కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

139వ పాట

వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

(మత్త. 28:19, 20)

  1. దేవుని సాయంతో ప్రజలు

    సత్యాన్ని స్వీకరిస్తే,

    ఎంతెంతో ఆనందం పొందుతాం

    వాళ్లను చూసి మనం.

    (పల్లవి)

    యెహోవా నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    స్థిరపర్చు వాళ్లందర్నీ నీవే తండ్రి.

  2. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు,

    ప్రార్థించాం ప్రతీ రోజు.

    బోధించాం, చూపించాం శ్రద్ధను;

    పొందేలా దీవెనలు.

    (పల్లవి)

    యెహోవా నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    స్థిరపర్చు వాళ్లందర్నీ నీవే తండ్రి.

  3. నమ్మకం చూపిస్తూ వాళ్లంతా

    నీ మీద, యేసు మీద;

    జీవపు పరుగు పందెంలో

    ఓర్పుతో గెలవాలి.

    (పల్లవి)

    యెహోవా నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    స్థిరపర్చు వాళ్లందర్నీ నీవే తండ్రి.

(లూకా 6:48; అపొ. 5:42; ఫిలి. 4:1 కూడా చూడండి.)