కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ: 1931, కొరియాలో పరిచర్య చేస్తున్న కల్‌పోర్చర్‌ సహోదరి; కుడి: నేడు, కొరియాలో సంజ్ఞా భాషలో పరిచర్య చేస్తున్న సహోదరీలు

2వ భాగం

రాజ్య ప్రకటనా పని—మంచివార్తను ప్రపంచమంతటా చాటిచెప్పడం

రాజ్య ప్రకటనా పని—మంచివార్తను ప్రపంచమంతటా చాటిచెప్పడం

ఈ రోజు మీ ఆఫీసుకు సెలవు. కాబట్టి పరిచర్యకు వెళ్లాలని సిద్ధపడుతున్నారు. కానీ కొంచెం అలసటగా అనిపించి, పరిచర్యకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉండి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని మీ మనసుకు అనిపిస్తుంది. కానీ ప్రార్థన చేసుకుని, ఎలాగైనా పరిచర్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చాలాకాలం నుండి నమ్మకంగా సేవచేస్తున్న ఒక వృద్ధ సహోదరితో మీరు పరిచర్య చేశారు. ఆమెకున్న ఓర్పు, దయ మిమ్మల్ని ఎంతో పురికొల్పాయి. ఇంటింటికి వెళ్తూ రాజ్య సందేశాన్ని ప్రకటిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరసహోదరీలు కూడా ఇదే సందేశాన్ని ప్రకటిస్తున్నారని, ఇవే ప్రచురణల్ని అందిస్తున్నారని, ఇలాంటి శిక్షణే పొందుతున్నారని మీరు గ్రహించారు. పరిచర్య ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మీకు కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. ఇంటి దగ్గరే ఉండిపోకుండా, పరిచర్యకు వెళ్లినందుకు మీరు చాలా సంతోషించారు!

ప్రస్తుతం దేవుని రాజ్యం చేస్తున్న ముఖ్యమైన పని పరిచర్యే. చివరి రోజుల్లో ప్రకటనా పని ఎంత విస్తృతంగా జరుగుతుందో యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:14) ఆ మాటలు ఎలా నెరవేరాయి? ఈ భాగంలో, పరిచర్య చేసిన ప్రజల గురించి, వాళ్లు ఉపయోగించిన పద్ధతుల గురించి, పరికరాల గురించి పరిశీలిస్తాం. ఆ పరిచర్య వల్ల, ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రజలు దేవుని రాజ్యం వాస్తవమైనదని తెలుసుకోగలుగుతున్నారు.

ఈ భాగంలో

6వ అధ్యాయం

ప్రకటనా పని చేసే ప్రజలు—ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు

ఈ చివరి రోజుల్లో ఇష్టపూర్వకంగా ప్రకటించే ఒక సైన్యం ఉంటుందని యేసు ఎందుకు నమ్మాడు? మీరు రాజ్యానికి మొదటి స్థానం ఇస్తున్నారని ఎలా చూపించవచ్చు?

7వ అధ్యాయం

ప్రకటించడానికి ఉపయోగించిన పద్ధతులు—ప్రజల్ని చేరుకోవడానికి వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగించడం

అంతం రాకముందే వీలైనంత ఎక్కువమంది ప్రజలకు మంచివార్త ప్రకటించడానికి, దేవుని ప్రజలు ఎలాంటి కొత్త పద్ధతులు ఉపయోగించారో తెలుసుకోండి.

8వ అధ్యాయం

ప్రకటించడానికి ఉపయోగించిన పరికరాలు—ప్రపంచవ్యాప్త ప్రజలందరి కోసం ప్రచురణలు తయారుచేయడం

రాజు మద్దతు మనకు ఉందని మన అనువాద పని ఎలా నిరూపిస్తుంది? మన ప్రచురణలకు సంబంధించిన ఏ విషయాల్ని బట్టి, రాజ్యం వాస్తవమైనదని మీకు అనిపిస్తుంది?

9వ అధ్యాయం

ప్రకటనా పనికి వచ్చిన ఫలితాలు—“పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి”

గొప్ప ఆధ్యాత్మిక కోత పనికి సంబంధించి, యేసు తన శిష్యులకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?