కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

22వ పాఠం

బ్రాంచి కార్యాలయం ఏమేం చేస్తుంది?

బ్రాంచి కార్యాలయం ఏమేం చేస్తుంది?

సాలమన్‌ దీవులు

కెనడా

దక్షిణ ఆఫ్రికా

బ్రాంచి కార్యాలయం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ దేశాల్లో జరిగే ప్రకటనా పనిని చూసుకుంటుంది. బెతెల్‌ కుటుంబ సభ్యులు వేర్వేరు విభాగాల్లో పనిచేస్తూ దానికి మద్దతిస్తారు. వాళ్లు అనువదించడం, పత్రికలు ముద్రించడం, పుస్తకాలు బైండింగ్‌ చేయడం, ప్రచురణలు భద్రపర్చి రవాణా చేయడం, ఆడియో-వీడియో రికార్డింగ్‌ వంటి పనులు చేస్తారు. అలాగే తమ బ్రాంచి ప్రాంతానికి సంబంధించిన ఇతర పనులు చూసుకుంటారు.

బ్రాంచి కమిటీ అక్కడి పనుల్ని పర్యవేక్షిస్తుంది. ప్రతీ బ్రాంచి కార్యాలయంలో జరిగే పనుల్ని చూసుకోవడానికి పరిపాలక సభ ఒక బ్రాంచి కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీలో ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది అర్హతగల పెద్దలు ఉంటారు. వాళ్లు తమ పరిధిలో ఉన్న ఒక్కో దేశంలో పనులు ఎలా జరుగుతున్నాయో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఎప్పటికప్పుడు పరిపాలక సభకు తెలియజేస్తారు. దాన్నిబట్టి ముందుముందు ప్రచురణల్లో, కూటాల్లో, సమావేశాల్లో ఎలాంటి విషయాలు పరిశీలించాలో పరిపాలక సభ నిర్ణయిస్తుంది. పరిపాలక సభ పంపించే ప్రతినిధులు క్రమంగా బ్రాంచీల్ని సందర్శించి, బ్రాంచి కమిటీలు తమ బాధ్యతల్ని నిర్వర్తించడానికి కావాల్సిన నిర్దేశాలు ఇస్తారు. (సామెతలు 11:14) ఆ సందర్భంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానకార్యాలయ ప్రతినిధి ప్రసంగం ఇస్తాడు, దానివల్ల ఆ బ్రాంచి పరిధిలో ఉన్నవాళ్లు ప్రోత్సాహం పొందుతారు.

బ్రాంచి కార్యాలయం స్థానిక సంఘాలకు మద్దతిస్తుంది. బ్రాంచి కార్యాలయంలోని బాధ్యతగల సహోదరులు కొత్త సంఘాలు ఏర్పాటు చేయడాన్ని ఆమోదిస్తారు. ఆ సహోదరులు తమ బ్రాంచి క్షేత్రంలో సేవచేస్తున్న పయినీర్ల, మిషనరీల, ప్రాంతీయ పర్యవేక్షకుల పనిని కూడా నిర్దేశిస్తారు. వాళ్లు సమావేశాలు ఏర్పాటు చేస్తారు, రాజ్యమందిర నిర్మాణ పనిని పర్యవేక్షిస్తారు, సంఘాలకు కావాల్సిన ప్రచురణలు అందేలా చూసుకుంటారు. బ్రాంచి కార్యాలయంలో జరిగే పనులన్నీ ప్రకటనా పని క్రమపద్ధతిలో జరగడానికి తోడ్పడతాయి.—1 కొరింథీయులు 14:33, 40.

  • బ్రాంచి కమిటీలు పరిపాలక సభకు ఎలా మద్దతిస్తాయి?

  • బ్రాంచి కార్యాలయంలో ఏయే పనులు జరుగుతాయి?