కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

26వ పాఠం

రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి ఏం చేయవచ్చు?

రాజ్యమందిరాన్ని మంచిస్థితిలో ఉంచడానికి ఏం చేయవచ్చు?

ఇస్టోనియా

జింబాబ్వే

మంగోలియా

ప్యూర్టోరికో

యెహోవాసాక్షుల ప్రతీ రాజ్యమందిరం దేవుని పవిత్రమైన పేరుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యమందిరాన్ని శుభ్రంగా, చక్కగా, మంచిస్థితిలో ఉంచడం మాకు దొరికిన గొప్ప అవకాశంగా చూస్తాం. అది మా పవిత్ర ఆరాధనలో భాగం. ఆ పనిలో అందరూ పాల్గొనవచ్చు.

కూటం తర్వాత రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తాం. ప్రతీ కూటం తర్వాత సహోదరసహోదరీలు సంతోషంగా రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తారు, వారానికి ఒకసారి ఇంకాస్త మెరుగ్గా శుభ్రం చేస్తారు. అప్పుడు ఏమేం చేయాలో సాధారణంగా ఒక పట్టిక ఉంటుంది, దాని ఆధారంగా ఒక పెద్ద లేదా సంఘ పరిచారకుడు ఆ పనిని చూసుకుంటాడు. అవసరాన్ని బట్టి ఊడ్వడం, తుడవడం, దుమ్ము దులపడం, కుర్చీలు సర్దడం, బాత్‌రూమ్‌లను క్రిములు లేకుండా రసాయనాలతో శుభ్రం చేయడం, కిటికీలు-అద్దాలు కడగడం, చెత్త పారేయడం, బయటివైపు అలాగే ప్రాంగణం శుభ్రం చేయడం వంటి పనుల్ని సహోదరసహోదరీలు స్వచ్ఛందంగా చేస్తారు. కనీసం సంవత్సరంలో ఒకసారి రాజ్యమందిరాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి ఒక రోజంతా కేటాయిస్తాం. కొన్ని పనులు మా పిల్లలతో చేయిస్తూ ఆరాధనా స్థలాన్ని గౌరవించడం నేర్పిస్తాం.—ప్రసంగి 5:1.

అవసరమైన మరమ్మతులు చేయడానికి ముందుకొస్తాం. సంవత్సరానికి ఒకసారి రాజ్యమందిరాన్ని లోపలా బయటా క్షుణ్ణంగా పరిశీలించి, దాన్ని మంచిస్థితిలో ఉంచడానికి కావాల్సిన మరమ్మతులు చేస్తారు. దానివల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి. (2 దినవృత్తాంతాలు 24:13; 34:10) శుభ్రంగా, మంచిస్థితిలో ఉన్న రాజ్యమందిరం మా దేవుని ఆరాధనకు తగినది. ఆ పనిలో మా వంతు కృషి చేయడం ద్వారా యెహోవాను, ఆయన ఆరాధనా స్థలాన్ని మేము ఎంత ప్రేమిస్తున్నామో చూపిస్తాం. (కీర్తన 122:1) దానివల్ల, ఇరుగుపొరుగువాళ్లకు కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.—2 కొరింథీయులు 6:3.

  • ఆరాధనా స్థలాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?

  • రాజ్యమందిరాన్ని శుభ్రంగా ఉంచడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?