కంటెంట్‌కు వెళ్లు

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యం అంటే ఏంటి?

మీరేమంటారు?

  • మన హృదయంలో ఉండేది.

  • పరలోకంలోని ప్రభుత్వం.

  • తెలీదు.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

“పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు.”—దానియేలు 2:44, కొత్త లోక అనువాదం.

“మనకు ఒక కుమారుడు ఇవ్వబడియున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది.”యెషయా 9:6, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

దానివల్ల మీరు పొందే ప్రయోజనాలు

  • మీకు మేలు చేసే ఒక మంచి ప్రభుత్వం.—యెషయా 48:17, 18.

  • రాబోయే కొత్త లోకంలో సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం.—ప్రకటన 21:3, 4.

బైబిలు చెప్పేది ఎందుకు నమ్మవచ్చు?

రెండు కారణాలు పరిశీలించండి.

  • దేవుని రాజ్యం ఏమి చేస్తుందో యేసు ముందే చూపించాడు. దేవుని రాజ్యం రావాలని, దేవుని ఇష్టం భూమ్మీద నెరవేరాలని ప్రార్థించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 6:9, 10) ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో యేసు చూపించాడు.

    యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, రోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను బ్రతికించాడు! (మత్తయి 15:29-38; యోహాను 11:38-44) అలా ఆ రాజ్యం ప్రజలకు ఏమి చేస్తుందో, దేవుని రాజ్యానికి కాబోయే రాజుగా యేసు ముందే చూపించాడు.—ప్రకటన 11:15.

  • దేవుని రాజ్యం త్వరలోనే వస్తుందని ఇప్పుడున్న పరిస్థితులు చూపిస్తున్నాయి. ఆ రాజ్యం భూమ్మీదికి శాంతిని తీసుకొచ్చే ముందు యుద్ధాలు, కరువులు, భూకంపాలు వస్తాయని యేసు చెప్పాడు.—మత్తయి 24:3, 7.

    నేడు మనం అవన్నీ చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యం ఆ కష్టాలన్నిటినీ త్వరలోనే తీసేస్తుందని మనం నమ్మకంతో ఉండవచ్చు.

ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .

దేవుని రాజ్య పరిపాలన కింద జీవితం ఎలా ఉంటుంది?

కీర్తన 37:29; యెషయా 65:21-23 లో దానికి జవాబు ఉంది.