కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ పాఠం

పయినీరు అని ఎవర్ని అంటారు?

పయినీరు అని ఎవర్ని అంటారు?

కెనడా

ఇంటింటి పరిచర్య

బైబిలు అధ్యయనం

వ్యక్తిగత అధ్యయనం

సాధారణంగా, ముందు వెళ్లి ఇతరుల కోసం దారి ఏర్పర్చే వ్యక్తిని పయినీరు అంటారు. ఒక విధంగా యేసు కూడా పయినీరే. సేవ చేయడానికి, ప్రజల కోసం రక్షణ మార్గం తెరవడానికి దేవుడు ఆయన్ని భూమ్మీదికి పంపించాడు. (మత్తయి 20:28) నేడు యేసు అనుచరులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని, వీలైనంత ఎక్కువ సమయం ‘శిష్యుల్ని చేసే’ పనిలో గడుపుతున్నారు. (మత్తయి 28:19, 20) కొంతమంది పయినీరుగా సేవ చేయగలుగుతున్నారు.

పయినీర్లు పూర్తికాల సువార్తికులు. యెహోవాసాక్షులంతా మంచివార్త ప్రకటిస్తారు. అయితే కొంతమంది తమ జీవితంలో సర్దుబాట్లు చేసుకుని నెలకు 70 గంటలు ప్రకటనా పని చేస్తారు, వాళ్లను క్రమ పయినీర్లు అంటారు. దానికోసం వాళ్లు సాధారణంగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తారు. ఇంకొంతమందిని ప్రత్యేక పయినీర్లు అంటారు. వాళ్లను రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు పంపిస్తారు, వాళ్లు నెలకు 130 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు పరిచర్య చేస్తారు. పయినీర్లు, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ తమ కనీస అవసరాలు యెహోవా చూసుకుంటాడని నమ్ముతారు. (మత్తయి 6:​31-33; 1 తిమోతి 6:​6-8) ఇలా పూర్తికాల సేవ చేయలేనివాళ్లు ఏదైనా నెలలో 30 లేదా 50 గంటలు ప్రకటనా పనిలో గడుపుతారు, వాళ్లను సహాయ పయినీర్లు అంటారు.

పయినీర్లు దేవుని మీద, ప్రజల మీద ప్రేమతోనే సేవచేస్తారు. దేవుని గురించి, ఆయన ఉద్దేశాల గురించి తెలియక చాలామంది దీనస్థితిలో ఉన్నారని యేసులాగే మేము కూడా అర్థం చేసుకున్నాం. (మార్కు 6:34) అలాంటివాళ్లకు ఇప్పుడు ఉపయోగపడే, ముందుముందు మంచి రోజులు వస్తాయనే ఆశను నింపే సమాచారం మా దగ్గరుంది. పొరుగువాళ్ల మీద ప్రేమతోనే పయినీర్లు మంచివార్త చెప్పడానికి సమయాన్ని, శక్తిని ధారపోస్తారు. (మత్తయి 22:39; 1 థెస్సలొనీకయులు 2:8) దానివల్ల వాళ్ల విశ్వాసం, దేవునితో స్నేహం బలపడతాయి. అంతేకాదు వాళ్లు ఎక్కువ సంతోషం పొందుతారు.—అపొస్తలుల కార్యాలు 20:35.

  • పయినీరు అని ఎవర్ని అంటారు?

  • కొంతమంది ఎందుకు పూర్తికాల పయినీరు సేవ చేయాలనుకుంటారు?