి.” యేసు ప్రతిస్పందన ఏమిటి? “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:13, 16) ఊహించుకోండి, యేసు జీవితం యొక్క చివరి గడియలు త్వరగా గడిచిపోతున్నాయి. అయినప్పటికీ, ఆయన ఈ పిల్లలకు తన సమయాన్ని, అవధానాన్ని ఇచ్చాడు. ఎంత చక్కని పాఠం!

14. తలిదండ్రులు తమ పిల్లలతో సమయాన్ని గడపడం వారికెందుకు ప్రయోజనకరం?

14 సంభాషించే వారిగా ఉండండి. మీ బిడ్డతో సమయాన్ని గడపడం వానితో సంభాషించేందుకు మీకు సహాయపడుతుంది. మీరు ఎంత ఎక్కువగా సంభాషిస్తే, వాని వ్యక్తిత్వం ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు అంత శ్రేష్ఠంగా తెలుసుకోగలరు. అయితే, సంభాషించడమంటే మాట్లాడటం కంటే ఎక్కువేనని జ్ఞాపకముంచుకోండి. “నేను వినే కళను నేర్చుకోవలసి వచ్చింది, నేను నా హృదయంతో వినాల్సి ఉంది” అని బ్రెజిల్‌లోని ఒక తల్లి చెప్పింది. ఆమె కుమారుడు ఆమెకు తన భావాలను చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమె సహనం ప్రతిఫలాన్నిచ్చింది.

15. వినోదం విషయానికొస్తే ఏ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాల్సిన అవసరత ఉంది?

15 పిల్లలకు “నవ్వుటకు . . . నాట్యమాడుటకు” అంటే వినోదం కొరకు సమయం అవసరం. (ప్రసంగి 3:1, 4; జెకర్యా 8:5) తలిదండ్రులు పిల్లలు కలిసి వినోదాన్ని ఆనందిస్తే అదెంతో ఫలవంతంగా ఉండగలదు. అనేక గృహాల్లో వినోదమంటే దూరదర్శినిని తిలకించడమే అన్నది ఒక విషాదకరమైన వాస్తవం. కొన్ని దూరదర్శిని కార్యక్రమాలు వినోదాన్ని అందించినప్పటికీ, అనేక కార్యక్రమాలు మంచి విలువలను నాశనం చేస్తాయి మరియు దూరదర్శినిని తిలకించడం కుటుంబంలో సంభాషణను కుంటుబరుస్తుంది. కాబట్టి, మీ పిల్లలతో ఏదైనా సృజనాత్మకమైన పనిని ఎందుకు చేయకూడదు? పాటలు పాడండి, ఆటలు ఆడండి, స్నేహితులతో సహవసించండి, ఆనందించదగిన స్థలాలను సందర్శించండి. అలాంటి కార్యకలాపాలు సంభాషణను ప్రోత్సహిస్తాయి.

16. యెహోవా గురించి తలిదండ్రులు తమ పిల్లలకు ఏమి బోధించాల్సి ఉంది, మరి వారు దాన్నెలా చేయాలి?

16 బోధకులుగా ఉండండి. “నీవు నీ కుమారులకు [ఈ మాటలను] అభ్యసింప”జేయాలని యెహోవా చెప్పాడు. దేనిని మరియు ఎలా బోధించాలనేది ఆ సందర్భం మీకు తెలియజేస్తుంది. మొదట, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణప్రాణంతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:5, NW) తర్వాత, ‘ఈ మాటలను . . . నీవు అభ్యసింపజేయాలి.’ యెహోవా ఎడల మరియు ఆయన న్యాయవిధుల ఎడల పూర్ణప్రాణ ప్రేమను వృద్ధిచేయాలన్న లక్ష్యంతో ఉపదేశాన్ని అందించండి. (హెబ్రీయులు 8:10 పోల్చండి.) ‘అభ్యసింపజేయడం’ అనే పదానికి మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా బోధించడం అనే భావముంది. మీ పిల్లలు దైవిక వ్యక్తిత్వాన్ని వృద్ధిపర్చుకునేందుకు సహాయపడగల ప్రముఖమార్గం ఆయన గురించి ఎడతెగక మాట్లాడటమేనని యెహోవా తద్వారా మీకు చెబుతున్నాడు. వాళ్లతో క్రమ బైబిలు పఠనాన్ని కలిగివుండటం అందులో ఇమిడివుంది.

