కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 6

జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

దేవుడు చెడ్డవాళ్లను నాశనం చేశాడు. నోవహును, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఆదికాండం 7:11, 12, 23

నలభై రోజులపాటు ఆగకుండా వర్షం పడడం వల్ల భూమంతా నీళ్లతో నిండిపోయింది. చెడ్డ వాళ్లందరూ చనిపోయారు.

దేవునికి ఎదురుతిరిగిన దేవదూతలు మళ్లీ పరలోకానికి వెళ్లిపోయారు, వాళ్లే చెడ్డదూతలు.

ఓడలో ఉన్నవాళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి నోవహు, ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. అయితే భవిష్యత్తులో దేవుడు వాళ్లను తిరిగి బ్రతికించి, నిరంతరం జీవించే అవకాశం ఇస్తాడు.

దేవుడు మళ్లీ చెడ్డవాళ్లను నాశనం చేస్తాడు, మంచివాళ్లను రక్షిస్తాడు. మత్తయి 24:37-39

సాతాను, అతని చెడ్డదూతలు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తున్నారు.

నోవహు కాలంలోని ప్రజల్లాగే నేడు చాలామంది యెహోవా ప్రేమతో చెప్తున్న మాటల్ని వినట్లేదు. యెహోవా త్వరలోనే చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తాడు.—2 పేతురు 2:5, 6.

నోవహులాగే కొంతమంది దేవుడు చెప్పేది వింటున్నారు, పాటిస్తున్నారు. వాళ్లే యెహోవాసాక్షులు.