కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ: 1945లో నెదర్లాండ్స్‌లోని ఐందోవెన్‌లో ప్రకటిస్తున్న ఒక సహోదరుణ్ణి అరెస్టు చేస్తున్నారు; కుడి: మీ దేశంలో, ప్రకటించడానికి చట్టబద్ధమైన హక్కు ఉందా?

4వ భాగం

రాజ్యం సాధించిన విజయాలు—మంచివార్త ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడం

రాజ్యం సాధించిన విజయాలు—మంచివార్త ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడం

మీరు ఇంటింటి పరిచర్య చేస్తూ ఒక ఇంట్లో మాట్లాడుతున్నారు. దూరం నుండి మీకు ఒక సైరన్‌ వినబడింది. ఉండేకొద్దీ అది ఇంకా పెద్దగా వినబడుతోంది. మీరు తర్వాతి ఇంటికి వెళ్లి ఒకతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. అంతలోనే పోలీసు కారు వచ్చి అక్కడ ఆగింది. మీతోపాటు వచ్చిన సహోదరి ఆ కారువైపు చూస్తూ ఉంది. దానిలో నుండి ఒక పోలీసు దిగి మీ దగ్గరికి వచ్చాడు. “ఇంటింటికి వెళ్లి బైబిలు గురించి చెప్తుంది మీరేనా? మీ మీద చాలామంది మాకు ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు. మీరు అతనితో గౌరవపూర్వకంగా మాట్లాడి, మీరు ఒక యెహోవాసాక్షి అని అతనికి చెప్పారు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది?

తర్వాత ఏమి జరుగుతుందనేది, గతంలో మీ దేశ ప్రభుత్వం యెహోవాసాక్షులతో ఎలా వ్యవహరించింది; మీ దేశంలో మత స్వేచ్ఛ ఎంతవరకు ఉంది వంటి విషయాల మీదే చాలావరకు ఆధారపడివుంటుంది. బహుశా, ఎన్నో దశాబ్దాల క్రితం మీ సహోదరసహోదరీలు పడిన కష్టానికి ఫలితంగా, ఇప్పుడు మీరు మత స్వేచ్ఛను అనుభవిస్తుండవచ్చు. వాళ్లు “మంచివార్త తరఫున వాదించడానికి, దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడానికి” ఎంతో ప్రయాసపడ్డారు. (ఫిలి. 1:7) మీరు ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ, వాళ్లు చేసిన చట్టపరమైన పోరాటాల గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం వల్ల మీ విశ్వాసం బలపడుతుంది. దేవుని రాజ్యం పరిపాలిస్తోందని అవి తిరుగులేని విధంగా రుజువు చేస్తున్నాయి! వాటిలో కొన్నిటిని ఈ భాగంలో పరిశీలిస్తాం.

ఈ భాగంలో

13వ అధ్యాయం

రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం

ఆధునిక కాలంలో కొంతమంది హైకోర్టు జడ్జీలు, ప్రాచీన కాలంలోని ధర్మశాస్త్ర బోధకుడైన గమలీయేలులా ఆలోచిస్తున్నారు.

14వ అధ్యాయం

దేవుని రాజ్యానికి మాత్రమే నమ్మకంగా మద్దతివ్వడం

రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉన్న యెహోవాసాక్షుల్ని, హింస ‘నదిలా’ ముంచెత్తినప్పుడు సహాయం వేరేవైపు నుండి అందింది.

15వ అధ్యాయం

ఆరాధనా హక్కు కోసం పోరాడడం

ఆరాధనా స్వేచ్ఛ కోసం దేవుని ప్రజలు పోరాడారు.