కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 16

రాజ్యానికై నిరీక్షించండి!

రాజ్యానికై నిరీక్షించండి!

(జెఫన్యా 2:3)

1. సరైనది చేస్తూ ఓ దీనులారా

వెదకండి మీరు యెహోవాను.

తప్పించుకోవచ్చు తీర్పురోజున

నమ్రతతో ఉంటే నేడు.

(పల్లవి)

యెహోవా పక్షానుండండి మీరు

రాజ్యంకై నిరీక్షిస్తూ.

ఆ దీవెనలకై వేచి చూడండి

దైవాజ్ఞలు గైకొంటూ.

2. క్రీస్తు పాలనకు లోబడి ఉంటూ

శత్రువులను ఎదిరించండి.

నీతీన్యాయాలకై తపించే మీరు

దుఃఖాన్ని వీడి సాగండి.

(పల్లవి)

యెహోవా పక్షానుండండి మీరు

రాజ్యంకై నిరీక్షిస్తూ.

ఆ దీవెనలకై వేచి చూడండి

దైవాజ్ఞలు గైకొంటూ.

3. యెహోవా ఇచ్చే వెలుగు పొందుతూ

చేసుకోండి ఆయన్నే ఆధారం.

స్థాపించబడింది దేవుని రాజ్యం

రుజువైంది ఈ విషయం.

(పల్లవి)

యెహోవా పక్షానుండండి మీరు

రాజ్యంకై నిరీక్షిస్తూ.

ఆ దీవెనలకై వేచి చూడండి

దైవాజ్ఞలు గైకొంటూ.