కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 21

కనికరం చూపేవారు ధన్యులు!

కనికరం చూపేవారు ధన్యులు!

(మత్తయి 5:7)

1. కనికరం చూపేవారు

దైవం దృష్టిలో ధన్యులు!

యెహోవా చూపే కారుణ్యం

వారు చాటుతారు నిత్యం.

చూపాడు కనికరము

పాపులమైన మనకు.

ఎంతో త్యాగం చేసి తాను

మనకై పంపెన్‌ యేసును.

2. కనికరం చూపేవారు

దేవుని కృపకర్హులు.

క్రీస్తు రక్తం ఆధారంగా

పొందుతారు క్షమాపణ.

రాజ్యం గురించి చాటుతూ

దేవుని వాక్యం బోధిస్తూ,

ఓదారుస్తారితరుల్ని

చూపిస్తారు ఆ గుణాన్ని.

3. చూపేవారికి కరుణ

దొరుకును ఆదరణ.

యెహోవా తీర్పుదినాన

కనికరిస్తాడాయన.

నేర్చుకుందాం కనికరం

క్రీస్తును అనుసరిద్దాం.

తండ్రి ఇచ్చే నిర్దేశము

సదా పాటిస్తూ ఉందాము.