కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 35

దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉందాం

దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉందాం

(2 పేతురు 3:15)

1. యెహోవా నీ శక్తి అనంతం

నీతి అంటే నీకు ప్రియం.

తాళలేవు దుష్టత్వాన్ని

చూడలేవు అన్యాయాన్ని.

ఆలస్యము చేయక నీవు

దుష్టులను నిర్మూలిస్తావు.

చూపిస్తావు దీర్ఘశాంతం

మాకు నీవే రక్షణాధారం.

2. వెయ్యి ఏళ్లు మాకు ఓ యుగం,

నీకు అవి ఒకే దినం.

రానైవుంది ఈ లోకాంతం

ఆలస్యము కాదేమాత్రం.

పాపం అసహ్యమైనా నీకు,

పశ్చాత్తప్తుల్ని క్షమిస్తావు.

యెహోవా నిన్నే స్తుతిస్తాం

భావి నిరీక్షణతో ఉంటాం.

(లూకా 15:7; 2 పేతు. 3:8, 9 కూడా చూడండి.)