కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 48

ప్రతీదినం యెహోవాతో నడుద్దాం

ప్రతీదినం యెహోవాతో నడుద్దాం

(మీకా 6:8)

1. యెహోవాతో ప్రతీదినం, వినయంగా నడుస్తుందాము.

సన్మార్గము చూపేందుకు, ఇస్తాడాయన చేయూతను.

సత్యమార్గం వెదికితే, ఉంటుంది తండ్రి కృప.

సమర్పించుకుని మనం ఉందాం దేవుని పక్షాన.

2. అంతం చేరువౌతుండగా, విరోధము ఎదురౌతుంది.

దేవుని తీర్పు కాలంలో, భీతిగొల్పే స్థితులుంటాయి.

ఐనా దైవ సంరక్షణ, మనపైన ఉంటుంది.

యెహోవాకు దగ్గరౌతూ, నిత్యం సేవిద్దామాయన్ని.

3. పరిశుద్ధాత్మనిస్తాడు, వాక్యముతో నడిపిస్తాడు.

ప్రార్థనలు ఆలకిస్తూ, సంఘం ద్వారా ఆదరిస్తాడు.

నీతిమార్గం చూపిస్తాడు, ఆయనతో నడిస్తే.

దయ నేర్పుతాడాయన, మనం వినయంతో ఉంటే.

(ఆది. 5:24; 6:9; 1 రాజు. 2:3, 4 కూడా చూడండి.)