17. తలిదండ్రులు తమ పిల్లవానిలో దేన్ని వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు?

17 బిడ్డ హృదయంలోకి సమాచారాన్ని పంపడం సులభం కాదని అనేకమంది తలిదండ్రులకు తెలుసు. అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులను ఇలా కోరాడు: “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:2) “అపేక్షించుడి” అనే పదం, అనేకులు సహజంగా ఆత్మీయ ఆహారం కొరకు ఆకలి కలిగివుండరని సూచిస్తుంది. తలిదండ్రులు తమ పిల్లల్లో ఆ అపేక్షను వృద్ధి చేయడానికి మార్గాలను కనుగొనవలసిన అవసరత ఉంది.

18. యేసు యొక్క ఏ కొన్ని బోధనా పద్ధతులను అనుకరించాలని తలిదండ్రులు ప్రోత్సహింపబడుతున్నారు?

18 యేసు ఉపమానాలను ఉపయోగించడం ద్వారా హృదయాలను చేరుకున్నాడు. (మార్కు 13:34; లూకా 10:29-37) ఈ బోధనా పద్ధతి ప్రాముఖ్యంగా పిల్లలకు ప్రభావవంతంగా ఉంటుంది. బైబిలు సూత్రాలను రంగురంగుల, ఆసక్తికరమైన కథలను, బహుశా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) అనే ప్రచురణలో కనుగొనబడే వాటిని ఉపయోగించి బోధించండి. a పిల్లలు కూడా అందులో పాల్గొనేలా చేయండి. బైబిలు సంఘటనలను గీయడం మరియు నాటికలుగా వేయడంలో వారు తమ సృజనాత్మకతను ఉపయోగించేలా చేయండి. యేసు ప్రశ్నలు కూడా ఉపయోగించాడు. (మత్తయి 17:24-27) మీ కుటుంబ పఠన సమయంలో ఆయన పద్ధతిని అనుకరించండి. దేవుని న్యాయవిధిని కేవలం చెప్పే బదులు, యెహోవా మనకు ఈ న్యాయవిధిని ఎందుకిచ్చాడు? మనం దాన్ని పాఠిస్తే ఏమి సంభవిస్తుంది? మనం దాన్ని పాఠించకుంటే ఏమి సంభవిస్తుంది? వంటి ప్రశ్నలను అడగండి. దేవుని న్యాయవిధులు ఆచరణయోగ్యమైనవి మరియు మంచివి అని తర్కించేందుకు, గ్రహించేందుకు అలాంటి ప్రశ్నలు ఒక పిల్లవానికి సహాయపడతాయి.—ద్వితీయోపదేశకాండము 10:13.

19. తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు తలిదండ్రులు బైబిలు సూత్రాలను అనుసరిస్తే, పిల్లలు ఏ గొప్ప ప్రయోజనాలను పొందుతారు?

19 ఒక మాదిరిగా, సహవాసిగా, సంభాషించే వారిగా మరియు బోధకులుగా ఉండడం ద్వారా, మీరు మీ పిల్లవాడు తన తొలి సంవత్సరాలనుండి యెహోవా దేవునితో సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండేందుకు సహాయం చేయగలరు. మీ పిల్లవాడు ఒక క్రైస్తవునిగా సంతోషంగా ఉండేందుకు ఈ సంబంధం వాన్ని ప్రోత్సహిస్తుంది. వాడు స్నేహితుల ఒత్తిడిని శోధనను ఎదుర్కొన్నప్పటికీ తన విశ్వాసానికి తగినట్లు జీవించేందుకు కృషిచేస్తాడు. ఈ అమూల్యమైన సంబంధాన్ని గుణగ్రహించేందుకు వానికి ఎల్లప్పుడూ సహాయపడండి.—సామెతలు 27:11.

