కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

23వ పాఠం

మా ప్రచురణల్ని వేర్వేరు భాషల్లో ఎలా తయారుచేస్తాం?

మా ప్రచురణల్ని వేర్వేరు భాషల్లో ఎలా తయారుచేస్తాం?

రచనా విభాగం, అమెరికా

దక్షిణ కొరియా

ఆర్మేనియా

బురుండి

శ్రీలంక

“ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” సువార్త ప్రకటించడానికి మేము 900 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణలు తయారుచేస్తాం. (ప్రకటన 14:6) ఈ కష్టమైన పనిని మేమెలా చేయగలుగుతున్నాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచనా సిబ్బంది, అలాగే అంకితభావంగల అనువాదకుల సహాయంతో మేము ఆ పని చేయగలుగుతున్నాం. వాళ్లందరూ యెహోవాసాక్షులే.

సమాచారాన్ని ముందు ఇంగ్లీషులో రాస్తారు. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో రచనా విభాగం (రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌) చేసే పనిని పరిపాలక సభ పర్యవేక్షిస్తుంది. ప్రధాన కార్యాలయంలో, ఇతర బ్రాంచి కార్యాలయాల్లో రచనా సిబ్బంది చేసే పనుల్ని ఈ విభాగం సమన్వయపరుస్తుంది. ఈ విభాగంలో వేర్వేరు నేపథ్యాల వాళ్లు ఉండడం వల్ల, మా ప్రచురణల్లో రకరకాల సంస్కృతుల ప్రజలకు నచ్చే అంశాలు ఉంటాయి. అందుకే మా ప్రచురణల్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టపడతారు.

రాసిన సమాచారాన్ని అనువాదకులకు పంపిస్తారు. రాసిన సమాచారంలో అవసరమైన మార్పులు చేసి ఆమోదించిన తర్వాత, దాన్ని కంప్యూటర్ల ద్వారా ప్రపంచమంతటా ఉన్న అనువాద బృందాలకు పంపిస్తారు. వాళ్లు ఆ సమాచారాన్ని తమ భాషలోకి అనువదించి, ఇంగ్లీషుతో సరిచూసి, తప్పుల్లేకుండా సహజంగా ఉండేలా చూసుకుంటారు. వాళ్లు “సత్యమైన మాటల్ని” ఎంచుకుని, ఇంగ్లీషు సమాచారంలోని భావాల్ని “ఉన్నదున్నట్టు” అనువదించడానికి ప్రయత్నిస్తారు.—ప్రసంగి 12:10.

కంప్యూటర్ల వల్ల పని వేగంగా జరుగుతుంది. కంప్యూటర్లు మానవ రచయితలకు, అనువాదకులకు సాటిరావు. అయితే కంప్యూటర్లలో ఉండే నిఘంటువులు, భాషా ఉపకరణాలు, పరిశోధనా సమాచారం వల్ల వాళ్ల పని వేగంగా జరుగుతుంది. యెహోవాసాక్షులు మల్టీలాంగ్వేజ్‌ ఎలక్ట్రానిక్‌ పబ్లిషింగ్‌ సిస్టమ్‌ (MEPS) రూపొందించారు. దాని సహాయంతో సమాచారాన్ని వందల భాషల్లో టైప్‌ చేయవచ్చు, దానికి చిత్రాలు జోడించవచ్చు, ముద్రించడానికి సిద్ధం చేయవచ్చు.

ఇన్ని భాషల్లో ప్రచురణలు తయారుచేయడానికి మేము ఎందుకు ఇంత కష్టపడతాం? ఎందుకంటే, “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని” యెహోవా కోరుకుంటున్నాడు.—1 తిమోతి 2:3, 4.

  • మా ప్రచురణల్ని ఎలా రచిస్తాం?

  • మా ప్రచురణల్ని చాలా భాషల్లోకి ఎందుకు అనువదిస్తాం?