కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ: 1945లో, ఇంగ్లాండ్‌లోని లండన్‌లో ఒక ఖాళీ స్థలంలో జరుగుతున్న కూటం; కుడి: 2012లో, ఆఫ్రికాలోని మలావీలో జరుగుతున్న సమావేశం

5వ భాగం

రాజ్యం ఇస్తున్న శిక్షణ—రాజు తన ప్రజలకు శిక్షణ ఇవ్వడం

రాజ్యం ఇస్తున్న శిక్షణ—రాజు తన ప్రజలకు శిక్షణ ఇవ్వడం

ఒక యౌవన సహోదరుడు స్టేజీ మీద నుండి ప్రసంగిస్తున్నాడు. అతను మీ సంఘంలోని సహోదరుడే. అతను సమావేశాల్లో ప్రసంగించడం ఇదే మొదటిసారి. మీరు ఆ ప్రసంగం వింటూ, అతను సంఘంలో మొట్టమొదటిసారిగా ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తు తెచ్చుకున్నారు. అప్పటికి, ఇప్పటికి అతనిలో ఎంత తేడా! అప్పటికన్నా ఇప్పుడు ప్రసంగాలు చాలా బాగా ఇస్తున్నాడు. అతను పయినీరు సేవా పాఠశాలకు వెళ్లొచ్చిన తర్వాత చాలా ప్రగతి సాధించాడు. ఈమధ్యే, తన భార్యతో కలిసి రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు కూడా హాజరయ్యాడు. అతని ప్రసంగం అయిపోగానే మీరు చప్పట్లు కొడుతూ, మీ చుట్టూవున్న దేవుని ప్రజలు పొందుతున్న శిక్షణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

దేవుని ప్రజలందరూ “యెహోవాచేత ఉపదేశము” పొందే కాలం వస్తుందని బైబిలు ముందే చెప్పింది. (యెష. 54:13) ఆ మాటలు నేడు నెరవేరుతున్నాయి. మనం ప్రచురణల ద్వారా, కూటాల ద్వారా, సమావేశాల ద్వారా, యెహోవా సంస్థలోని వేర్వేరు నియామకాల కోసం సిద్ధం చేసే పాఠశాలల ద్వారా ఉపదేశం పొందుతున్నాం. మనం పొందుతున్న ఈ శిక్షణ, దేవుని రాజ్యం పరిపాలిస్తోందనడానికి ఎలా ఒక రుజువుగా ఉందో ఈ భాగంలో పరిశీలిస్తాం.

ఈ భాగంలో

16వ అధ్యాయం

ఆరాధన కోసం సమకూడడం

ఆరాధన కోసం సమకూడడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

17వ అధ్యాయం

రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం

రాజ్య ప్రచారకులు తమ నియామకాలు నిర్వర్తించేలా దైవపరిపాలనా పాఠశాలలు ఎలా శిక్షణ ఇస్తున్నాయి?