క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యమైన అవసరత

20. క్రమశిక్షణ అంటే ఏమిటి, మరి దాన్నెలా అన్వయించుకోవాలి?

20 మనస్సును హృదయాన్ని సరిదిద్దే తర్ఫీదే క్రమశిక్షణ. పిల్లలకు అది తదేకంగా అవసరం. ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను [తమ పిల్లలను] పెంచాలని’ పౌలు తండ్రులకు సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 6:4) యెహోవా చేస్తున్నట్లే, తలిదండ్రులు ప్రేమతో క్రమశిక్షణనివ్వాలి. (హెబ్రీయులు 12:4-11) ప్రేమపై ఆధారపడిన క్రమశిక్షణను తర్కించడం ద్వారా అందించవచ్చు. కాబట్టి మనందరికీ, “క్రమశిక్షణను లక్ష్యపెట్టండి” అని చెప్పబడుతోంది. (సామెతలు 8:33, NW) క్రమశిక్షణ ఎలా ఇవ్వబడాలి?

21. తమ పిల్లలకు క్రమశిక్షణనిచ్చేటప్పుడు తలిదండ్రులు ఏ సూత్రాలను మనస్సులో ఉంచుకోవాలి?

21 తమ పిల్లలకు క్రమశిక్షణనివ్వడంలో, వారిని గద్దిస్తూ మాట్లాడటం, వారిని తిట్టడం, లేక అవమానించడం మాత్రమే ఇమిడివున్నాయని కొందరు తలిదండ్రులు భావిస్తారు. అయితే, అదే అంశంపై పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేప”కుడి. (ఎఫెసీయులు 6:4) క్రైస్తవులందరు కూడా, “ఎదురాడు . . . వారిని సాత్వికముతో శిక్షించుచు, . . . అందరి యెడల సాధువుగా . . . ఉండవలెను” అని ప్రోత్సహింపబడుతున్నారు. (2 తిమోతి 2:24-26) క్రైస్తవ తలిదండ్రులు, దృఢంగా ఉండాల్సిన అవసరతను గుర్తిస్తూ, తమ పిల్లలకు క్రమశిక్షణనిచ్చే సమయంలో ఈ మాటలను మనస్సులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే, కొన్నిసార్లు తర్కన చాలదు, ఏదొక విధమైన శిక్ష అవసరం కావచ్చు.—సామెతలు 22:15.

22. బిడ్డను శిక్షించాల్సిన అవసరం వస్తే, వాడు ఏది అర్థం చేసుకోడానికి సహాయపడాలి?

22 వేర్వేరు పిల్లలకు వేర్వేరు రకాల క్రమశిక్షణ అవసరమౌతుంది. “వాగ్దండనచేత గుణ”పడని వారు కొందరు ఉంటారు. వారికి, అవిధేయత కొరకు అప్పుడప్పుడూ ఇవ్వబడే శిక్ష, జీవాన్ని రక్షించేదిగా ఉండగలదు. (సామెతలు 17:10; 23:13, 14; 29:19) అయితే, తాను ఎందుకు శిక్షింపబడుతున్నాడో పిల్లవానికి అర్థం కావాలి. ‘బెత్తము మరియు గద్దింపు జ్ఞానము కలుగజేయును.’ (సామెతలు 29:15; యోబు 6:24) అంతేకాక, శిక్షకు హద్దులు ఉన్నాయి. “నేను నిన్ను సరైనంత మేరకు శిక్షించాల్సి ఉంటుంది” అని యెహోవా తన ప్రజలతో చెప్పాడు. (యిర్మీయా 46:28బి, NW) తీవ్రమైన దెబ్బలు లేక గాయాలు కలిగేలా పిల్లల్ని కోపంగా కొరడాతో కొట్టడం లేక తీవ్రంగా కొట్టడం వంటి వాటిని బైబిలు ఎంతమాత్రం ఆమోదించడం లేదు.—సామెతలు 16:32.

