కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

27వ పాఠం

రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?

రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?

ఇజ్రాయిల్‌

జెక్‌ రిపబ్లిక్‌

బెనిన్‌

కేమన్‌ దీవులు

మీ బైబిలు జ్ఞానాన్ని పెంచుకోవడానికి పరిశోధన చేయాలనుకుంటున్నారా? బైబిల్లో ఏదైనా లేఖనం, వ్యక్తి, ప్రాంతం, లేదా విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకు ఆందోళన కలిగిస్తున్న విషయం గురించి బైబిల్లో ఏదైనా సలహా ఉందా అని ఆలోచిస్తున్నారా? అయితే రాజ్యమందిరంలోని లైబ్రరీ మీకు సహాయం చేస్తుంది.

పరిశోధనకు ఉపయోగపడేవి అక్కడ ఉంటాయి. యెహోవాసాక్షులు మీ భాషలో ప్రచురించిన బైబిలు ప్రచురణలన్నీ మీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ రాజ్యమందిరంలోని లైబ్రరీలో తాజా ప్రచురణలు చాలావరకు ఉంటాయి. అంతేకాదు రకరకాల బైబిళ్లు, మంచి నిఘంటువు, రెఫరెన్సు పుస్తకాలు కూడా అక్కడ ఉండవచ్చు. కూటానికి ముందు, తర్వాత మీరు ఆ లైబ్రరీని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్‌ కూడా ఉంటే, అందులో కావలికోట లైబ్రరీ ఇన్‌స్టాల్‌ చేసివుండవచ్చు. దానిలో మా ప్రచురణలు ఎన్నో ఉంటాయి. ఏదైనా అంశం గురించి, పదం గురించి, లేఖనం గురించి అందులో సులభంగా వెదకవచ్చు.

అది క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లోని విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీ నియామకాలకు సిద్ధపడుతున్నప్పుడు రాజ్యమందిరంలోని లైబ్రరీని చక్కగా ఉపయోగించుకోవచ్చు. క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు లైబ్రరీని చూసుకుంటాడు. లైబ్రరీలో తాజా ప్రచురణలు ఉండేలా, అవన్నీ చక్కగా అమర్చబడి ఉండేలా చూసుకోవడం ఆయన బాధ్యత. మీకు కావల్సిన సమాచారాన్ని ఎలా వెదకాలో ఆయన గానీ, మీతో బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లు గానీ చూపిస్తారు. అయితే లైబ్రరీలోని పుస్తకాల్ని రాజ్యమందిరం నుండి బయటికి తీసుకెళ్లకూడదు. పుస్తకాల్ని పాడుచేయకుండా, గీతలు గీయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి.

“దేవుని గురించిన జ్ఞానం” కావాలంటే, “దాచబడిన సంపదల కోసం” వెతికినట్టు దాని కోసం మనస్ఫూర్తిగా వెదకాలని బైబిలు చెప్తుంది. (సామెతలు 2:1-5) ఆ పనిని మీరు రాజ్యమందిరంలోని లైబ్రరీ నుండే మొదలుపెట్టవచ్చు.

  • పరిశోధన చేయడానికి రాజ్యమందిరంలోని లైబ్రరీలో ఏమేం ఉంటాయి?

  • లైబ్రరీని చక్కగా ఉపయోగించుకోవడానికి మీకు ఎవరు సహాయం చేస్తారు?