కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

21వ పాఠం

బెతెల్‌ అంటే ఏంటి?

బెతెల్‌ అంటే ఏంటి?

ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, అమెరికా

జర్మనీ

కెన్యా

కొలంబియా

బేతేలు అనే హీబ్రూ పదానికి “దేవుని ఇల్లు” అని అర్థం. (ఆదికాండం 28:17, 19, అధస్సూచి) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల కార్యాలయాలకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అక్కడినుండి ప్రకటనా పనిని నిర్దేశిస్తారు, దానికి మద్దతిస్తారు. పరిపాలక సభ అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అక్కడినుండి అది వేర్వేరు దేశాల బ్రాంచి కార్యాలయాల్లో జరిగే పనుల్ని చూసుకుంటుంది. ఈ కార్యాలయాల్లో సేవచేసే వాళ్లందర్నీ కలిపి బెతెల్‌ కుటుంబం అంటారు. ఒక కుటుంబంలా వాళ్లందరూ ఒకేచోట ఉంటారు, కలిసి పనిచేస్తారు, కలిసి తింటారు, కలిసి బైబిల్ని అధ్యయనం చేస్తారు.—కీర్తన 133:1.

నిస్వార్థంగా సేవచేసే ఒక కుటుంబం ఉండే ప్రత్యేక స్థలం. ప్రతీ బెతెల్‌లో, దేవుని ఇష్టం చేయడం కోసం, రాజ్య సంబంధ పనుల కోసం తమను తాము అంకితం చేసుకున్న క్రైస్తవ స్త్రీపురుషులు ఉంటారు. (మత్తయి 6:33) ఎవ్వరికీ జీతాలు ఉండవు. అయితే వసతి, ఆహారం, చేతి ఖర్చుల కోసం కొంత డబ్బు ఇస్తారు. బెతెల్‌లో ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంటుంది. కొంతమంది ఆఫీసులో, వంటగదిలో, లేదా భోజన హాలులో పనిచేస్తారు. ఇంకొంతమంది ముద్రించడం, బైండింగ్‌ చేయడం, గదుల్ని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, అన్నిటినీ మంచి స్థితిలో ఉంచడం వంటి పనులు చేస్తారు.

రాజ్య ప్రకటనా పనికి మద్దతివ్వడానికి నిరంతరం కృషిచేసే స్థలం. బైబిలు సత్యాన్ని వీలైనంత ఎక్కువమందికి చేరవేయడమే ప్రతీ బెతెల్‌ లక్ష్యం. అందుకు ఈ బ్రోషుర్‌ ఒక ఉదాహరణ. దీన్ని పరిపాలక సభ పర్యవేక్షణలో రాసి, కంప్యూటర్ల సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది అనువాద బృందాలకు పంపించారు. తర్వాత వేర్వేరు బెతెల్‌ ముద్రణాలయాల్లో శరవేగంతో ముద్రించే యంత్రాల మీద అచ్చువేసి, 1,20,000 కన్నా ఎక్కువ సంఘాలకు పంపించారు. ఈ పనులన్నిటి ద్వారా, బెతెల్‌ కుటుంబాలు అన్నిటికన్నా అత్యవసరమైన ప్రకటనా పనికి ఎంతో మద్దతిస్తాయి.—మార్కు 13:10.

  • బెతెల్‌లో ఎవరు సేవచేస్తారు? వాళ్ల కోసం ఏమేం ఏర్పాట్లు ఉంటాయి?

  • ప్రతీ బెతెల్‌ ఏ అత్యవసరమైన పనికి మద్దతిస్తుంది?