కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ పాఠం

మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఎలా వచ్చింది?

మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఎలా వచ్చింది?

నోవహు

అబ్రాహాము, శారా

మోషే

యేసుక్రీస్తు

యెహోవాసాక్షులది ఒక కొత్త మతం అని చాలామంది అనుకుంటారు. కానీ 2,700 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే, ఏకైక సత్యదేవుని సేవకులు ఆయన “సాక్షులు” అని పిలవబడ్డారు. (యెషయా 43:​10-12) మమ్మల్ని 1931 వరకు “బైబిలు విద్యార్థులు” అని పిలిచేవాళ్లు. మరైతే యెహోవాసాక్షులు అనే పేరు మాకు ఎలా వచ్చింది?

ఆ పేరు మా దేవుడు ఎవరో చెప్తుంది. ప్రాచీన రాతప్రతుల ప్రకారం, యెహోవా దేవుని పేరు బైబిల్లో వేలసార్లు ఉంది. కానీ చాలా అనువాదాల్లో ఆ పేరు తీసేసి “ప్రభువు” లేదా “దేవుడు” అని పెట్టారు. అయితే సత్యదేవుడే స్వయంగా తన పేరు యెహోవా అని మోషేకు చెప్పి, “ఎప్పటికీ నా పేరు ఇదే” అన్నాడు. (నిర్గమకాండం 3:15) అలా, తాను అబద్ధ దేవుళ్లకు వేరుగా ఉన్నానని ఆయన చూపించాడు. దేవుని పవిత్రమైన పేరు పెట్టుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం.

ఆ పేరు మా బాధ్యత ఏంటో చెప్తుంది. నీతిమంతుడైన హేబెలుతో మొదలుపెట్టి, పూర్వకాలంలో జీవించిన ఎంతోమంది దేవుని సేవకులు యెహోవా మీద తమకున్న విశ్వాసం గురించి సాక్ష్యమిచ్చారు. ఈ ‘పెద్ద సాక్షుల సమూహంలో’ నోవహు, అబ్రాహాము, శారా, మోషే, దావీదు వంటివాళ్లు ఉన్నారు. (హెబ్రీయులు 11:4–12:1) న్యాయస్థానంలో నిర్దోషి తరఫున ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పినట్టు, మేము కూడా మా దేవుని గురించిన సత్యం చెప్పాలని తీర్మానించుకున్నాం.

మేము యేసును అనుసరిస్తున్నాం. బైబిలు యేసును “నమ్మకమైన సత్యసాక్షి” అని పిలుస్తుంది. (ప్రకటన 3:14) తాను ‘దేవుని పేరును తెలియజేశానని,’ దేవునికి సంబంధించిన ‘సత్యం గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చానని’ యేసే స్వయంగా చెప్పాడు. (యోహాను 17:26; 18:37) కాబట్టి క్రీస్తును నిజంగా అనుసరించేవాళ్లు యెహోవా పేరును ధరించి, ఆ పేరును అందరికీ చెప్పాలి. యెహోవాసాక్షులు అదే చేస్తున్నారు.

  • బైబిలు విద్యార్థులకు యెహోవాసాక్షులు అనే పేరు ఎలా వచ్చింది?

  • యెహోవాకు భూమ్మీద ఎప్పటినుండి సాక్షులు ఉన్నారు?

  • యెహోవా గురించి అందరికన్నా గొప్పగా సాక్ష్యమిచ్చింది ఎవరు?