పాట 55
పరదైసులో నిత్యజీవితం!
1. మీ మనోనేత్రాలతో
చూడండి పరదైసు.
దుఃఖం బాధ ఉండవు
శాంతి వర్ధిల్లును.
(పల్లవి)
భూపరదైసులో
మీరూ ఉండవచ్చు.
నిత్యజీవం కోసము
నిరీక్షిస్తుండండి.
2. వృద్ధులు యౌవ్వనులై
ఆరోగ్యంగా ఉంటారు.
గతిస్తాయి కష్టాలు,
భయమే ఉండదు.
(పల్లవి)
భూపరదైసులో
మీరూ ఉండవచ్చు.
నిత్యజీవం కోసము
నిరీక్షిస్తుండండి.
3. నూతన లోకములో
కీర్తిస్తాం నిన్నే దేవా.
నిరంతరం యెహోవా
కృతజ్ఞులై ఉంటాం.
(పల్లవి)
భూపరదైసులో
మీరూ ఉండవచ్చు.
నిత్యజీవం కోసము
నిరీక్షిస్తుండండి.
(యోబు 33:25; కీర్త. 72:7; ప్రక. 21:4 కూడా చూడండి.)