కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ పాఠం

మా కూటాలు ఎలా జరుగుతాయి?

మా కూటాలు ఎలా జరుగుతాయి?

న్యూజిలాండ్‌

జపాన్‌

ఉగాండా

లిథువానియా

మొదటి శతాబ్దంలోని క్రైస్తవ కూటాల్లో ముఖ్యంగా పాటలు పాడడం, ప్రార్థించడం, లేఖనాలు చదివి చర్చించడం ఉండేవి. వాటిలో ఎలాంటి ఆచారాలు పాటించేవాళ్లు కాదు. (1 కొరింథీయులు 14:26) మా కూటాలు కూడా అలాగే జరుగుతాయి.

బైబిలు ఆధారంగా, పాటించదగిన ఉపదేశం ఇస్తారు. ప్రతీ సంఘంలో, శనివారం లేదా ఆదివారం జరిగే కూటంలో 30 నిమిషాల బైబిలు ప్రసంగం ఉంటుంది. మన జీవితాల గురించి, ఇప్పటి రోజుల గురించి బైబిలు ఏం చెప్తుందో ఆ ప్రసంగంలో తెలుసుకుంటాం. లేఖనాలు చదువుతున్నప్పుడు బైబిలు తీసి చూడమని మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ప్రసంగం తర్వాత ఒక గంటసేపు “కావలికోట” అధ్యయనం జరుగుతుంది. అప్పుడు కావలికోట అధ్యయన ప్రతిలోని ఒక ఆర్టికల్‌ చర్చిస్తారు, కూటానికి వచ్చిన వాళ్లందరూ జవాబులు చెప్పవచ్చు. ఈ అధ్యయనం, బైబిలు నిర్దేశాన్ని మా జీవితాల్లో పాటించడానికి సహాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,20,000 కన్నా ఎక్కువున్న యెహోవాసాక్షుల సంఘాల్లో ఒకే సమాచారం చర్చిస్తాం.

బోధనా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి సహాయం చేస్తారు. వారంమధ్యలో జరిగే కూటంలో మన క్రైస్తవ జీవితం, పరిచర్య అనే మూడుభాగాల కార్యక్రమం ఉంటుంది. అది ప్రతీనెల వచ్చే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ కూటంలో మొదటి భాగం, “దేవుని వాక్యంలో ఉన్న సంపద.” ఇది బైబిల్లోని కొన్ని అధ్యాయాల్ని లోతుగా పరిశీలించడానికి సహాయం చేస్తుంది. సంఘంలోని వాళ్లు ఆ అధ్యాయాల్ని ముందే చదువుకొని వస్తారు. రెండో భాగం, “చక్కగా సువార్త ప్రకటిద్దాం.” ఇందులో, ఇతరులతో బైబిలు విషయాలు ఎలా చర్చించాలో చూపించే ప్రదర్శనలు ఉంటాయి. చదవడంలో, బోధించడంలో మా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఒక సహోదరుడు సలహాలు ఇస్తాడు. (1 తిమోతి 4:13) మూడో భాగం, “మన క్రైస్తవ జీవితం.” రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాలు ఎలా పాటించవచ్చో ఈ భాగంలో పరిశీలిస్తాం. ఇందులో బైబిల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నాజవాబుల చర్చ ఉంటుంది.

మా కూటాలకు వచ్చినప్పుడు మీరు చక్కని బైబిలు ఉపదేశం పొందుతారు, అది మీకు తప్పకుండా నచ్చుతుంది.—యెషయా 54:13.

  • యెహోవాసాక్షుల కూటాల్లో మీరు ఏం నేర్చుకోవచ్చు?

  • వారంలో జరిగే రెండు కూటాల్లో మీరు దేనికి రావాలనుకుంటున్నారు?