కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 46

యెహోవా మన రాజు!

యెహోవా మన రాజు!

(కీర్తన 97:1)

1. యెహోవా నీతిని చాటుతూ

ఆయనను స్తుతిస్తోంది ఆకాశం.

ఆయన అద్భుత క్రియల్ని ధ్యానిస్తూ

ఆనందంతో స్తుతి చెల్లిద్దాం.

(పల్లవి)

ఆకాశం, భూలోకం పాడాలానందంతో

యెహోవాయే రాజయ్యాడని!

ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో

యెహోవాకు స్తుతి పాడాలి!

2. యెహోవా రక్షణ కార్యాల్ని

ప్రతీరోజు ప్రకటిద్దాం అంతటా.

ఆయనే రారాజు, స్తుతికి పాత్రుడు

విధేయులై ఉందాము సదా!

(పల్లవి)

ఆకాశం, భూలోకం పాడాలానందంతో

యెహోవాయే రాజయ్యాడని!

ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో

యెహోవాకు స్తుతి పాడాలి!

3. నీతియుక్త రాజ్యం స్థాపించి

రాజుగా నియమించాడు క్రీస్తును.

లోక దేవుళ్లంతా తలవంచుతారు

యెహోవాయే స్తుతికర్హుడు.

(పల్లవి)

ఆకాశం, భూలోకం పాడాలానందంతో

యెహోవాయే రాజయ్యాడని!

ఆకాశం, భూలోకం హర్షాతిరేకంతో

యెహోవాకు స్తుతి పాడాలి!

(1 దిన. 16:9; కీర్త. 68:20; 97:6, 7 కూడా చూడండి.)