కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 39

మనకు అనుగ్రహించబడిన శాంతి

మనకు అనుగ్రహించబడిన శాంతి

(యోహాను 14:27)

1. ఐక్యతకు శాంతికి, యెహోవా మూలం.

స్థాపిస్తాడు శాంతిని, మాన్పించి యుద్ధం.

సమాధానాధిపతి, క్రీస్తు సౌమ్యుడు.

నీతికోసం పోరాడి, శాంతి తెస్తాడు.

2. పరుషపు మాటల్ని, విడిచిపెట్టాం.

నాగళ్లుగా మార్చాము, ఖడ్గాల్ని మనం.

శాంతి నిలిపేందుకు, క్షమిద్దాం మనం.

గొర్రెలమై యేసుకు, శాంతిగా ఉందాం.

3. నీతిఫలం శాంతిని, ఫలిస్తూ మనం,

ప్రార్థనతో పొందిన, జ్ఞానం చూపిస్తాం.

దైవరాజ్యం శాంతిని, తెచ్చు త్వరలో

శాంతిమార్గం చాటుతూ, నడుద్దాం దాంట్లో.