కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ పాఠం

కుటుంబ ఆరాధన అంటే ఏంటి?

కుటుంబ ఆరాధన అంటే ఏంటి?

దక్షిణ కొరియా

బ్రెజిల్‌

ఆస్ట్రేలియా

గినియా

ప్రతీ కుటుంబంలోని వాళ్లు కలిసి సమయం గడుపుతూ తనకు దగ్గరవ్వాలని, అలాగే ఒకరికొకరు కూడా దగ్గరవ్వాలని యెహోవా ప్రాచీనకాలం నుండి కోరుకుంటున్నాడు. (ద్వితీయోపదేశకాండం 6:6, 7) అందుకే యెహోవాసాక్షులు కుటుంబమంతా కలిసి ఆరాధించడానికి వారంలో కొంత సమయం కేటాయిస్తారు. అప్పుడు వాళ్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబ అవసరాలకు సరిపోయే బైబిలు సమాచారం చర్చించుకుంటారు. ఒకవేళ మీరు ఒంటరిగా జీవిస్తున్నా, ఆ సమయంలో ఒక బైబిలు విషయం గురించి పరిశోధిస్తూ దేవునికి దగ్గరవ్వడానికి ప్రయత్నించవచ్చు.

అది యెహోవాకు దగ్గరయ్యే సమయం. “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని బైబిలు చెప్తుంది. (యాకోబు 4:8) బైబిలు ద్వారా యెహోవా లక్షణాలు, పనుల గురించి నేర్చుకునేకొద్దీ ఆయన్ని ఇంకా బాగా తెలుసుకుంటాం. కుటుంబ ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టడానికి ఒక సులువైన పద్ధతి ఏమిటంటే, కుటుంబమంతా కలిసి బైబిలు చదవడం. బహుశా మీరు ఆ వారంలో జరిగే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లోని బైబిలు అధ్యాయాలు చదవవచ్చు. కుటుంబంలో ఒక్కొక్కరూ బైబిల్లోని కొంతభాగాన్ని బయటికి చదవవచ్చు, నేర్చుకున్న విషయాల్ని అందరూ కలిసి చర్చించుకోవచ్చు.

అది కుటుంబ సభ్యులు దగ్గరయ్యే సమయం. కలిసి బైబిలు చదివినప్పుడు భార్యాభర్తలు, తల్లిదండ్రులు-పిల్లలు ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు. కుటుంబ ఆరాధన సంతోషంగా, ప్రశాంతంగా సాగాలి. కుటుంబంలో అందరూ దానికోసం ఉత్సాహంగా ఎదురుచూసేలా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల వయసుకు తగిన అంశాల్ని కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి, లేదా మా jw.org వెబ్‌సైట్‌ నుండి తీసుకోవచ్చు. స్కూల్లో మీ పిల్లలకు ఎదురైన ఒక సమస్య గురించి, దాని పరిష్కారం గురించి మాట్లాడుకోవచ్చు. అంతేకాదు JW బ్రాడ్‌కాస్టింగ్‌లో (tv.pr418.com) ఒక కార్యక్రమం చూసి, చర్చించుకోవచ్చు. కూటాల్లో పాడే పాటల్ని ప్రాక్టీసు చేయవచ్చు. వీలైతే, కుటుంబ ఆరాధన తర్వాత ఏమైనా తినేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇలా ప్రతీవారం కుటుంబమంతా కలిసి యెహోవాను ఆరాధించడం వల్ల, దేవుని వాక్యంలోని విషయాల్ని అందరూ ఆనందంగా నేర్చుకుంటారు. మీ ప్రయత్నాల్ని యెహోవా మెండుగా దీవిస్తాడు.—కీర్తన 1:1-3.

  • మేము కుటుంబ ఆరాధన కోసం ఎందుకు సమయం కేటాయిస్తాం?

  • కుటుంబ ఆరాధన ఇంట్లో అందరికీ నచ్చేలా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?