కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14

భూమంతటినీ పరిపాలించబోయే ఓ రాజ్యం

భూమంతటినీ పరిపాలించబోయే ఓ రాజ్యం

అది ఏ రాజ్యమో చెప్పుకోండి చూద్దాం.— ఆఁ, దేవుని రాజ్యం. అది ఈ మొత్తం భూమిని పరదైసులా, ఓ అందమైన తోటలా మారుస్తుంది. ఈ రాజ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుందా?—

రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన రాజ్యంలోని ప్రజల్ని పరిపాలిస్తాడు. దేవుని రాజ్యానికి రాజు ఎవరో తెలుసా?— యేసుక్రీస్తు. ఆయన పరలోకంలో ఉంటాడు. త్వరలోనే ఆయన భూమ్మీద ప్రతీ ఒక్కరిని పరిపాలించబోతున్నాడు! యేసు ఈ భూమినంతా పరిపాలించేటప్పుడు మనం సంతోషంగా ఉంటామా?—

పరదైసులో పొందబోయే ఏ దీవెనల కోసం మీరు ఎదురుచూస్తున్నారు?

అవును, చాలా సంతోషంగా ఉంటాం! పరదైసులో ఎవ్వరూ ఇక కొట్లాడుకోరు, యుద్ధాలు చేసుకోరు. ఒకరితోఒకరు ప్రేమగా ఉంటారు. ఎవ్వరికీ జబ్బులు రావు, ఎవ్వరూ చనిపోరు. కళ్లులేని వాళ్లు చూస్తారు, చెవిటివాళ్లు వింటారు, నడవలేనివాళ్లు పరిగెత్తుతారు, గంతులేస్తారు. ఇక ఆహారమైతే అందరికీ కావాల్సినంత ఉంటుంది. జంతువులన్నీ కలిసిమెలిసి ఆడుకుంటాయి, మనం కూడా వాటితో ఆడుకుంటాం. చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారు. మీరు ఈ బ్రోషుర్‌లో రిబ్కా, రాహాబు, దావీదు, ఏలీయాల గురించి నేర్చుకున్నారు కదా, అలాంటి వాళ్లు చాలామంది మళ్లీ బతుకుతారు! మీకు వాళ్లను కలుసుకోవాలనుందా?—

యెహోవాకు మీరంటే ఎంతో ప్రేమ, మీరు సంతోషంగా ఉండాలనేదే ఆయన కోరిక. మీరు యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయనకు లోబడుతూ ఉంటే అందమైన పరదైసులో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు! మరి మీకు అలా జీవించాలనుందా?—

మీ బైబిల్లో చదవండి