కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 10

‘నేనున్నాను! నన్ను పంపించు’

‘నేనున్నాను! నన్ను పంపించు’

(యెషయా 6:8)

1. నేడు దేవుని నామాన్ని

ప్రజలెంతో నిందిస్తారు.

క్రూరుడసమర్థుడని

దేవుడే లేడనంటారు.

తొలగించి ఆ నిందలు,

స్తుతి పాడేవారెవరు?

“పంపించు యెహోవా నన్ను.

నే నీకు స్తుతి పాడతా.”

(పల్లవి)

“ఇంకే ఘనతా లేదు దేవా

నేనున్నాను పంపించు.”

2. ఆలస్యం చేస్తాడు అంటూ

ఆయనను నిందిస్తారు.

రాతిబొమ్మలారాధిస్తూ

కైసరే దేవుడంటారు.

దేవుని తీర్పు తెలిపి

హెచ్చరించేవారెవరు?

“పంపించు యెహోవా నన్ను.

నే ధైర్యంగా హెచ్చరిస్తా.”

(పల్లవి)

“ఇంకే ఘనతా లేదు దేవా

నేనున్నాను పంపించు.”

3. ఈ లోక స్థితిని చూసి

ఎందరో దుఃఖిస్తున్నారు.

ఈ చీకట్లో ఆ దీనులు

వెలుగు వెదుకుతారు.

సత్యాన్ని నేర్పి వారికి

ఓదార్పునిచ్చేదెవరు?

“పంపించు యెహోవా నన్ను.

ఓర్పుతో నేను బోధిస్తా.”

(పల్లవి)

“ఇంకే ఘనతా లేదు దేవా

నేనున్నాను పంపించు.”

(కీర్త. 10:4; యెహె. 9:4 కూడా చూడండి.)