కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 9

యెహోవాను స్తుతిద్దాం రండి!

యెహోవాను స్తుతిద్దాం రండి!

(కీర్తన 145:12)

1. రారండి సన్నుతిద్దాము

మన దేవుని పేరును.

చాటుదాం మానవాళికి

ఆయనిచ్చే దీవెనలను.

క్రీస్తు రాజయ్యే కాలమిదని

యెహోవా నిర్ణయించాడు.

సమీపించింది అంతము అని

హెచ్చరిద్దాం ప్రజలను.

(పల్లవి)

రారండి సన్నుతిద్దాము

మన తండ్రి గొప్పతనాన్ని.

2. రారండి ఆలపిద్దాము

తండ్రికి స్తుతి చెల్లిద్దాం.

ప్రార్థన ఆలకించేటి

యెహోవాను కొనియాడుదాం.

సర్వసృష్టికి కారకుడైనా,

యెహోవా వినయస్థుడు.

తన ఔదార్యం, ప్రేమ గురించి

ధైర్యంగా ప్రకటిద్దాము.

(పల్లవి)

రారండి సన్నుతిద్దాము

మన తండ్రి గొప్పతనాన్ని.