23. పిల్లవాన్ని తలిదండ్రులు శిక్షిస్తే, వాడు దేన్ని గుర్తించగలగాలి?

23 యెహోవా తన ప్రజలకు క్రమశిక్షణనిస్తానని వారిని హెచ్చరించినప్పుడు, ఆయన మొదట ఇలా చెప్పాడు: “నేను నీకు తోడైయున్నాను భయపడకుము.” (యిర్మీయా 46:28ఎ) అదే విధంగా, తలిదండ్రుల క్రమశిక్షణ ఏ సరైన పద్ధతిలో ఇవ్వబడినా, తలిదండ్రులు తనను వదిలేశారనే భావనను పిల్లవానికి కలిగించకూడదు. (కొలొస్సయులు 3:21) బదులుగా, తల్లి/తండ్రి ‘తనతో’ తన వైపు ఉన్నందుకే క్రమశిక్షణ ఇవ్వబడిందని పిల్లవాడు గ్రహించాలి.

మీ పిల్లవాన్ని అపాయంనుండి కాపాడండి

24, 25. ఈ దినాల్లో, వికృతమైన ఏ ముప్పునుండి పిల్లలను కాపాడవలసిన అవసరముంది?

24 అనేకమంది పెద్దవారు తమ చిన్నతనం ఒక సంతోషమయ సమయంగా ఉండినదని జ్ఞాపకం చేసుకుంటారు. వారు ఆప్యాయతతో కూడిన భద్రతాభావనను మరియు అన్ని పరిస్థితుల్లో తమ తలిదండ్రులు తమ ఎడల శ్రద్ధవహిస్తారన్న నిశ్చయతను జ్ఞాపకం చేసుకుంటారు. తమ పిల్లలు కూడా అలానే భావించాలని తలిదండ్రులు ఇష్టపడతారు, అయితే నేటి హీన సమాజంలో, పిల్లలను భద్రంగా ఉంచడం ముందుకన్నా మరీ కష్టతరమైపోతుంది.

25 ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువగా పెరిగిపోయిన ఒక వికృతమైన ముప్పు, పిల్లలను లైంగికంగా హింసించడం. మలేసియాలో, పిల్లలను హింసించడం పది సంవత్సరాల కాలంలో నాలుగంతలైందని నివేదించబడింది. జర్మనీలో ప్రతి సంవత్సరం దాదాపు 3,00,000 పిల్లలు లైంగిక దురాచారానికి గురౌతున్నారు, మరి ఒక అధ్యయనం ప్రకారం, ఒక దక్షిణ అమెరికా దేశంలో సాంవత్సరిక అంచనా లెక్కల ప్రకారం ఆ సంఖ్య 90,00,000 ఉందని తేలింది! ఈ పిల్లల్లో అధిక శాతంమంది తమ స్వగృహాల్లో తమకు తెలిసిన, తాము నమ్మిన వారివల్లనే దురాచారానికి గురయ్యారన్నది దుఃఖకరమైన విషయం. అయితే పిల్లలకు వారి తలిదండ్రులే దృఢమైన అండగా ఉండాలి. తలిదండ్రులు ఎలా రక్షకులుగా ఉండగలరు?

26. పిల్లలను భద్రంగా ఉంచగల కొన్ని మార్గాలేవి, జ్ఞానం పిల్లవాన్ని ఎలా కాపాడగలదు?

