కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిల్లోని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి?

బైబిల్లోని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి?

బైబిలు గురించి మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పంపిణీ అయ్యే పుస్తకం ఇదొక్కటే. అందులోని సందేశాన్ని చదివి అన్ని సంస్కృతుల ప్రజలు ఎంతో ఓదార్పును పొందారు, భవిష్యత్తుమీద ఆశను పెంచుకున్నారు. అంతేగాక, అందులోని సలహాలు వారి అనుదిన జీవితాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అంటున్నారు. అయితే, ఈ రోజుల్లో చాలామందికి బైబిలు గురించి అంతగా తెలీదు. మతంపట్ల మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా, బహుశా బైబిలు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండవచ్చు. బైబిలు సారాంశాన్ని తెలుసుకోవడానికి ఈ బ్రోషురు మీకు సహాయం చేస్తుంది.

బైబిలు చదవడం మొదలుపెట్టేముందు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. పరిశుద్ధ లేఖనాలు అని కూడా పిలువబడే దీనిలో, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము లేక దర్శన గ్రంథం వరకు 66 పుస్తకాలున్నాయి.

అసలు బైబిలును ఎవరు రాశారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బైబిలును దాదాపు 40 మంది వ్యక్తులు రాశారు. మొత్తం బైబిలును రాయడానికి 1,600 కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టింది. అయితే, తామే బైబిలు రచయితలమని వాళ్లెప్పుడూ చెప్పుకోలేదు. వాళ్లలో ఒక వ్యక్తి, ‘లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగాయి [“దేవునిచే ప్రేరేపించబడినవి,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌]’ అని రాశాడు. (2 తిమోతి 3:16, 17) మరో వ్యక్తి ఇలా రాశాడు: “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది.” (2 సమూయేలు 23:2) అలా చెప్పి వాళ్లు, విశ్వ పరిపాలకుడైన యెహోవా దేవుడే బైబిలు రచయిత అని చూపించారు. మనం తనకు దగ్గరవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడని వాళ్లు బైబిల్లో రాశారు.

బైబిలు అంతటిలో ఒకే ముఖ్యాంశం ఉంది. బైబిలును అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అదేమిటో తెలుసుకోవాలి. దేవుడు తన పరలోకరాజ్యం ద్వారా, మనుషులను పరిపాలించే హక్కు తనకు మాత్రమే ఉంది అని నిరూపించుకోవడమే ఆ ముఖ్యాంశం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రతీ పుస్తకం ఈ ముఖ్యాంశం గురించి ఏమి చెప్తోందో ఈ బ్రోషురు వివరిస్తుంది.

ఈ విషయాలను మనసులో ఉంచుకుని, ప్రపంచ ప్రసిద్ధ పుస్తకమైన బైబిల్లో ఉన్న సందేశమేమిటో ఇప్పుడు చూద్దాం.

^ పేరా 9 తేదీలను వివిధ రకాలుగా రాయవచ్చు. ఈ బ్రోషురులో, సా.శ. అని ఉంటే “సామాన్య శకం” అనీ సా.శ.పూ. అని ఉంటే “సామాన్య శక పూర్వం” అనీ అర్థం చేసుకోవాలి. ప్రతీ పేజీలో కిందవున్న కాలరేఖలో వీటిని మీరు చూడవచ్చు.