కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12వ పాఠం

మేము రాజ్య ప్రకటనా పనిని ఎలా చేస్తున్నాం?

మేము రాజ్య ప్రకటనా పనిని ఎలా చేస్తున్నాం?

స్పెయిన్‌

బెలారస్‌

హాంకాంగ్‌

పెరూ

యేసు తాను చనిపోవడానికి కొన్నిరోజుల ముందు ఇలా చెప్పాడు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.” (మత్తయి 24:14) ఇంతకీ ఆ సువార్త భూమంతటా ఎలా ప్రకటించబడుతుంది? యేసు భూమ్మీద ఉన్నప్పుడు చూపించిన పద్ధతిని పాటించడం వల్ల అది సాధ్యమౌతుంది.—లూకా 8:1.

ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలుస్తాం. ఇంటింటికి వెళ్లి సువార్త ప్రకటించేలా యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. (మత్తయి 10:​11-13; అపొస్తలుల కార్యాలు 5:42; 20:​20) మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించిన వాళ్లకు కొన్ని ప్రాంతాలు నియమించారు. (మత్తయి 10:​5, 6; 2 కొరింథీయులు 10:13) మేము కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రకటనా పని చేస్తాం, ప్రకటించడానికి ప్రతీ సంఘానికి ఒక ప్రాంతం నియమిస్తారు. అలా మేము, ‘ప్రకటించమనే, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమనే’ యేసు ఆజ్ఞను పాటించగలుగుతున్నాం.—అపొస్తలుల కార్యాలు 10:42.

ప్రజలు ఎక్కడున్నా కలవడానికి కృషిచేస్తాం. బహిరంగ ప్రదేశాల్లో ప్రకటించే విషయంలో కూడా యేసే మాకు ఆదర్శం. ఆయన సముద్ర తీరం దగ్గర, అందరూ ఉపయోగించే బావి దగ్గర, వేరే చోట్ల ప్రకటించాడు. (మార్కు 4:1; యోహాను 4:​5-15) మేము కూడా వీలైన ప్రతీచోట అంటే వీధుల్లో, వ్యాపార ప్రాంతాల్లో, పార్కుల్లో, ఒక్కోసారి ఫోన్‌ ద్వారా ప్రజలతో బైబిలు గురించి మాట్లాడతాం. అవకాశం దొరికినప్పుడు పొరుగువాళ్లకు, మాతో కలిసి పనిచేసేవాళ్లకు, కలిసి చదువుకునేవాళ్లకు, బంధువులకు కూడా సాక్ష్యమిస్తాం. వీటన్నిటి వల్ల భూవ్యాప్తంగా లక్షలమంది “రక్షణ సువార్తను” వినగలుగుతున్నారు.—కీర్తన 96:2.

దేవుని రాజ్యం గురించి, అది చేయబోతున్న వాటి గురించి మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ఈ మంచివార్తను మీ దగ్గరే ఉంచుకోకండి, వీలైనంత త్వరగా వేరేవాళ్లకు చెప్పండి!

  • ఏ “సువార్త” అందరికీ ప్రకటించాలి?

  • ప్రకటించడానికి యేసు చూపించిన ఏ పద్ధతిని యెహోవాసాక్షులు పాటిస్తున్నారు?