కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 43

మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

(1 కొరింథీయులు 16:13)

1. మెలకువగా మీరుంటూ, పెంచుకోండి విశ్వాసం.

ధైర్యశాలులై ఉండండి, మనకు జయం తథ్యం.

క్రీస్తు నాయకత్వంలో మనం

స్థిరంగా ముందుకు సాగుదాం.

(పల్లవి)

నిత్యము మేలుకొని ఉంటూ

స్థిరంగా సాగిపోండి!

2. నిబ్బరమైన బుద్ధితో, వినయం చూపించండి.

దాసుని ద్వారా క్రీస్తిచ్చే, ఉపదేశం వినండి.

ప్రేమతో బోధిస్తూ కాపాడే

పెద్దల మాట పాటించండి.

(పల్లవి)

నిత్యము మేలుకొని ఉంటూ

స్థిరంగా సాగిపోండి!

3. సమర్థిస్తూ సువార్తను, మేలుకొని ఉండండి!

మానక ప్రకటిస్తుందాం, బెదరక వైరికి.

రానైవుంది యెహోవా దినం.

దేవునిని స్తుతిస్తుండండి.

(పల్లవి)

నిత్యము మేలుకొని ఉంటూ

స్థిరంగా సాగిపోండి!

(మత్త. 24:13; హెబ్రీ. 13:7, 17; 1 పేతు.5:8 కూడా చూడండి.)