కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 54

నిజమైన విశ్వాసం పెంపొందించుకుందాం

నిజమైన విశ్వాసం పెంపొందించుకుందాం

(హెబ్రీయులు 10:38, 39)

1. పూర్వం నిర్దేశించాడు దేవుడు

తన ప్రవక్తల ద్వారా.

నేడు మనసు మార్చుకోండని

చెప్పాడు యేసు ద్వారా.

(పల్లవి)

విశ్వాసం ఉందా మనకు?

రక్షణకది ముఖ్యము.

చూపిస్తున్నామా క్రియల్లో?

అప్పుడే దక్కుతుంది జీవము.

2. రాజ్య వార్తను చాటించాలనే

క్రీస్తాజ్ఞకు లోబడతాం.

నేర్పే వాటిని పాటిస్తూ మనం

ధైర్యంగా ప్రకటిస్తాం.

(పల్లవి)

విశ్వాసం ఉందా మనకు?

రక్షణకది ముఖ్యము.

చూపిస్తున్నామా క్రియల్లో?

అప్పుడే దక్కుతుంది జీవము.

3. దృఢ నమ్మకం ఇస్తుంది బలం

వెనుదీయము ఎన్నడు.

శత్రు బలగం ఎంతున్నా సరే

రక్షిస్తాడు దేవుడు.

(పల్లవి)

విశ్వాసం ఉందా మనకు?

రక్షణకది ముఖ్యము.

చూపిస్తున్నామా క్రియల్లో?

అప్పుడే దక్కుతుంది జీవము.