కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

28వ పాఠం

మా వెబ్‌సైట్‌లో ఏం ఉంటుంది?

మా వెబ్‌సైట్‌లో ఏం ఉంటుంది?

ఫ్రాన్స్‌

పోలండ్‌

రష్యా

యేసుక్రీస్తు తన అనుచరులతో ఇలా అన్నాడు: “మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు.” (మత్తయి 5:16) అందుకోసం మేము ఇంటర్నెట్‌, ఇతర ఆధునిక టెక్నాలజీలు బాగా ఉపయోగించుకుంటున్నాం. మా అధికారిక వెబ్‌సైట్‌ jw.org లో యెహోవాసాక్షుల నమ్మకాలు, పనుల గురించి ఉంటుంది. దాని ప్రత్యేకత ఏంటి?

తరచూ అడిగే ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు. ఈ వెబ్‌సైట్‌లో, ప్రజలు అడిగే ముఖ్యమైన ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు దొరుకుతాయి. ఉదాహరణకు, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా? అనే కరపత్రాలు ఈ వెబ్‌సైట్‌లో 900 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్నాయి. కొత్త లోక అనువాదం బైబిలు కూడా 160 కన్నా ఎక్కువ భాషల్లో ఉంది. అలాగే, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకం, బైబిలు అధ్యయనాలకు ఉపయోగించే ఇతర ప్రచురణలు, కావలికోట, తేజరిల్లు! తాజా సంచికలు కూడా దానిలో ఉన్నాయి. వీటిలో చాలా ప్రచురణల్ని ఆన్‌లైన్‌లో చదవవచ్చు, వినవచ్చు, లేదా MP3, PDF, EPUB వంటి ఫార్మాట్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆసక్తిగలవాళ్ల కోసం వాళ్ల భాషలో కొన్ని పేజీలు ప్రింట్‌ తీసి ఇవ్వవచ్చు! ఎన్నో సంజ్ఞా భాషల్లో వీడియో ప్రచురణలు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అంతేకాదు, నాటకరూపంలో సాగే బైబిలు పఠనాలు, బైబిలు నాటకాలు, చక్కని సంగీతం వంటివాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని మీ తీరిక సమయంలో ఆస్వాదించవచ్చు.

యెహోవాసాక్షుల గురించిన వాస్తవ సమాచారం. మా ప్రపంచవ్యాప్త పనికి సంబంధించిన తాజా వార్తలు, వీడియోలు, యెహోవాసాక్షుల మీద ప్రభావం చూపించే సంఘటనలు, మానవతా స్ఫూర్తితో మేము చేసే పనులు ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అంతేకాదు, రాబోయే సమావేశాల గురించిన సమాచారం, మా బ్రాంచి కార్యాలయాల చిరునామాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంటాయి.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా మేము మారుమూల ప్రాంతాల్లో కూడా సత్యమనే వెలుగును ప్రసరింపజేస్తున్నాం. ప్రతీ ఖండంలో, చివరికి అంటార్కిటికాలో ఉన్న ప్రజలు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతున్నారు. దేవునికి మహిమ వచ్చేలా, భూమంతటా “యెహోవా వాక్యం వేగంగా వ్యాప్తిచెందుతూ ఉండాలని” మేము ప్రార్థిస్తున్నాం.—2 థెస్సలొనీకయులు 3:1.

  • ఎక్కువమంది బైబిలు సత్యం తెలుసుకోవడానికి jw.org ఎలా సహాయం చేస్తుంది?

  • మా వెబ్‌సైట్‌లో మీరు ఏం చూడాలనుకుంటున్నారు?