26 లైంగికత గురించి ఎక్కువ తెలియని పిల్లలే బాల్య దురాచారానికి ప్రాముఖ్యంగా గురయ్యారని అనుభవం చూపుతుంది గనుక, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వాళ్లకు ఆ విషయాల గురించి బోధించడం ఒక నివారణా చర్య కాగలదు. జ్ఞానం, “దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు” రక్షణను అందించగలదు. (సామెతలు 2:10-12) ఏ జ్ఞానం? నైతిక విషయాల్లో బైబిలు సూత్రాల ప్రకారం ఏది సరైనది, ఏది తప్పైనది అనేదాని గురించిన జ్ఞానం. కొందరు పెద్ద వాళ్లు చెడ్డ పనులు చేస్తారని మరియు ఎవరైనా సరైనవి కాని క్రియలను చేయమని చెప్పినప్పుడు చిన్నపిల్లలు వాళ్ల మాట విననవసరం లేదన్న విషయాలను గురించిన జ్ఞానం కూడా. (దానియేలు 1:4, 8; 3:16-18 పోల్చండి.) అలాంటి ఉపదేశాన్ని గురించి కేవలం ఒకసారి మాత్రమే మాట్లాడి ఆపేయకండి. అనేకమంది చిన్న పిల్లలు పాఠాలను జ్ఞాపకం ఉంచుకోడానికి వాటిని వారికి అనేకసార్లు చెప్పాల్సి ఉంటుంది. పిల్లలు పెరిగే కొలది ఒక తండ్రి తన కుమార్తె ఒంటరిగా ఉండేందుకు గల హక్కును అలాగే తల్లి తన కుమారుని హక్కును ప్రేమపూర్వకంగా గౌరవించాలి—అలా ఏది సరైనది అనే విషయంలో పిల్లల భావాన్ని దృఢపర్చాలి. దురాచారం నుండి కాపాడేందుకుగల శ్రేష్ఠమైన నిశ్చయతల్లో ఒకటి, తలిదండ్రులుగా మీరు నిశితంగా పర్యవేక్షించడమే.

దైవిక నడిపింపును వెదకండి

27, 28. పిల్లవాన్ని పెంచాల్సిన సవాలును తలిదండ్రులు ఎదుర్కొన్నప్పుడు, వారికి ఎవరు గొప్ప సహాయాన్ని ఇవ్వగలరు?

27 బాల్యంనుండి పిల్లలకు తర్ఫీదునివ్వడం వాస్తవంగా ఒక సవాలే, అయితే విశ్వాసులైన తలిదండ్రులు ఈ సవాలును ఒంటరిగా ఎదుర్కోనవసరం లేదు. పూర్వం, న్యాయాధిపతుల కాలంలో, మానోహ అనే పేరుగల ఒక పురుషుడు తాను తండ్రి కాబోతున్నానని తెలుసుకున్నప్పుడు, తన పిల్లవాని పెంపకం విషయంలో యెహోవా నడిపింపు కొరకు అడిగాడు. యెహోవా ఆయన ప్రార్థనలకు జవాబిచ్చాడు.—న్యాయాధిపతులు 13:8, 12, 24.

28 అదే విధంగా నేడు కూడా, విశ్వాసులైన తలిదండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు, వారు కూడా ప్రార్థన ద్వారా యెహోవాతో మాట్లాడగలరు. తలిదండ్రులుగా ఉండటం కష్టతరమైన పని, అయితే అందులో గొప్ప బహుమానాలు ఉన్నాయి. హవాయ్‌లోని ఒక క్రైస్తవ దంపతులు ఇలా చెబుతున్నారు: “ఆ అపాయకరమైన టీన్‌ లేక యౌవన సంవత్సరాలు రాకముందు మీరు పని చేయడానికి మీకు 12 సంవత్సరాలు ఉన్నాయి. అయితే బైబిలు సూత్రాలను అనుసరించేందుకు మీరు కష్టించి పని చేస్తే, వారు యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఆనందాన్ని శాంతిని పొందే సమయం అవుతుంది.” (సామెతలు 23:15, 16) మీ పిల్లవాడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు, “కుమారులు [మరియు కుమార్తెలు] యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని పలికేందుకు మీరు కూడా పురికొల్పబడతారు.

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.